శ్రీ మదగ్ని మహాపురాణము - 238 / Agni Maha Purana - 238


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 238 / Agni Maha Purana - 238 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 72

🌻. స్నానతర్పణాది విధి కధనము - 3 🌻


ఇదియే ఆగ్రేయస్నానము, సూర్యకిరణములు కనబడు చున్నపుడు ఆకాశమునుండి వర్షము కురియుచున్నచో, పూర్వాభిముఖుడై రెండు భుజములు పైకెత్తి ఈశాన మంత్రముచ్చరించుచు, ఏడు అడుగులు నడిచి, ఆ వర్షాజలమునందు స్నానముచేయవలెను. ఇది ''మాహేంద్ర స్నానము'', గోసముదాయము మధ్య నిలిచి, గోవుల డెక్కలచే పైకి ఎగురగొట్టబడిన ధూళిలో ఇష్టదేవతా మూలమంత్రము జపించుచు, లేదా కవచమంత్రము (హుం) జపించుచు చేయు స్నానము ''పావనస్నానము'' సద్యోజాతాది మంత్రముల నుచ్చరించు జలముతో చేయు స్నానము ''మంత్రస్నానము'', ఈ స్నానము వరుణదేవతా మంత్రములను, అగ్ని దేవతామంత్రములను ఉచ్చరించుచు గూడ చేయవచ్చును. మనస్సులో మూలమంత్రముచ్చరించుచు ప్రాణాయామము చేయుట ''మానసిక స్నానము''. ఈ స్నానము సర్వకర్మలయందును విధింపబడినది. విష్ణుదేవతాదులకు సంబంధించిన కార్యములలో ఆ యా దేవతల మంత్రములతో ఈ స్నానము చేయవలెను.

కార్తికేయా! విభిన్న మంత్రములతో సంధ్యావిధిని గూర్చి చెప్పెదను బాగుగా చూచి జలమును, మంత్రపాఠపూర్వకముగ బ్రహ్మతీర్థము ద్వారా మూడు పర్మాయములు గ్రహించవలెను. ఆచమన సమయమున ఆత్మతత్త్వ - విద్యాతత్త్వ - శివతత్త్వములకు 'నమః' సహిత 'స్వాహా' శబ్దమును చేర్చి మంత్రము చదువవలెను. అనగా ఇచ్చట ఆత్మాతత్త్వాయ నమః స్వాహాః, ఓం విద్యాతత్త్వాయ నమః స్వాహా, ఓం శివతత్త్వాయ నమః స్వాహా'' అను మంత్రములతో ఆచమనము చేయవలెను. పిదప ముఖము, నాసిక, నేత్రములు, కర్ణములు స్పృశింపవలెను. ప్రాణాయామముచేసి, సఫలీకరణక్రియను సంపన్నము చేసి స్థిరముగ కూర్చుండవలెను. పిమ్మట మంత్రసాధకుడు శివసంహితను మనస్సులోనే ఆవృత్తిచేసి, ఆచమనము, అంగ న్యాసములచేసి ప్రాతఃకాలమునందు బ్రాహ్మీ సంధ్యను ఈ విధముగ ధ్యానించవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 238 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 72

🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 3🌻


20. The māhendra bathing (consists in the recitation of the) Īśa mantra and walking seven steps in the midst of herds of cows being besmeared with the dust (arising) from the hoofs.

21. The pāvana (purifying) bathing (should be done) with the nine mantras or the constituent mantra and the pouring of water (should be done) with the mantras sadyojāta, etc.

22. The bathing with the mantra should be done in this manner in honour of (the gods) Varuṇa, Agni and others with (the recitation) of the principal mantra being preceded by the regulation of the breath.

23. The mental bathing [i.e., mānasa-snāna—mānasaṃ snānaṃ] which has been universally enjoined should be performed in honour of Lord Viṣṇu, by uttering the mantra sacred to him.

24. O Guha (son of Lord Śiva)! I shall describe the rules (relating to) the twilight (worship) (to be performed) with different mantras. After having had a look one should drink the water, the Brahma and Śaṅkara tīrthas (from the root of different fingers).

25. (One should pronounce) the different principles consti-tuting one’s self ending with the tern svadhā, touching firmly the (nine) apertures (in the body). After having done the sakalīkaraṇa (accomplishing deed) one should remain composed by (the performance of) regulation of breath.

26. The performer should mentally repeat thrice the śivasaṃhitā. After having sipped water and performing nyāsa (assigning gods or mantras in different parts of the body, one should meditate upon the goddess brāhmī and the sandhyā in the morning as follows:


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment