🌹. కపిల గీత - 185 / Kapila Gita - 185 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 39 🌴
39. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథఙ్మర్యః ప్రతీయతే|
అప్యాత్మత్వేనాభిమతాద్దేహాదేః పురుషస్తథా॥
తాత్పర్యము : సామాన్య జీవుడు అతిప్రేమ కారణముగా పుత్రులు, సంపదలు మొదలగు వాటియందు ఆత్మబుద్ధిని (మమకారము) కలిగియుండును. కాని, అతడు విచక్షణతో పరిశీలించిన పిమ్మట ఆ పుత్రాది సంపదలన్నియును తనకంటె వేరని గ్రహించును. అట్లే, ఆత్మజ్ఞానము కలిగినంతనే అతనికి ఇంతకుముందు దేహముపై గల ఆత్మభావము నశించిపోవును. అనగా ఆత్మ దేహముకంటే వేరని బోధపడును.
వ్యాఖ్య : శరీరమూ బుద్ధి మనసు అహంకారం చిత్తం. ఈ ఆరింటికన్నా ఆత్మ వేరే ఉందా. ఉన్నట్లు ఎలా నమ్మాలి? ఏ ప్రమాణం ఉంది? "నా శరీరం" అంటే నేను వేరు శరీరం వేరు. "నా పుత్రుడు" అంటే నేను వేరు పుత్రుడు వేరు. ఏది నా అంటున్నామో అది ఆత్మ. ప్రపంచములో అందరికంటే అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది పుత్రుడు. అయినా కొడుకు వేరు "నేను " వేరు. పుత్రుడు మిత్రుడూ వీరు మనకు ప్రీతి పాత్రమైన వారు. వారికంటే మనిషి విడిగానే కనపడతాడూ, తెలుసుకుంటాడు. కొడుకు మీద ప్రేమ ఉంది అంటే మొదట తన మీద తనకు ప్రీతి ఉన్నది అని అర్థం. అత్యంత ప్రీతి పాత్రమైంది దేహం. "నాకు నా మిత్రునికీ/పుత్రునికి భేధమే లేదు" అని మాటలలో అన్నా, ఆ "నేను" వేరు, పుత్రుడు/మిత్రుడు వేరు. అలాగే దేహము వేరు పురుషుడు వేరు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 185 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 39 🌴
39. yathā putrāc ca vittāc ca pṛthaṅ martyaḥ pratīyate
apy ātmatvenābhimatād dehādeḥ puruṣas tathā
MEANING : Because of great affection for family and wealth, one accepts a son and some money as his own, and due to affection for the material body, one thinks that it is his. But actually, as one can understand that his family and wealth are different from him, the liberated soul can understand that he and his body are not the same.
PURPORT : The status of real knowledge is explained in this verse. There are many children, but we accept some children as our sons and daughters because of our affection for them, although we know very well that these children are different from us. Similarly, because of great affection for money, we accept some amount of wealth in the bank as ours. In the same way, we claim that the body is ours because of affection for it. I say that it is "my" body. I then extend that possessive concept and say, "It is my hand, my leg," and further, "It is my bank balance, my son, my daughter." But actually I know that the son and the money are separate from me. It is the same with the body; I am separate from my body. It is a question of understanding, and the proper understanding is called pratibuddha. By obtaining knowledge in devotional service, or Kṛṣṇa consciousness, one can become a liberated soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment