🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 104, 105 / Vishnu Sahasranama Contemplation - 104, 105 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 104. వసుః, वसुः, Vasuḥ 🌻
ఓం వసవే నమః | ॐ वसवे नमः | OM Vasave namaḥ
వసంతి అస్మిన్ ఇతి ఈతని యందు సర్వభూతములు వసించును లేదా వసతి ఇతి వసుః ఈతడు సర్వభూతములయందును వసించును. లేదా భగవద్గీత విభూతి యోగమునందు భగవద్వచనముచే చెప్పబడిన పావకుడనే (అగ్ని) వసువు.
:: భగవద్గీత - ఆత్మసంయమ యోగము ::
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30 ॥
ఎవడు సమస్తభూతములందును నన్ను చూచుచున్నాడో, మఱియు నన్ను సమస్తభూతములందును గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు.
:: భగవద్గీత - విభూతి యోగము ::
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకశ్చాస్మి మేరుశ్శిఖరిణామహమ్ ॥ 23 ॥
నేను రుద్రులలో శంకరుడనువాడను, యక్షులలోను, రాక్షసులలోను కుబేరుడను, వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను.
(అష్టవసువులు: ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, పావకుడు / అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 104 🌹
📚. Prasad Bharadwaj
🌻104. Vasuḥ 🌻
OM Vasave namaḥ
Vasanti asmin iti / वसंति अस्मिन् इति All beings abide in Him therefore Vasuḥ or Vasati iti vasuḥ / वसति इति वसुः He too abides in them; so He is Vasuḥ. Or as Lord has described himself in Chapter 10 of Bhagavad Gītā, He is Pāvaka among the eight Vasus.
Bhagavad Gītā - Chapter 6
Yo māṃ paśyati sarvatra sarvaṃ ca mayi paśyati,
Tasyāhaṃ na praṇaśyāmi sa ca me na praṇaśyati. (30)
:: श्रीमद्भगवद्गीता - आत्मसंयम योग ::
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३० ॥
One who sees Me in everything and sees all things in Me - I do not go out of vision and he also is not lost to My vision.
Bhagavad Gītā - Chapter 10
Rudrāṇāṃ śaṃkaraścāsmi vitteśo yakṣarakṣasām,
Vvasūnāṃ pāvakaścāsmi meruśśikhariṇāmaham. (23)
:: श्रीमद्भगवद्गीता - विभूति योग ::
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुश्शिखरिणामहम् ॥ २३ ॥
Among the Rudrās I am Śankara, among the Yakṣās and goblins I am Kubera. Among the Vasus, I am Fire and among the mountains I am Meru.
🌻 🌻 🌻 🌻 🌻
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥
వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥
Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 105 / Vishnu Sahasranama Contemplation - 105 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻105. వసుమనాః, वसुमनाः, Vasumanāḥ🌻
ఓం వసుమనసే నమః | ॐ वसुमनसे नमः | OM Vasumanase namaḥ
వసు అను శబ్దమునకు ధనము అను అర్థము కలదు. మానవ జీవితమున ఇది గొప్ప ప్రాముఖ్యము కలది కావున 'వసు' అనగా ప్రాశస్త్యము కలది అను అర్థము. వసు మనః యస్య సః ప్రశస్తమగు మనస్సు ఎవనికి కలదో ఆతడు అని వ్యుత్పత్తి. ఆతని మనస్సు రాగము, ద్వేషము మొదలగు చిత్తక్లేషములచేతను, మదము మొదలగు ఉపక్లేశముల చేతను అతని చిత్తము కలుషితము కాదు కావున ఆతని మనస్సు ప్రశస్తమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 105 🌹
📚. Prasad Bharadwaj
🌻105. Vasumanāḥ🌻
OM Vasumanase namaḥ
By Vasu which means wealth - excellence is indicated. Vasu manaḥ yasya saḥ / वसु मनः यस्य सः He whose mind is excellent is Vasumanāḥ. That mind is said to be praiseworthy which is not polluted by kleṣas and upakleṣas.
🌻 🌻 🌻 🌻 🌻
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥
వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥
Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
12 Nov 2020
No comments:
Post a Comment