18-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 552 / Bhagavad-Gita - 552 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 114, 115 / Vishnu Sahasranama Contemplation - 114, 115🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 37 / Sri Devi Mahatyam - Durga Saptasati - 37🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 106🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 125 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Gajanan Maharaj Life History - 112 🌹
7) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 52 🌹* 
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 93 / Sri Lalita Chaitanya Vijnanam - 93🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 464 / Bhagavad-Gita - 464 🌹
🌹. నాగుల చవితి 🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 78 📚
11) 🌹. శివ మహా పురాణము - 276🌹
12) 🌹 Light On The Path - 32🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 163 🌹
14) 🌹. శివగీత - 117 / The Siva-Gita - 117🌹* 
15) 🌹 Seeds Of Consciousness - 226🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 102 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 66 / Sri Vishnu Sahasranama - 66 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 552 / Bhagavad-Gita - 552 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 19 🌴*

19. తానహం ద్విషత: క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||

🌷. తాత్పర్యం : 
అసూయగలవారును, క్రూరులును అగు నరాదములను వివిధ ఆసురజన్మలనెడి సంసారసాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను.

🌷. భాష్యము :
జీవుని ఒక ప్రత్యేక దేహమునందు ప్రవేశింపజేయుట యనునది శ్రీకృష్ణభగవానుని విశేష అధికారమని ఈ శ్లోకమున అతిస్పష్టముగ తెలుపబడినది. దానవప్రవృత్తి గలవాడు భగవానుని అధికారమును ఆంగీకరింపక తనకు తోచిన రీతిలో వర్తించినను, అతని తదుపరి జన్మము మాత్రము ఆ భగవానుని నిర్ణయముపైననే ఆధారపడియుండును. 

అది ఎన్నడును అతనిపై ఆధారపడియుండదు. మరణము పిదప జీవుడు తల్లిగర్భములో ప్రవేశపెట్టబడుననియు, అచ్చట అతడు తగిన దేహమును భగవానుని దివ్యశక్తి యొక్క పర్యవేక్షణమున పొందుననియు శ్రీమద్భాగవతపు మూడవస్కంధమున తెలుపబడినది. కనుకనే భౌతికజగమున జంతువులు, కీటకములు, మనుష్యాది పలుజీవజాతులను మనము గాంచుచున్నాము. అవన్నియు శ్రీకృష్ణభగవానుని శక్తిచేతనే రూపొందినవి గాని యాదృచ్చికముగా కాదు. 

ఇక ఆసురస్వభావుల విషయమున వారు సదా అసురయోనులందే ఉంచబడుదరనియు, తత్కారణముగా వారు ద్వేషులుగాను మరియు నరాధములుగాను కొనసాగుదురనియు ఇచ్చట తెలుపబడినది. అట్టి అసురస్వభావులు సదా కామపూర్ణులును, హింసాపూర్ణులును, ద్వేషులును, శుచిరహితులును అయియుందురు. అరణ్యములందు నివసించు పలురకములైన వేటగాళ్ళు అట్టి అసురజాతికి చెందినవారుగా పరిగణింపబడుదురు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 552 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 19 🌴*

19. tān ahaṁ dviṣataḥ krūrān
saṁsāreṣu narādhamān
kṣipāmy ajasram aśubhān
āsurīṣv eva yoniṣu

🌷 Translation : 
Those who are envious and mischievous, who are the lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demoniac species of life.

🌹 Purport :
In this verse it is clearly indicated that the placing of a particular individual soul in a particular body is the prerogative of the supreme will. 

The demoniac person may not agree to accept the supremacy of the Lord, and it is a fact that he may act according to his own whims, but his next birth will depend upon the decision of the Supreme Personality of Godhead and not on himself. In the Śrīmad-Bhāgavatam, 

Third Canto, it is stated that an individual soul, after his death, is put into the womb of a mother where he gets a particular type of body under the supervision of superior power. Therefore in the material existence we find so many species of life – animals, insects, men, and so on. All are arranged by the superior power. 

They are not accidental. As for the demoniac, it is clearly said here that they are perpetually put into the wombs of demons, and thus they continue to be envious, the lowest of mankind. Such demoniac species of men are held to be always full of lust, always violent and hateful and always unclean. The many kinds of hunters in the jungle are considered to belong to the demoniac species of life.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 114, 115 / Vishnu Sahasranama Contemplation - 114, 115 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻114. రుద్రః, रुद्रः, Rudraḥ🌻*

*ఓం రుద్రాయ నమః | ॐ रुद्राय नमः | OM Rudrāya namaḥ*

సంహారకాలే భవాన్ సంహరన్ సకలాః ప్రజాః సంహార ప్రళయకాలమున సమస్త జీవులను సంహరించువాడగుటచే రుద్రుడు. యో రోదయతి రుద్రస్స రుడం రాతీతి వా తథా అట్లు సంహరింపబడిన వారిని చూచి తత్సంబంధ జీవులు రోదించెదరు. అట్లు రోదింపజేయువాడు గనుక రుద్రుడు.

:: శివ పురాణం - సంహిత 6, అధ్యాయం 9 ::
రు ర్ధుఃఖం దుఃఖ హేతుర్వా తద్‍(తం) ద్రావయతి యః ప్రభుః ।
రుద్ర ఇత్యుచ్యతే తస్మాచ్ఛివః పరమ కారణం ॥ 14 ॥

'రు' అనగా దుఃఖము లేదా దుఃఖమునకు కారణమగునది (అవిద్య) అని అర్థము. ఏ ప్రభువు (దానిని తరిమివేయ శక్తి సంపన్నుడో) దానిని తరిమివేయునో అట్టి సర్వకారణములకు కారణమగు (పరమకారణము) శివుడు ఆ హేతువుననే 'రుద్రః' అనబడుచున్నాడు.

ఇట్లు దుఃఖ వశమున రోదనము లేదా ఏడిపించుట మరియూ దుఃఖమును తరిమివేయుట అను హేతువులు రుద్రుని రుద్రత్వమును సమర్థించుచున్నవి.

రుదం రాతి రుద్ అనగా వాణి లేదా వాక్కు. దానిని ఇచ్చువాడు కావున రుద్రః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 114🌹*
📚. Prasad Bharadwaj 

*🌻114. Rudraḥ🌻*

*OM Rudrāya namaḥ*

Saṃhārakāle bhavān saṃharan sakalāḥ prajāḥ / संहारकाले भवान् संहरन् सकलाः प्रजाः At the time of dissolution, He destroys the beings and hence He is Rudraḥ. Yo rodayati rudrassa ruḍaṃ rātīti vā tathā / यो रोदयति रुद्रस्स रुडं रातीति वा तथा By doing so, He makes the related cry and hence He is Rudraḥ.

Śiva Purāṇa - Part VI, Chapter IV
Ru rdhuḥkhaṃ duḥkha heturvā tadˈ(taṃ) drāvayati yaḥ prabhuḥ,
Rudra ityucyate tasmācchivaḥ parama kāraṇaṃ. (14)

:: शिव पुराणं - संहित ६, अध्याय ९ ::
रु र्धुःखं दुःख हेतुर्वा तद्‍(तं) द्रावयति यः प्रभुः ।  
रुद्र इत्युच्यते तस्माच्छिवः परम कारणं ॥ १४ ॥

'Ru' means sorrow or can also be interpreted as the source for it - which is ignorance. The Lord who holds the power to rid one of such sorrow and does in fact melts away such sorrow (or the reason for it) being the supreme cause, Śiva is known as Rudra for the very reason.

He makes one lament out of sorrow and He is also the one who melts away ignorance which is the cause of sorrow. Both the attributes are apt to describe Rudra.

Rudaṃ rāti Rud means speech. The one who bestows that is Rudra.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 115 / Vishnu Sahasranama Contemplation - 115🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻115. బహుశిరాః, बहुशिराः, Bahuśirāḥ🌻*

*ఓం బహుశిరసే నమః | ॐ बहुशिरसे नमः | OM Bahuśirase namaḥ*

బహుశిరాః, बहुशिराः, Bahuśirāḥ

బహుని శిరాంసి యస్య బహుశిరాస్స ఉచ్యతే అనేకములగు శిరములు కలవాడు. పురుష సూక్తమునందు 'సహస్రశీర్షా పురుషః' అని ఉన్నది. సర్వప్రాణిదేహ సమష్టియందుండు విరాట్ పురుషుడు వేయి, వేలకొలది శిరములు కలవాడు అను మంత్రవర్ణము ననుసరించి పరమాత్ముడు బహుశిరాః.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్ ।
నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 16 ॥

(అర్జునుడు పలికెను) ప్రపంచాధిపతీ! జగద్రూపా! మిమ్ము సర్వత్ర అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు గలవానినిగను, అనంతరూపులుగను నేను చూచుచున్నాను. మఱియు మీయొక్క మొదలుగాని, మధ్యముగాని, తుదనుగాని నేను గాంచజాలకున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 115🌹*
📚. Prasad Bharadwaj 

*🌻115. Bahuśirāḥ🌻*

*OM Bahuśirase namaḥ*

Bahuni śirāṃsi yasya bahuśirāssa ucyate He who has many heads. Puruṣa sūkta eulogizes the Supreme God as 'Sahasraśīrṣā puruṣaḥ' The puruṣa with countless number of heads, eyes, and feet pervades the Earth in entirety and extends far beyond.

Bhagavad Gītā - Chapter 11
Aneka bāhūdaravaktranetraṃ paśyāmi tvāṃ sarvato’nantarūpam,
Nāntaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśveśvara viśvarūpa. (16)

:: श्रीमद्भगवद्गीता - विश्वरूप संदर्शन योग ::
अनेक बाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥ १६ ॥

Arjuna exclaims! I see You as possessed of numerous arms, bellies, mouths and eyes; as having infinite forms all around. O Lord of the Universe, O Cosmic Person, I see not Your limit nor the middle, nor again the beginning.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 37 / Sri Devi Mahatyam - Durga Saptasati - 37 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 11*
*🌻. నారాయణీ స్తుతి - 1 🌻*

1-2. ఋషి పలికెను : ఆ గొప్ప దానవచక్రవర్తి దేవిచే అక్కడ పరిమార్పబడినప్పుడు, ఇష్టార్థసిద్ధి పొందడం వల్ల దిక్కులను తేజరిల్లజేసే విధంగా దీపించే ముఖపద్మాలతో ఇంద్రాది దేవతలు అగ్ని దేవుణ్ణి ముందు ఉంచుకుని ఆమెను (కాత్యాయనిని) స్తుతించారు.

3. "శరణు జొచ్చినవారి దుఃఖాలను పోగొట్టే దేవీ, ప్రీతవగుము. ఎల్ల లోకాలకు తల్లీ! ప్రీతవగుము! విశ్వాన్ని పరిపాలించే దేవీ, ప్రీతవగుము. జగత్తును రక్షించు. చరాచర ప్రపంచమంతటికి ఓ దేవీ! నీవు పరిపాలకురాలవు.

4. "అతిక్రమింప నలవికాని శౌర్యం గల ఓ దేవీ! భూమిరూపంలో ఉండే నీవే ఈ జగత్తుకు ఆధార భూతురాలవు. నీటి రూపంలో ఉండే నీ చేత ఈ సర్వమూ తృప్తి చెందుతుంది.

5. "విష్ణుదేవుని శక్తివైన నీ పరాక్రమానికి మేర లేదు. జగత్తుకు మూలమైన ఆది మాయవు నీవు. నీచేత ఈ సర్వమూ (విశ్వం) భ్రాంతి (అజ్ఞానం) పొందింది. ప్రీతి చెందితే లోకంలో మోక్షానికి నీవు కారణభూతురాల వగుతావు.

6. "దేవీ! విద్యలన్ని నీ వివిధ అంశలు, అలాగే లోకంలో స్త్రీలు అందరూ (నీ) వివిధకళలు (అంశలు) కలిగి ఉంటారు. తల్లీ! ఈ జగత్తునంతా నీవే నిండి ఉన్నావు. స్తుతింపదగిన సర్వవస్తువుల యొక్క పరాపరోక్తి (ముఖ్యోక్తి, గౌణోక్తి రెండూ) రూపవైన నిన్ను స్తుతించడం ఎలా?

7. సర్వభూతస్వరూపిణివైన దేవి (పరంజ్యోతి)గా, భోగమోక్ష ప్రదాయినిగా ప్రశంసిచబడుతున్న నిన్ను ఎంత శ్రేష్ఠమైనవి అయినా కూడా ఏ మాటలు వర్ణించగలవు?

8. సర్వజనుల హృదయాలలో బుద్ధిరూపంలో నిలిచి ఉంటూ, స్వర్గ సుఖాన్ని, మోక్షాన్ని ప్రసాదించే ఓ దేవీ! నారాయణీ! నీకు ప్రణామాలు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 37 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 11* 
*🌻 Hymn to Narayani - 1 🌻*

 The Rishi said:

1-2. When the great lord of asuras was slain there by the Devi, Indra and other devas led by Agni, with their object fulfilled and their cheerful faces illumining the quarters, praised her, Katyayani:

The devas said:

3. 'O Devi, you who remove the sufferings of your suppliants, be gracious. Be propitious, O Mother of the whole world. Be gracious, O Mother of the universe. Protect the universe. You are, O Devi, the ruler of all that is moving and unmoving.

4. 'You are the sole substratum of the world, because you subsist in the form of the earth. By you, who exist in the shape of water, all this (universe) is gratified, O Devi of inviolable valour!

5. 'You are the power of Vishnu, and have endless valour. You are the primeval maya, which is the source of the universe; by you all this (universe) has been thrown into an illusion. O Devi. If you become gracious, you become the cause of final emancipation in this world.

6. 'All lords are your aspects O Devi; so are all women in the world, endowed with various attributes. By you alone, the Mother, this world is filled. What praise can there be for you who are of the nature of primary and secondary expression regarding (objects) worthy of praise?

7. 'When you have been lauded as the embodiment of all beings, the Devi (the effulgent one), and bestower of the enjoyment and liberation, what words, however excellent, can praise you?

8. 'Salutation be to you, O Devi Narayani, O you who abide as intelligence in the hearts of all creatures, and bestow enjoyment and liberation.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 106 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -36 🌻*

అధవా వివేకం ఇంకా కొద్దిగా స్థాయికి పడిపోయింది, అప్పుడేమి చేయాలట? ‘అధమాధమంచ తీర్ధాటనం’ - ఒక కాశీనో, ఒక రామేశ్వరమో. ప్రతి సంవత్సరము మానవులందరూ ఒక సంవత్సర చక్రభ్రమణం పెట్టుకోండి. ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడికో ఒక చోటుకి, దేవాలయ దర్శనం, లేదా ఒక క్షేత్ర దర్శనం, ఆరామ దర్శనం. మీరు ఏదైనా పెట్టుకోండి. 

ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పనిగా పెట్టుకోండి. నిజానికి మహానుభావులను, మహనీయులను, మహర్షులను, సందర్శించుటం కొరకే ఈ తీర్ధాటనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న, రామకృష్ణ మిషనో, ఒక చిన్మయా మిషనో, ఒక బ్రహ్మకుమారీ ఆశ్రమమో ఇట్లాంటి ఆశ్రమాలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి కదా! ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. 

ఆయా ఆశ్రమ సందర్శనకు వెళ్ళి, అక్కడున్నటువంటి మహానుభావుల యొక్క పరిచర్య చేసి, వారికి సేవ చేసి, చతుర్విధ శుశ్రూషలను ఆశ్రయించి, వారికి ఆ సేవలను అందించి, వారు మనకు చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి బోధను గ్రహించి, కనుక మనము వచ్చామనుకోండి, అది కూడా తీర్ధాటనమే! కాని మనము ఏమి చేస్తున్నాము? చకాచకా రిజర్వేషన్స్‌ చేయించుకోవడం, చకచకా పరుగెత్తడం, చకచకా కొండపైకి వెళ్ళడం, చకచకా గుండుకొట్టించుకోవడం, చకచకా లడ్డూ తీసుకోవడం, చకచకా తిరిగి వచ్చేయడం. అంతా 24 గంటలలో అయిపోతుంది. 

కానీ, ఈ చకచకాలో ఎక్కడైనా స్థిరత్వం వచ్చిందా? మానసిక స్థిరత్వం కలిగిందా? స్థిరమైన బుద్ధి కలిగిందా? ప్రవృత్తి నుండి నివృత్తికి మారామా? నివృత్తి నుంచి మనమేమైనా ఎదిగామా? నిర్వాణ స్థితికి ఎదిగామా? ఆ దర్శన కాలంలో నువ్వు నిర్వాణ స్థితిలో ఉండేటటువంటి స్థితిలో ఉండాలి. అది దేవాలయ దర్శనమైనా కావచ్చు, సద్గురు దర్శనమైనా కావచ్చు. ఆ దర్శనం వల్ల నీకు నిర్వాణ స్థితి ప్రాప్తించాలి.
 
       అప్పుడు మాత్రమే నీతో ఆ దర్శనాన్ని తెచ్చుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఆ దర్శనం నీతో నిలబడి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీకు సూక్ష్మమైనటువంటి ప్రత్యగాత్మ స్థితిలో మెలకువ కలిగేటటువంటి అవకాశం వస్తుంది.

 ఇప్పుడు మనమందరము హృదయస్థానంలో నిద్రపోతున్నాము. అందువల్ల ఏమైంది? మనము బుద్ధిని అధిగమించి, మహతత్వాన్ని ఆశ్రయించి, ఆ మహతత్త్వం కంటే అవ్యక్తము, ఆ అవ్యక్తం కంటే పరుడైనటువంటి ప్రత్యగాత్మ స్థితికి ఎదగలేకపోతున్నాము. 

ఎప్పుడు పనిముట్ల దగ్గరే ఆగిపోతున్నాము. ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి మనస్సు వరకో, బుద్ధి వరకో వెళ్ళి ఆగిపోతుంది. కానీ, గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మహతత్త్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతున్నావు.

        కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసినటువంటి సాధన సాక్షీ సాధన. ఈ సాక్షి సాధన ఎవరైతే చేస్తారో, వాడు తత్వచింతనే చేయనీయండి, మంత్ర జపమే చేయనీయండి, శాస్త్ర చింతనే చేయనీయండి, తీర్ధాటనమే చేయనీయండి ఏ సాధనలు చేసినప్పటికీ కూడా నువ్వు దానిలో నుంచీ సాక్షిత్వాన్ని రాబట్టుకుంటావు. 

ఆ సర్వ సాక్షిత్వం దిశగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆ సాక్షిత్వ బలం చేత మాత్రమే, నువ్వు ఆ మహతత్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతావు. ‘అధిగచ్ఛతి’ - అధిగమించగలుగుతావు. 

సాక్షిత్వం లేకుండా మహతత్వాన్ని, అవ్యక్తాన్ని ఎవరూ దాటలేరు. ప్రత్యగాత్మ స్థితిని తెలుసుకొనలేరు. కాబట్టి, సర్వాంతర్యామి, అందరి, సమస్త జీవుల హృదయాలలో ‘హృద్దేశోర్జునతిష్ఠతి’ - పరమాత్మను అడిగాడు అర్జునుడు, నాయనా! నువ్వు ఎక్కడ ఉంటావు నిన్ను పట్టుకోవాలంటే? నాయనా! నువ్వు అక్కడా ఇక్కడా వెతకమాక!-

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 126 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
118

Dileepa realized that the lion had great powers. He knew it was not an ordinary lion because it could speak human language. He was surprised to hear it speak. We discussed that the king replied humbly, “Lion king, it is true that this is your territory. It is also true that this divine cow is your prey. But, this divine cow is under my protection. 

So, please let go of the cow and eat me instead. That will be just”. Saying so, he lowered his head to the lion. The cave glowed with divine light. Nandinidhenu looked very pleased . 

She said, King, this is all my creation. I am happy with your devotion and dedication. Ask me for whatever you want”. All that transpired was an illusion. That was the Guru principle at play. 

Dileepa prostrated to Nandinidhenu and asked to be blessed with children. Those who place their faith in Guru and walk in the path shown by the Guru will never face difficulties in life. They will always be happy. Dileepa obediently followed every word uttered by the Guru. He obtained what he desired. Next, they are initiating us into the mantra for meditating on the Guru. 

Sloka: 
Brahmanandam param sukhadam kevalam jnana murtim dwandwatitam gagana sadrsam tatvamasyadi laksyam | 
Ekam nityam vimalamacalam sarvadhi sakshi bhutam bhavatitam triguna rahitam sadgurum tam namami || 

Obeisance to Sadguru who is the source of bliss, giver of great comfort, form of pure knowledge, beyond all dualities, sky-like, the essence of Mahavakyas like Tatvamasi, the only one, unique, eternal, pure, steady, witness to all intellect, incomprehensible to intellect and who is beyond the three qualities of Sattva, Rajas and Tamas. Here, we come across “dwandwatitam” and “bhavatitam”.  

That means, he is beyond the dualities and the activities of the intellect and hence cannot be comprehended by them. This can only be realized through experience. That experience is gained through service to the Guru. Next, they are initiating us into another mantra for meditating on the Guru. 

Sloka: 
Anandamanandakaram prasannam jnana swarupam nija bodha yuktam | 
Yogindra midhyam bhavaroga vaidyam srimadgurum nityamaham namami ||

 Eternal obeisance to Sadguru who is the embodiment of bliss, the source of bliss who is ever gracious, embodiment of knowledge, self-realized, the best among yogis, praise-worthy and doctor of all diseases of samsara.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 20వ అధ్యాయము - 5 🌻*

ఆ భిక్షకుడే కనుక శ్రీమహారాజు అయితే తనకు తప్పకుండా వ్యాపారంలో, మంచి లాభాలు రావాలని అతను అనుకున్నాడు. అదే రోజున అతని దూదినింపిన బళ్ళు వార్ధాకు అమ్మకానికి తేబడ్డాయి. వాటికి మంచిధర వచ్చింది. అప్పడు యాదవ్ శ్రీగజానన్ మహారాజు తన దగ్గరకు ఆభిక్షకుని రూపంలో వచ్చినట్టు నమ్మాడు.. శ్రీమహారాజు తన భక్తులను సదా కాపాడుతారు. 

ఇప్పుడు కావర్ అనుభవం వినండి ...... భవ్ రాజారాం కావర్ ఖాంగాంలో వైద్యుడు, అతనికి తెల్టరా బదిలీ అయింది. తెల్టరాలో పనిలో చేరేముందు, అతను తన కుటుంబంతోపాటు షేగాం దర్శనానికి వచ్చాడు. షేగాంలో ఒక ఎడ్లబండిని తెల్లరా వెళ్ళేందుకు అద్దెకు తీసుకున్నాడు. అతను సాయంత్రం బయలుదేరబోతూ ఉంటే, రేపు ప్రసాదం తీసుకున్నాకా మీరు షేగాంనుండి వెళ్ళాలని నావినంతి. 

ఇంతకు ముందు ఎప్పుడూ మీరు షేగాంనుండి భోజనం చెయ్యకుండా వెళ్ళలేదు. మరి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? పైగా ఈరోజు వ్యాతిపతి, ప్రయాణానికి అశుభమయిన రోజు అని బాలాభవ్ అన్నాడు. కావర్ పాక్షికంగా అంగీకరించాడు. తనురాత్రి భోజనం చెయ్యగానే వెంటనే బయలుదేరతాను అన్నాడు. ఆప్రకారంగా కుటుంబంతో కలిసి బయలుదేరాడు. 

అ రోజు చిక్కటి చీకటి రాత్రి. ఆ చీకటి అంధకారంలో తెల్టరా దారితప్పి ఒకసన్నటి దారిన చుట్టూ అడవిలా ఎదురుగా పెద్ద సరస్సు ఎదురయింది. బండి ఆగింది. దారి అడుగుదామన్నా చుట్టుప్రక్కల ఎవరూ లేరు. మనం తప్పుదారిన ఉన్నాంఅని బండివాడు అన్నాడు. కావర్ ఆశ్చర్యపోయాడు. బండిదిగి అతను నిజంగానే తెల్టరా వెళ్ళవలసిన దారి తప్పడం చూసాడు. 

కావర్ ఈ తప్పుకు బండివాడిని దూషించాడు. దానికి, నన్ను ఎందుకు దూషిస్తున్నారు, నేను తరచు ప్రయాణికులను తెల్టరా తీసుకు వెళుతూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు నేను సరిఅయిన దారినే అనుసరించాను, ఎడ్లుకూడా ఎటూ తిరగకుండా తిన్నగా నడిచాయి. ఈ సరస్సు చూసిన తరయవాతనే అవి ఆగాయి, ఇది ఖచ్చితంగా తెల్టరా దారి కాదు అని బండివాడు అన్నాడు. 

అప్పడు కావర్ దీనికి కారణం అర్ధం చేసుకున్నాడు. బాలాభవ్ ప్రార్ధన లక్ష్యపెట్టకుండా, ప్రసాదం తీసుకోకుండా షేగాం వదిలి రావడంవల్ల ఈపని శ్రీమహారాజుదే అని అతను అనుకున్నాడు. చేతులు కట్టుకుని, ఆ అడవిలో తనను కాపాడవలసిందిగా శ్రీమహారాజును ప్రార్ధించాడు. వెంటనే ఎడ్ల గంటలమోత వినిపించింది. అది అతని ధైర్యం తిరిగి పుంజుకునేలా చేసింది. బండి వాడిని ఆ శబ్దంవస్తున్న దిశలో నడవమని సూచిస్తాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 111 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 20 - part 5 🌻*

Before joining his duty at Telhara, he, along with his family, came to Shegaon for Maharaj’s Darshan. At Shegaon he hired one bullock cart for going to Telhara, and when he was about to start in the evening, Balabhau said to him, It is my request that you should leave Shegaon only after taking prasad tomorrow. 

Before this, you never went from here without taking any food. Why are you behaving like this today? Moreover today is 'Vyatipat', an inauspicious day for travel. Kavar agreed partially. He said that he would start immediately after taking meals at night. 

Accordingly he left with his family after eating dinner. It was a pitch dark night. It so happened that, in the darkness, he missed the road to Telhara and strayed on a narrow path with jungle all around and a big lake in front. The cart stopped. There was nobody nearabout from whom they could enquire their location. 

The cartman said that they were on the wrong path. Kavar was surprised. He got down and saw that they had really missed the road to Telhara. Kavar abused the cartman for his mistake. Thereupon the cart man said, Why are you abusing me? I frequently take the passengers to Telhara and, as far as I think, I followed the right path, the bullocks too walked straight without turning anywhere. 

They stopped only when they saw this lake. This is surely is not the road to Telhara. Then Kavar understood the reason of all that was happening. He thought it to be the act of Shri Gajanan Maharaj , as he had left Shegaon without taking prasad in the morning and, that too, by ignoring the request of Balabhau. With folded hands he implored Shri Gajanan Maharaj to protect him in that forest. 

Immediately thereafter he heard the ringing of bells of bullocks. That made him regains his courage; he asked the cartman to drive towards the direction of that sound. The cartman did accordingly and reached a big road. On enquiring there, it was learnt that they were still within the field boundaries of Shegaon.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నాగుల చవితి 🌹*

*🙏 🐍 నాగేంద్ర ఆదిశేష నమోస్తుతే*
*నమస్తే దేవదేవేశ*
*నమస్తే ధరణీధర*
 *నమస్తే సర్వ నాగేంద్ర*
  *ఆదిశేష నమోస్తుతే*

🙏 🐍 మనము ప్రకృతిని ఆరాధిస్తుంటాము కదా. దానికి నిదర్శనమే ఈ నాగుల చవితి. ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తిక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.

🙏🐍 నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లు, ఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు. నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు. ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు. నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.

🙏🐍 నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి.

🙏🐍 పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .

*🙏🐍 నడుము తొక్కితే నావాడనుకో*
         *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో*
          *తోక తొక్కితే తోటి వాడు అనుకో*
          *నా కంట నువ్వుపడకు* 
*నీకంట నేను పడకుండా చూడు తండ్రీ*
అని చెప్పాలి.

🙏🐍 ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటమే ముఖ్యమైన వుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని చెప్పడమే ఇలాంటివి నేర్పడంలో ఉద్దేశము. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తరువాత. బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారాన్ని పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును మన చెవులకు పెట్టుకుంటాం. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవారు ఉపవాసం వుంటారు.

🙏🐍 ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి "నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

🙏🐍 మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 52 / Sri Lalitha Sahasra Nama Stotram - 52 🌹*
*ప్రసాద్ భరద్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 94, 95 / Sri Lalitha Chaitanya Vijnanam - 94, 95 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖*

 *🌻 94. కౌళినీ 🌻*

శివశక్తి సామరస్యమే కౌళము. అట్టి కౌళము గలది శ్రీదేవియని ఈ నామము తెలుపుచున్నది. 

కుళ మనగా శక్తి యని, అకుళము అనగా శివుడని, కూళాకుళ సంబంధమే కౌళమని తంత్రశాస్త్రము తెలుపుచున్నది. అమ్మ శివశక్తియే. శివుని వ్యక్తరూపమే అమ్మ. దైవము సాక్షాత్కరింపవలె నన్నచో రూపమును ధరించవలెను. కనపడుట కిదియే మార్గము. రూపము స్థూలమైనను, సూక్ష్మమైనను, సూక్ష్మకరమైనను, సూక్ష్మతమమైనను అమ్మయే. అమ్మలేక, దేవుడు కనపడడు. కేనోపనిషత్తు ఈ రహస్యమునే బోధించు చున్నది.

శివుడు లేక పరదైవము లేక పరబ్రహ్మము అవికారము,
అలక్షణము, అప్రతర్క్యము, అవిశ్లేయము, అనూహ్యము, అతీతము, అపరిమితము, అగోచరము. అట్టి తత్త్వము వ్యక్తమగుటయే వెలుగు. ఆ వెలుగే అమ్మ. 

వెలిగినచో కనపడును. వెలుగక ముందు కనపడదు.
కనపడనిది కనిపించుటయే అమ్మ ఆవిర్భావము. వెలుగుటకు కారణము వెలుగున కాధారముగ నున్న తత్త్వము. విద్యుత్తు కనపడదు కాని దాని వెలుగు కనపడుచున్నది కదా! దాని శక్తి తెలియుచున్నది కదా! అట్లు పరతత్త్వము యొక్క వెలుగు, శక్తి అమ్మగ ప్రకటిత మగుచున్నది. విద్యుత్తు లేనిదే వెలుగు లేదు. అట్లే శివుడు లేనిదే శక్తి లేదు.

వెలుగునందు, శక్తినందు విద్యుత్తు వున్నది కదా! అట్లే అమ్మ యందు అయ్య వున్నాడు. అమ్మ కనపడితే అయ్య అనుగ్రహించినట్లే. అయ్య రూపమే అమ్మ. శివరూపమే శివా. పై కారణముగనే పంచాక్షరీ మంత్రము అమ్మ నుద్దేశించి ఈయబడినదని తెలియవలెను. 'ఓం నమః శివాయ'. 'శివా' శబ్దము అమ్మ నుద్దేశించినది. 

శివుడు కనపడుట యనగా శివారూప సాక్షాత్కారమే. ఇది వారి సామరస్యము. ఆకుళుడైన శివుడు కుళయైన అమ్మ కలిసి కౌళముగ సృష్టి జరుగుచున్నది. జరిపించునది 'కౌళినీ' యగు అమ్మ. శివ సహకారముతో, శివ సంకల్పముగ శివశక్తియై నిలచి జీవుల ననుగ్రహించుచున్న తల్లియే జగన్మాత శ్రీదేవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 94 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Kaulinī कौलिनी (94) 🌻*

She is the core of kaula worship. Kaula worship is a tantric worship under śākta method (methods of worshipping Śaktī is called śākta worship). Since She is the centre of this worship She is called kaulīnī.  

As She is worshiped everywhere (omnipresence), She is called as kaulīnī (as per triad – worshipper, worshipped and worship). Tantra śāstra define Śaktī as kulā and Śiva as akula. The union of Śiva and Śaktī is called as kaula and She is called kuṇḍalinī.  

This union takes place in sahasrāra. There is a reference in some tantra texts to one more thousand petal lotus, just below the thousand petal lotus, is the sahasrāra. In the centre of the second sahasrāra, Kula Devi is worshiped and in the petals kula Śaktīs are worshiped. 

 Kaulīni also means this kula Devi, the goddess of one’s lineage. One of the Vāc-Devi-s, the authors of this Sahasranāma is known as Kaulīnī. The external worship of cakra-s, possibly meaning that Śrī Cakra is also called kaulīnī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 95 / Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖*

*🌻 95. 'కులయోగినీ 🌻*

హృదయాకాశమున శ్రీదేవి పాదపద్మములతో అనుసంధానము చెంది పూజాదులను చేయుట కుళమని, అట్టి విధానమున యోగము చెందుట కుళయోగమని, దాని ననుగ్రహించినది శ్రీదేవి యని అర్థము. అమ్మ చైతన్య స్వరూపిణి. 

మనయందు కూడ సుషుమ్న మార్గమున నిలచియున్న చైతన్యము శ్రీదేవియై ఆమె సాన్నిధ్యమును పొందుటయే యోగము. అట్టి యోగము నిర్వర్తించుకొనుటకు అమ్మ రూపమును గాని, శ్రీచక్రమునుగాని హృదయాకాశమున దర్శించి ఆరాధించుట కౌళమార్గము. 

బాహ్య పూజలకు ముందుగాని తరువాత గాని ఈ విధముగ హృత్ పద్మమున అమ్మ ఆసీనురాలై యున్నట్లు భావించి అంతరంగమున ధ్యానించవలెను, అచటనే పూజింపవలెను.

ఆకాశము పంచభూతములలో అత్యంత పవిత్రము. అది వెలుగుతో కూడినది. అట్టి ఆకాశమును దర్శించి అందు శ్రీదేవి రూపమునుగాని, శ్రీచక్రమునుగాని భావన చేత రూపొందించి, స్థాపించి పూజింపవలెను. 

అందులకే సహస్ర నామ పారాయణము ముందు ధ్యానశ్లోక మీయబడినది. అందు అమ్మరూపము వర్ణింపబడినది. "అరుణాం కరుణా తరంగితాక్షీం.....” అను ధ్యానశ్లోకము అమ్మ రూపమును ఆవిష్కరించగలదు.

ఆమె మనోహర యగుటచే అంతరంగమున మనసు హరింపబడి, బుద్ధిలోకమున ధ్యానము, పారాయణము నిలువగలదు. పై విధమైన అంతరంగ ఆరాధనమున హృదయపద్మము ద్వారా సుషుమ్నను చేరవచ్చు లేదా మన చుట్టును గల నీలాకాశమున శ్రీచక్రమును గాని, అమ్మ రూపమును గాని మానసికముగ, రూపొందించుకొని ధ్యానించుట, పూజించుట చేయవచ్చును. ఇది బాహ్యారాధనము.

కుళయోగము కులమధ్యమున నిర్వర్తించుకొనుట భగవద్గీత యందు బోధించియున్నారు. హృదయ పద్మమున నిర్వర్తించుట ఉపనిషత్తులందు తెలుపబడినది. మూలాధారమున నిర్వర్తించుట సద్గురు సాన్నిధ్యమున మాత్రమే వీలగునని పెద్దల అభిప్రాయము. 

సహస్రారము దిగువ నుండి మూలాధార కేంద్రము వరకు గల షట్చక్రములను కలుపు సుషుమ్న నాళము అంతయూ కుళమే. జీవ లక్షణమును బట్టి, గురూపదేశమును, నిర్దేశమును బట్టి ఈ నాళమున ఏ కేంద్రము ద్వారా నైనను యోగింపవచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 95 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Kulayoginī कुलयोगिनी (95) 🌻*

Kaulā means mental worship. Here it means offering mental worship to Her in the six cakra-s. Mental worship can be performed only through yoga.  

Kula means mūlādhārā cakra and akula means sahasrāra. The link between these can be established only by yogic methods. That is why she is called as Kulayoginī.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 464 / Bhagavad-Gita - 464 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 04 🌴*

04. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు ||

🌷. తాత్పర్యం : 
ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మించబడిన విధానము, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనెడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేపవర్ణనను ఆలకింపుము.

🌷. భాష్యము :
కర్మక్షేత్రము మరియు కర్మక్షేత్రపు జ్ఞాతయైన క్షేత్రజ్ఞుని సహజస్థితిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. 

ఏ విధముగా ఈ దేహము నిర్మింపబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, ఎవని నియామకమున ఇది పనిచేయుచున్నది, దీనియందలి మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఆ మార్పులు ఎచ్చట నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణము మరియు హేతువులేవి, ఆత్మ యొక్క చరమగమ్యమేది, ఆత్మ యొక్క నిజరూపమేది యనెడి విషయములను ప్రతియొక్కరు తెలిసికొనవలసియున్నది. 

అంతియే గాక జీవాత్మకును పరమాత్మకును నడుమగల భేదము, వారి ప్రభావములు, సామర్థ్యములు కూడ మనుజుడు ఎరిగియుండవలెను. అందులకు శ్రీకృష్ణభగవానుడు ప్రత్యక్షముగా ఉపదేశించిన ఈ భగవద్గీతను అవగతము చేసికొనిన చాలును. అంతట సర్వము సుస్పష్టము కాగలదు. 

కాని ఎల్లదేహముల యందున్న భగవానుడు జీవాత్మతో సమానుడని ఎవ్వరును భావింపరాదు. అట్టి భావనము శక్తిమంతుడైనవానిని శక్తిహీనునితో సమానము చేయుటయే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 464 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 04 🌴*

04. tat kṣetraṁ yac ca yādṛk ca
yad-vikāri yataś ca yat
sa ca yo yat-prabhāvaś ca
tat samāsena me śṛṇu

🌷 Translation : 
Now please hear My brief description of this field of activity and how it is constituted, what its changes are, whence it is produced, who that knower of the field of activities is, and what his influences are.

🌹 Purport :
The Lord is describing the field of activities and the knower of the field of activities in their constitutional positions. 

One has to know how this body is constituted, the materials of which this body is made, under whose control this body is working, how the changes are taking place, wherefrom the changes are coming, what the causes are, what the reasons are, what the ultimate goal of the individual soul is, and what the actual form of the individual soul is. 

One should also know the distinction between the individual living soul and the Supersoul, their different influences, their potentials, etc. 

One just has to understand this Bhagavad-gītā directly from the description given by the Supreme Personality of Godhead, and all this will be clarified. 

But one should be careful not to consider the Supreme Personality of Godhead in every body to be one with the individual soul, the jīva. This is something like equating the potent and the impotent.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
Join and Share in 🌹. Indaichat 🌹
https://wn78r.app.goo.gl/gv65S
Follow my Blogs
http://dailybhakthimessages.blogspot.com/
https://incarnation14.wordpress.com/ 
🌹 Vedas And Puranas 🌹
https://chat.whatsapp.com/HPdh0EYd5vdC3l6o0sQwZr
*🌹. గాయత్రి శక్తి Gayatri Mata 🌹*
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 78 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 16. కర్తవ్యము - సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును. కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 19 📚*

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || 19

కర్మ నిర్వహణమునందు వ్యక్తిగతమైన సంకల్పము, కోరిక యుండుట సామాన్యము. తననుండి ఆరంభము కాకయే తన వరకు కొన్ని కర్తవ్య కర్మలు వచ్చుచుండును. అవికాక తనవైన కోరికలు కొన్ని యుండును. పండితుడు అనగా తెలిసిన వాడని యర్థము. 

తెలిసినవాడు అనగా జ్ఞాని. అతనికి కోరికలుండవు. వ్యక్తిగతములైన సంకల్పము లుండవు. రెండునూ లేక ఆచరణయే యుండును. ఇట్టివారినే పెద్దలు పండితులుగా గుర్తింతురు. రజోగుణ ప్రేరితునకు, తమోగుణ ప్రేరితునకు కోరికలు మెండుగ నుండును. తదనుగుణముగ సంకల్పములు వచ్చు చుండును. సత్వగుణమున నిలచిన వానికే సంకల్పములు యుండవు, కోరికలు యుండవు. కర్తవ్యములు మాత్రమే యుండును. 

కర్తవ్యము మాత్రమే నిర్వర్తించువానికి, కర్మ దగ్ధమగు చుండును. కోరికలున్నచోట ఫలాసక్తి యుండును. కర్మ ఫలానుభూతి మరల కర్మను కలిగించును. అవి సంకల్ప రూపమున జీవుని ప్రేరేపించును. సంకల్ప ప్రేరితుడై ఫలాసక్తితో మరల జీవుడు పనిచేయును.
 
ఇట్లు కోరికనుండి ఫలాసక్తి కారణముగా కర్మ పుట్టును. కర్మ కారణముగా కర్మఫలము కలుగును. కర్మఫలము నుండి నూతన సంకల్పము పుట్టును. జీవిత మంతయు “ఇది కావలెను, యిది వద్దు" అనుకొనుచు ఎడతెరపి లేక జీవించుట యుండును. అపుడు కర్మయందు చిక్కుపడును.

కర్మమంటక, అందు చిక్కుపడక, కర్మను నిర్వర్తించుటకు ఉపాయమే శ్లోకమున తెలుపబడినది. ఈ సుళువు తెలియుటకే శ్రీరాముని జీవితము, శ్రీకృష్ణుని జీవితము పఠించి, అవగాహన చేసుకొనవలెను. అందులకే రామాయణ, భారత, భాగవతములు. 

ఉదాహరణకు శ్రీరాముని జీవితమును పరిశీలింపుడు. అతడు తన కోరిక కారణముగ పుట్టలేదు. దశరథుని ప్రార్థనకు ప్రతిస్పందించి, జన్మించినాడు. వశిష్ఠుని వద్ద తండ్రి ఆజ్ఞగ విద్య నేర్చినాడు. విశ్వామిత్రునితో తండ్రి ఆజ్ఞగనే చనినాడు. తాటక సంహారము విశ్వామిత్రుని యాజ్ఞ. మిథిలానగర ప్రవేశము కూడ మహర్షి ఆదేశమే. విల్లు నెక్కు పెట్టుట మహర్షి ఆదేశము. సీతా పరిణయము జనకుని ప్రార్థన. పట్టాభిషేకము తండ్రి సంకల్పము. 

వనవాసము ప్రత్యక్షముగా సవతి తల్లి ఆజ్ఞ. పరోక్షముగా తండ్రిమాట. దండకవన ప్రవేశము ఋషుల కోరిక. ఖరదూషణ సంహారము రాక్షసుల ప్రేరణ. సుగ్రీవుని స్నేహము కబంధుని సూచన. రాక్షస సంహారము ఋషుల సూచన. సీతా లక్ష్మణులను రక్షించుకొనుట కర్తవ్యము. భరతుని అనుగ్రహించుట కర్తవ్యము. పట్టాభిషేకము భరతుని కోరిక. 

ఇట్లు జీవితమంతయు కర్తవ్యపరముగనే సాగినది గాని వ్యక్తిగతమగు కోరిక ఒక్కటియునూ లేదు. బంగారు లేడిని గూడ సీత కోరినదే గాని, తనది కాదు. జ్ఞానులెట్లు నడువవలెనో రాముని జీవితము సూటిగ తెలియజెప్పును. అట్టివారికి ఉన్న కర్మ దగ్ధమగును. కొత్త కర్మ పుట్టదు. 

దీనికి వలసిన సూత్రము కర్తవ్యాచరణము. అందు వ్యక్తిగతమగు కోరిక, సంకల్పము లేకుండుట. ఇట్లు జీవించుట అసామాన్యము. అట్లు జీవించి, యితరులకు మార్గదర్శకులై నిలచువారు ఆచార్యులు లేక సద్గురువులు లేక జ్ఞానులు. వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 275 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
65. అధ్యాయము - 20

*🌻. సతి కైలాసమునకు పయనమగుట - 2 🌻*

నీరేతస్సు నాల్గు బిందువులు భూమిపై పడినవి గాన, ఆకాశమునందు ప్రలయమును సృష్టించగల నాల్గు మేఘములు పుట్టును (22). వెంటనే అచట దేవతలు, ఋషులు చూచు చుండగా ఆ రేతస్సు నుండి నాల్గు మేఘములు పుట్టినవి (23). 

వత్సా! సంవర్తకము, ఆవర్తము, పుష్పకము, ద్రోణము అనే ఈ నాల్గు మహామేఘములు ప్రలయమును కలిగించును (24). ఓ మహర్షీ! అమంగళ గర్జనను చేయు ఆ మేఘములు అపుడు శివుని ఇచ్ఛచే కొద్ది జలమును వర్షించుచూ, గర్జించుచూ ఆకాశమునందు విస్తరించినవి (25).

ఆకాశమంతయూ పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను. అపుడు దాక్షాయణీ దేవి, మరియు శంకరుడు శాసింసగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను (26). అపుడు నేను తొలగిన భయము కలవాడనైతిని. ఓ మహర్షీ! నేను శంకరుని ఆజ్ఞచే అపుడు మిగిలిన వివాహకర్మను పూర్తి చేయించితిని (27). 

సతీశివుల శిరస్సుపై, మరియు సర్వత్రా దేవగణములచే విడువ బడిన పుష్పవృష్టి కురిసెను. ఓ మహర్షీ! దేవతలందరు ఆనందించిరి (28). వారు వాద్యములను వాయించుచూ, పాటలను పాడిరి. భక్తితో కూడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు వేదములను పఠించిరి (29).

ఓ నారదా! రంభాద్యప్సరసలు శ్రద్ధతో నాట్యము చేయుచుండగా దేవతల భార్యలు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి (30). అపుడు యజ్ఞాది కర్మలకు ప్రభువగు పరమేశ్వరుడు ప్రసన్నుడై, లోకపు పోకడను ఆశ్రయించి ప్రీతితో అంజలి ఒగ్గి నాతో నిట్లనెను (31).

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! వివాహకర్మను అంతనూ ఆచార్యుడవగు నీవు చక్కగా నిర్వహించితివి. నేను ప్రసన్నుడనైతిని. నేను నీకు ఏ దక్షిణను ఈయవలెను? (32). నీవు దేవతలలో జ్యేష్ఠుడవు. దక్షిణను కోరుకొనుము. మహాత్మా! వెంటనే చెప్పుము. మిక్కిలి దుర్లభమైమ దక్షిణనైననూ ఈయగలను. నేను ఈయలేనిది లేనే లేదు (33).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శంకరుని ఈ మాటలను విని, నేను దోసిలి యొగ్గి, అనేక పర్యాయములు ఈశునకు ప్రణమిల్లి, వినయముతో కూడిన మనస్సు గలవాడనై ఇట్లు పలికితిని (34). ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో, నేను వరమునకు అర్హుడనైన చో, ఓ మహేశ్వరా! నేను చెప్ప బోవు కార్యమును నీవు ప్రీతితో చేయుము (35). 

మహేశ్వరా! నీవు ఇదే రూపముతో ఈ వేది యందు ఇక్కడ సర్వదా ఉన్నవాడవై మానవుల పాపములను పోగొట్టి పవిత్రులను చేయుము (36). ఓ చంద్రశేఖరా! నేను ఈ వేదికకు దగ్గరలో నా ఆశ్రమమును నిర్మించుకొని నేను చేసిన ఈ పాపమును నివారించు కొనుటకై తపస్సు చేసెదను (37).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 32 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
🌻KILL OUT AMBITION - 11 🌻

141. That which is described here is a still higher stage than that of the man of whom we are now thinking. We have been considering only the beginning of that Path which leads to this full realization of the Self. But the motive which is given here applies to him; he has realized the emptiness of the non-self, and is in a position to respond to the appeal of the one Self. 

He is prepared to work with the motive of benefit to the world. Such a man may now think of trying to gain spiritual knowledge not in order that he himself may thereby become wise and great, but because it will help the world; he is gradually making that his object – something outside his own individual self.

142. Finally he will drop that motive of lofty desire also, and only wish that he may be an organ of the higher, and may do that which Ishvara wishes. 

Then he will learn that he is not even to desire spiritual knowledge, nor even to become a Master, but simply to become an instrument for the higher Life. Thus being active as they who are ambitious, but with the motive of being a channel for the higher Life, the man will get rid of the last vestiges of ambition. His energy is now merged in the Will of the Logos; that becomes the motive for his working.

143. In the verses of the Gita quoted above Shri Krishna explains how a. man should work in order to reach the Supreme, to realize the presence and power of the Divine. Then He goes on to show that such attainment and realization lead to fuller activity than any ever known before. He explains that it is the active work of Ishvara that sustains everything:

144. There is nothing in the three worlds, O Partha, that should be done by Me, nor anything unattained that might be attained; yet I mingle in action.

145. For if I mingled not ever in action unwearied, men all around would follow My path, O son of Pritha.

146. These worlds would fall into ruin, if I did not perform action.

147. He works for the welfare of the world, for the turning of the wheel of the universe, and the sole motive of His activity is that the world may grow and develop till the cycle is completed.

148. Shri Krishna then goes on to show the reasons for which a man should work – for the benefit and maintenance of the world and of mankind. No longer identifying himself with the separated forms, he has to identify himself with the one Life which is carrying on separated lives in order to bring them to perfection. 

Thus identifying himself with the one Life he should work entirely for the welfare and maintenance of his fellows and of the whole world – that everything moving and unmoving may reach its appointed end, may become that which is in the thought of Ishvara, although in manifested life they have not reached that point. 

The whole universe of Ishvara exists perfect in His thought, and gradually in many stages He works that thought out in matter. Those who realize this as part of His life must work as He works for the complete manifestation of that thought, that is, in order to turn the wheel of life till the turning is complete.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 163 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జాబాలిమహర్షి - 3 🌻*

19. పిప్పలాదమహర్షి, బ్రహ్మజ్ఞానీయిన జాబాలిని పరతత్వరహస్యాన్ని బోధించమని అడిగినప్పుడు ఆయనతో జాబాలి ఇలా చెప్పెను:

పిప్పలాదుడు: నీవు ఎవరివలన తెలుసుకున్నావు?
    
జాబాలి: సుబ్రహ్మణ్యస్వామి వలన తెలుసుకున్నాను.
    పిప్పలాదుడు: సుబ్రహ్మణ్యస్వామి ఎవరివలన తెలుసుకున్నాడు?
    
జాబాలి: ఈశ్వరుడు సర్వేశ్వరుడు అయిన ఈశానుడివలన తెలుసు కున్నాడు.
    
పిప్పలాదుడు: ఈశానుడి వలన ఏ విధంగా తెలుసుకున్నాడు?
    
జాబాలి: ఈశానోపాసనమువలన తెలుసుకున్నాడు.
    పిప్పలాదుడు: భగవన్! దయతో నాకు ఆ విషయాన్నంతా చెప్పు. అంటే నీకు ఎవరు చెప్పారో అదొక్కటే కాదు. వాళ్ళకు ఎవరు చెప్పారో అతడిగురించి కూడా చెప్పు. ఈశానుడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎలా ఆరాధించాడో చెప్పు.
    
జాబాలి: అట్లాగే! నీవడిగిన సకల విషయాలూ నివేదిస్తాను. పశుపతి అయిన ఈశ్వరుడు అహంకారముచేత వ్యాపించబడి ఉన్నాప్పుడు, అతడిని సంసారియైన జీవుడంటారు. ఈ జీవుడే పశువు. ఈ జీవులకు అధిపతి కాబట్టి ఈశ్వరుడిని పశుపతి అని అంటారు. 

సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనబడేవి ఆయనయొక్క పంచకృత్యములనబడతవి. ఆ సర్వేశ్వరుడియందే అవి అన్నీ ఉన్నవి. అతడే సృష్టికర్త, లయకర్త. సర్వేశ్వరుడయిన ఆ ఈశ్వరుడినే పశుపతి అంటారు. జీవులందరికీ, అతడితో పోల్చినపుడు, పశువులనే నామం సార్థకమవుతుంది.
    
పిప్పలాదుడు: జీవులు పశువులెల్లా అవుతాయి. వానికి ఈశ్వరుడు పతి ఎట్లా అవుతాడు?
    
జాబాలి: గడ్డి తింటూ వివేకం లేక ఇతరుల చేత పనికి ప్రేరేపింపబడి అనేకమయిన కష్టాలను సహిస్తూ యజమాని చేతుల్లో పశువులు కట్టబడి (పాశబద్దులై) ఉండటంచేత పశువులనబడతవి. జీవులు సర్వేశ్వరుని మాయాజాలంచేత అట్లా ఉన్నవి. 

ఆ పశువుల యజమానివలె సర్వజ్ఞుడైన ఈశ్వరుడున్నాడు. జీవులకు ఆయనే పతి. పాబట్టే ఆయనను పశుపతి అంటారు. ఈ జీవులు పశువులనబడతవి.
    
పిప్పలాదుడు: విభూతి ఎట్లా ధరించాలి? అన్నీ వివరంగా తెలుపండి.
    
జాబాలి: ‘సద్యోజాతాది’ పంచబ్రహ్మ మంత్రములచేత భస్మమును గ్రహించి ‘అగినిరితి భస్మ’ అనే మంత్రం చేత భస్మమును అభిమంత్రించాలి. ‘మానస్తోకే తనయే’ అనే మంత్రంలో అందులో జలాన్ని కలపాలి. 

తరవాత శిరస్సు, లలాటము, వక్షము, భుజములు వీటియందు ‘త్య్రాయుషం జమదగ్నేః’ ‘త్య్రంబకం యజామహే’ అనే మంత్రములచేత అడ్డంగా మూడురేఖలు వచ్చేటట్లు విభూతి ధరించాలి. దీనిని శాంభవవ్రతము అని అంటారు. 

(శైవులందరూ కూడా జబాల్యుపనిషన్మార్గమును అనుసరిస్తారు. నిత్యమూ ఆయన చెప్పినట్లే చేస్తారు. వివిధ రుద్రాక్షధారణ అంతా కూడా అలాగే జరుగుతుంది. జాబాలి శైవ మతంలో ప్రమాణం.)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 117 / The Siva-Gita - 117 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 15
*🌻. భక్తి యోగము - 6 🌻*

త్రేతాగ్నే స్ప్మార్తన హ్నేర్వా - శైవాగ్నే ర్వా సమాహితమ్,
భస్మాభి మంత్ర్య యో మాంతు - ప్రణ వేన ప్రపూజయేత్ 26
తస్మాత్పర తరో భక్తో - మనులోకే న విద్యతే,
శాలాగ్నే ర్దావ వహ్నేర్వా - భస్మానీ యాభి మంత్రితమ్ 27
యో విలిం పతి గాత్రాణి- సశూద్రోపి విముచ్యతే,
కుశపు ష్పైర్బిల్వదళై: - పుష్పైర్వా గిరి సంభవై: 28
యోమామర్చయతే నిత్యం - ప్రణ వేన ప్రియోహి సః,
పుష్పం ఫలం సమూలం వా -పత్రం సలీల మేవవా 29
యోదద్యా త్ప్రణ వైర్మహ్యం - తత్కోటి గునితం భవేత్,
అహింసా సత్య మస్తేయం - శౌచ మింద్రియ నిగ్రహ: 30

పాలు, నెయ్యి , తేనె, చెరుకు రసము ,మామిడి పండు రసము, టెంకాయ నీరు, గంధము, వీటిలో దేనితో నైనను రుద్ర మంత్రములతో నన్ను అభిషేకించిన వాని కంటెను మరొకడు నాకు ప్రియమైన వాడు లేడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 117 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 15
*🌻 Bhakthi Yoga - 6 🌻*

With the holy ash obtained from the sacrificial altar, one who worships me by uttering Pranava, there doesn't remain any second to such a devotee. Even a shudra gets liberated if he applies the holy ash obtained from the sacrificial house on his body. 

One who worships me with darbha grass, with Bilva leaves uttering Pranava he becomes my favorite one and his merits get multiplied by a factor of billion.

One who is serene, honest, truthful, loves all creatures, remains clean, is a conquerer of his senses, and studies the scriptures to attain knowledge; such a devotee becomes my loved devotee.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 227 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 76. From non-being to being, how is it known? By the knowledge 'I am'. Stay there in the 'I am', then you'll go back from being to non-being. 🌻*

The way in is the way out, from the unmanifest to the manifest, from absence to presence, from non-being to being. How is this so? It is the knowledge 'I am', which, when it spontaneously appears, makes this possible. 

So the 'I am' is the connection or gateway in, thus it must also be the means on disconnection or the gateway out. But, for this reversal to occur you have to be in the 'I am', the feeling of the wordless 'I am' must completely engulf you, only then will you be free from its clutches and enter non-being.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 102 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - 7 🌻*

425. అయిదు, ఆరు భూమికల యందున్న (మహాపురుషుడు ) మరియు (సత్పురుషుడు ) మాత్రమే ఇతరులను తమ స్థాయికి తీసికొని పోగలరు. అట్టివారి అనుగ్రహమును పొందినవారు గొప్ప ప్రయోజకులు.

426. సూక్ష్మ ప్రపంచము నుండి నిస్సంగమును పొందిన వాడు సాధుపురుషుడు (వలీ) అగును. 

427. దర్శనము అయిదు, ఆరు భూమికలకు సంబంధించినది. 

428. అయిదవ భూమిక యందున్న వలీ (మహాపురుషుడు), సాధకునికి, తన కరుణాదృష్టిని అతనిపై సారించి, తద్వారా తనస్థితిని వానికిచ్చును.

429. భూమికలలో నున్న గురువులకు ప్రత్యక్షముగా భౌతిక సంపర్కము కావలయును.

430. మానసిక భూమికలలో ఈ మనస్సే, ఈశ్వరుడుగను జ్ఞానాపూర్వకముగను ఉపయోగ పడుచున్నప్పుడు, ప్రాణశక్తి, పరోక్షముగను స్పృహ లేకను ఉపయోగ పడుచుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 66 / Sri Vishnu Sahasra Namavali - 66 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🌻 66. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |*
*విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ‖ 66 ‖ 🌻*

🍀 615) స్వక్ష: - 
చక్కని కన్నులు కలవాడు.

🍀 616) స్వంగ: - 
చక్కని అంగములు కలవాడు.

🍀 617) శతానంద: - 
అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.

🍀 618) నంది: - 
పరమానంద స్వరూపుడు.

🍀 619) జ్యోతిర్గణేశ్వర: - 
జ్యోతిర్గణములకు ప్రభువు.

🍀 620) విజితాత్మ - 
మనస్సును జయించువాడు.

🍀 621) విధేయాత్మా - 
సదా భక్తులకు విధేయుడు.

🍀 622) సత్కీర్తి: - 
సత్యమైన యశస్సు గలవాడు.

🍀 623) ఛిన్నసంశయ: - 
సంశయములు లేనివాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 66 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 2nd Padam*

*🌻 66. svakṣaḥ svaṅgaḥ śatānaṅdō naṅdirjyōtirgaṇeśvaraḥ |
vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṁśayaḥ || 66 || 🌻*

🌻 615. Svakṣaḥ: 
One who's Akshas (eyes) are handsome like lotus flowers.

🌻 616. Svaṅgaḥ: 
One whose limbs are beautiful.

🌻 617. Śatānandaḥ: 
One who is non-dual and is of the nature of supreme bliss.

🌻 618. Nandiḥ: 
One who is of the nature of supreme Bliss.

🌻 619. Jyōtir-gaṇeśvaraḥ: One who is the Lord of the stars, that is, Jyotirgana.

🌻 620. Vijitātmā:  
One who has conquered the Atma that is the mind.

🌻 621. Vidheyātmā: 
One whose form or nature cannot be determined as 'only this'.

🌻 622. Satkīrtiḥ: One whose fame is of the nature of truth.

🌻 623. Chinna-saṁśayaḥ: 
One who has no doubts, as everything is clear to him like a fruit in the palm.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment