కపిల గీత - 159 / Kapila Gita - 159
🌹. కపిల గీత - 159 / Kapila Gita - 159 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 13 🌴
13. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణమ్|
నీలోత్పలదళశ్యామం శంఖచక్రగదాధరమ్॥
తాత్పర్యము : ఆ శ్రీమన్నారాయణుని యొక్క వదనారవిందము ప్రసన్నమై యుండును. నేత్రములు పద్మకోశముల వలె అరుణవర్ణ శోభితములు. మేను నల్లగలువల రేకుల వలె శ్యామవర్ణముతో విలసిల్లు చుండును. ఆ స్వామి నాల్గు భుజముల యందును శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి యుండును.
వ్యాఖ్య : పద్మ పత్రముల వంటి, ఎర్రాగా ఉన్న, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడూ, అయిన పరమాత్మని ధ్యానం చేయాలి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం వలన ప్రకృతి మనని బంధించదు. అలాంటి పరమాత్మని చేరడానికి జ్ఞ్యాన కర్మాదులతో కూడి ఉన్న భక్తి యోగం సహకరిస్తుంది. దానికి అన్ని ఇంద్రియాలనూ మనసులో, మనసును హృదయములో చేర్చాలి. మనసు ప్రాణాయామముతో మనం చెప్పినట్లు వింటుంది. పరమాత్మ భూషణాలూ, ఆయుధాలు ఉన్న పరమాత్మని ధ్యానించాలి. హృదయ దహరాకాశములో స్వామి ఉంటాడు. ఎలాంటి స్వామిని ధ్యానించాలి. పడుకుని ఉన్నా, కూర్చుని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. సంపూర్ణ ధ్యానం చేయాలి. కేశముల నుండీ పాదముల వరకూ, పాదముల నుండీ కేశముల వరకూ ధ్యానించవచ్చు. ఒకే సారి పరమాత్మను మొత్తం ధ్యానములో నిల్పుకోలేని నాడు, ఒక్కొక్క అవయవాన్నే ముందు పెట్టుకుంటూ దాని మీదే ధ్యానం చేయాలి. ఇతర ఏ విషయములవైపూ మనసు వెళ్ళకుండా, పరమాత్మ యొక్క ఆ అవయవం మీదే ధ్యానం కుదిరే వరకూ చేయాలి. ఇలాంటి ఏకాగ్రత కలిగిన తరువాత సాంసారికమైన విషయాలు బాధించవు. ఇది సులభ ఉపాయం.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 159 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 13 🌴
13. prasanna-vadanāmbhojaṁ padma-garbhāruṇekṣaṇam
nīlotpala-dala-śyāmaṁ śaṅkha-cakra-gadā-dharam
MEANING : The Supreme Personality of Godhead has a cheerful, lotuslike countenance with ruddy eyes like the interior of a lotus and a swarthy body like the petals of a blue lotus. He bears a conch, discus and mace in three of His hands.
PURPORT : It is definitely recommended herein that one concentrate his mind upon the form of Viṣṇu. There are twelve different forms of Viṣṇu, which are described in Teachings of Lord Caitanya. One cannot concentrate his mind on anything void or impersonal; the mind should be fixed on the personal form of the Lord, whose attitude is cheerful, as described in this verse. Bhagavad-gītā states that meditation on the impersonal or void features is very troublesome to the meditator. Those who are attached to the impersonal or void features of meditation have to undergo a difficult process because we are not accustomed to concentrating our minds upon anything impersonal. Actually such concentration is not even possible. Bhagavad-gītā also confirms that one should concentrate his mind on the Personality of Godhead.
The color of the Personality of Godhead, Kṛṣṇa, is described here as nīlotpala-dala, meaning that it is like that of a lotus flower with petals tinted blue and white. The Lord's appearance is described here as padma-garbhāruṇekṣaṇam. His eyes resemble the inside of a lotus flower, and in His four hands He holds the four symbols: conchshell, discus, mace and lotus.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment