11) 🌹. శివ మహా పురాణము - 345🌹
12) 🌹 Light On The Path - 98🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 230🌹
14) 🌹 Seeds Of Consciousness - 294🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 169🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 24 / Bhagavad-Gita - 24 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Lalitha Sahasra Namavali - 25🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 25 / Sri Vishnu Sahasranama - 24 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -147 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము
హెచ్చరిక :
ధ్యాన యోగమును 'ఆత్మ సంయమ' యోగమని పిలుతురు. శరీరము, యింద్రియములు, మనస్సు, బుద్ధి ఆత్మతో సంయమము చెందుటకు వలసిన సూత్రములు ఈ అధ్యాయమున "శ్రీకృష్ణార్జున సంవాదము"గ వేదవ్యాస మహర్షి పొందుపరచినాడు.
ధ్యానము చేయుటకు పూర్వము సాధకుడు పొంద వలసిన శిక్షణ, ధ్యానము చేయుచు అనుసరించవలసిన ప్రధాన సూత్రములు ఈ అధ్యాయమున వివరింపబడినవి. ధ్యానమును గూర్చిన మోజు, వ్యామోహము ప్రస్తుతమున భౌగోళికముగ నేర్పడినది.
సరాసరి ధ్యానమున కుపక్ష మించుట అవివేకము, అపాయకరము కూడ. సాధకుడు తన్ను తానుగ కొంత నియంత్రణ పాటించుచు, ధ్యానము ప్రారంభించిన కాలము నుండి ఈ అధ్యాయమున తెలుప బడిన నియంత్రణలను అన్నింటిని పాటించవలసి యున్నది.
యోగశాస్త్రమైన భగవద్గీత యందలి ఈ సూత్రములను పాటింపక ధ్యానమున కుపక్రమించువారు, వారి అశ్రద్ధ, అహంకారము కారణముగ కష్ట నష్టములకు లోను కాగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 346 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
88. అధ్యాయము - 43
*🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు, నేను, దేవతలు, ఋషులు, మరియు ఇతరులు ఇట్లు స్తుతించగా, మహా దేవుడు మిక్కిలి ప్రసన్నుడాయెను (1). అపుడు శంభుడు ఋషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు మొదలగు వారి నందరినీ సమాధానపరచి దక్షునితో నిట్లనెను (2).
మహాదేవుడిట్లు పలికెను -
ఓయీ దక్ష ప్రజాపతీ! నేను చెప్పు మాటను వినుము. నేను ప్రసన్నడనైతిని. నేను స్వతంత్రుడను, సర్వేశ్వరుడను అయినప్పుటికీ నిత్యము భక్తులకు వశములో నుండెదను (3). ఓయీ దక్ష ప్రజాపతీ! నాల్గు రకముల పుణ్యాత్ములు నన్ను నిత్యము సేవించెదరు. వీరిలో వరుసగా ముందు వానికంటె తరువాతి వాడు శ్రేష్ఠుడు (4). ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అను నల్గురు నన్ను సేవింతురు. మొదటి ముగ్గురు సామాన్య భక్తులు కాగా, నాల్గవవాడు సర్వశ్రేష్ఠుడు (5).
వారిలో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. జ్ఞాని నా స్వరూపమేనని వేదములు చెప్పుచున్నవి. కావున జ్ఞానికంటె నాకు ఎక్కువ ప్రియమైనవాడు లేడు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (6).
ఉపనిషత్తుల తాత్పర్యము నెరింగిన జ్ఞానులు ఆత్మజ్ఞుడనగు నన్ను జ్ఞానముచే పొందెదరు. జ్ఞానము లేకుండగనే నన్ను పొందుటకు యత్నించువారు మూర్ఖులు (7). మూర్ఖులు, కర్మాధీనులు అగు మానవులు నన్ను వేదములచే గాని, యజ్ఞములచే గాని, దానములచే గాని, తపస్సుచే గాని పొందలేరు (8). నీవు కేవలకర్మతో సంసారమును తరింప గోరితివి.అందువలననే నేను కోపించి యజ్ఞమును విధ్వంసము చేసితిని (9). ఓదక్షా! ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా ఎరింగి, బుద్ధిని జ్ఞానార్జన యందు లగ్నము చేసి, శ్రద్ధతో కర్మను అనుష్ఠించుము (10).
ఓ ప్రజాపతీ! మరియొక మాటను చెప్పెదను . మంచి బుద్ధితో వినుము. నేను నా సగుణ స్వరూపమునకు సంబంధిచిన రహస్యమును ధర్మ వృద్ధి కొరకై నీకు చెప్పెదను (11). నేను బ్రహ్మ విష్ణు రూపుడనై జగత్తుయొక్క పరమకారణ మగుచున్నాను. నేను ఆత్మను. ఈశ్వరుడను. ద్రష్టను. స్వయంప్రకాశుడను. నిర్గుణుడను (12). ఓప్రజాపతీ!అట్టి నేను నా మాయను స్వాధీనము చేసుకొని జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుచూ, ఆయా క్రియలకు తగిన నామములను ధరించుచున్నాను (13). అద్వితీయము, ఆత్మరూపము, ఏకము అగు పరబ్రహ్మ యందు ప్రాణులు, బ్రహ్మ, ఈశ్వరుడు అను భేదములను అజ్ఞాని దర్శించును (14).
మానవుడు తన దేహములోని తల, చేతులు మొదలగు అవయవముల యందు తన పాండిత్యముచే భేద బుద్ధిని కలగియుండుట లేదు గదా ! అదే విధముగా నా భక్తుడు ప్రాణుల యందు భేద బుద్ధిని కలిగియుండును (15). ఓ దక్షా! సర్వప్రాణుల ఆత్మలు ఒక్కటియే అను భావన గలవాడై, త్రిమూర్తులలో భేదమును ఎవడు గనడో, వాడు శాంతిని పొందును (16). ఎవడైతే త్రిమూర్తులలో భేదబుద్ధిని కలిగి యుండునో,అట్టి మానవాధముడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంత వరకు నరకమునందు నివసించుట నిశ్చయము (17). ఏ వివేకి నా యందు భక్తి గలవాడై దేవతల నందరినీ పూజించునో, వాడు జ్ఞానమును పొంది, దాని ప్రభావముచే శాశ్వతమగు ముక్తిని పొందును (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 98 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 15th RULE
*🌻 15. Desire possessions above all. - 2 🌻*
375. All these forces thrown out from the man must recoil upon him so long as he projects them from himself in that way. However, every man has an interior connection with the Deity which is not through any of these concentric spheres, but through the centre itself.
By turning within he can reach the Logos himself, and so long as he sends all the force of his thought and desire in that way, it is not reflected back to him at all, but goes to reinforce the great outwelling of divine power which the Deity is always sending through His universe, by which He keeps it alive.
His force wells up in the centre; it does not come from without. If we look at a number of physical atoms clairvoyantly we shall see some drawing in force and others pouring it out. They must receive that force from somewhere. It does not go in at one side and out at the other; it wells up in the centre apparently from nowhere but is in reality coming from some higher dimension which we cannot see.
Thus the communication with God lies in the very heart of things, and the man who turns his eyes always upon the Deity, and thinks only of Him in the work that he is doing, pours all his force along that line. It disappears so far as he is concerned but, as I said before, goes to reinforce the divine strength which is always being outpoured everywhere.
There is no personal result for the man on lower planes, but with every such effort he draws nearer to the divine Truth within him – becomes a better and fuller expression of it and so it would not be true to say that he obtains no result. In a universe of law nothing could be without result, but there is no outward result such as would bring him back to earth.
376. That, I think, is what is meant when it is said that the Great Ones escape from the law of karma. They spend the whole of Their mighty spiritual force upon doing good in the name of humanity and as units of humanity, and so They escape from the binding of the law.
“Whatever result there is comes to humanity, not to Them. The karma of all the glorious actions of the Master is not held back that He may receive the result; it goes to humanity as a whole.
377. It is in that spirit of impersonality that we also should perform action. If we do anything, even a good action, thinking: “I am doing this; I want the credit of this,” or even if we do not think of receiving the credit for it, but only think: “am doing this,” like the Pharisees of old, we shall have our reward. The result will come back to the personal self, and it will bind us back to earth just as surely as though it were an evil result.
But if we have forgotten the personal self altogether and are acting merely as part of humanity, it is to the humanity of which each is a part that the result of the action will come. The more truly we can act without thought of self the nearer we shall be drawing to the divine heart of things. That is how the Logos Himself looks upon everything.
There could be no thought of self for Him; He acts always for the good of the whole and as representing the whole. If we act thinking only of Him, then the result will flow out in His divine force and will not come to us as anything that will bind, but rather as something which will make us a greater and greater expression of Him, and will raise us more and more into the peace of God which passeth all understanding.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 230 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. దేవలమహర్షి - 1 🌻*
1. ప్రజాపతి అంటే బ్రహ్మ అని అర్థంకూడా ఉంది. అయియే విష్ణునాభికమలంనుండీ పుట్టిన బ్రహ్మ ఇతడు కాదు. ప్రజాపతి కొడుకులలో ఒకడైన బ్రహ్మ అనేవాడు. ఆ ప్రజాపతికి ప్రభాత అనే భర్య వలన ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు ప్రత్యూషుడు. ఇంతనికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో మొదటివాడు దేవలుడు.
2. అతిథిసేవ సులభంగా లభించే వస్తువుకాదు. అతిథి ఎవరికీ అంత సులభంగా దొరకడు. కోరినా దొరకడు. కోరని వాడికి దొరకనే దొరకడు. కాబ్ట్టి అతిథి దొరకటమనేది అంత సులభంకాదు.
3. ఆ సేవలో ఉండే మహాఫలంలో ఎంత శక్తిఉందో తెలిస్తే. దేసంలో దరిద్రమే ఉండదు. ఇతరుల దారిద్య్రం నిర్మూలించటానికి ఆతిథ్యం ఇవ్వమని చెప్పటంలేదు. అందులోని రహస్యం, ఆ శక్తి తెలిసినవాడు ఎవరినీకూడా అన్నంలేకుండా ఆకలితో ఉంచడు.
4. కృతజ్ఞత ఆశించెచేసే దానం దానంకాదు. అట్టి సేవ సేవేకాదు. ఎవరైనా అతిథులువచ్చి తిట్టిపోయినాసరే మరచిపోవాలి. ఎవరైనా అట్లాంటివాడు మన ఇంటికివచ్చి, “నువ్వు అన్నం పెట్టావు. కానీ ఏం పెట్టావు? అది ఏమంత గొప్పపని? నేను ఇలాంటివాళ్ళకు చాలామందికి అన్నంపెట్టాను” అని పోయాడనుకోండి.
5. అప్పుడు మనం, “నువ్వు మహానుభావుడివి. నీకు ఇంతే పెట్టగలిగాను” అని అనటం ఉచితం. తిట్టినా మర్చిపోవటం ఆదర్శం. అంతటి నిష్ఠ, ఆదర్శం పెట్టుకొంటే ముందరికి వెళ్ళవచ్చు. ఆర్యుల ఆదర్శం జ్ఞానమే. అదే ఆ ఋషులచరిత్ర తెలిపేది.
6. నమస్కరించినవాడు వృధాగాపోడు. గురువుకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకు వెళితే ఓ పండు ఇస్తాడు. ఆ పండు అప్పుడే రెండు నిమిషాల్లోనే అరిగిపోతుంది. దాని ఫలం వాడికి ఆ వెనకాలే ఉంటుంది. శ్రద్ధా భక్తులతో ఉతాములను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు కోరకుండానే సిద్ధులొస్తాయి. సాధుజనసాంగత్యం, పవిత్రజనసేన వ్యర్థంగాపోవు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 294 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 143. Together with the body and the indwelling principle 'I am' everything is. Prior to that what was there? 🌻*
The indwelling principle 'I am' is absolutely essential for everything to surface. The body may be there, but unless the 'I am' principle arises nothing can be known.
Once you have understood the importance of the knowledge 'I am', all your efforts should be directed towards investigating it. The very first question that you must ask is: how did this 'I am' come to be? Prior to that what was there?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 169 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 7 🌻*
652. సద్గురువు పరిపూర్ణుడగునుటచే ,అన్ని పాత్రలను పరిపూర్ణముగా ప్రవర్తించగలడు. సామాన్యులకు ఒక సామాన్యుని వలె కనిపించును. యోగీశ్వరుల యోగి వలె ,ఋషీశ్వ రులకు ఋషీశ్వరుని వలె కాన్పించును. అన్ని భూమికలలో, అన్ని స్థాయిలలో అన్ని విధముల అన్నింటికీ, అదే విధముగా కనిపించును.
653. సద్గురువు ఏకకాలమందే ఉత్తమాధమ స్థితుల యందుడును . అతడు అనంత సత్య స్థితిలో ప్రతిష్టితుడయ్యెను, వేరొక వంక మాయకు ప్రభువై ఉన్నాడు . ఈ రెండు ఎగుడు దిగుళ్ళను తాను ఏకకాలమందే అన్ని భూమికలలో , అన్ని స్థాయిలలో వ్యవహరించును. మధ్య స్థితుల ద్వారా వాటిని సమతుల్యంగా కాపాడుతున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 24 / Bhagavad-Gita - 24 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 24 🌴
24. సంజయ ఉవాచ
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్తాపయిత్వా రథోత్తమమ్ ||
🌷. తాత్పర్యం :
సంజయుడు పలికెను : ఓ భరత వంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడిన వాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
🌷. భాష్యము :
ఈ శ్లోకము నందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. “గుడాక”మనగా నిద్ర యని భావము.
అట్టి నిద్రను జయించినవాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్రయనగా అజ్ఞానమని భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణభగవానుని సఖ్యము కారణమున నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని జయించెను.
కృష్ణభక్తునిగా అతడు శ్రీకృష్ణభగవానుని క్షణకాలము సైతము మరిచియుండలేదు. ఏలయన అదియే భక్తుని లక్షణము. నిద్రయందైనను లేదా మెలకువ యందైనను భక్తుడెన్నడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలల స్మరణమును మరువడు.
ఆ విధముగా కృష్ణభక్తుడు శ్రీకృష్ణునే నిరంతరము తలచుచు నిద్ర మరియు అజ్ఞానము రెండింటిని సులభముగా జయింపగలుగును. ఇదియే “కృష్ణభక్తి రసభావనము” లేదా సమాధి యని పిలువబడుచున్నది.
హృషీకేశునిగా లేదా ప్రతిజీవి యొక్క ఇంద్రియమనముల నిర్దేశకునిగా శ్రీకృష్ణభగవానుడు ఇరుసేనల నడుమ రథమును నిలుపుమనెడి అర్జునిని ప్రయోజనమును అవగతము చేసికొనెను. కనుకనే అతడు ఆ విధముగా నొనర్చి ఈ క్రింది విధముగా పలికెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 24 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yoga 🌴
Verse 24
24. sañjaya uvāca
evam ukto hṛṣīkeśo
guḍākeśena bhārata
senayor ubhayor madhye
sthāpayitvā rathottamam
🌷 Translation :
Sañjaya said: O descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Kṛṣṇa drew up the fine chariot in the midst of the armies of both parties.
🌷 Purport :
In this verse Arjuna is referred to as Guḍākeśa. Guḍākā means sleep, and one who conquers sleep is called guḍākeśa. Sleep also means ignorance.
So Arjuna conquered both sleep and ignorance because of his friendship with Kṛṣṇa. As a great devotee of Kṛṣṇa, he could not forget Kṛṣṇa even for a moment, because that is the nature of a devotee.
Either in waking or in sleep, a devotee of the Lord can never be free from thinking of Kṛṣṇa’s name, form, qualities and pastimes. Thus a devotee of Kṛṣṇa can conquer both sleep and ignorance simply by thinking of Kṛṣṇa constantly.
This is called Kṛṣṇa consciousness, or samādhi. As Hṛṣīkeśa, or the director of the senses and mind of every living entity, Kṛṣṇa could understand Arjuna’s purpose in placing the chariot in the midst of the armies. Thus He did so, and spoke as follows
🌹🌹🌹🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 25 / Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 25. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |*
*అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ‖ 25 ‖ 🍀*
🍀 66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా -
సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
🍀 67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా -
అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 25 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 25. sampatkarī-samārūḍha-sindhura-vraja-sevitā |*
*aśvārūḍhādhiṣṭhitāśva-koṭi-koṭibhirāvṛtā || 25 || 🌻*
🌻 66 ) Sampathkari samarooda sindhoora vrija sevitha -
She who is surrounded by Sampathkari (that which gives wealth) elephant brigade
🌻 67 ) Aswaroodadishidaswa kodi kodi biravrutha -
She who is surrounded by crores of cavalry of horses.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 25 / Sri Vishnu Sahasra Namavali - 25 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*మిధునరాశి- పునర్వసు నక్షత్ర 1వ పాద శ్లోకం*
*25. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |*
*అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ‖ 25 ‖*
🍀 228) ఆవర్తనః ---
సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.
🍀229) నివృత్తాత్మా ---
అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.
🍀230) సంవృతః ---
కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.
🍀 231) సంప్రమర్దనః ---
చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).
🍀 232) అహఃసంవర్తకః ---
సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.
🍀 233) వహ్నిః ---
సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.
🍀 234) అనిలః ---
వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.
🍀 235) ధరణీధరః ---
భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 25 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Midhuna Rasi, Punarvasu 1st Padam*
*25. āvartanō nivṛttātmā saṁvṛtaḥ saṁpramardanaḥ |*
*ahaḥ saṁvartakō vahniranilō dharaṇīdharaḥ || 25 ||*
228. Āvrtanaḥ:
One who whirls round and round the Samsara-chakra, the wheel of Samsara or worldy existence.
229. Nivṛttātmā:
One whose being is free or untouched by the bondage of Samsara.
230. Saṁvṛtaḥ:
One who is covered by all-covering Avidya or ignorance.
231. Sampramardanaḥ:
One who delivers destructive blows on all beings through His Vibhutis (power manifestation like Rudra, Yama etc.).
232. Ahaḥ-saṁvartakaḥ:
The Lord who, as the sun, regulates the succession of day and night.
233. Vahniḥ:
One who as fire carries the offerings made to the Devas in sacrifices.
234. Anilaḥ:
One who has no fixed residence.
235. Dharaṇī-dharaḥ:
One who supports the worlds, Adisesha, elephants of the quarters, etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment