🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 97 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - 2 🌻
408. మానాసికగోళము నందున్న బాటసారి ఒకడు భారతదేశములో నున్నాడనుకొందము.అతడు అమెరికాను చుచు చున్నాడని భావించినచో, శారీరికముగా కానీ మానసికముగా కానీ అతను అమెరికాలో నుండగలడు. ఎందుచేతననగా- అతను మానసిక ప్రపంచమందుడుట చేత, మనసుయొక్క మూర్తిమత్వము అతడు.
ఎక్కడ ఉండగోరిన, అక్కడ నుండగలదు స్థూల సూక్ష్మ అవయవములను ఉపయోగింపనవసరము లేదు.భౌతిక,సూక్ష్మ,మానసిక గోళముల గురించి అతడు తెలుసుకొనగలడు.
ఇతడు తనకంటే తక్కువస్థితి గలవారిని గాని లేక సామాన్య మానవునిగాని తన స్థాయికి తీసుకొని పొగలడు.
409. ఐదవ భూమిక
ఈ భూమిక మానసికగోళము నందలి మొదటి భాగము ఇతడిచ్చట భావద్రష్టయు, భావాధికారియై యుండును. భౌతిక, సూక్ష్మ చైతన్యములు గల అందరి ఆత్మల యొక్క జిజ్ఞాస మనస్సులకు అధికారము గల సమర్థుడగును. ఈ భూమిక యందున్న మానవుడు, జిజ్ఞాస మనస్సు లేక, అన్వేషిత మనస్సు లేక, విచారణ మనస్సుతో తాదాత్మ్యడై యుండును.
ఇచ్చట మనస్సు రెండు విధాలుగా పని చేయును. మహిమలు ప్రదర్శింపడు. భగవంతుని ముఖాముఖి చూడలేడు. ఎరుకతోగాని,ఎరుకాలేకగాని వెనుకబడ్డ వారికి గొప్ప సహాయము చేయును.
విచారణా మాసము:
ఉన్నతభావములు X నీచభావములు
సదాలోచనలు X దూరాలోచనలు
ఆధ్యాత్మికభావనాలు X ఆధిభౌతికభావనలు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Nov 2020
No comments:
Post a Comment