భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 102
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 102 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - 7 🌻
425. అయిదు, ఆరు భూమికల యందున్న (మహాపురుషుడు ) మరియు (సత్పురుషుడు ) మాత్రమే ఇతరులను తమ స్థాయికి తీసికొని పోగలరు. అట్టివారి అనుగ్రహమును పొందినవారు గొప్ప ప్రయోజకులు.
426. సూక్ష్మ ప్రపంచము నుండి నిస్సంగమును పొందిన వాడు సాధుపురుషుడు (వలీ) అగును.
427. దర్శనము అయిదు, ఆరు భూమికలకు సంబంధించినది.
428. అయిదవ భూమిక యందున్న వలీ (మహాపురుషుడు), సాధకునికి, తన కరుణాదృష్టిని అతనిపై సారించి, తద్వారా తనస్థితిని వానికిచ్చును.
429. భూమికలలో నున్న గురువులకు ప్రత్యక్షముగా భౌతిక సంపర్కము కావలయును.
430. మానసిక భూమికలలో ఈ మనస్సే, ఈశ్వరుడుగను జ్ఞానాపూర్వకముగను ఉపయోగ పడుచున్నప్పుడు, ప్రాణశక్తి, పరోక్షముగను స్పృహ లేకను ఉపయోగ పడుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment