✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 11
🌻. నారాయణీ స్తుతి - 1 🌻
1-2. ఋషి పలికెను : ఆ గొప్ప దానవచక్రవర్తి దేవిచే అక్కడ పరిమార్పబడినప్పుడు, ఇష్టార్థసిద్ధి పొందడం వల్ల దిక్కులను తేజరిల్లజేసే విధంగా దీపించే ముఖపద్మాలతో ఇంద్రాది దేవతలు అగ్ని దేవుణ్ణి ముందు ఉంచుకుని ఆమెను (కాత్యాయనిని) స్తుతించారు.
3. "శరణు జొచ్చినవారి దుఃఖాలను పోగొట్టే దేవీ, ప్రీతవగుము. ఎల్ల లోకాలకు తల్లీ! ప్రీతవగుము! విశ్వాన్ని పరిపాలించే దేవీ, ప్రీతవగుము. జగత్తును రక్షించు. చరాచర ప్రపంచమంతటికి ఓ దేవీ! నీవు పరిపాలకురాలవు.
4. "అతిక్రమింప నలవికాని శౌర్యం గల ఓ దేవీ! భూమిరూపంలో ఉండే నీవే ఈ జగత్తుకు ఆధార భూతురాలవు. నీటి రూపంలో ఉండే నీ చేత ఈ సర్వమూ తృప్తి చెందుతుంది.
5. "విష్ణుదేవుని శక్తివైన నీ పరాక్రమానికి మేర లేదు. జగత్తుకు మూలమైన ఆది మాయవు నీవు. నీచేత ఈ సర్వమూ (విశ్వం) భ్రాంతి (అజ్ఞానం) పొందింది. ప్రీతి చెందితే లోకంలో మోక్షానికి నీవు కారణభూతురాల వగుతావు.
6. "దేవీ! విద్యలన్ని నీ వివిధ అంశలు, అలాగే లోకంలో స్త్రీలు అందరూ (నీ) వివిధకళలు (అంశలు) కలిగి ఉంటారు. తల్లీ! ఈ జగత్తునంతా నీవే నిండి ఉన్నావు. స్తుతింపదగిన సర్వవస్తువుల యొక్క పరాపరోక్తి (ముఖ్యోక్తి, గౌణోక్తి రెండూ) రూపవైన నిన్ను స్తుతించడం ఎలా?
7. సర్వభూతస్వరూపిణివైన దేవి (పరంజ్యోతి)గా, భోగమోక్ష ప్రదాయినిగా ప్రశంసిచబడుతున్న నిన్ను ఎంత శ్రేష్ఠమైనవి అయినా కూడా ఏ మాటలు వర్ణించగలవు?
8. సర్వజనుల హృదయాలలో బుద్ధిరూపంలో నిలిచి ఉంటూ, స్వర్గ సుఖాన్ని, మోక్షాన్ని ప్రసాదించే ఓ దేవీ! నారాయణీ! నీకు ప్రణామాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 37 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 11
🌻 Hymn to Narayani - 1 🌻
The Rishi said:
1-2. When the great lord of asuras was slain there by the Devi, Indra and other devas led by Agni, with their object fulfilled and their cheerful faces illumining the quarters, praised her, Katyayani:
The devas said:
3. 'O Devi, you who remove the sufferings of your suppliants, be gracious. Be propitious, O Mother of the whole world. Be gracious, O Mother of the universe. Protect the universe. You are, O Devi, the ruler of all that is moving and unmoving.
4. 'You are the sole substratum of the world, because you subsist in the form of the earth. By you, who exist in the shape of water, all this (universe) is gratified, O Devi of inviolable valour!
5. 'You are the power of Vishnu, and have endless valour. You are the primeval maya, which is the source of the universe; by you all this (universe) has been thrown into an illusion. O Devi. If you become gracious, you become the cause of final emancipation in this world.
6. 'All lords are your aspects O Devi; so are all women in the world, endowed with various attributes. By you alone, the Mother, this world is filled. What praise can there be for you who are of the nature of primary and secondary expression regarding (objects) worthy of praise?
7. 'When you have been lauded as the embodiment of all beings, the Devi (the effulgent one), and bestower of the enjoyment and liberation, what words, however excellent, can praise you?
8. 'Salutation be to you, O Devi Narayani, O you who abide as intelligence in the hearts of all creatures, and bestow enjoyment and liberation.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
18 Nov 2020
No comments:
Post a Comment