దేవాపి మహర్షి బోధనలు - 29


🌹. దేవాపి మహర్షి బోధనలు - 29 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 20. పృథివి - అంతరిక్షము - దివి 🌻


సూర్యుడు సమస్తమునకు కారణముకాగ శనిదేవత ఫలితమగును. శనిదేవతను అంకుశముగ, జ్యోతిషమున సంకేతించుదురు. యమము, నియమము కలిగిన వారిని శనిదేవుడనుగ్రహించును. అవి లేనివారిని అంకుశమై శిక్షించును, అనగా శిక్షణ నిచ్చును.

శనిదేవత దేవాలయమునకు పునాది కాగా, సూర్యుడు దేవాలయము నకు శిఖర మగును. సూర్యుడు దివ్యలోకమునకు, శని పృథ్వీలోకమునకు, కుజుడు అంతరిక్ష లోకములకు అధి దేవతలు. కుజుడనగా స్కందుడే. అతడు సేన రౌద్రమూర్తి లేక రుద్రత్వము కలవాడు. రుద్రులే అంతరిక్ష దేవతలు.

చీకటులను చెండాడి చీకటి పై నుండు వెలుగును ఆవిష్కరించి వ్యాప్తిచేయు ప్రజ్ఞయే స్కందప్రజ్ఞ. ఇతడు కారణముగ దివినుండి భువి వరకు వెలుగు వ్యాపించి యుండును. ఇది జ్యోతిషపరమైన అవగాహనముపై అవగాహన మేరకు కుజుడు, శని సూర్యుపుత్రులుగ వ్యవహరింప బడుచున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2021

No comments:

Post a Comment