📚. ప్రసాద్ భరద్వాజ
🌻114. రుద్రః, रुद्रः, Rudraḥ🌻
ఓం రుద్రాయ నమః | ॐ रुद्राय नमः | OM Rudrāya namaḥ
సంహారకాలే భవాన్ సంహరన్ సకలాః ప్రజాః సంహార ప్రళయకాలమున సమస్త జీవులను సంహరించువాడగుటచే రుద్రుడు. యో రోదయతి రుద్రస్స రుడం రాతీతి వా తథా అట్లు సంహరింపబడిన వారిని చూచి తత్సంబంధ జీవులు రోదించెదరు. అట్లు రోదింపజేయువాడు గనుక రుద్రుడు.
:: శివ పురాణం - సంహిత 6, అధ్యాయం 9 ::
రు ర్ధుఃఖం దుఃఖ హేతుర్వా తద్(తం) ద్రావయతి యః ప్రభుః ।
రుద్ర ఇత్యుచ్యతే తస్మాచ్ఛివః పరమ కారణం ॥ 14 ॥
'రు' అనగా దుఃఖము
లేదా దుఃఖమునకు కారణమగునది (అవిద్య) అని అర్థము. ఏ ప్రభువు (దానిని తరిమివేయ శక్తి సంపన్నుడో) దానిని తరిమివేయునో అట్టి సర్వకారణములకు కారణమగు (పరమకారణము) శివుడు ఆ హేతువుననే 'రుద్రః' అనబడుచున్నాడు.
ఇట్లు దుఃఖ వశమున రోదనము లేదా ఏడిపించుట మరియూ దుఃఖమును తరిమివేయుట అను హేతువులు రుద్రుని రుద్రత్వమును సమర్థించుచున్నవి.
రుదం రాతి రుద్ అనగా వాణి లేదా వాక్కు. దానిని ఇచ్చువాడు కావున రుద్రః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 114🌹
📚. Prasad Bharadwaj
🌻114. Rudraḥ🌻
OM Rudrāya namaḥ
Saṃhārakāle bhavān saṃharan sakalāḥ prajāḥ / संहारकाले भवान् संहरन् सकलाः प्रजाः At the time of dissolution, He destroys the beings and hence He is Rudraḥ. Yo rodayati rudrassa ruḍaṃ rātīti vā tathā / यो रोदयति रुद्रस्स रुडं रातीति वा तथा By doing so, He makes the related cry and hence He is Rudraḥ.
Śiva Purāṇa - Part VI, Chapter IV
Ru rdhuḥkhaṃ duḥkha heturvā tadˈ(taṃ) drāvayati yaḥ prabhuḥ,
Rudra ityucyate tasmācchivaḥ parama kāraṇaṃ. (14)
:: शिव पुराणं - संहित ६, अध्याय ९ ::
रु र्धुःखं दुःख हेतुर्वा तद्(तं) द्रावयति यः प्रभुः ।
रुद्र इत्युच्यते तस्माच्छिवः परम कारणं ॥ १४ ॥
'Ru' means sorrow or can also be interpreted as the source for it - which is ignorance. The Lord who holds the power to rid one of such sorrow and does in fact melts away such sorrow (or the reason for it) being the supreme cause, Śiva is known as Rudra for the very reason.
He makes one lament out of sorrow and He is also the one who melts away ignorance which is the cause of sorrow. Both the attributes are apt to describe Rudra.
Rudaṃ rāti Rud means speech. The one who bestows that is Rudra.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥
Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 115 / Vishnu Sahasranama Contemplation - 115🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻115. బహుశిరాః, बहुशिराः, Bahuśirāḥ🌻
ఓం బహుశిరసే నమః | ॐ बहुशिरसे नमः | OM Bahuśirase namaḥ
బహుశిరాః, बहुशिराः, Bahuśirāḥ
బహుని శిరాంసి యస్య బహుశిరాస్స ఉచ్యతే అనేకములగు శిరములు కలవాడు. పురుష సూక్తమునందు 'సహస్రశీర్షా పురుషః' అని ఉన్నది. సర్వప్రాణిదేహ సమష్టియందుండు విరాట్ పురుషుడు వేయి, వేలకొలది శిరములు కలవాడు అను మంత్రవర్ణము ననుసరించి పరమాత్ముడు బహుశిరాః.
:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్ ।
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 16 ॥
(అర్జునుడు పలికెను) ప్రపంచాధిపతీ! జగద్రూపా! మిమ్ము సర్వత్ర అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు గలవానినిగను, అనంతరూపులుగను నేను చూచుచున్నాను. మఱియు మీయొక్క మొదలుగాని, మధ్యముగాని, తుదనుగాని నేను గాంచజాలకున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 115🌹
📚. Prasad Bharadwaj
🌻115. Bahuśirāḥ🌻
OM Bahuśirase namaḥ
Bahuni śirāṃsi yasya bahuśirāssa ucyate He who has many heads. Puruṣa sūkta eulogizes the Supreme God as 'Sahasraśīrṣā puruṣaḥ' The puruṣa with countless number of heads, eyes, and feet pervades the Earth in entirety and extends far beyond.
Bhagavad Gītā - Chapter 11
Aneka bāhūdaravaktranetraṃ paśyāmi tvāṃ sarvato’nantarūpam,
Nāntaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśveśvara viśvarūpa. (16)
:: श्रीमद्भगवद्गीता - विश्वरूप संदर्शन योग ::
अनेक बाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥ १६ ॥
Arjuna exclaims! I see You as possessed of numerous arms, bellies, mouths and eyes; as having infinite forms all around. O Lord of the Universe, O Cosmic Person, I see not Your limit nor the middle, nor again the beginning.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥
Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment