సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 206. 'సర్వతంత్రరూపా' 🌻
సర్వ తంత్రముల స్వరూపము కూడ శ్రీదేవియే అని అర్థము.
తంత్రమనగా శాస్త్రీయ విధానము. శాస్త్రీయ మనగా శాస్త్ర విధాన జ్ఞానము. ఏది ఎట్లు చేయవలెనో, అట్లు చేసిననే అది సిద్ధించును. అట్లు చేయనిచో సిద్ధింపదు. దీనినే శాస్త్ర విధి యందురు. ఏపనికైనను శాస్త్ర విధాన మున్నది. ఇది తెలియుట జ్ఞానము. తెలిసి చేసినచో కృతకృత్యులగుదురు.
తెలియక చేసినచో వైఫల్య ముండును. పై విధమగు శాస్త్ర విధి తంత్రము. తెలిసి చేయుట ఒక పద్ధతి. చేయుచూ తెలుసుకొనుట మరియొక పద్ధతి. మంత్రమును ఎట్లు మననము చేయవలెనో తెలియవలెను. యంత్రమును ఎట్లు పూజింపవలెనో తెలియవలెను.
ఇట్లు తెలిసి ఆరాధించుటను తంత్ర మందురు. యంత్రములను శాస్త్ర విధిగ ఆరాధించినచో మంత్రము సిద్ధించి తద్దేవతా స్వరూపము ప్రత్యక్షమగును. తోచినట్లు చేయుట వలన సిద్ధి కలుగదు.
ఋషులు మంత్రములను, యంత్రములను గ్రహించి అనేకానేక దేవతా శక్తులను సిద్ధింప చేసుకొనినారు. సద్గురువు సాన్నిధ్యమున సకల దేవతలు కొలువై యుందురని తెలుపుటలోని రహస్య మిదియే. వారు విధి విధానముగ ఆరాధనము గావించి వివిధములగు దేవతలను సిద్ధింప జేసిరి.
శ్రీ రామకృష్ణ పరమహంస సర్వమత వ్యవస్థాపకులను కూడ ఆయా మార్గముల ఆరాధించి సిద్ధింప చేసుకొనెను. ఋషులు, సద్గురువులు మంత్ర యంత్ర స్వరూపములను కూలంకషముగ గ్రహించి తంత్రముల నందించి నారు.
నిర్దిష్టమగు ఈ తంత్ర శాస్త్రము తెలిసినవారు వైజ్ఞానికముగ దేవతలను సిద్ధింపజేసికొను శక్తి కలవారైయుందురు. వారే పూర్వము మంత్ర యంత్రముల ద్వారా వర్షములను కురిపించుట, దేవతలను అవతరింపజేయుట గావించిరి.
ఆకాశమున పయనించుట, కొండలను మోయుట, నదీ గమనములను మార్చుట కూడ చేసిరి. తంత్రమునకు నిష్ఠ, నియమము, ఏకాగ్రత, దీక్ష, మనోబలము, మనోనిర్మలము ఇత్యాది గుణములు ముఖ్యము.
సర్వ తంత్ర స్వరూపిణియైన శ్రీదేవి ఈ తంత్ర శాస్త్రముల కధిదేవత. ఆమె అధ్యక్షతనే మంత్రము, యంత్రము, తంత్రము యున్నవి. మంత్రమును యంత్రముపై తంత్ర పూర్వకముగ ప్రయోగించుట సిద్ధి నీయగలదు.
ఈ తంత్ర జ్ఞాన మంతయూ శ్రీదేవి అనుగ్రహము కలవారికి శీఘ్రముగ సిద్ధించును. కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు అట్టివారు. ఇటీవలి కాలమున శ్రీ రామకృష్ణ పరమ హంస అమ్మ అనుగ్రహమున సర్వతంత్రముల నెరిగెను.
రామకృష్ణునికి తంత్రము నేర్పుటకై వచ్చిన తంత్రవేత్తలు అతడప్పటికే ఎరిగిన తంత్రమునకు దిగ్ర్భాంతి చెందిరి. భక్తి పూర్వకముగ శ్రీదేవి నారాధించువారికి సర్వమూ హస్తగత మగును. మంత్రము, తంత్రము, యంత్రము వారి కధీనమై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 206 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Sarva-tantra-rūpā सर्व-तन्त्र- रूपा (206) 🌻
She is in the form of all tantra-s. There are various types of tantra-s and She is the focal point in all these tantra-s.
[Further reading on tantra: Tantra are class of works teaching mystical formularies (mostly in the form of dialogues between Śiva and Śaktī and said to treat five subjects, 1. the creation, 2. the destruction of the world, 3. the worship of gods, 4. the attainment of all objects, especially of six superhuman faculties (siddhi-s) 5. the four modes of union with the Supreme Spirit by meditation. Tantra can be defined as the practice in an effort to gain access to and appropriate the energy of illuminated consciousness of the Brahman that courses through the universe, giving its creatures, life and potential salvation.
Humans in particular are empowered to realise this goal through strategies of embodiment, i.e. of causing that divine energy to become concentrated in or another or sort of template , grid, or macrocosm – prior to internalisation in or identification with the individual microcosm.
Tantra is generally considered as beliefs and practices which, working from the principle that the universe we experience, is nothing other than the concrete manifestation of the divine energy of the Brahman that creates and sustains that universe, seeks to ritually appropriate and channel that energy, within the human microcosm, in the creative and emancipator ways.]
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
11 Feb 2021
No comments:
Post a Comment