1) 🌹 05, MARCH 2023 SUNDAY, ఆదివారం, భానువాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita -335 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 25 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 182 / Agni Maha Purana - 182 🌹 🌻. దశదిక్పతియాగ ము - 2 / Five divisions of installation - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 047 / DAILY WISDOM - 047 🌹 🌻 16. ప్రతిదీ మిగతా అన్నింటితో అనుసంధానించబడి ఉంది / 16. Everything is Connected with Everything Else 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 312 🌹
6) 🌹. శివ సూత్రములు - 49 / Siva Sutras - 49 🌹
🌻 16. శుద్ధ-తత్త్వ-సంధానద్-వాపశుశక్తిః - 1 / 16. Śuddha-tattva-sandhānād-vāpaśuśaktiḥ - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 05, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. సూర్య మండల స్త్రోత్రం - 11 🍀*
11. యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఆలోచనలకు వెనుకగా నిలువబడి పరిశీలించే ధ్యానపద్దతికి తరువాతి మెట్టు ఆలోచనలన్నిటినీ మనసులోంచి ఖాళీచేసే ధ్యానపద్ధతి. జాగరూకతతో కూడిన విశుద్ధమైన ఆ ఖాళీలో దివ్య జ్ఞానం సాధారణ మానసిక ప్రవృత్తులచే కలుషితం కావడానికి వీలేర్పడుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 14:08:21
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: ఆశ్లేష 21:31:53
వరకు తదుపరి మఘ
యోగం: అతిగంధ్ 20:21:05 వరకు
తదుపరి సుకర్మ
కరణం: తైతిల 14:06:21 వరకు
వర్జ్యం: 09:00:36 - 10:47:48
దుర్ముహూర్తం: 16:48:38 - 17:36:04
రాహు కాలం: 16:54:34 - 18:23:30
గుళిక కాలం: 15:25:37 - 16:54:34
యమ గండం: 12:27:43 - 13:56:40
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 19:43:48 - 21:31:00
సూర్యోదయం: 06:31:55
సూర్యాస్తమయం: 18:23:30
చంద్రోదయం: 16:43:21
చంద్రాస్తమయం: 05:13:34
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
21:31:53 వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 335 / Bhagavad-Gita - 335 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 25 🌴*
*25. ధూమో రాత్రిస్తథా కృష్ణ: షణ్మాసా దక్షిణాయనమ్ |*
*తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ||*
🌷. తాత్పర్యం :
&ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమునందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.*
🌷. భాష్యము :
భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞవిధానములందు నిష్ణాతులైనవారు మరణానంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవతము నందలి మూడవస్కంధమున కపిలముని తెలిపెను.
అట్టి ఉన్నతులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము పదివేలసంవత్సరములు జీవించి, సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవింతురు. కాని అంత్యమున వారు మరల భులోకమునకే తిరిగి వత్తురు.
దీని భావమేమనగా జడేంద్రియములచే అనుభూతము కాకున్నను ఉన్నతులైన జీవులు చంద్రలోకమున నిలిచియున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 335 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 25 🌴*
*25 . dhūmo rātris tathā kṛṣṇaḥ ṣaṇ-māsā dakṣiṇāyanam*
*tatra cāndramasaṁ jyotir yogī prāpya nivartate*
🌷 Translation :
*The mystic who passes away from this world during the smoke, the night, the fortnight of the waning moon, or the six months when the sun passes to the south reaches the moon planet but again comes back.*
🌹 Purport :
In the Third Canto of Śrīmad-Bhāgavatam Kapila Muni mentions that those who are expert in fruitive activities and sacrificial methods on earth attain to the moon at death.
These elevated souls live on the moon for about 10,000 years (by demigod calculations) and enjoy life by drinking soma-rasa. They eventually return to earth. This means that on the moon there are higher classes of living beings, though they may not be perceived by the gross senses.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 182 / Agni Maha Purana - 182 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 56*
*🌻. దశదిక్పతియాగ ము - 2 🌻*
*ఉంగరములు మొదలగు ఆభరణములిచ్చి, ప్రార్థించి మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి వారిని చతురస్రములు, అర్ధచంద్రాకారములు, గోలాకారములు, లేదా పద్మసదృశములు అగు కుండములపై కూర్చుండ పెట్టవలెను. పూర్వాది దుక్కులతోరణములకు అశ్వత్థ-ఉదుంబర-వట-ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పుద్వారమునకు 'సుశోభన' మని పేరు. దక్షిణద్వారము 'సుభద్రము' , పశ్చిమద్వారము 'సుకర్మ' ఉత్తరద్వారము' సుహోత్రము'. ఆ తోరణస్తంభములన్నియు ఐదుహస్తుముల ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి "స్యోనా పృథివీనో" అనే మంత్రముచే పూజించవలెను. తోరణస్తంభముల మూల భాగములందు మంగళకరమైన చూత పల్లవ - యవాంకురాద్యంకురములున్న కలశలు స్థాపింపవలెను. తోరణస్తంభముపై సుదర్శన చక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజముకూడ స్థాపింపవలెను. దీన వెడల్పు పదునారు అంగుళములుండవలెను. ఓ సురశ్రేష్ఠా! ఆ ధ్వజదండము ఏడుహస్తముల ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై అరుణవర్ణము, అగ్ని (ధూమ్రవర్ణము), కృష్ణ-శుక్ల-పీత-రక్త-శ్వేత వర్ణములు ఉండవెలను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 182 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 56*
*🌻Five divisions of installation - 2 🌻*
6. The expert idol-worshippers should be established in front of each pit (intended for the rite). (They should be endowed) with rings, bracelets and other things.
7. Logs of the pippala, udumbara, vaṭa trees (should be planted) at the doorways of the place for the sake of arches. The place may be quadrangular, semi-circular, circular or lotusshaped.
8. Log of the fig tree should adorn the east, of the subhadra the south, of the sukarma and suhotra the northern and western doorways respectively.
9. The pitchers having young sprouts of mango trees should be placed five cubits apart at the toot of each one of the supporting columns of the arches and be worshipped with the sacred syllables syonā pṛthivī[1].
10. The sudarśana (disc of Viṣṇu) should be placed at the top. A wise man has to make the banner five cubits long.
11-12. It should be made sixteen fingers broad. O excellent among the celestials! the height should be seventeen cubits in the alternative. The pit should be duly reddish, flame-coloured,. black, white, yellow, deep red, white and (again) white..
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 47 / DAILY WISDOM - 47 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 16. ప్రతిదీ మిగతా అన్నింటితో అనుసంధానించబడి ఉంది. 🌻*
*ప్రతిదానికీ అన్నిటితో సంబంధం ఉంటుంది. సర్వశక్తిమంతుడైన పరమాత్మతో అంతర్గతంగా సంబంధం లేనిది ఏదీ లేదు. ప్రతి పరమాణువు ప్రతి దానితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రతి పరమాణువు ఇచ్చిన పరిస్థితులలో ఒక గురువు కావచ్చు. భగవంతుని వెలుపల విశ్వం అంటూ ఏదీ లేదు కాబట్టి మనం ప్రతి అణువు ద్వారా భగవంతుడిని తాకవచ్చు.*
*భగవంతుడు ఇక్కడ ప్రపంచంగా లేదా విశ్వంగా అనుభవించే ప్రతిదానిలో ఉన్నాడు. అన్ని విషయాలలో వ్యాపించి మరియు వాటిలో భాగమై ఉన్నాడు, కాబట్టి ఎవరైనా భగవంతుడిని కాక ప్రపంచంలో దేనినీ తాకలేరు. ప్రజలు పూజించే దేవతలు, ప్రతిమలు, విగ్రహాలు అన్నీ కేవలం అర్ధంలేనివి లేదా అప్రధానమైనవి అనే అపోహ ఉండకూడదు; ఆత్మ యొక్క పరిణామ దశలలో ఉండే విపరీతాలకు ఇవే పరిష్కారాలు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 47 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 16. Everything is Connected with Everything Else
🌻*
*Everything has a connection with everything else. There is nothing which is not internally related to the Almighty, the Supreme Being. Every atom is so related, and every atom can be a teacher under given conditions. We can touch God through every speck of space, because there is no such thing as a universe outside God.*
*God is in everything that is experienced here as the world, or the universe, pervading and permeating all things, so that one cannot touch anything without touching God in some way. There should not be any misconception that the deities, even the images, the so-called idols that the people worship, are all just nonsense or insignificant nothings; these are necessary prescriptions for the illness of the spirit in the stages of its evolution.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 312 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనకున్న వాటి గురించి మనమాలోచించం. లేని వాటి గురించి ఆలోచిస్తాం. ప్రేమికుడిగా వుండటానికి సాహసం కావాలి. కారణం ప్రేమ అహాన్ని వదులుకోమంటుంది. అప్పుడు అద్భుతం ఆరంభమవుతుంది. అప్పుడు ప్రేమ నిన్ను ముంచెత్తుతుంది. 🍀*
*ప్రపంచంలో ప్రేమ గురించి రాసినంత దేన్ని గురించీ రాయలేదు. దేవుడి కన్నా ఎక్కువ రాశారు. ఎన్నో పాటలు, ఎన్నో కల్పనలు, నవలలు, కథలు ప్రేమ పేరుతో వున్నాయి. ఎందుకని మనుషులు ప్రేమ పట్ల అట్లా అల్లాడతారు? సినిమాలు, టీవీ, పత్రికలు, సాహిత్యం అన్నిట్లో ప్రేమే. దాన్ని బట్టి చూస్తే మనిషికి ప్రేమ పట్ల చాలా ఆసక్తి. కానీ దాని బదులుగా వీటన్నిట్ని ఆశ్రయిస్తాడు. సినిమాకు వెళతాడు. అక్కడ ఎవరి ప్రేమనో చూస్తాడు. అన్ని చోట్లా ప్రేక్షక పాత్ర వహిస్తాడు. పాత్రల్ని సృష్టించి సంతోషిస్తాడు. కవిత్వం సృష్టించి తృప్తి పడతాడు. అది తన అనుభవమే అంటాడు.*
*ఇవన్నీ నిజమైన ప్రేమకు పేలవమైన ప్రత్యామ్నాయాలు. మనిషి నిజంగా ప్రేమలో అడుగుపెడితే ఈ చెత్తాచెదారం మాయమవుతుంది. గుర్తుంచుకోండి. ఆకలివున్న వాళ్ళే ఆహారం గురించి ఆలోచిస్తారు. నగ్నంగా వున్నవాళ్ళు బట్టల గురించి, ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళ గురించి ఆలోచిస్తాడు. మనకున్న వాటి గురించి మనమాలోచించం. లేని వాటి గురించి ఆలోచిస్తాం. ప్రేమికుడిగా వుండటానికి సాహసం కావాలి. కారణం ప్రేమ అహాన్ని వదులుకోమంటుంది. అప్పుడు అద్భుతం ఆరంభమవుతుంది. అప్పుడు ప్రేమ నిన్ను ముంచెత్తుతుంది. చివరగా ప్రేమ అస్తిత్వానికి సంబంధించినవి, సత్యానికి సంబంధించిన నీ అనుభవంగా మారుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 049 / Siva Sutras - 049 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 16. శుద్ధ-తత్త్వ-సంధానద్-వాపశుశక్తిః - 1 🌻*
*🌴. స్వచ్ఛమైన పూర్ణత్వాన్నిధ్యానించడం ద్వారా సాధకుడు బంధించే శక్తి నుండి విముక్తుడవుతాడు 🌴*
*పరిపూర్ణత యొక్క శాశ్వతమైన అవగాహన ఉన్నప్పుడు ముముక్షువు బంధాలలో చిక్కుకునే శక్తిని కోల్పోతాడు. పరిపూర్ణత అంటే శివుడు. ప్రాధమికంగా, స్వచ్ఛమైన రూపం శివుడు. ఒక యోగి శివునిపై తన పూర్తి ఎరుకను ఉంచగలడు. దీనిని మరో విధంగా చెప్పాలంటే, ఒక యోగి తన శుద్ధమైన వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంలో, అంటే శివ చైతన్యంలో స్థిరపరచుకోగలడు. అతని వ్యక్తిగత చైతన్యం అత్యున్నత స్థాయి చైతన్యంతో విలీనమైపోయెలా పరివర్తన చెందుతుంది. దీనిని చేతనా చేతన భేదము (భేద - వేరు) అంటారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 049 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 16. Śuddha-tattva-sandhānād-vāpaśuśaktiḥ - 1 🌻*
*🌴. By contemplating the pure principle one is free of the power that binds 🌴*
*By perpetual awareness of the Pure Principle, the individual soul or the aspirant becomes devoid of power that binds. Pure Principle is Śiva. By default, purest form is Śiva. A yogi is able to establish his ever existing un-afflicted awareness on Śiva. To put this in other way, a yogi is able to fix his purified individual consciousness in the universal consciousness, the Śiva consciousness. His individual consciousness undergoes transformation to merge with the highest level of consciousness. This is known as cetanā cetana bhidā (bhidā – separation).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment