1) 🌹 06, AUGUST 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 409 / Bhagavad-Gita - 409 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 37 / Chapter 10 - Vibhuti Yoga - 37 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 11 / Mode of worshipping Śiva (śivapūjā) - 11 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 121 / DAILY WISDOM - 121 🌹
🌻 30. మన చర్యలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి / 30. Our Actions Determine the Future 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 387 🌹*
6) 🌹. శివ సూత్రములు - 123 / Siva Sutras - 123 🌹
🌻 2-08. శరీరం హవిః - 5 / 2-08. śarīram havih - 5 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 06, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 18 🍀*
*35. అనాద్యంతోఽచ్యుతో విశ్వో విశ్వామిత్రో ఘృణిర్విరాట్ |*
*ఆముక్తకవచో వాగ్మీ కంచుకీ విశ్వభావనః*
*36. అనిమిత్తగతిః శ్రేష్ఠః శరణ్యః సర్వతోముఖః |*
*విగాహీ వేణురసహః సమాయుక్తః సమాక్రతుః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవ ప్రేమ ఉపయోగం - మానవ ప్రేమ విలువ ఎట్టిదైనా, అతని వికాసపథంలో దానికొక స్థానం ఉన్నది. ఏలనంటే, అసత్యమును వీడి సత్యమును, ఆపూర్ణమును వీడి పూర్ణమును, మానవత్వమును వీడి దివ్యత్వమును గ్రహించే యోగ్యత సంపాదించే పర్యంతం తనకు కావలసిన హృదయ భావానుభూతులను హృత్పురుషుడు ఈ మానవ ప్రేమ ద్వారముననే పొందగలుగుతాడు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ పంచమి 07:11:32 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: రేవతి 25:45:05 వరకు
తదుపరి అశ్విని
యోగం: ధృతి 20:26:35 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 07:11:32 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 17:04:26 - 17:55:48
రాహు కాలం: 17:10:51 - 18:47:11
గుళిక కాలం: 15:34:32 - 17:10:51
యమ గండం: 12:21:54 - 13:58:13
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: -
సూర్యోదయం: 05:56:38
సూర్యాస్తమయం: 18:47:11
చంద్రోదయం: 22:29:39
చంద్రాస్తమయం: 10:21:42
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 25:45:05 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 409 / Bhagavad-Gita - 409 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 37 🌴*
*37. వృష్ణీనాం వాసుదేవో(స్మి పాణ్డవానాం ధనంజయ: |*
*మునీనామప్యహం వ్యాస: కవీనాముశనా కవి: ||*
*🌷. తాత్పర్యం : నేను వృష్ణివంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను అయి యున్నాను.*
*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు ఆద్యదేవదేవుడు కాగా, బలదేవుడు అతని అవ్యవహిత విస్తృతాంశయై యున్నాడు. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు వసుదేవుని తనయులుగా అవతరించి యున్నందున వారిరువురిని వాసుదేవులుగా పిలువవచ్చును. వేరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడును బృందావనమును వీడడు కనుక, బృందావనమునకు అన్యమైన స్థలములలో దర్శితమైన కృష్ణుని రూపములు అతని విస్తృతాంశములై యున్నవి. అనగా శ్రీకృష్ణుని విస్తృతాంశయైన వాసుదేవుడు శ్రీకృష్ణుని కన్నను అన్యుడు కాదు. భగవద్గీత యందలి ఈ శ్లోకమున గల వాసుదేవ పదము బలరామునే సూచించుచున్నదని అవగతము చేసికొనవలెను. ఏలయన బలరాముడే సర్వవతారములకు మూలమై యున్నందున వాసుదేవ అంశములకు సైతము అతడే మూలమై యున్నాడు. ఈ విధమైన శ్రీకృష్ణభగవానుని అవ్యవహిత విస్తారములు “స్వాంశములు” (వ్యక్తిగత రూపములు) అని పిలువబడును. ఇవియేగాక “విభిన్నాంశములు” అని పిలువబడు విస్తృతరూపములును కలవు.*
*పాండురాజు తనయులలో ధనంజయునిగా పేరొందిన అర్జునుడు నరులలో శ్రేష్టుడు గనుక శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మునులు లేక వేదజ్ఞానపారంగతులైన మనుజులలో వ్యాసుడు శ్రేష్టుడు. ఏలయన ఆయన ఈ కలియుగ జనులకు అవగతమగునట్లు భిన్నపద్దతులలో వేదజ్ఞానమును వివరించెను. అంతియేగాక వ్యాసుడు శ్రీకృష్ణుని అవతారమై యున్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. ఎట్టి విషయమును గూర్చియైనను సమగ్రముగా ఆలోచింప సమర్థులైన వారిని కవులందురు. అట్టి కవులలో దానవుల గురువైన ఉశనుడు(శుక్రాచార్యుడు) అసాధారణ మేధాసంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజనీతినిపుణుడు కనుక శ్రీకృష్ణుని విభూతికి ప్రతినిధియై యున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 409 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 37 🌴*
*37. vṛṣṇīnāṁ vāsudevo ’smipāṇḍavānāṁ dhanañ-jayaḥ*
*munīnām apy ahaṁ vyāsaḥ kavīnām uśanā kaviḥ*
*🌷 Translation : Of the descendants of Vṛṣṇi I am Vāsudeva, and of the Pāṇḍavas I am Arjuna. Of the sages I am Vyāsa, and among great thinkers I am Uśanā.*
*🌹 Purport : Kṛṣṇa is the original Supreme Personality of Godhead, and Baladeva is Kṛṣṇa’s immediate expansion. Both Lord Kṛṣṇa and Baladeva appeared as sons of Vasudeva, so both of Them may be called Vāsudeva. From another point of view, because Kṛṣṇa never leaves Vṛndāvana, all the forms of Kṛṣṇa that appear elsewhere are His expansions. Vāsudeva is Kṛṣṇa’s immediate expansion, so Vāsudeva is not different from Kṛṣṇa. It is to be understood that the Vāsudeva referred to in this verse of Bhagavad-gītā is Baladeva, or Balarāma, because He is the original source of all incarnations and thus He is the sole source of Vāsudeva. The immediate expansions of the Lord are called svāṁśa (personal expansions), and there are also expansions called vibhinnāṁśa (separated expansions).*
*Amongst the sons of Pāṇḍu, Arjuna is famous as Dhanañjaya. He is the best of men and therefore represents Kṛṣṇa. Among the munis, or learned men conversant in Vedic knowledge, Vyāsa is the greatest because he explained Vedic knowledge in many different ways for the understanding of the common mass of people in this Age of Kali. And Vyāsa is also known as an incarnation of Kṛṣṇa; therefore Vyāsa also represents Kṛṣṇa. Kavis are those who are capable of thinking thoroughly on any subject matter. Among the kavis, Uśanā, Śukrācārya, was the spiritual master of the demons; he was an extremely intelligent and far-seeing politician. Thus Śukrācārya is another representative of the opulence of Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 11 🌻*
*పిమ్మట ఆ దేవాధి దేవుని శిరస్సుపై అక్షతలను, పవిత్రకమును ఉంచి, హృదయముచే (నమః) అభి మంత్రిత మగు మూలమంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను. పిమ్మట కవచము చుట్టినదియు, అస్త్రముచే రక్షితమును అగు అక్షత - కుశలను, పుష్పములను, సమర్పించి ఉద్భవమగు ముద్రతో శివుని - ''ఓ ప్రభూ! గుహ్యాతి గుహ్యమును రక్షించుటకై, నేను చేసిన జపమును గ్రహింపుము దానిచే నీవుండగా, కృపచే నాకు సిద్ధి లభించు గాక'' అని ప్రార్థించవలెను.*
*భోగేచ్ఛ గల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్ర ముచ్చరించుచు కుడి చేతిలో ఆర్ఘ్యోదకము గ్రహించి, దానిని భగవంతుని వరముద్రతో కూడిన హస్తములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. ''మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీ పాదములను శరణు జొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొలగింపుము. ''హూ క్షః శివుడే దాత. శివుడే భోక్త శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయ మగు గాక. శివుడే నేను'' ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివ మంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తికి ఇది అవసరము) మరల అర్ఘ్యమిచ్చి భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తి యగు శివునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివద్యానము చేసి, చేత్రమునందు గాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ - పూజాదులు చేయవలెను.*
*అగ్ని మహాపురాణమునందు శివపూజావిధి వర్ణన మను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 255 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 11 🌻*
79-81. “May there be success for me by this by your presence here”. Having recited this verse at first, the worshipper should offer to Śambhu (Śiva) the waters of respect with the right hand with (the repetition of) the principal mantra. Whatever good or bad that I may do O lord! let it be cast off from me who am in the region of Śiva. Hūṃ kṣaḥ O Śaṅkara, Śiva is the giver, Śiva is the enjoyer, Śiva is all this universe.
82. Śiva is victorious everywhere. I am identical with Śiva. After having repeated these two verses, the japa should be dedicated to the lord.
83. One-tenth (should be dedicated) to the limbs of Śiva. Having offered the waters of respect, one should adore (the deity). After circumambulating (the deity), one should bow to the eight-formed (representing the five elements, sun, moon and yajamāna) deity by prostrating (the eight limbs touching the ground). After salutation (the deity) should be worshipped in a picture or in the fire by meditation etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 121 / DAILY WISDOM - 121 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 30. మన చర్యలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి / 30. Our Actions Determine the Future🌻*
*మీ చర్య యొక్క ఫలితమే మీ భవిష్యత్తు. పతంజలి, తన యోగ సూత్రాలలో, ఒక వ్యక్తి జన్మించిన సమాజంలోని స్థాయి, ఆయుష్షు, మరియు అనుభవించాల్సిన అనుభవాల స్వభావం అన్నీ తన గత చర్యల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ గత చర్యల యొక్క ఫలితాలు ఈ జీవితంలోనే లేదా రాబోయే జీవితంలో అనుభవం లోకి వస్తాయి. ఒక ప్రసిద్ధ నానుడి ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, ఐశ్వర్యం, విద్య మరియు మరణం అతని తల్లి గర్భంలోనే నిర్ణయించబడతాయి అని.*
*మానవ ప్రయత్నం సాపేక్ష విలువను కలిగి ఉంటుంది. అది ఈ విశ్వ స్వీయ-సంపూర్ణతా న్యాయంలో ఒక భాగం. అవ్యక్త వాస్తవికత వ్యక్తిత్వంలో ఎలా నడుచుకుంటుంది అనేది మానవ ప్రయత్నం నిర్ణయిస్తుంది. కర్మ సిద్ధాంతం, తరచుగా తప్పుగా ఊహించినట్లుగా, భాగ్యవాదంపై నమ్మకం కాదు, కానీ గురుత్వాకర్షణ సూత్రం వలె విశ్వంలోని ప్రతిచోటా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక శాస్త్రీయ చట్టం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 121 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 30. Our Actions Determine the Future🌻*
*The resultant force of an action has one’s future determined by it. Patanjali, in his Yoga Sutras, says that the class of society into which one is born, the length of life which one is to live, and the nature of the experiences through which one has to pass, are all determined by the residual potency of past actions. These potencies become active in this life itself or in a life to come. A famous verse proclaims: “The nature of one’s life, action, wealth, education and death are all fixed up even when one is in the womb of the mother.”*
*Human effort has a relative value and forms a part of this universal law of self-completeness, displaying the manner in which the impersonal reality behaves when it is cast in the moulds of personality and individuality. The doctrine of karma, therefore, is not a belief in fatalism as is often wrongly supposed, but the enunciation of a scientific law that operates inexorably and impartially everywhere in the universe, like the principle of gravitation.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 387 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. 🍀*
*జీవితం ఒక్కటే దేవుడు. వ్యక్తి దాంట్లో జీవించాలి. గాఢంగా జీవించాలి. అనురాగభరితంగా, ఆర్ద్రంగా, హృదయపూర్వకంగా జీవించాలి. వానపాము లాగా కాదు. రెండు వైపులా మంట వున్న కాగడాలా జీవించాలి. అప్పుడు అనంత శాశ్వతత్వం కన్నా ఒక్క క్షణం కూడా అద్భుతమైనది అవుతుంది. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. దేన్నీ వెనకనున్న దేన్నీ ఆధారంగా పట్టుకోకు. యిప్పుడు యిక్కడ నిలబడు. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. అన్యమనస్కంగా, అంటీ ముట్టనట్లు ఎందుకుండాలి? నువ్వు యింకో క్షణం వుండకపోవచ్చు.*
*కాబట్టి యీ క్షణాన్ని పట్టుకో. యింకో క్షణం సంగతి నీకెందుకు? జీవించే విధానమిది. నువ్వు ఫలితం గురించి పట్టించుకోకుంటే పద్మానివి. మాటిమాటికీ పద్మాన్ని మననం చేయాలి. వర్తమానం లోలోతుల్లోకి వెళ్ళు. యిప్పుడు యిక్కడ నిలబడాలి. కాని అనుబంధం లేకుండా వుండాలి. అతుక్కుపోకుండా వుండాలి. తాకకుండా వుండాలి. భవిష్యత్తు లేదు. అందువల్ల సంపూర్ణంగా జీవిస్తావు. గతం లేదు అందువల్ల అనుబంధముండదు. ఒకసారి అది జరిగితే జీవితం ఆనందం, అంతులేని ఆనందం శాశ్వతపరమానందం!*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 123 / Siva Sutras - 123 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-08. శరీరం హవిః - 5 🌻*
*🌴. ఆత్మ శుద్ధి అనే యాగంలో దేహమే నైవేద్యంగా ఉంటుంది, అందులో పాల్గొనే శక్తులకు నైవేద్యంగా మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను జ్ఞాన అగ్నిలో పోస్తారు. 🌴*
*అటువంటి రూపాంతరం చెందిన యోగి శివుని యొక్క గొప్ప మంత్రమైన నమశివాయను పునరావృతం చేయడు, కానీ అతను స్వయంగా శివునిగా మారి ఆత్మవిశ్వాసంతో శివోహాన్ని ధృవీకరిస్తాడు, అంటే నేను శివుడిని. కృష్ణుడు భగవద్గీత (IV.25 - 27)లో ఇలా అంటాడు, “కొంతమంది యోగులు దేవతలకు మాత్రమే అర్పిస్తారు, మరికొందరు బ్రహ్మం యొక్క అగ్నిలో నేనుని బలి అర్పిస్తారు. ఇంకా ఇతరులు నిగ్రహం యొక్క మంటలలో ఇంద్రియాలను అర్పిస్తారు. మరికొందరు ఇంద్రియాలకు సంబంధించిన అన్ని విధులను యోగ అగ్నిలో ఆత్మనిగ్రహం ద్వారా, జ్ఞానంచే వెలిగిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 123 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-08. śarīram havih - 5 🌻*
*🌴. The body is the oblation in the sacrifice of self-purification in which the impurities of the mind and body are poured in to the fire of knowledge as an offering to the shaktis who participate in it. 🌴*
*Such a transformed yogi will not repeat namaśivāya, the great mantra of Śiva, but he will turn into Śiva himself and affirm confidently śivohaṁ, meaning I am Śiva. Kṛṣṇa says in Bhagavad Gīta (IV.25 - 27), “Some yogis offer oblations to gods alone, while others offer oblations as sacrifice by the Self in the fire of Brahman. Yet others offer senses as oblations in the fires of restraint. Some others sacrifice all the functions of the senses in the fire of yoga by self-restraint, kindled by knowledge.”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment