🍀 12 - OCTOBER అక్టోబరు - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

 🌹🍀 12 - OCTOBER అక్టోబరు - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
🌹 12 - OCTOBER అక్టోబరు - 2022 WEDNESDAY  బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 269 / Bhagavad-Gita -269 - 6వ అధ్యాయము 36 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 668 / Vishnu Sahasranama Contemplation - 668 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 630 / Sri Siva Maha Purana - 630 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 347 / DAILY WISDOM - 347 🌹   
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 246 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹12, October 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : అట్లతద్ధి, Atla Tadde 🌺*

*🍀. శ్రీ నారాయణ కవచం - 19 🍀*

*27. యన్నో భయం గ్రహేభ్యోఽ భూత్కేతుభ్యో నృభ్య ఏవ చ |*
*సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో  భూతేభ్యోఽఘేభ్య ఏవ చ*
*28. సర్వాణ్యేతాని భగవన్నామ రూపాస్త్రకీర్తనాత్ |*
*ప్రయాంతు సంక్షయం సద్యో యే నః శ్రేయఃప్రతీపకాః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి :   భావనాశక్తిని ఎల్లప్పుడూ నిర్మాణాత్మక ప్రయోజనాలకే వినియోగించాలి. దుర్వినియోగం కూడదు. ద్వేషం, అసూయ, క్రోధం - వీటికి వశులమై పోక, ప్రేమతో, విశ్వాసంతో ఏదైనా ఒకే అభ్యుదయ కార్యం కొరకే దానిని ఉపయోగించాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ తదియ 26:01:33
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: భరణి 17:11:13
వరకు తదుపరి కృత్తిక
యోగం: వజ్ర 14:19:02 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: వణిజ 13:44:00 వరకు
వర్జ్యం: 02:14:48 - 03:54:16
మరియు 29:55:30 - 31:37:34 ?
దుర్ముహూర్తం: 11:38:51 - 12:26:04
రాహు కాలం: 12:02:27 - 13:31:00
గుళిక కాలం: 10:33:55 - 12:02:28
యమ గండం: 07:36:50 - 09:05:23
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25
అమృత కాలం: 12:11:36 - 13:51:04
సూర్యోదయం: 06:08:18
సూర్యాస్తమయం: 17:56:38
చంద్రోదయం: 19:45:23
చంద్రాస్తమయం: 08:08:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మేషం
కాల యోగం - అవమానం 17:11:13
వరకు తదుపరి సిద్ది యోగం -
కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 269 / Bhagavad-Gita - 269 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 36 🌴*

*36. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి: |*
*వశ్యాత్మనా తు యతతా శక్యో(వాప్తుముపాయత: ||*

🌷. తాత్పర్యం :
*మనస్సు నిగ్రహింపబడినవానికి ఆత్మానుభవము అతికష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి, తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము.*

🌷. భాష్యము :
విషయకర్మల నుండు మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను పొందనివాడు ఆత్మానుభవము నందు విజయమును సాధింపలేడని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట పకటించుచున్నాడు.

భౌతికానందమున మనస్సును నిమగ్నముచేసి యోగాభ్యాసమునకు యత్నించుట యనునది ఒకవైపు అగ్ని యందు నీరు పోయుచునే దానిని జ్వలింపజేయు యత్నము వంటిది. మనోనిగ్రహము లేనటువంటి యోగాభ్యాసము కేవలము కాలమును వ్యర్థము చేయుటయే కాగలదు.

అట్టి యోగ ప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయముగా తోచినను ఆత్మానుభవమునకు సంబంధించినంతవరకు మాత్రము అది నిరుపయోగమై యున్నది.

కనుక ప్రతియొక్కరు మనస్సును సదా దివ్యమగు ప్రేమయుతసేవ యందు లగ్నము చేయుట ద్వారా నియమించవలెను. మనుజుడు కృష్ణభక్తిభావన యందు నిలువనిదే తన మనస్సును నియమింపజాలడు.

అనగా కృష్ణభక్తిరసభావితుడు యోగాభ్యాసపు ఫలమును ప్రత్యేకమైన శ్రమ వేరేదియును లేకనే సులభముగా పొందగలడు. కాని కేవల యోగాభ్యాసపరుడు కృష్ణభక్తిరసభావితుడు కానిదే జయమును సాధింపలేడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 269 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 36 🌴*

*36. asaṁyatātmanā yogo duṣprāpa iti me matiḥ*
*vaśyātmanā tu yatatā śakyo ’vāptum upāyataḥ*

🌷 Translation :
*For one whose mind is unbridled, self-realization is difficult work. But he whose mind is controlled and who strives by appropriate means is assured of success. That is My opinion.*

🌹 Purport :
The Supreme Personality of Godhead declares that one who does not accept the proper treatment to detach the mind from material engagement can hardly achieve success in self-realization.

Trying to practice yoga while engaging the mind in material enjoyment is like trying to ignite a fire while pouring water on it.

Yoga practice without mental control is a waste of time. Such a show of yoga may be materially lucrative, but it is useless as far as spiritual realization is concerned.

Therefore, one must control the mind by engaging it constantly in the transcendental loving service of the Lord. Unless one is engaged in Kṛṣṇa consciousness, he cannot steadily control the mind.

A Kṛṣṇa conscious person easily achieves the result of yoga practice without separate endeavor, but a yoga practitioner cannot achieve success without becoming Kṛṣṇa conscious.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 668/ Vishnu  Sahasranama Contemplation - 668🌹*

*🌻668. బ్రహ్మీ, ब्रह्मी, Brahmī🌻*

*ఓం బ్రహ్మిణే నమః | ॐ ब्रह्मिणे नमः | OM Brahmiṇe namaḥ*

*అత్రైవ తచ్ఛేషభూతా వర్తన్తే బ్రహ్మ సంజ్ఞితాః ।*
*ఇతి త్రివిక్రమో బ్రహ్మీత్యుచ్యతే విదుషాం వరైః ॥*

*బ్రహ్మము తనయందుగలవాడు బ్రహ్మీ. బ్రహ్మ అను సంజ్ఞతో వ్యవహరించబడు తపము మొదలగునవి నాలుగును పరమాత్మునకు అంగ భూతములు అగుచు త్రివిక్రముడగు విష్ణునియందే యున్నవి గనుక బ్రహ్మీ.*

:: పోతన భాగవతము షష్ఠమ స్కంధము ::
సీ. పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలె నాకు
నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నా యందు జోకఁజెందు,
నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు!
తే. వెలయ నిద్రించువాఁడాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ
గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు. (479)

*ఈ జగత్తులోని సమస్తజీవులూ నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపములను నిర్దేశించెడివాడను నేనే! బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ - రెండూ శాశ్వతమైన నా దేహములు. ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకములయందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులూ నాకు అనుకూలముగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెంటిలోను అంతర్లీనముగా ఉంటాను. నిదురించెడి వాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధముగా జీవులు ఈ విశాల సృష్టియందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయ నుండి విడివడినవారై పరమార్థమును తెలుసుకుంటారు.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 668🌹*

*🌻668. Brahmī🌻*

*OM Brahmiṇe namaḥ*

अत्रैव तच्छेषभूता वर्तन्ते ब्रह्म संज्ञिताः ।
इति त्रिविक्रमो ब्रह्मीत्युच्यते विदुषां वरैः ॥

*Atraiva taccheṣabhūtā vartante brahma saṃjñitāḥ,*
*Iti trivikramo brahmītyucyate viduṣāṃ varaiḥ.*

*Austerity, the Vedas, sages and wisdom which are indicated by the word Brahma, are parts of Him and hence He is Brahmī.*

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे षोडशोऽध्यायः ::
अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः ।
शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनू ॥ ५१ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ahaṃ vai sarvabhūtāni bhūtātmā bhūtabhāvanaḥ,
Śabdabrahma paraṃ brahma mamobhe śāśvatī tanū. 51.

*All living entities, moving and non-moving, are My expansions and are separate from Me. I am the Supersoul of all living beings, who exist because I manifest them. I am the form of the transcendental vibrations like om‌kāra and I am the Supreme Absolute Truth. These two forms of Mine - namely, the transcendental sound and the eternally blissful spiritual form of the Deity, are My eternal forms; they are not material.*

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



.*🌹 . శ్రీ శివ మహా పురాణము - 630 / Sri Siva Maha Purana - 630 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 11 🌴*
*🌻. బాణ ప్రలంబవధ  - 3 🌻*

కుముదుడిట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! శ్రేష్ఠపురుషా! తండ్రీ! మహాప్రభూ! ప్రలంబునిచే హింసింపబడిన నేను నిన్ను శరణు జొచ్చితిని (22). ప్రలంబాసురునిచే పీడింపబడి నిన్ను శరణుజొచ్చిన నన్ను రక్షించుము. కుమారా! స్కందా! దేవ దేవా! తారకుని సంహరించిన మహాప్రభూ! (23) నీవు దీనులకు బంధువు. కరుణా సముద్రుడవు. ప్రణమిల్లిన వారియందు ప్రేమ గలవాడవు. దుష్టులను దండించువాడవు. శరణు పొంద దగినవాడవు. సత్పురుషులకు నీవే గతి (24). ఇట్లు కుముదుడు స్తుతించి ఆ రాక్షసిని వధించుమని విన్నవించగా, ఆయన శివుని పాదపద్మములను స్మరించి తన శక్తిని చేతిలోనికి తీసుకొనెను (25).

పార్వతీ తనయుడు దానిని ప్రలంబుని ఉద్ధేశించి విసిరెను. అపుడు పెద్ద శబ్దము పుట్టి దిక్కులు, ఆకాశము మండెను (26) ఎంతటి పనులనైననూ తేలికగా చేయు ఆ శక్తి ఆ రాక్షసుని, వాని పదివేల సైన్యమును శీఘ్రముగా భస్మము చేసి గుహుని సమీపమునకు వెంటనే వచ్చి చేరుకొనెను (27). అపుడు కుమారుడు సర్పబాలకుడగు కుముదునితో 'నీవు నిర్భయముగా నీ ఇంటికి వెళ్ళుము. ఆ రాక్షసుడు సైన్యముతో సహా మరణించినాడు' అని చెప్పెను (28). శేషుని కుమారుడు కుముదుడు ఆ స్కందుని మాటను విని కుమారస్వామికి నమస్కరించి స్తుతించి, ఆనందముతో పాతాళమునకు వెళ్లెను (29).

ఓ మహర్షీ! నీకీ తీరున కుమార విజయము, తారక వధ అనే మిక్కిలి ఆశ్చర్యమును గొల్పు వృత్తాంతమును వర్ణించితిని (30). ఇది పాపములనన్నిటినీ పోగొట్టి మానవులకు కొర్కెల నన్నిటినీ ఈడేర్చు దివ్యగాథ. పవిత్రము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్ధాయమును కలిగించునది అగు ఈ గాథ సత్పురుషులకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (31). ఏ మానవులు దివ్యమగు ఈ కుమారస్వామి యొక్క కీర్తిని గానము చేయుదురో వారు అంతులేని భాగ్యముల ననుభవించి శివలోకమును పొందెదరు(32). ఏ జనులు ఆ దివ్య కీర్తిని శ్రధ్ధతో, భక్తితో వినెదరో, వారు ఇచట గొప్ప సుఖముల ననుభవించి మోక్షమును పొందగలరు(33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో బాణ ప్రలంబవధ అనే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 630🌹*
*✍️  J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  11 🌴*

*🌻 The Victory of Kumāra and the death of Bāṇa and Pralamba - 3 🌻*

Kumuda said:—

22. O excellent son of great lord, lord of the gods, O great chief, I am afflicted by Pralamba and am seeking refuge in you.

23. O Kumāra, O Skanda, O lord of the gods, O great lord, O slayer of Tāraka, save me harassed by the Asura Pralamba and seeking refuge in you.

24. You are the kinsman of the distressed, the ocean of mercy, favourably disposed to the devotees, the slayer of the wicked, worthy of refuge and the goal of the good.

25. Eulogised thus by Kumuda and requested to slay the demon Pralamba, the lord took up his spear after remembering the lotus-like feet of Śiva.

26. The son of Pārvatī hurled the spear at Pralamba. It made a loud report. The quarters and the sky blazed.

27. Reducing that powerful Asura to ashes in a trice the spear carried out the job without strain and returned to Kumāra.

28. Then Kumāra told the Nāga child Kumuda—“Go home fearlessly. That Asura has been slain along with his army.”

29. On hearing the words of Guha, Kumuda, the son of the Nāga chief eulogised and bowed to Kumāra and went to Pātāla[3] in great delight.

30. Thus the story[4] of the victory of Kumāra, including the wonderful way in which Tāraka was slain, has been narrated by me, O noble sage.

31. It is the divine story that removes all sins. It bestows all desires on men. It is conducive to the increase of wealth, glory and longevity. It confers worldly pleasures and salvation on the good.

32. Those who recite this divine story of Kumāra and glorify him are infinitely fortunate and attain Śivaloka.

33. Those who listen to his glory with devotion and faith will attain divine salvation hereafter after enjoying great happiness here.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 347 / DAILY WISDOM - 347 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి  🍀*
*📝.  ప్రసాద్ భరద్వాజ్*

*🌻12. ఇక్కడ ఒక పర్వతం ఉంది, అక్కడ మరొకటి ఉంది అని కాదు🌻*

*సాధారణంగా, పదార్థం అంతరిక్షంలో ఒక విషయంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది.  సమయం అని ఒక విషయం ఉందని భావించడం చాలా అరుదు. కాలంతో మనిషికి ఉండే సంబంధం విడదీయరానిది. అయినప్పటికీ, అతను దాని గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాడు, కానీ ప్రదేశం గురించి చాలా స్పృహ కలిగి ఉంటాడు. మనిషి పదార్థంగా గుర్తించే ఈ వస్తువుల సమాహారాలన్నీ అక్కడ ఉన్న ఆకాశం యొక్క విస్తరణలే. వస్తువుల మధ్య దూరం అని పిలవబడేది వాటి మధ్య ఉన్న ఆకాశం వల్లే ఉన్నది. మనిషి ఆకాశం యొక్క లక్షణాలు గురించి అంతరంగా ఒక అవగాహన కలిగి ఉంటాడు, అతను దాని స్వభావం గురించి పెద్దగా పట్టించుకోడు. అంతా సవ్యంగానే ఉందని అతను భావిస్తాడు. ఆకాశం అంటే ఏమిటో అందరికీ తెలుసు-అది ఒక రకమైన శూన్యత, ప్రతి వస్తువును అది తనలో కలిగి ఉంటుందని మనం భావిస్తాము.*

*పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దాల చివరికి భౌతిక శాస్త్రం విశ్వం గురించి అర్థం చేసుకున్నదేమిటంటే విశ్వం అంతా కూడా అంతరిక్షంలో అమర్చబడి ఉన్న పదార్థాల సమాహారం అని. ఈ అమరికలే గ్రహాలుగా, పాలపుంతలుగా, సౌర కుటుంబాలుగా ఉన్నాయని అప్పటి భౌతిక శాస్త్రం అనుకుంది. అయినప్పటికీ, ఈ ఖగోళ అమరికలు తమలో తాము ఏ విధమైన సంబంధం లేనట్లుగా, అంతరిక్షంలో స్వతంత్రంగా చెల్లాచెదురుగా ఉన్నాయని అంగీకరించడం కూడా అంత తేలిక కాదు. ఒక పర్వతం ఇక్కడ ఉంది, మరొకటి ఉంది, లేదా ఒక చెట్టు ఇక్కడ ఉంది మరియు మరొకటి ఉంది, రెండింటి మధ్య సంబంధం లేకుండా ఈ వస్తువులు అలా ఉనికి లో ఉన్నాయని కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 347 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻12. It is not That One Mountain is Here, Another There🌻*

*Generally, we have the feeling that matter is contained as a substance inside space. Very rarely does one feel that there is such a thing called time. Man is inviolably connected with the process of time. Yet, he thinks very little of it, but is acutely conscious of space. The dimensions of matter, which man identifies with the substances of the world, are due to the extensions of space. There is what is called distance, and that principle of distance is due to the existence of space. Man has an intuitional apperception of the characteristic of space, such that he does not bother much about its nature. He thinks that it is all clear. Everyone knows what space is—it is a kind of emptiness, we think, which contains every blessed thing.*

*This was the original eighteenth or nineteenth century conclusion of even physics, which led to the notion that the universe of astronomy is an arrangement of material bodies which were formed out of the galaxies, and which constituted the solar system, the Earth, the planets, etc. However, it is not evidently easy to accept that bodies are scattered independently in space, as if they have no connection whatsoever among themselves. It is not that one mountain is here, another there, or one tree is here and another there, without any connection between the two.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 246 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మతమున్న మనుషులు దిగులుగా కనిపిస్తారు. నవ్వడం పాపం కింద భావిస్తారు. వాళ్ళు పాడరు. నాట్యమాడరు. వాళ్ళు దేన్నీ ఆనందించలేరు.  వాళ్ళు జీవితానికి వ్యతిరేకమయిన వాళ్ళు. సత్యాన్ని కనిపెట్టే మార్గం కాదది. జీవితాన్ని ప్రేమించు.  జీవితంలోని సాధారణ విషయాల్ని ఆనందంగా మార్చుకో. వాటిని ఆనందంగా మలచుకుంటే అవి నాట్యంగా మారతాయి. సత్యమెంతో దూరంలో వుండదు. 🍀*

*సత్యాన్ని సమీపించే స్థితి ఉత్సాహం. గాఢమయిన లోపలి నాట్యం. ఆ నాట్యానికి అడ్డమొచ్చే అన్నిట్నీ వ్యక్తి త్యజించాలి. అన్ని అవరోధాల్ని తొలగించుకుంటే జీవితం వుత్సవమవుతుంది. మనం ఆనందాన్ని అడ్డుకునే భారాల్ని మోస్తూ వుంటాం. వాస్తవానికి మతమన్నది గంభీరానికి ప్రత్యామ్నాయ పదంగా మారింది. మతమున్న మనుషులు దిగులుగా కనిపిస్తారు. నవ్వడం పాపం కింద భావిస్తారు. వాళ్ళు పాడరు. నాట్యమాడరు. వాళ్ళు దేన్నీ ఆనందించలేరు. వాళ్ళు జీవితానికి వ్యతిరేకమయిన వాళ్ళు.*

*సత్యాన్ని కనిపెట్టే మార్గం కాదది. జీవితాన్ని ప్రేమించు. జీవితంలోని చిన్ని చిన్ని విషయాల్ని ప్రేమించు. మరీ చిన్న వాటిని అంటే తినడాన్ని, వాకింగ్ చెయ్యడాన్ని, నిద్రపోవడాన్ని ప్రేమించు. జీవితంలోని సాధారణ విషయాల్ని ఆనందంగా మార్చుకో. వాటిని ఆనందంగా మలచుకుంటే అవి నాట్యంగా మారతాయి. సత్యమెంతో దూరంలో వుండదు. అప్పుడు ప్రతి క్షణం మరింత మరింత సన్నిహితంగా మారుతుంది. ఒక సమయానికి నీ ఆనందం సంపూర్ణమవుతుంది. సత్యం నీలో ప్రవేశిస్తుంది. సత్యం స్వేచ్ఛనిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment