భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 101


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 101 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మానసిక గోళము - మనోభువనము - 6 🌻

422. మానవుని ఆధ్యాత్మిక వికాశము:-

అనుభూతి ఐక్యము:-

మనోమయ భూమికలైన 5వ భూమిక యందున్న వారిపై ఉదయించును. ఇచ్చట ఆత్మ, సరాసరి భగవంతుని దివ్యత్వ ప్రసారముచే ప్రకాశింపబడుచున్నానని కనుగొనును. ఎఱుకతోగాని ఎరుకలేకగాని భౌతిక, సూక్ష్మగోళములలో నున్నవారికి ఇతోధికమైన సహాయము చేయుదురు.

423. అభావరుప అస్తిత్వము:-

మనోమయ ప్రపంచములో అనేకత్వమందు ఏకత్వస్థితి ప్రారంభమగును.

424. మనోమయ భూమిక ;-

(అస్తిత్వము గాని అస్తిత్వము) ఉనికి గాని ఉనికి భగవంతుని జ్ఞానావస్థానము నుండి దీని ఉనికి ఏర్పడుచున్నది. అంతర్జ్ఞానము యొక్క ప్రతిబింబము. దీనిలో సృష్టియొక్క వివరములన్నియు ఉండును ఇచ్చట భగవంతునికి-సృష్టికి గల సంబంధము ప్రియతముడు-ప్రేమికుడు సంబంధము వంటిది ఇది మానవుని సత్యస్థితి. ఈ దశలో భగవంతుని యందు గల భావము అనుభూతి ఐక్యమే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2020

No comments:

Post a Comment