శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 55
🌻. పిండికాది లక్షణములు - 1 🌻
హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! నే నిపుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంశముండవలెను. దాని మూడ వంతుచే మేఖల నిర్మింపవెలను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత, మేఖల కొలతతో తుల్యముగా నుండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవంతుతో జలము బైటకు పోవుటకై ప్రణాలము నిర్మించవలెను. మూలభాగమున దానివిస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయినకొలది సగముండవలెను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవవంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమాపొడవెంతయో అంతే ఉండవలెనని చెప్పబిడనది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.
వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశభాగసంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిది భాగము క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీనిపైననున్న మూడుభాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్క దానిని ప్రతిష్ఠ, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలెను. ఇది ప్రతిమాపిండికల సామాన్య లక్షణము. ప్రాసాదద్వార దైర్ఘ్యవిస్తారములనుపట్టి ప్రతిమా గృహ ద్వారముండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. శ్రీహరియొక్క పిండికను గూడ యథోచిత శోభాసంపన్నముగ నుండునట్లు చేయవలెను. అన్ని దేవప్రతిమల ప్రమాణము విష్ణు ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె నుండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీప్రతిమకు చెప్పిన విధముననే ఉండవలెను.
శ్రీ అగ్నిమహాపురాణమునందు పిండికాది లక్షణమును ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 180 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 55
🌻The characteristics of the pedestal (piṇḍikā-lakṣaṇa) - 1 🌻
The Lord said:
I. I shall describe (the characteristics of) the pedestal of images [i.e., piṇḍikā]. They have the same length as (the height) of the image and have breadth half (the height) of (the image).
2. Or the breadth should be half or one-third of the measure of the height. The girdle should be equal to one-third of its breadth.
3. The cavity should be of the same measure and should be inclined towards the posterior part. A quarter of the breadth (should be left out) for the canal as outlet.
4. (The width) of the forepart (of the channel) should be half of the breadth of the base. The water-course should be one-third of the breadth (of the base).
5. Or else the length of the liṅga is said to be equal to half (the length) of the base or equal to the length (of the base).
6. The height (of the pedestal [i.e., piṇḍikā]) should be divided into sixteen parts as before. The lower six divisions should be made to comprise two parts. The neck should be three parts.
7. The foundation, projections, joint, seat and other remaining parts should each comprise one part. This will hold good in the case of ordinary images.
8. The door-way (leading) to the image is said to be proportionate to the door-way of the temple. The canopy over the image should be endowed with elephants and tigers.
9. The pedestal of (the image of) Hari also should always be made beautiful. The measures (laid down) for the images of Viṣṇu shall apply to (the images of) all gods. Those measures set forth for the image of Lakṣmī shall apply to all (images of) the goddesses.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment