భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 169
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 169 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 7 🌻
652. సద్గురువు పరిపూర్ణుడగునుటచే ,అన్ని పాత్రలను పరిపూర్ణముగా ప్రవర్తించగలడు. సామాన్యులకు ఒక సామాన్యుని వలె కనిపించును. యోగీశ్వరుల యోగి వలె ,ఋషీశ్వ రులకు ఋషీశ్వరుని వలె కాన్పించును. అన్ని భూమికలలో, అన్ని స్థాయిలలో అన్ని విధముల అన్నింటికీ, అదే విధముగా కనిపించును.
653. సద్గురువు ఏకకాలమందే ఉత్తమాధమ స్థితుల యందుడును . అతడు అనంత సత్య స్థితిలో ప్రతిష్టితుడయ్యెను, వేరొక వంక మాయకు ప్రభువై ఉన్నాడు . ఈ రెండు ఎగుడు దిగుళ్ళను తాను ఏకకాలమందే అన్ని భూమికలలో , అన్ని స్థాయిలలో వ్యవహరించును. మధ్య స్థితుల ద్వారా వాటిని సమతుల్యంగా కాపాడుతున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment