1) 🌹 25, NOVEMBER 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 462 / Bhagavad-Gita - 462 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 48 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 48 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 818 / Sri Siva Maha Purana - 818 🌹
🌻. దేవతలు శివుని స్తుతించుట - 4 / Prayer by the gods - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 75 / Osho Daily Meditations - 75 🌹
🍀 75. ప్రేమ లేనితనాన్ని వదిలివేయండి / 75. WITHDRAW UNLOVE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 504 / Sri Lalitha Chaitanya Vijnanam - 504 🌹
🌻 504. 'స్వాధిష్ఠానాంబుజగతా' / 504. Svadhishtananbujagata 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 25, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైకుంఠ చతుర్థశి, Vaikuntha Chaturdashi 🌻*
*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 24 🍀*
*44. పుణ్యశ్లోకో వేదవేద్యః స్వామితీర్థనివాసకః |*
*లక్ష్మీసరఃకేళిలోలో లక్ష్మీశో లోకరక్షకః*
*45. దేవకీగర్భసంభూతో యశోదేక్షణలాలితః |*
*వసుదేవకృతస్తోత్రో నందగోపమనోహరః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సాధనలో వైఫల్యాలు - సాధనలో ఏ ప్రయత్నమైనా తాత్కాలికంగా విఫలమైనపుడు, ఆది ఈశ్వరేచ్ఛకు సూచన యని భావించి సాధకుడు ప్రయత్నమును విరమించ రాదు, కలత చెందని సమతాదృష్టితో ఆ వైఫల్యమును స్వీకరించి, దాని కారణ మరసి, ఆంతర్యం కనుగొని విజయసిద్ధి పర్యంతం శ్రద్ధతో ప్రయత్నము నింకనూ కొనసాగించాలి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల త్రయోదశి 17:23:55
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: అశ్విని 14:57:32 వరకు
తదుపరి భరణి
యోగం: వరియాన 27:52:11 వరకు
తదుపరి పరిఘ
కరణం: తైతిల 17:24:55 వరకు
వర్జ్యం: 11:06:50 - 12:38:30
మరియు 24:12:00 - 25:44:40
దుర్ముహూర్తం: 07:55:54 - 08:40:47
రాహు కాలం: 09:14:27 - 10:38:38
గుళిక కాలం: 06:26:07 - 07:50:17
యమ గండం: 13:26:58 - 14:51:09
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 08:03:30 - 09:35:10
సూర్యోదయం: 06:26:07
సూర్యాస్తమయం: 17:39:29
చంద్రోదయం: 16:01:55
చంద్రాస్తమయం: 04:12:37
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
14:57:32 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 462 / Bhagavad-Gita - 462 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 48 🌴*
*48. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్ న చ క్రియాభిర్న తపోభిరుగ్రై: |*
*ఏవంరూప: శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||*
*🌷. తాత్పర్యం : ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు.*
*🌷. భాష్యము : ఈ సందర్భమున దివ్యదృష్టి యననేమో చక్కగా అవగతము చేసికొనవలసియున్నది. దివ్యదృష్టిని ఎవ్వరు కలిగియుందురు? దివ్యము అనగా దేవత్వమని భావము. దేవతల వలె దివ్యత్వమును సాధించనిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు.*
*ఇక దేవతలన యెవరు? విష్ణుభక్తులే దేవతలని వేదవాజ్మయమునందు తెలుపబడినది (విష్ణుభక్తా: స్మృతాదేవా:). అనగా విష్ణువు నందు విశ్వాశము లేని నాస్తికులు మరియు శ్రీకృష్ణుని నిరాకారరూపమునే శ్రేష్టమని భావించువారు దివ్యదృష్టిని పొందలేరు. ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే దివ్యదృష్టిని పొందుటకు ఎవ్వరుకినీ సాధ్యము కాదు. దివ్యులు కానిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. అనగా దివ్యదృష్టిని కలిగినవారు అర్జునుని వలెనే విశ్వరూపమును గాంచగలరు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 462 🌹*
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 48 🌴*
*48. na veda-yajñādhyayanair na dānair na ca kriyābhir na tapobhir ugraiḥ*
*evaṁ-rūpaḥ śakya ahaṁ nṛ-loke draṣṭuṁ tvad anyena kuru-pravīra*
*🌷 Translation : O best of the Kuru warriors, no one before you has ever seen this universal form of Mine, for neither by studying the Vedas, nor by performing sacrifices, nor by charity, nor by pious activities, nor by severe penances can I be seen in this form in the material world.*
*🌹 Purport : The divine vision in this connection should be clearly understood. Who can have divine vision? Divine means godly. Unless one attains the status of divinity as a demigod, he cannot have divine vision. And what is a demigod? It is stated in the Vedic scriptures that those who are devotees of Lord Viṣṇu are demigods (viṣṇu-bhaktaḥ smṛto daivaḥ). Those who are atheistic, i.e., who do not believe in Viṣṇu, or who recognize only the impersonal part of Kṛṣṇa as the Supreme, cannot have the divine vision. It is not possible to decry Kṛṣṇa and at the same time have the divine vision. One cannot have the divine vision without becoming divine. In other words, those who have divine vision can also see like Arjuna. The Bhagavad-gītā gives the description of the universal form.*
*Although this description was unknown to everyone before Arjuna, now one can have some idea of the viśva-rūpa after this incident. Those who are actually divine can see the universal form of the Lord. But one cannot be divine without being a pure devotee of Kṛṣṇa. The devotees, however, who are actually in the divine nature and who have divine vision, are not very much interested in seeing the universal form of the Lord. As described in the previous verse, Arjuna desired to see the four-handed form of Lord Kṛṣṇa as Viṣṇu, and he was actually afraid of the universal form.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 818 / Sri Siva Maha Purana - 818 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴*
*🌻. దేవతలు శివుని స్తుతించుట - 4 🌻*
*ఓ ప్రభూ! భద్రసేనుని కుమారుడగు సుధర్ముడు, మరియు మంత్రిపుత్రుడగు శుభకర్ముడు సర్వదా రుద్రాక్షలను ధరించి (23). నీ అనుగ్రహమువలన ఇహలోకములో ఉచితమగు సుఖముననుభవించి ముక్తిని పొందిరి. పూర్వజన్మలో కోతి, కోడి యైన వారిద్దరు రుద్రునకు అలంకారములైరి (24).*
*ఓ నాథా! భక్తుల ఉద్ధారమే ప్రముఖకార్యముగా గలవాడా! పింగళ, మహానంద అను ఇద్దరు వేశ్యలు నీ భక్తివలన సద్గతిని పొందిరి (25). బ్రాహ్మణుని కుమార్తెయగు శారద బాల్యములో భర్తృవియోగమును పొంది నీ భక్తి యొక్క ప్రభావమువలన పుత్రప్రాప్తి అనే సౌభాగ్యమును పొందెను (26) నామమాత్ర బ్రాహ్మణుడు, వేశ్యాలంపటుడునగు బిందుగుడు మరియు వాని ప్రియురాలగు వంచుక నీ కీర్తిని విని, పరమగతిని పొందిరి (27). ఓ ప్రభూ! మహేశ్వరా! దీనబంధూ! కృపాసముద్రా! ఈ తీరున అనేక జీవులు నీయందు భక్తిభావము కలుగుట వలన సిద్ధిని పొందిరి (28).*
*ఓ పరమేశ్వరా! నీవు ప్రకృతి పురుషాతీతమగు నిర్గుణ బ్రహ్మవు. నీవు త్రిగుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్రులను రూపములను దాల్చినావు (29). ఓ మహేశ్వరా! నీవు సర్వదా విధకర్మలను చేయుచున్ననూ నిర్వికారుడవు. బ్రహ్మాదులమగు మేము అందరము సర్వేశ్వరుడవగు నీకు దాసులము (30). ఓ దేవదేవా! ప్రసన్నుడవు కమ్ము. మమ్ములను సర్వదా రక్షించుము. ఓ శివా! నాథా! నీ సంతానమగు మేము సర్వదా నిన్ను శరణు పొందియున్నాము (31).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 818 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴*
*🌻 Prayer by the gods - 4 🌻*
23-25. O lord, the son of Bhadrasena and the son of his minister both of virtuous and auspicious rites and regular wearers of Rudrākṣa beads, enjoyed good pleasures here and became liberated, thanks to your grace. The two devotees who had been monkey and a cock in a previous birth became the ornaments of Rudra. O lord, always engaged in uplifting the devotees, the two courtesans Piṅgalā and Mahānandā attained the goal of the good, thanks to their devotion to you.
26. The brahmin girl Śāradā who had become a widow in childhood, was fortunate to regain her lost husband and was blessed with sons, thanks to the power of devotion to you.
27. Binduga, a brahmin only in name, a harlot monger and his wife Cañculā[2] attained great salvation on hearing your glory.
28. O lord Śiva, friend of the distressed, storehouse of mercy, many living beings have attained the goal in this way.
29. O lord Śiva, you are greater than Prakṛti and Puruṣa. You are the Brahman. You are devoid of attributes as well as the support of attributes in the forms of Brahmā, Viṣṇu and Rudra.
30. You are free from aberrations, O lord of all, you perform different activities incessantly. O lord Śiva, we all, Brahmā and others are your slaves.
31. O lord of gods, be pleased. O Śiva, protect us ever. O lord, we are your subjects and we ever seek refuge in you.”
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 75 / Osho Daily Meditations - 75 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 75. ప్రేమ లేనితనాన్ని వదిలివేయండి 🍀*
*🕉. మనం ప్రేమించము. అయితే అది ఒక్కటే సమస్య కాదు. మనము ప్రేమించడం మానేసాము. కాబట్టి మొదట మీరు ప్రేమ రాహిత్యాన్ని వదిలివేయడం ప్రారంభించండి. ఏదైనా వైఖరి, ఏదైనా పదం మీరు అలవాటుగా ఉపయోగించుకున్నా కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా మీరు క్రూరమైనదిగా భావించిన దానిని వదిలివేయండి! 🕉*
*'నన్ను క్షమించండి' అని చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇలా చెప్పగలిగే సామర్థ్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. కొన్నిసార్లు వారు చెప్పినట్లు కనిపించినప్పటికీ, అది చెప్పడం కాదు. అది కేవలం సామాజిక లాంఛనమే కావచ్చు. నిజంగా 'నన్ను క్షమించండి' అని చెప్పడం గొప్ప అవగాహన. నువ్వేదో తప్పు చేశావని, మర్యాదగా ప్రవర్తించడమే కాదు, మీరు ఏదో ఉపసంహరించు కుంటున్నారు. మీరు జరగబోయే చర్యను ఉపసంహరించు కుంటున్నారు, మీరు అన్న మాటను మీరు ఉపసంహరించు కుంటున్నారు. కాబట్టి ప్రేమ రాహిత్యాన్ని ఉపసంహరించుకోండి మరియు మీరు చేస్తున్నప్పుడు మీరు ఇంకా చాలా విషయాలు చూస్తారు, అది నిజంగా ఎలా ప్రేమించాలి అనేది కాదు. ఎలా ప్రేమ లేకుండా ఉన్నారు అనేది అసలు ప్రశ్న. ఇది రాళ్లతో, రాళ్లతో కప్పబడిన నీటి బుగ్గ లాంటిది. మీరు రాళ్లను తీసివేస్తే, వసంతం ప్రవహిస్తుంది. అది అక్కడ ఉంది.*
*ప్రతి హృదయానికి ప్రేమ ఉంటుంది, ఎందుకంటే అది లేకుండా హృదయం ఉండదు. ఇది జీవితం యొక్క ప్రధమ స్పందన. ప్రేమ లేకుండా ఎవరూ ఉండలేరు; అది అసాధ్యం. ప్రతి ఒక్కరికీ ప్రేమ ఉంటుంది, ప్రేమించే సామర్థ్యం మరియు ప్రేమించ బడడం ఉంది అనేది ప్రాథమిక సత్యం. కానీ కొన్ని రాళ్ళు - తప్పుడు పెంపకం వల్ల, తప్పుడు వైఖరులు వల్ల, అతి తెలివితేటలు, చాకచక్యం మరియు వెయ్యి ఒక్క విషయాలు ఈ మార్గాన్ని అడ్డుకుంటున్నాయి. ప్రేమ లేని చర్యలను, ప్రేమ లేని పదాలను, ప్రేమ లేని సంజ్ఞలను ఉపసంహరించుకోండి, ఆపై అకస్మాత్తుగా మీరు చాలా ప్రేమ గల భావనలో ఉంటారు. కేవలం ప్రేమ మాత్రమే ఉంది మరియు అది ఒక సంగ్రహావలోకనం. ఆ అవగాహనలో మీరు ఉంటే అకస్మాత్తుగా ప్రేమ యొక్క లోతులను మీరు చూసే కొన్ని క్షణాలు వస్తాయి. తరువాత ఆ క్షణాలు చాలా పొడవుగా మారతాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 75 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 75. WITHDRAW UNLOVE 🍀*
*🕉 We don't love. But that is not the only' problem. We unlove. So first start dropping anything that you feel is unloving. Any attitude, any word that you have used out if habit but that now suddenly you feel is cruel-drop it! 🕉*
*Always be ready to say, "I am sorry." Very few people are capable of saying this. Even when they appear to be saying it, they are not. It may be just a social formality. To really say "I am sorry" is a great understanding. You are saying that you have done something wrong and you are not just trying to be polite. You are withdrawing something. You are withdrawing an act that was going to happen, you are withdrawing a word that you had uttered. So withdraw unlove, and as you do you will see many more things that it is not really a question of how to love. It is only a question of how not to love. It is just like a spring covered with stones and rocks. You remove the rocks, and the spring starts flowing. It is there.*
*Every heart has love, because the heart cannot exist without it. It is the very pulse of life. Nobody can be without love; that is impossible. It is a basic truth that everyone has love, has the capacity to love and to be loved. But some rocks-wrong upbringing, wrong attitudes, cleverness, cunningness, and a thousand and one things are blocking the path. Withdraw unloving acts, unloving words, unloving gestures, and then suddenly you will catch yourself in a very loving mood. Many moments will come when suddenly you will see that something is bubbling-and there was love, just a glimpse. And by and by those moments will become longer.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 504 / Sri Lalitha Chaitanya Vijnanam - 504 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।*
*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀*
*🌻 504. 'స్వాధిష్ఠానాంబుజగతా' 🌻*
*స్వాధిష్ఠాన మను అంబుజమున (పద్మమున) గల యోగిని శ్రీమాత అని అర్థము. స్వాధిష్ఠానము ఆరు దళముల పద్మము. ఈ పద్మము నందలి ఆరు రేకులపై బ భ మ య ర ల అను ఆరు అక్షరములు, ఆరు మాతృకలుగ యుండును. "వ" అను అక్షరము బీజము నందుండును. ఈ ఆరు దళముల పద్మము లేత గులాబి రంగులో యుండును. గులాబి రంగు సున్నితత్వమునకు, కౌమారత్వమునకు, నిర్మలత్వమునకు ప్రతీక. స్వచ్ఛమగు ప్రేమకు ప్రతీక. అరిషడ్వర్గముల ప్రభావము లేశమాత్రము కూడ మానవుని యందు లేనప్పుడు గులాబి కాంతితో ఈ పద్మము ప్రకాశించుచుండును. ఇందలి దళములు కుమారుని షణ్ముఖములకు ప్రతీకలై యుండును. ఈ పద్మమున ఆసీనుడగు జీవుడు స్వాధీనముననే యుండును గాని, ఎన్నటికి పరాధీనుడు కాడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 504 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara*
*shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻*
*🌻 504. Svadhishtananbujagata 🌻*
*It means that the yogini in the lotus called Swadhisthana is Shrimata. Swadhisthana is a six-petaled lotus. On the six petals of this lotus there are six letters as six matrukas called Ba bha Ma ya Ra la. The letter 'Va' is in the seed. This six-armed lotus is pale pink in color. Pink is a symbol of tenderness, youth and purity. It is a symbol of pure love. This lotus shines with rosy light when the influence of Arishadvargas is absolutely absent from a human being. These petals are symbolic of the six faces of Kumara. A living being sitting on this lotus is ever in control, but never a dependent.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment