ప్రసాద్ భరద్వాజ
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 94. కౌళినీ 🌻
శివశక్తి సామరస్యమే కౌళము. అట్టి కౌళము గలది శ్రీదేవియని ఈ నామము తెలుపుచున్నది.
కుళ మనగా శక్తి యని, అకుళము అనగా శివుడని, కూళాకుళ సంబంధమే కౌళమని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. అమ్మ శివశక్తియే. శివుని వ్యక్తరూపమే అమ్మ. దైవము సాక్షాత్కరింపవలె నన్నచో రూపమును ధరించవలెను. కనపడుట కిదియే మార్గము. రూపము స్థూలమైనను, సూక్ష్మమైనను, సూక్ష్మకరమైనను, సూక్ష్మతమమైనను అమ్మయే. అమ్మలేక, దేవుడు కనపడడు. కేనోపనిషత్తు ఈ రహస్యమునే బోధించు చున్నది.
శివుడు లేక పరదైవము లేక పరబ్రహ్మము అవికారము,
అలక్షణము, అప్రతర్క్యము, అవిశ్లేయము, అనూహ్యము, అతీతము, అపరిమితము, అగోచరము. అట్టి తత్త్వము వ్యక్తమగుటయే వెలుగు. ఆ వెలుగే అమ్మ.
వెలిగినచో కనపడును. వెలుగక ముందు కనపడదు.
కనపడనిది కనిపించుటయే అమ్మ ఆవిర్భావము. వెలుగుటకు కారణము వెలుగున కాధారముగ నున్న తత్త్వము. విద్యుత్తు కనపడదు కాని దాని వెలుగు కనపడుచున్నది కదా! దాని శక్తి తెలియుచున్నది కదా! అట్లు పరతత్త్వము యొక్క వెలుగు, శక్తి అమ్మగ ప్రకటిత మగుచున్నది. విద్యుత్తు లేనిదే వెలుగు లేదు. అట్లే శివుడు లేనిదే శక్తి లేదు.
వెలుగునందు, శక్తినందు విద్యుత్తు వున్నది కదా! అట్లే అమ్మ యందు అయ్య వున్నాడు. అమ్మ కనపడితే అయ్య అనుగ్రహించినట్లే. అయ్య రూపమే అమ్మ. శివరూపమే శివా. పై కారణముగనే పంచాక్షరీ మంత్రము అమ్మ నుద్దేశించి ఈయబడినదని తెలియవలెను. 'ఓం నమః శివాయ'. 'శివా' శబ్దము అమ్మ నుద్దేశించినది.
శివుడు కనపడుట యనగా శివారూప సాక్షాత్కారమే. ఇది వారి సామరస్యము. ఆకుళుడైన శివుడు కుళయైన అమ్మ కలిసి కౌళముగ సృష్టి జరుగుచున్నది. జరిపించునది 'కౌళినీ' యగు అమ్మ. శివ సహకారముతో, శివ సంకల్పముగ శివశక్తియై నిలచి జీవుల ననుగ్రహించుచున్న తల్లియే జగన్మాత శ్రీదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 94 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Kaulinī कौलिनी (94) 🌻
She is the core of kaula worship. Kaula worship is a tantric worship under śākta method (methods of worshipping Śaktī is called śākta worship). Since She is the centre of this worship She is called kaulīnī.
As She is worshiped everywhere (omnipresence), She is called as kaulīnī (as per triad – worshipper, worshipped and worship). Tantra śāstra define Śaktī as kulā and Śiva as akula. The union of Śiva and Śaktī is called as kaula and She is called kuṇḍalinī.
This union takes place in sahasrāra. There is a reference in some tantra texts to one more thousand petal lotus, just below the thousand petal lotus, is the sahasrāra. In the centre of the second sahasrāra, Kula Devi is worshiped and in the petals kula Śaktīs are worshiped.
Kaulīni also means this kula Devi, the goddess of one’s lineage. One of the Vāc-Devi-s, the authors of this Sahasranāma is known as Kaulīnī. The external worship of cakra-s, possibly meaning that Śrī Cakra is also called kaulīnī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 95 / Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 95. 'కులయోగినీ 🌻
హృదయాకాశమున శ్రీదేవి పాదపద్మములతో అనుసంధానము చెంది పూజాదులను చేయుట కుళమని, అట్టి విధానమున యోగము చెందుట కుళయోగమని, దాని ననుగ్రహించినది శ్రీదేవి యని అర్థము. అమ్మ చైతన్య స్వరూపిణి.
మనయందు కూడ సుషుమ్న మార్గమున నిలచియున్న చైతన్యము శ్రీదేవియై ఆమె సాన్నిధ్యమును పొందుటయే యోగము. అట్టి యోగము నిర్వర్తించుకొనుటకు అమ్మ రూపమును గాని, శ్రీచక్రమునుగాని హృదయాకాశమున దర్శించి ఆరాధించుట కౌళమార్గము.
బాహ్య పూజలకు ముందుగాని తరువాత గాని ఈ విధముగ హృత్ పద్మమున అమ్మ ఆసీనురాలై యున్నట్లు భావించి అంతరంగమున ధ్యానించవలెను, అచటనే పూజింపవలెను.
ఆకాశము పంచభూతములలో అత్యంత పవిత్రము. అది వెలుగుతో కూడినది. అట్టి ఆకాశమును దర్శించి అందు శ్రీదేవి రూపమునుగాని, శ్రీచక్రమునుగాని భావన చేత రూపొందించి, స్థాపించి పూజింపవలెను.
అందులకే సహస్ర నామ పారాయణము ముందు ధ్యానశ్లోక మీయబడినది. అందు అమ్మరూపము వర్ణింపబడినది. "అరుణాం కరుణా తరంగితాక్షీం.....” అను ధ్యానశ్లోకము అమ్మ రూపమును ఆవిష్కరించగలదు.
ఆమె మనోహర యగుటచే అంతరంగమున మనసు హరింపబడి, బుద్ధిలోకమున ధ్యానము, పారాయణము నిలువగలదు. పై విధమైన అంతరంగ ఆరాధనమున హృదయపద్మము ద్వారా సుషుమ్నను చేరవచ్చు లేదా మన చుట్టును గల నీలాకాశమున శ్రీచక్రమును గాని, అమ్మ రూపమును గాని మానసికముగ, రూపొందించుకొని ధ్యానించుట, పూజించుట చేయవచ్చును. ఇది బాహ్యారాధనము.
కుళయోగము కులమధ్యమున నిర్వర్తించుకొనుట భగవద్గీత యందు బోధించియున్నారు. హృదయ పద్మమున నిర్వర్తించుట ఉపనిషత్తులందు తెలుపబడినది. మూలాధారమున నిర్వర్తించుట సద్గురు సాన్నిధ్యమున మాత్రమే వీలగునని పెద్దల అభిప్రాయము.
సహస్రారము దిగువ నుండి మూలాధార కేంద్రము వరకు గల షట్చక్రములను కలుపు సుషుమ్న నాళము అంతయూ కుళమే. జీవ లక్షణమును బట్టి, గురూపదేశమును, నిర్దేశమును బట్టి ఈ నాళమున ఏ కేంద్రము ద్వారా నైనను యోగింపవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Kulayoginī कुलयोगिनी (95) 🌻
Kaulā means mental worship. Here it means offering mental worship to Her in the six cakra-s. Mental worship can be performed only through yoga.
Kula means mūlādhārā cakra and akula means sahasrāra. The link between these can be established only by yogic methods. That is why she is called as Kulayoginī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment