✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము
హెచ్చరిక :
ధ్యాన యోగమును 'ఆత్మ సంయమ' యోగమని పిలుతురు. శరీరము, యింద్రియములు, మనస్సు, బుద్ధి ఆత్మతో సంయమము చెందుటకు వలసిన సూత్రములు ఈ అధ్యాయమున "శ్రీకృష్ణార్జున సంవాదము"గ వేదవ్యాస మహర్షి పొందుపరచినాడు.
ధ్యానము చేయుటకు పూర్వము సాధకుడు పొంద వలసిన శిక్షణ, ధ్యానము చేయుచు అనుసరించవలసిన ప్రధాన సూత్రములు ఈ అధ్యాయమున వివరింపబడినవి. ధ్యానమును గూర్చిన మోజు, వ్యామోహము ప్రస్తుతమున భౌగోళికముగ నేర్పడినది.
సరాసరి ధ్యానమున కుపక్ష మించుట అవివేకము, అపాయకరము కూడ. సాధకుడు తన్ను తానుగ కొంత నియంత్రణ పాటించుచు, ధ్యానము ప్రారంభించిన కాలము నుండి ఈ అధ్యాయమున తెలుప బడిన నియంత్రణలను అన్నింటిని పాటించవలసి యున్నది.
యోగశాస్త్రమైన భగవద్గీత యందలి ఈ సూత్రములను పాటింపక ధ్యానమున కుపక్రమించువారు, వారి అశ్రద్ధ, అహంకారము కారణముగ కష్ట నష్టములకు లోను కాగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Feb 2021
No comments:
Post a Comment