శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 86, 87 / Sri Lalitha Chaitanya Vijnanam - 86, 87

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 47 / Sri Lalitha Sahasra Nama Stotram - 47 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 86, 87 / Sri Lalitha Chaitanya Vijnanam - 86, 87 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ‖ 35 ‖


🌻 86. 'కంఠాథః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ'' 🌻

కంఠము నుండి కటి (నడుము) వరకు గల మధ్యమైన కామరాజ కూటము తన నిజరూపముగా గలది.

సృష్టియందు శిరస్సున వెలుగు, మధ్యభాగమున దైవాసుర సంపత్తి, అధో భాగమున పంచభూతాత్మక సృష్టి ఏర్పడి యుండును. మానవుని యందు కూడ ఇదే విధముగ శిరస్సున వెలుగు, కంఠము నుండి బొడ్డు వరకు కుడి ఎడమల భావములు (దైవాసుర భావములు) అచట నుండి మూలాధారము వరకు శక్తికూటము ఉండును. మధ్యమైన కూటమును కామరాజ కూటమందురు. దీనికి ప్రభువు కామదేవుడు. ధర్మయుక్తమైన కామము దైవీ భావము. అధర్మయుక్త కామము అసురభావము. వీటి సంఘర్షణము సృష్టియందు తప్పదు.

ద్వంద్వముల యందున్న వారికి ఈ ఘర్షణ యుండును. కావున ఇంద్రాది దేవతలు సైతము భయమున చిక్కియుందురు. ధర్మపరులకు అధర్మపరుల భయముండనే యున్నది. అట్లే అధర్మపరులకు ధర్మపరుల భయముండనే యున్నది. ఈ మధ్యమకూట మంతయు కామము ప్రధానముగ నిర్వర్తింపబడు చున్నది. అది ధర్మ కామమైనను, అధర్మ కామమైనను కామమే. పైన గల వెలుగు ఈ ద్వంద్వమున కతీతము.

ద్వంద్వమున గల జీవులకు షట్భావములు, షడ్గుణములు, షడ్రుచులు, సమస్తము షడ్యంత్రముగ నడచును. త్రిగుణములు ప్రతిబింబించుటచే ఈ షట్కోణ మేర్పడెను. అందలి కేంద్రబిందువే జీవ చైతన్యము. ఈ షట్కోణముల నిర్వహణము రాజసికము, తామసికముగ నిర్వర్తింపబడు చున్నప్పుడు సమస్త కార్యములు ఈ మధ్యమ కూటమున జరుగుచున్నవి.

సత్త్వమున మాత్రమే ఈ షట్కోణ చక్రము నుండి బయల్పడ వచ్చును. సత్త్వమొక తటస్థ స్థితి. విరుద్ధమగు రెండు భావముల కది కేంద్రము. తటస్థ స్థితి చేరిన వారియందు అవిద్యను, అధర్మమును, అకార్యమును ద్వేషించుట యుండదు. గమనించుట మాత్రమే యుండును.

ద్వేషభావము అధర్మము పైన మిక్కుటముగ నున్నచో భావ తీవ్రతచే దాని నాకర్షించుట జరుగును. దారిద్ర్యమును ద్వేషించువారు దారిద్ర్యమును, అనారోగ్యమును ద్వేషించువారు అనారోగ్యమును పొందుట చూచుచున్నాము కదా! దీని నుండి బయల్పడుటకు, వెలుగులోనికి ప్రవేశించుటకు పంచదశీ మంత్రములోని మధ్యమకూటమైన షడక్షరములను ఉపాసించుట మార్గము.

అవి హ, స, క, హ, ల, హ్రీం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 86 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 kaṇṭhādhaḥ kaṭiparyantha-madhyakūṭa-svarūpiṇī कण्ठाधः कटिपर्यन्थ-मध्यकूट-स्वरूपिणी (86) 🌻

Madhya kūṭa or the middle group of Pañcadaśī mantra refers to that portion between Her neck and the hip. Previous nāma is jñāna śaktī, this nāma is icchā śaktī and the next nāma is kriyā śaktī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 87 / Sri Lalitha Chaitanya Vijnanam - 87 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ‖ 35 ‖

🌻 87. 'శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణీ' 🌻

శక్తికూటము నడుమున కథో భాగముగ ధరించునది శ్రీదేవి యని అర్థము.

కామ మాధారముగనే మధ్యమకూట మంతయు నిర్వర్తింప బడుచున్నది. కామోత్పత్తికి మూలము శ్రీదేవియే. ఆమె శక్తియే. కామశక్తిగ ఉద్భవించును. ఆమె కామేశ్వరి కదా! చతుర్ వ్యూహములను అమ్మ తన సంకల్ప శక్తిచే నిర్వర్తించుచున్నది. (పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను నాలుగును నాలుగు వ్యూహములు లేక వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు.) వీనికి మూలకారణముగ ఆమెయే యున్నది.

ఆమె మూలశక్తి, మూలమంత్రము. జీవునియందు ఆమె యుండు స్థానము మూలాధారము. మూలాధారమున అమ్మ కుండలినీ చైతన్యరూపిణియై యుండును. తపస్సుచేత ఈమె ఈ శక్తిని ప్రచోదనమ కావించుట యొక మార్గము. ఇది అనాదిగ భరత దేశమున జరుగుచున్నది. యోగవిద్య ఋషు లందించినది. కుండలినీ శక్తి ప్రచోదనమునకే. ఈ శక్తిని ప్రచోదనము చేయుటకు శక్తికూటమైన పంచదశీలోని చివరి నాలుగు అక్షరములను శ్రీవిద్య ఉపాసకులు ఆశ్రయింతురు.

ముందు రెండు నామములు, ఈ నామము అమ్మ పంచదశీ మంత్రమును భక్తలకు పరిచయము చేయుచున్నది. పంచదశి పదిహేను అక్షరముల మంత్రము. మొత్తము మంత్రము ఈ విధముగ వున్నది. క, ఏ, ఈ, ల, అక్షరములు 6 అక్షరములు హ, స, క, హ, ల, హ్రీం హీం స, క, 4 అక్షరములు 15 ఇందు మొదటిది వాగ్భవ కూటము, రెండవది కామరాజు కూటము, మూడవది శక్తి కూటము. యోగ విద్యయందు సుషుమ్నా మార్గమున కుండలినీ చైతన్యమును ప్రచోదనము కావించుకొని యోగులు మొదటి కూటమును చేరుచున్నారు.

ఈ మంత్ర రహస్యమును, ఉపాసనా విధానమును గురు ముఖముగ పొందవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 87 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Śakti- kūṭaikatāpanna- kaṭyadhobhāga-dhārinī शक्ति-कूटैकतापन्न-कट्यधोभाग-धारिनी (87) 🌻

Śaktī kūṭa, the last of the three kūṭa-s is compared to Her hip downwards.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam


JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra

Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹
https://www.facebook.com/groups/465726374213849/

JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness

Join and Share in 🌹. Indaichat 🌹
https://wn78r.app.goo.gl/gv65S


12 Nov 2020

No comments:

Post a Comment