వివేక చూడామణి - 19 / Viveka Chudamani - 19


🌹. వివేక చూడామణి - 19 / Viveka Chudamani - 19 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. పంచభూతాలు - 2 🍀


76. లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాసన, రుచి, కాంతి, స్పర్శ, శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి. అలానే మనిషి కూడా ఈ పంచతన్మాత్రులకు బందీ అయి తదనుసారముగా జన్మలు, కర్మలు, అనుభవించు చుండును.

77. త్రాచు పాము విషము కంటే పంచతన్నాత్రల వలన పొందే చెడు ఫలితములు ఇంకా ప్రమాదకమైనవి. పాము విషము అది తీసుకొన్నప్పుడే ప్రభావము చూపుతుంది. కాని పంచతన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.

78. జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చు నుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టుకల నుండి విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్‌ శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 19 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj


🌻 Five Elements - 2 🌻


76. The deer, the elephant, the moth, the fish and the black-bee –these five have died, being tied to one or other of the five senses, viz. sound etc., through their own attachment. What then is in store for man who is attached to all these five.

77. Sense-objects are even more virulent in their evil effects than the poison of the cobra. Poison kills one who takes it, but those others kill one who even looks at them through the eyes.

78. He who is free from the terrible snare of the hankering after sense-objects, so very difficult to get rid of, is alone fit for Liberation, and none else –even though he be versed in all the six Shastras.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2021

No comments:

Post a Comment