భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 230


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 230 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దేవలమహర్షి - 1 🌻


1. ప్రజాపతి అంటే బ్రహ్మ అని అర్థంకూడా ఉంది. అయియే విష్ణునాభికమలంనుండీ పుట్టిన బ్రహ్మ ఇతడు కాదు. ప్రజాపతి కొడుకులలో ఒకడైన బ్రహ్మ అనేవాడు. ఆ ప్రజాపతికి ప్రభాత అనే భర్య వలన ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు ప్రత్యూషుడు. ఇంతనికి ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో మొదటివాడు దేవలుడు.

2. అతిథిసేవ సులభంగా లభించే వస్తువుకాదు. అతిథి ఎవరికీ అంత సులభంగా దొరకడు. కోరినా దొరకడు. కోరని వాడికి దొరకనే దొరకడు. కాబ్ట్టి అతిథి దొరకటమనేది అంత సులభంకాదు.

3. ఆ సేవలో ఉండే మహాఫలంలో ఎంత శక్తిఉందో తెలిస్తే. దేసంలో దరిద్రమే ఉండదు. ఇతరుల దారిద్య్రం నిర్మూలించటానికి ఆతిథ్యం ఇవ్వమని చెప్పటంలేదు. అందులోని రహస్యం, ఆ శక్తి తెలిసినవాడు ఎవరినీకూడా అన్నంలేకుండా ఆకలితో ఉంచడు.

4. కృతజ్ఞత ఆశించెచేసే దానం దానంకాదు. అట్టి సేవ సేవేకాదు. ఎవరైనా అతిథులువచ్చి తిట్టిపోయినాసరే మరచిపోవాలి. ఎవరైనా అట్లాంటివాడు మన ఇంటికివచ్చి, “నువ్వు అన్నం పెట్టావు. కానీ ఏం పెట్టావు? అది ఏమంత గొప్పపని? నేను ఇలాంటివాళ్ళకు చాలామందికి అన్నంపెట్టాను” అని పోయాడనుకోండి.

5. అప్పుడు మనం, “నువ్వు మహానుభావుడివి. నీకు ఇంతే పెట్టగలిగాను” అని అనటం ఉచితం. తిట్టినా మర్చిపోవటం ఆదర్శం. అంతటి నిష్ఠ, ఆదర్శం పెట్టుకొంటే ముందరికి వెళ్ళవచ్చు. ఆర్యుల ఆదర్శం జ్ఞానమే. అదే ఆ ఋషులచరిత్ర తెలిపేది.

6. నమస్కరించినవాడు వృధాగాపోడు. గురువుకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకు వెళితే ఓ పండు ఇస్తాడు. ఆ పండు అప్పుడే రెండు నిమిషాల్లోనే అరిగిపోతుంది. దాని ఫలం వాడికి ఆ వెనకాలే ఉంటుంది. శ్రద్ధా భక్తులతో ఉతాములను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు కోరకుండానే సిద్ధులొస్తాయి. సాధుజనసాంగత్యం, పవిత్రజనసేన వ్యర్థంగాపోవు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2021

No comments:

Post a Comment