శ్రీమద్భగవద్గీత - 570: 15వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 570: Chap. 15, Ver. 19

 

🌹. శ్రీమద్భగవద్గీత - 570 / Bhagavad-Gita - 570 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 19 🌴

19. యో మామేవసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ||


🌷. తాత్పర్యం : ఓ భారతా! సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగినవాడే సర్వము నెరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుతసేవలో నిమగ్నుడగును.

🌷. భాష్యము : జీవుల యొక్క, పరతత్త్వము యొక్క సహజస్థితికి సంబంధించిన తాత్త్వికవిచారములు లేదా కల్పనలు పెక్కు గలవు. కాని తనను పురుషోత్తమునిగా తెలిసికొనగలిగినవాడే వాస్తవమునకు సర్వమును ఎరిగినవాడని శ్రీకృష్ణభగవానుడు స్పష్టముగా ఈ శ్లోకమునందు వివరించుచున్నాడు. అపరిపక్వజ్ఞానము గలవాడు పరతత్త్వమును గూర్చిన ఊహాకల్పనల యందే కాలమును గడిపినను, సంపూర్ణజ్ఞానము గలవాడు అట్లు కాలమును వృథాపరుపక కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నిలుచును. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్తసేవ యందు అతడు పూర్ణముగా నిమగ్నుడగును. భగవద్గీత యందంతటను ఈ భక్తియోగమే నొక్కి చెప్పబడినది. వేదజ్ఞానము “శృతి”యని పిలువబడును. అనగా అది శ్రవణము ద్వారా అభ్యసింపబడునది. వాస్తవమునకు వేదజ్ఞానమును శ్రీకృష్ణభగవానుడు మరియు అతని ప్రతినిధుల వంటి ప్రామాణికుల నుండియే స్వీకరింపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రతివిషయమును చక్కగా వివరించియున్నందున ప్రతియొక్కరు దీని నుండియే శ్రవణమును గావింపవలెను. కాని కేవలము జంతువులవలె శ్రవణము చేసిన చాలదు.

విషయమును ప్రామాణికుల నుండి అవగతము చేసికొనుటకు యత్నింపవలెను. పాండిత్యముతో ఊరకనే ఊహాకల్పనలు చేయరాదు. అనగా ప్రతియొక్కరు గీతను నమ్రతతో శ్రవణము చేసి, జీవులు సదా దేవదేవుడైన శ్రీకృష్ణునకు ఆధీనులే యని ఎరుగవలెను. శ్రీకృష్ణభగవానుని వాక్యము ననుసరించి అట్లు అవగతము చేసికొనినవాడే వేదముల ప్రయోజనమును ఎరిగినవాడగును. అతడు తప్ప అన్యులెవ్వరును వేదప్రయోజనమును ఎరుగలేరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 570 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 19 🌴

19. yo mām evam asammūḍho jānāti puruṣottamam
sa sarva-vid bhajati māṁ sarva-bhāvena bhārata


🌷 Translation : Whoever knows Me as the Supreme Personality of Godhead, without doubting, is the knower of everything. He therefore engages himself in full devotional service to Me, O son of Bharata.

🌹 Purport : There are many philosophical speculations about the constitutional position of the living entities and the Supreme Absolute Truth. Now in this verse the Supreme Personality of Godhead clearly explains that anyone who knows Lord Kṛṣṇa to be the Supreme Person is actually the knower of everything. The imperfect knower goes on simply speculating about the Absolute Truth, but the perfect knower, without wasting his valuable time, engages directly in Kṛṣṇa consciousness, the devotional service of the Supreme Lord. Throughout the whole of Bhagavad-gītā, this fact is being stressed at every step. And still there are so many stubborn commentators on Bhagavad-gītā who consider the Supreme Absolute Truth and the living entities to be one and the same.

Vedic knowledge is called śruti, learning by aural reception. One should actually receive the Vedic message from authorities like Kṛṣṇa and His representatives. Here Kṛṣṇa distinguishes everything very nicely, and one should hear from this source. Simply to hear like the hogs is not sufficient; one must be able to understand from the authorities. It is not that one should simply speculate academically. One should submissively hear from Bhagavad-gītā that these living entities are always subordinate to the Supreme Personality of Godhead. Anyone who is able to understand this, according to the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, knows the purpose of the Vedas; no one else knows the purpose of the Vedas.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment