శివగీత - 29 / The Siva-Gita - 29

🌹. శివగీత - 29 / The Siva-Gita - 29 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము

🌻. శివ ప్రాదుర్భావము - 5 🌻
స్వస్వ కాంతా సమాయుక్తా - న్దిక్పా లాన్పరి తస్త్సి తాన్ 37
అగ్రగం గుడా రూడం - శంఖ చక్ర గదాధరమ్,
కాలాం బుద ప్రతీ కాశం - విద్యుత్కాంత శ్రితాయుతమ్ 38

తరువాత తమ తమ వాహనారూడులై సమస్తా యుధములను ధరించి ,తమ తమ భార్యా సమేతులై నలువైపులా బూరించు బృహద్ర ధంత రాది సామగానము చేయుచున్న దిక్పాలకులను సందర్శించెను.

మరియు పరమ శివుని యెదుట శంఖ చక్ర గదా ఖడ్గములను దాల్చి నీలి మేఘము కాంతి నొప్పుచున్న దేహము గలవాడై మెరుపు తీగను బోలిన శ్రీదేవితో గూడి గరుడ వాహనము
నధిష్టింఛి యనన్య భక్తితో రుద్రాద్యాయమును పటించు
చున్న విష్ణువును కాంచెను.

జపంత మేక మనసా - రుద్రాద్యాయం జనార్ధనమ్,
పశ్చాచ్చతుర్ముఖం దేవం - బ్రహ్మాణం హంస వాహనమ్ 39
చాతుర్వక్తై శ్చతుర్వేద - రుద్ర సూక్తై ర్మ హేవ్వరమ్,
స్తువంతం భారతీ యుక్తం - దీర్ఘ కూర్చ జటాధరమ్ 40

పిమ్మట పరమ శివుని వెనుక భాగమున హంస వాహనము నధిరోహించి, దనసతి యగు వాగ్దేవితోను, నాలుగు వేదములలోని రుద్ర సూక్తములతో నీశ్వరుని స్తుతించు బ్రహ్మను చూచెను.

అధర్వ శిరసా దేవం - స్తువంతం ముని మండలమ్,
గంగాది తటి నీ యుక్త - మంబు ధిం నీల విగ్రహమ్ 41
శ్వేతా శ్వత రమన్త్రేణ - సుతవంతం గిరిజా పతిమ్,
అనంతాది మహానాగా - న్కైలాస గిరి సన్ని భాన్ 42
కైవల్యో పనిషత్పారా - న్మణి రత్న విభూషితాన్,
సువర్ణ వేత్ర హస్తాడ్యం - నందినం పురత స్థ్సితమ్ 43
అధర్వ శిరస్సులతో శివుని స్తోత్రము గావించు మునులను గంగానది సమేతుడునగు, నీలదేహము గలవాడై శ్వేతాశ్వతర మంత్రములతో ఉమాకాంతుని స్తుతించు చున్న సాగరుని చూచెను.

కైలాస పర్వతము వలె ఉన్నతములైనవి మణి రత్నాద్య
లంకారములతో నొప్పుచున్నవి. యునై గైవల్యో పనిషత్తులను పటించుచు శ్రీ మహాదేవుని స్తోత్రము చేయుచున్న అనంతాది గొప్ప ఏనుగులను చూచెను మరియు స్వర్ణ మయ దండమును
చేత బూని యాగ్ర భాగంబున నిలిచియున్న నందీశ్వరుని కూడా చూచెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 29 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 5 🌻

Thereafter Rama saw dikpalakas seated on their respective divine vehicles with their respective consorts and singing hymns of Sama Veda.

Then Sri Rama sighted in front of Paramashiva, the lord Vishnu who held discus, conch, mace, and sword in his hands, who was shining brillinantly with a dark bluish hue, who was seated on his vehicle named Garuda, the Eagle, with goddess Sridevi who resembled like a streak of lightening and who was singing Rudradhyayana (Sri Rudram hymn).

Then Rama sighted at the back side of Paramashiva, the Lord Brahma riding on his divine Swan, seated with his consort goddess Bharati and who was singing Rudra Suktas from four vedas through his four heads (mouths).

Then Rama sighted many divine sages singing Atharvasiras hymns of Shiva. Rama also behelf the god of ocean standing beside goddess Ganga and singing Svetaswatara hymns in praise of Lord of Uma. Also, many elephants and Ananta (the divine serpent) who looked as huge as Kailasha mountain, were sighted singing hymns from kaivalyopanishat in praise for Mahadeva. And then Rama sighted Nandishwara holding a golden danda in his hands.

N.B: We need not get confused by seeing nandi standing as a bull and simultaneously standing holding a golden danda in hands. Yes, this looks strange but Nandi simultaneously appears in two forms with Lord Shiva.

We have a similar narration in Shaiva Puranas in the story of Upamanyu. When Shiva appeared in front of Upamanyu, that time also Upamanyu found Nandi as a bull and at the same time standing beside Maheshwara holding an umbrella covering Mahadeva's head. Therefore there is no confusion here.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment