🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 32 🌻
230. ధర్మమనేది తెలుసుకుని ఉంటే, ధర్మమార్గంలో ప్రవర్తించటం చేత జీవుడు ప్రవృత్తిమార్గంలోనే క్రమక్రమంగా నివృత్తిమార్గానికి చేరుకోవటానికి ఒక నాడు మోక్షేఛ్ఛ కలుగుతుంది. ధర్మమార్గంలో ఉండగా ఉండగా అనేక జన్మలకు నివృత్తిమార్గం – మోక్షేఛ్ఛ – వాళ్ళయందు కలుగుతుంది. ఆ మోక్షేఛ్ఛ కలిగింపచేసే లక్షణము విష్ణువుయందు ఉంది.
231. ఈ లోకాన్ని ప్రవర్తమానంచేస్తూ ధర్మమార్గంలో నడిపిస్తూ, అధర్మాన్ని శాసించి నాశనంచేస్తూ ఉండే ధర్మరక్షాలక్షణం విష్ణువుయందుంది. నివృత్తిమార్గానికి తీసుకెళ్ళే ప్రవృత్తిమార్గాన్ని చెప్పేవాడు విష్ణువైతే; ప్రవృత్తిమార్గాన్ని ప్రవర్తింపచేసేవాడు బ్రహ్మ కాగా; పూర్తిగా నివృత్తిమార్గాన్ని, వైముఖ్యాన్ని ఇచ్చేవాడు శివుడు. ప్రవృత్తియందు లౌకికమైన, భౌతికమైన సుఖాలకొరకు విష్ణువును ఆశ్రయించవచ్చు.
232. ధర్మస్వరూపుడాతడు. వేదాలు, విజ్ఞానం, యజ్ఞాల
యొక్క సత్ఫలం, యజ్ఞపురుషుడు అంతా విష్ణువే! ప్రవృత్తి నుండి క్రమశః ఎప్పటికోఒకప్పటికి నివృత్తిలో ప్రవేశించగలిగిన జీవులకు మార్గం అది.
233. కర్మలోకమంతా, సత్కర్మ అంతా విష్ణుమయం. యజ్ఞం విష్ణుమయం. ధర్మం విష్ణుమయం. ధర్మరక్షకుడు విష్ణువు. ఇదంతా ప్రవృత్తిలో ధర్మం. ఈ మహర్షులందరూకూడా మానవమాత్రులందరికీ అట్టి విషయాన్ని చెప్పారు కాబట్టే వీళ్ళందరూ గురుస్వరూపులు.
234..మనమంతా అనేక జన్మలెత్తాము. ఏ జన్మలో ఏ గోత్రంలో పుట్టామో ఎవరికి తెలుసు! కాబట్టి ఈ మహర్షులందరూ మనకు తండ్రులే! ఎన్ని గోత్రాలు, ఎన్ని జన్మలెత్తామో, ఏ జన్మలో ఏయే ఋషిపేరు చెప్పుకుని బ్రతికామో తెలియదు కనుక, వీరందరూ మన తండ్రులే. ఋషిసంతానం కాని మానవుడే లేడు. ఆ మహర్షులబోధలే మనకు శరణ్యం. వాటిని అనుసరించటమే మన కర్తవ్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Nov 2020
No comments:
Post a Comment