శివగీత - 112 / The Siva-Gita - 112

🌹. శివగీత - 112 / The Siva-Gita - 112 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 15

🌻. భక్తి యోగము - 1 🌻

శ్రీరామ ఉవాచ :-


భక్తిస్తే కీ దృశ దేవ -జాయతే నా కధం చసా,

యయా నిర్వాణ రూపంతు - లభతే మోక్ష ముత్తమమ్. 1


తద్బ్రూహి గిరిజా కాంత ! - మయితే నుగ్రహొ యది,

యోవేదాద్య యనం యజ్ఞం- దానాని వివిదానిచ 2


మదర్పణి దియాకూర్యా - త్సమే భక్తస్స మే ప్రియః,

అవి ముక్తే దండ కాయాం- శ్రీశైలే పుండ రీకకే 3


య ఉపాస్తే మమాకారం - సమే భక్త స్సమే ప్రియః,

నర్య భస్మ సమాదాయ - విశుద్ధం శ్రోత్రి యాల యాత్ 4


అగ్ని రిత్యాది భీర్మం త్రై- రభి మంత్ర్య యధావిధి,

ఉద్దూలయతి గాత్రాణి - తేన చార్చతి మామపి 5


తస్మాత్పరత రా భక్తి - ర్మమ రామ ! న విద్యతే,

సర్వదా శిరసా కంటే - రుద్రాక్షా న్దార యేత్తు యః 6


శ్రీరాముడు మాట్లాడు (ప్రశ్నించు ) చున్నాడు:

నీ యందలి భక్తి ఎటువంటిది? అది ఏవిధముగా పుట్టుచున్నది: ఏ విధమై భక్తి చేత సుఖ మత్తమమైన ముక్తి లభించునో ఓ శివ దేవ, దానిని యాదేశించ వలసిందిగా ప్రార్ధించెను. అందుకు పరమశివుడా దేశించు చున్నాడు.

ఎవడు వేదాధ్యనము యజ్ఞము దాన ధర్మములు మదర్పణ బుద్ది చేత చేయునో అట్టివాడు నాకు ప్రియమైన భక్తుడు.

ఎవడైతే శ్రోత్రియ గృహము నుండి యగ్ని భస్మమును తెచ్చి అగ్నిరితి మున్నగు మంత్రములతో నాభి మంత్రింఛి దేహమంతటికి పులుముకొని, దానితో నన్నారాదిం చునో రామా ! ఇంత కంటే నుత్తముడగు భక్తుడు నాకు మరొకడు లేడు.

సుమా ! (విశేషమున్నది యను భగవద్గీతలోని విషయమునకు సరియైనది) ఎల్లప్పుడూ శిరస్సు నందును, కంటము నందును రుద్రాక్షల నెవడు ధరించునో ఎవడు శివ -పంచాక్షరి జప పరాయణుడో వారుభయులును నా కిష్టమైన భక్తులు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 112 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 15

🌻 Bhakthi Yoga - 1 🌻

Sri Rama said: What is meant by devotion to you? How does it take birth? And how does one gain the supreme happiness called liberation by devotion to you, please explain me O Shiva! Sri Bhagawan said:

One who studies Vedas or does the sacrificial rituals and offers his actions to me, he is my favorite devotee. One who applies the holy ash all over his body and worships me with devotion; there is no other devotee dearer than such a one to me.

One who wears Rudraksha beads on his hair and neck, one who constantly chants my Panchakshari mantra, both these types of devotees are my favorite and very dear to me.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2020

No comments:

Post a Comment