శివగీత - 116 / The Siva-Gita - 116



🌹. శివగీత - 116 / The Siva-Gita - 116 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 15

🌻. భక్తి యోగము - 5 🌻


ప్రధమా రక్త వర్ణాస్యా -ద్ద్వితియా భాస్వ రామతా,

తృతీయా విద్యుదా భాసా - చతుర్ధి శుక్ల వర్ణ నీ 22


జాతంచ జాయ మానంచ - తదోం కారే ప్రతిష్టి తిమ్,

విశ్వం భూతం భువనం - విచిత్రం బహుదా తధా 23


జాతం చ జాయ మానం య - త్తత్ర్వం రుద్ర ఉచ్యతే,

తస్మిన్నేన పునః ప్రాణా- స్సర్వ మోంకార ఉచ్చతే. 24


ప్రవి లీనం తదోం కారే - పరం బ్రహ్మ సనాతనమ్,

తస్మాదోం కార జాపీయ - స్సముక్తో నాత్ర సంశయః 25


మాత్రల రంగులిలా ఉండునని యాదేశించు చున్నాడు. అందు ప్రధమ మాత్ర రంగు ఎరుపు గాను, రెండవ మాత్ర రంగు భాస్వర వర్ణము గాను, మూడవ మాత్ర రంగు ఎరుపు కాంతిగాను, నాలుగవ మాత్ర రంగు మక్ల రంగు గాను ఉండును.

అనేక విధముల చిత్రమగు నట్టియు పుట్టినదియు, పుట్ట బోవునదియు నగు ప్రపంచము ఓంకారము నందు ప్రతిష్టించ బడెను.

పుట్టినది పుట్టబోవునది యు నగునీ సమస్తమును రుద్రుడే. ఆయన లోనే ఈ ప్రాణము లున్నవి. సమస్తము రుద్రాభిన్నమగు నోంకారమే యని నిరూపించబడి యున్నది .

దీనివలన నోం కార శివుల కభేదము గనే చెప్పబడినది. ఈ ఓంకారమున సనాతనమగు బ్రహ్మము లీనమై యుండుట వలన ప్రణవమును జపించువాడు ముక్తి నొందుటలో సందేహము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 116 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 15

🌻 Bhakthi Yoga - 5 🌻

The first note Akara remains of red color, second note Ukara of golden color, the third one of lightening hue, fourth one of white color.

This entire creation with the past, present and future universes is established in the Omkara. That which is born, which is yet to be born everything is Rudra alone.

All the pranas reside in him. Scriptures voice the fact that everything is nondual from Rudra who is the Omkara.

That's why Omkara and Shiva are nondifferent.

Because the eternal brahman is established in this Omkara, those who chants Omkara would get liberated for sure beyond any doubts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2020

No comments:

Post a Comment