శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 105 / Sri Gajanan Maharaj Life History - 105


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 105 / Sri Gajanan Maharaj Life History - 105 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 13 🌻

శ్రీమహారాజు తన జీవాత్మను తననుదుటియందు, తన ఆత్మీయులయిన భక్తులు దర్శనంచేసుకునే వరకూ ఉంచుతారని విద్వాంసుడయిన శ్రీగోవింద శాస్త్రి అన్నారు. అది నిరూపించడానికి శ్రీశాస్త్రి, కొద్ది వెన్న శ్రీమహారాజు తలమీద పెట్టగానే తలలో ఉన్న వేడివల్ల ఆవెన్న కరిగిపోయింది.ఇది శ్రీమహారాజు సాధించిన యోగశాస్త్ర ఫలితం. శ్రీమహారాజు ఆ తన్మయంలో ఒక సంవత్సరమయినా జీవించగలరని శ్రీగోవింద శాస్త్రి అన్నారు, కానీ ఆయన భక్తులు అందరూ దర్శనం చేసుకున్నాక సమాధిలో మూసివెయ్యడం ఉచితం అని అన్నారు. అందరూ దానికి అంగీకరించారు.

శ్రీమహారాజు ముందు భజనలు ప్రారంభం అయ్యాయి, సుమారు 1000 మంది ఇందులో పాల్గొన్నారు. దూరంగా ఉన్నభక్తులకు శ్రీమహారాజు తనే స్వయంగా వాళ్ళ కలలో కనపడి ఈవార్త అందచేసారు. ఆ ఋషిపంచమి రోజున లెఖ్కలేనంతమంది ప్రజలు షేగాంలో శ్రీమహారాజు దర్శనం కోసం గుమిగూడారు. ఒక రధం ఆయన యాత్రకోసం తయారు చెయ్యబడింది.

భజనలు చేసేవారు ఊరేగింపుగా షేగాం చేరారు. ఆడవాళ్ళు ఆవుపేడ కలిపిన నీళ్ళు రోడ్లమీద చల్లి, అందమైన ముగ్గులు వేసారు. దారి పొడుగునా ఉన్న ఇళ్లన్నీ దీపాలతో దేదీప్యమానం చేసారు. అలంకరించబడిన ఆరధం మీద శ్రీమహారాజు శరీరాన్ని ఉంచి శ్రీమహారాజు అంతిమయాత్ర ఊరేగింపు ప్రారంభించారు. రాత్రంతా ఆఊరేగింపు ఆఊరంతా తిరిగింది. అనేక విధములయిన వాద్యాలు ఊరేగింపుముందర మ్రోగుతున్నాయి. దానివెనుక భజనలు పాడుతున్నవాళ్ళు తరువాత విఠల భగవానుని పవిత్రనామోఛ్ఛారణ చేస్తున్నవారు ఉన్నారు.

తులసీ, బుక్కా, గులాల్ మరియు పూలు శ్రీమహారాజు మీద జల్ల బడ్డాయి. కొంతమందియితే శ్రీమహారాజును మోస్తున్నరధం మీద రూపాయలు, నాణాలు కూడా జల్లారు. ఆవిధంగా ఆఊరేగింపు షేగాంలోని వీధులన్నీ తిరిగి ఉదయానికి మఠానికి తిరిగి వచ్చింది. ఆయన శరీరాన్ని సమాధి స్థలానికి మోసుకు వచ్చి, చివరి రుద్రాభిషేకం జరిపించారు. చిట్టచివరి పూజలు పూర్తి లాంఛనాలతోనూ విధులతో చేసి, భక్తులు తమ గొంతు పెద్దది చేస్తూ... జైగజానన్... మానవరూపంలో ఉన్న నారాయణా జై అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని ఇచ్చేవాడా జై......... ఇలా అంటూ ఆయన ముఖం ఉత్తరం వైపు ఉండేట్టు ఆయన శరీరాన్ని సమాధి గోతిలో ఉంచారు. అందరూ జైగజానన్ అంటూ చివరిగా దర్శనం చేసుకున్నారు.

ఆ తరువాత ఆగోతిని ఉప్పు, అర్గజ, అబీరు వేసి, బరువైన హృదయాలతో ఒక పెద్ద రాతితో భక్తులు ఆ సమాధిని మూసారు. శ్రీమహారాజు ఇంకా అక్కడ ఉన్నారు. 10 రోజుల వరకు అందరికీ భోజనాలు శ్రీమహారాజు ప్రసాదంగా ఇచ్చారు. అనేకమంది ప్రజలు ఆప్రసాదం పొందారు. ఆయోగి యొక్క గొప్పతనం, అధికారం అతీతమయినది. ఒక రాజయినా ఆయనముందు ప్రత్యేకత లేనివాడవుతాడు. కాబట్టి ఈ దాస్గణు చేత చెప్పబడ్డ ఈ గజానన్ విజయ మహాగ్రంధం భక్తులకు సరి అయిన మార్గం చూపి వారిలో హారిభక్తి పెంపొందించుగాక.

శుభం భవతు

శ్రీహరి హరార్పణమస్తు

19. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 105 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 19 - part 13 🌻

Shri Govind Shastri Dongaonkar, a learned person, said that Shri Gajanan Maharaj could keep the life flame in his forehead alive till all of His affectionate devotees got Darshan; to prove what he said, Shastriji put some butter on the head of Shri Gajanan Maharaj . The butter melted with the warmth of the head. It was the effect of Yogashastra acquired by Shri Gajanan Maharaj .

Shri Govind Shastri said that Shri Gajanan Maharaj could live in that trance even for a year, but nevertheless, it was advisable to close him in Samadhi pit after all the devotees got His last Darshan. Bhajan was started before Shri Gajanan Maharaj and about thousand people participated in it. Shri Gajanan Maharaj Himself gave the message to many people about His Samadhi through dreams.

On that Rushi Panchami day innumerable people gathered at Shegaon for the Darshan of Shri Gajanan Maharaj . A Chariot was prepared for his last journey. Many Bhajan singers reached Shegaon in the procession. Ladies sprinkled cow dung mixed water on the roads, and beautiful designs of Rangoli were drawn on it.

All the houses on way and the roads were illuminated. The body of Shri Gajanan Maharaj was put on the decorated chariot, and the procession of the last journey of Shri Gajanan Maharaj started. It was going round the town throughout the night. Various music instruments were playing ahead of the procession followed by Dindis singing Bhajans and people chanting the pious name of Vithala.

Tulsi, Bukka, Gulal and flowers were showered on Shri Gajanan Maharaj , and prasad of sweets was distributed. Some people even showered rupees and coins on the chariot carrying Shri Gajanan Maharaj . Thus the procession moved on all the streets of Shegaon and returned to the Math in the morning. The body was carried to the place of Samadhi and the last Rudrabhisheka was performed.

Final Puja was offered with full rituals, and honours and the devotees raised their voice saying, “Jai Gajanan! Jai to Narayan in the form of man! Jai to the giver of indestructible happiness! Jai to the Lord of this world!” Saying so, the body with His face to the North was put in the Samadhi pit.

All devotees took the last Darshan shouting, Jai Gajanan!!! Then the pit was filled with salt, Argaja and Abir, and with heavy hearts, devotees closed the Samadhi with a big flat stone. Shri Gajanan Maharaj is still there. For ten days all were offered food daily as the prasad of Shri Gajanan Maharaj . Innumerable people got that prasad.

The greatness and the authority of a saint is really supreme, and even an emperor is insignificant before Him. So let this Gajanan Vijay epic, narrated by Shri Dasganu, show the right path to the devotees and help them develop Hari Bhakti.

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Nineteen

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2020

No comments:

Post a Comment