శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 20వ అధ్యాయము - 5 🌻

ఆ భిక్షకుడే కనుక శ్రీమహారాజు అయితే తనకు తప్పకుండా వ్యాపారంలో, మంచి లాభాలు రావాలని అతను అనుకున్నాడు. అదే రోజున అతని దూదినింపిన బళ్ళు వార్ధాకు అమ్మకానికి తేబడ్డాయి. వాటికి మంచిధర వచ్చింది. అప్పడు యాదవ్ శ్రీగజానన్ మహారాజు తన దగ్గరకు ఆభిక్షకుని రూపంలో వచ్చినట్టు నమ్మాడు.. శ్రీమహారాజు తన భక్తులను సదా కాపాడుతారు.

ఇప్పుడు కావర్ అనుభవం వినండి ...... భవ్ రాజారాం కావర్ ఖాంగాంలో వైద్యుడు, అతనికి తెల్టరా బదిలీ అయింది. తెల్టరాలో పనిలో చేరేముందు, అతను తన కుటుంబంతోపాటు షేగాం దర్శనానికి వచ్చాడు. షేగాంలో ఒక ఎడ్లబండిని తెల్లరా వెళ్ళేందుకు అద్దెకు తీసుకున్నాడు. అతను సాయంత్రం బయలుదేరబోతూ ఉంటే, రేపు ప్రసాదం తీసుకున్నాకా మీరు షేగాంనుండి వెళ్ళాలని నావినంతి.

ఇంతకు ముందు ఎప్పుడూ మీరు షేగాంనుండి భోజనం చెయ్యకుండా వెళ్ళలేదు. మరి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? పైగా ఈరోజు వ్యాతిపతి, ప్రయాణానికి అశుభమయిన రోజు అని బాలాభవ్ అన్నాడు. కావర్ పాక్షికంగా అంగీకరించాడు. తనురాత్రి భోజనం చెయ్యగానే వెంటనే బయలుదేరతాను అన్నాడు. ఆప్రకారంగా కుటుంబంతో కలిసి బయలుదేరాడు.

అ రోజు చిక్కటి చీకటి రాత్రి. ఆ చీకటి అంధకారంలో తెల్టరా దారితప్పి ఒకసన్నటి దారిన చుట్టూ అడవిలా ఎదురుగా పెద్ద సరస్సు ఎదురయింది. బండి ఆగింది. దారి అడుగుదామన్నా చుట్టుప్రక్కల ఎవరూ లేరు. మనం తప్పుదారిన ఉన్నాంఅని బండివాడు అన్నాడు. కావర్ ఆశ్చర్యపోయాడు. బండిదిగి అతను నిజంగానే తెల్టరా వెళ్ళవలసిన దారి తప్పడం చూసాడు.

కావర్ ఈ తప్పుకు బండివాడిని దూషించాడు. దానికి, నన్ను ఎందుకు దూషిస్తున్నారు, నేను తరచు ప్రయాణికులను తెల్టరా తీసుకు వెళుతూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు నేను సరిఅయిన దారినే అనుసరించాను, ఎడ్లుకూడా ఎటూ తిరగకుండా తిన్నగా నడిచాయి. ఈ సరస్సు చూసిన తరయవాతనే అవి ఆగాయి, ఇది ఖచ్చితంగా తెల్టరా దారి కాదు అని బండివాడు అన్నాడు.

అప్పడు కావర్ దీనికి కారణం అర్ధం చేసుకున్నాడు. బాలాభవ్ ప్రార్ధన లక్ష్యపెట్టకుండా, ప్రసాదం తీసుకోకుండా షేగాం వదిలి రావడంవల్ల ఈపని శ్రీమహారాజుదే అని అతను అనుకున్నాడు. చేతులు కట్టుకుని, ఆ అడవిలో తనను కాపాడవలసిందిగా శ్రీమహారాజును ప్రార్ధించాడు. వెంటనే ఎడ్ల గంటలమోత వినిపించింది. అది అతని ధైర్యం తిరిగి పుంజుకునేలా చేసింది. బండి వాడిని ఆ శబ్దంవస్తున్న దిశలో నడవమని సూచిస్తాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 111 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 20 - part 5 🌻

Before joining his duty at Telhara, he, along with his family, came to Shegaon for Maharaj’s Darshan. At Shegaon he hired one bullock cart for going to Telhara, and when he was about to start in the evening, Balabhau said to him, It is my request that you should leave Shegaon only after taking prasad tomorrow.

Before this, you never went from here without taking any food. Why are you behaving like this today? Moreover today is 'Vyatipat', an inauspicious day for travel. Kavar agreed partially. He said that he would start immediately after taking meals at night.

Accordingly he left with his family after eating dinner. It was a pitch dark night. It so happened that, in the darkness, he missed the road to Telhara and strayed on a narrow path with jungle all around and a big lake in front. The cart stopped. There was nobody nearabout from whom they could enquire their location.

The cartman said that they were on the wrong path. Kavar was surprised. He got down and saw that they had really missed the road to Telhara. Kavar abused the cartman for his mistake. Thereupon the cart man said, Why are you abusing me? I frequently take the passengers to Telhara and, as far as I think, I followed the right path, the bullocks too walked straight without turning anywhere.

They stopped only when they saw this lake. This is surely is not the road to Telhara. Then Kavar understood the reason of all that was happening. He thought it to be the act of Shri Gajanan Maharaj , as he had left Shegaon without taking prasad in the morning and, that too, by ignoring the request of Balabhau. With folded hands he implored Shri Gajanan Maharaj to protect him in that forest.

Immediately thereafter he heard the ringing of bells of bullocks. That made him regains his courage; he asked the cartman to drive towards the direction of that sound. The cartman did accordingly and reached a big road. On enquiring there, it was learnt that they were still within the field boundaries of Shegaon.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


18 Nov 2020

No comments:

Post a Comment