17-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 112, 113 / Vishnu Sahasranama Contemplation - 112, 113🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36 / Sri Devi Mahatyam - Durga Saptasati - 36🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 105🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 124 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 111 / Gajanan Maharaj Life History - 111 🌹
7) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 51 🌹* 
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 92  / Sri Lalita Chaitanya Vijnanam - 92🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 77 📚
11) 🌹. శివ మహా పురాణము - 275🌹
12) 🌹 Light On The Path - 31🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 162 🌹
14) 🌹. శివగీత - 116 / The Siva-Gita - 116🌹* 
15) 🌹 Seeds Of Consciousness - 225🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 101 🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 65 / Sri Vishnu Sahasranama - 65 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 18 🌴*

18. అహంకార బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా: |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోభ్యసూయకా: ||


🌷. తాత్పర్యం : 
మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురస్వభావులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడైన నా యెడ అసూయగలవారై నిజమైన ధర్మమును దూషింతురు.

🌷. భాష్యము :
భగవానుని దేవదేవత్వమును ఎల్లప్పుడు వ్యతిరేకించుటచే ఆసురస్వభావుడు శాస్త్రములను నమ్మ ఇచ్ఛగింపడు. శాస్త్రము నెడ మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అతడు అసూయను కలిగియుండును. అట్టి భ్రాంతికి అతని నామమాట గౌరవము, ధనము, బలములే కారణము. వర్తమాన జన్మము భవిష్యజ్జన్మకు మూలమని తెలియనందునే ఆసురస్వభావుడు తన యెడ, ఇతరుల యెడ అసూయను కలిగియుండును. 

తత్కారణముగా అతడు ఇతరులయెడ మరియు తనయెడ హింస నొనరించును. జ్ఞానరహితుడైనందున అట్టివాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమ నియామకత్వమును లెక్కచేయడు. శాస్త్రము మరియు భగవానుని యెడ అసూయగలవాడైనందున భగవానుని అస్తిత్వమునకు విరుద్ధముగా అతడు మిథ్యావాదము చేయుచు శాస్త్రప్రమాణమును త్రోసిపుచ్చును. ప్రతికార్యమునందు తనను స్వతంత్రునిగా మరియు శక్తిగలవానిగా అతడు భావించును. 

బలము, శక్తి లేదా ధనమునందు తనతో సమానులు ఎవ్వరును లేనందున తాను తోచిన రీతిలో వర్తింపవచ్చుననియు, తననెవ్వరును అడ్డగింపలేరనియు అతడు తలచును. అట్టి అసురస్వభావుడు తన భోగకర్మలను అడ్డగించు శత్రువున్నాడని తెలిసినచో అతనిని తన శక్తినుపయోగించి నశింపజేయుటకు ప్రణాళికలు రూపొందించును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 551 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 18 🌴*

18. ahaṅkāraṁ balaṁ darpaṁ
kāmaṁ krodhaṁ ca saṁśritāḥ
mām ātma-para-deheṣu
pradviṣanto ’bhyasūyakāḥ

🌷 Translation : 
Bewildered by false ego, strength, pride, lust and anger, the demons become envious of the Supreme Personality of Godhead, who is situated in their own bodies and in the bodies of others, and blaspheme against the real religion.

🌹 Purport :
A demoniac person, being always against God’s supremacy, does not like to believe in the scriptures. He is envious of both the scriptures and the existence of the Supreme Personality of Godhead. This is caused by his so-called prestige and his accumulation of wealth and strength. He does not know that the present life is a preparation for the next life. Not knowing this, he is actually envious of his own self, as well as of others. He commits violence on other bodies and on his own. 

He does not care for the supreme control of the Personality of Godhead, because he has no knowledge. Being envious of the scriptures and the Supreme Personality of Godhead, he puts forward false arguments against the existence of God and denies the scriptural authority. He thinks himself independent and powerful in every action. 

He thinks that since no one can equal him in strength, power or wealth, he can act in any way and no one can stop him. If he has an enemy who might check the advancement of his sensual activities, he makes plans to cut him down by his own power.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 112, 113 / Vishnu Sahasranama Contemplation - 112, 113 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻112. వృషకర్మా, वृषकर्मा, Vr̥ṣakarmā🌻*

*ఓం వృషకర్మాయ నమః | ॐ वृषकर्माय नमः | OM Vr̥ṣakarmāya namaḥ*

యస్య క్రియా ధర్మ రూపా వృషకర్మా స ఉచ్యతే వృష అనగా ధర్మ రూపమగు కర్మలను అనుష్ఠించుట ఎవనికి కలదో అట్టివాడు.

:: భగవద్గీత - విజ్ఞాన యోగము ::
బలం బలవతాంచాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥

భరతకులశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కామమును అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 112🌹*
📚. Prasad Bharadwaj 

*🌻112. Vr̥ṣakarmā🌻*

*OM Vr̥ṣakarmāya namaḥ*

Yasya kriyā dharma rūpā vr̥ṣakarmā sa ucyate His action is of the nature of dharma or One whose actions are according to Vr̥ṣa or dharma.

Bhagavad Gītā - Chapter 7
Balaṃ balavatāṃcāhaṃ kāmarāgavivarjitam,
Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. (11)

:: श्रीमद्भगवद्गीता - विज्ञान योग ::
बलं बलवतांचाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥

Of the strong I am the strength which is devoid of passion and attachment. Among creatures I am desire which is not contrary to righteousness, O scion of the Bharata dynasty!

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥

వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥

Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 113 / Vishnu Sahasranama Contemplation - 113🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻113. వృషాకృతిః, वृषाकृतिः, Vr̥ṣākr̥tiḥ🌻*

*ఓం వృషాకృతయే నమః | ॐ वृषाकृतये नमः | OM Vr̥ṣākr̥taye namaḥ*

ధర్మార్థ మాకృతిర్యస్య శరీరం స వృషాకృతిః ధర్మము కొరకు ఆకృతి అనగా శరీరము ధరించు విష్ణువు వృషాకృతి అని చెప్పబడును.

:: భగవద్గీత - జ్ఞాన యోగము ::
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ 8 ॥

సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును, దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును, ధర్మమును లెస్సగా స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందును అవతరించుచుందును. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 113🌹*
📚. Prasad Bharadwaj 

*🌻113. Vr̥ṣākr̥tiḥ🌻*

*OM Vr̥ṣākr̥taye namaḥ*

Dharmārtha mākr̥tiryasya śarīraṃ sa vr̥ṣākr̥tiḥ He who takes form for the sake of Vr̥ṣa or Dharma or righteousness is Vr̥ṣākr̥tiḥ.

Bhagavad Gītā - Chapter 4
Paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkr̥tām,
Dharmasaṃsthāpanārthāya saṃbhavāmi yuge yuge. (8)

:: श्रीमद्भगवद्गीता - ज्ञान योग ::
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥

For the protection of the pious, the destruction of the evil-doers and establishing virtue, I manifest Myself in every age.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥

వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥

Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36 / Sri Devi Mahatyam - Durga Saptasati - 36 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 10*
*🌻. శుంభ వధ - 3 🌻*

26. దైత్యజనులకు రేడైన ఆ శుంభుడు తనమీదికి కవియుట చూసి, దేవి అతని వక్షస్థలంపై దూరేలా శూలాన్ని ప్రయోగించి, అతనిని నేలపై కూలి పడిపోయేటట్లు చేసింది.

27. దేవి యొక్క శూలపు మొన వల్ల గాఢంగా గాయపడి అతడు ప్రాణాలు కోల్పోయి నేలగూలగా భూమి అంతా, పర్వత సముద్ర ద్వీప సహితంగా సంచలించింది.

28. ఆ దురాత్ముడు హతుడయినప్పుడు అఖిల ప్రపంచం సుఖం పొంది పూర్ణమైన స్వస్థత పొందింది. ఆకాశం నిర్మలం అయ్యింది.

29. అతడచట కూల్చబడినప్పుడు ఘోరమైన అశుభాలను సూచించేవీ, కొరివి పిడుగులుగలవి అయిన తొల్లిటి మేఘాలు శాంతించాయి. నదులు తమ సరియైన మార్గాలనే పట్టి ప్రవహించాయి.

30. అతడు హతుడైనప్పుడు సర్వదేవగణాల మనస్సులు పట్టరాని ఆనందాన్ని పొందాయి. గంధర్వులు మనోహరగానం చేసారు.

31–32. ఇతరులు వాద్యాలు మ్రోగించారు. అప్సర గణాలు (అచ్చరపిండులు) నృత్యం చేసారు. అనుకూల మారుతాలు వీచాయి. సూర్యుడు పూర్ణతేజస్సుతో వెలిగాడు. అగ్నులు శాంతంగా దీవించాయి. దిక్కులందు పుట్టిన నాదాలు శమించాయి.

శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లోని "శుంభవధ” అనే దశమాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 36 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 10* 
*🌻 The Slaying of Shumbha - 3 🌻*

 26. Seeing that lord of all the daitya-folk approaching, the Devi, piercing him on the chest with a dart, threw him down on the earth.

27. Pierced by the pointed dart of the Devi he fell lifeless on the ground, shaking the entire earth with its seas, islands and mountains.

28. When that evil-natured (asura) was slain, the universe became happy and regained perfect peace, and the sky grew clear.

29. Flaming portent-clouds that were in evidence before became tranquil, and the rivers kept within their courses when (Shumbha) was stricken down there.

30. When he had been slain, the minds of all the bands of devas became overjoyed, and the Gandharvas sang sweetly.

31-32. Others sounded (their instruments), and the bands of nymphs danced; likewise favourable winds blew; the sun became very brilliant; the sacred fires blazed peacefully and tranquil became the strange sounds that had risen in different quarters. 

Here ends the tenth chapter called 'The Slaying of Shumbha' of Devi-mahatmya in Markandeya-purana, during the period of Savarni, the Manu. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 105 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -35 🌻*

నాయనా! నీకు వివేకము ఉత్తమముగా పనిచేస్తుంది అనుకో, అప్పుడు తత్వ చింతన చేయి. తత్‌ త్వం అనేటటువంటి విచారణ చేయి. పొందదగిన లక్ష్యం ఏమిటి? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను ఉన్నటువంటి స్థితిని ఆ స్థితికి చేర్చడం ఎలా? అనేటటువంటి తత్వ విచారణ, ఆత్మవిచారణ చేపట్టు. బ్రహ్మజ్ఞానాన్ని పొందు. బ్రహ్మనిష్ఠను పొందు.

 బ్రహ్మానుసంధానము చేయి, ఇది ఉత్తమమైనటువంటి వివేకముతో చేయవలసినటువంటి పని. అంత స్థాయిలో వివేకము పనిచేయడం లేదు. కొద్దిగా క్రిందకి దిగింది. బుద్ధి స్థాయిలోకి వచ్చేసింది. మనసు స్థాయిలోకి వచ్చేసింది. ప్రత్యగాత్మ స్థితిలో నుంచి క్రిందికి దిగిపోయింది.

 గుణమాలిన్యం లోకి దిగి వచ్చేసింది. అప్పుడేమయ్యింది? ఒక మెట్టు జ్ఞాత నుండి క్రిందికి దిగి అంతరేంద్రియాలలోకి దిగి వచ్చేసింది. దిగి వచ్చేసేటప్పటికి ఏమైపోయిందట? కనీసం దానిని ఉద్ధరించాలి అంటే, ‘మధ్యమం మంత్ర చింతాచ’ - మంత్ర జపం అలవాటు చేసుకో! ఇందాక ఏం చెప్పాము? ఆసన సిద్ధి కలిగి ఉండాలి. ప్రాణాయామం చేస్తుండాలి. నిరంతరాయంగా అనులోమ, విలోమ సమప్రాణాయామం 24 గంటలు నిరంతరాయంగా, సహజంగా నీకు జరిగేటట్లుగా నీవు ఆ ప్రాణయామ విధిని నీవు ఆశ్రయించాలి. ఇంకేమి చేయాలి? అదే సమయంలో శ్వాసతో సమంగా నీ ఇష్ట దేవత మంత్రాన్ని జపించు. ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం శివాయ గురవే నమః’, ‘ఓం నమోవేంకటేశాయ’, ‘ఓం శ్రీమాత్రేనమః’ నీ ఇష్టం ఏదైనా పెట్టుకో! 

నీ ఇష్టదేవతా మంత్రాన్ని నిరంతరాయంగా జపించు. కాదూ... నీకు గురూపదేశం ఉంది, ఆ గురూపదేశ విధిలో నీకివ్వబడినటువంటి, ఏ మంత్రాలయితే ఉన్నాయో, హంసమంత్రమే కావచ్చు, మహావాక్యములే కావచ్చు, త్రయమే కావచ్చు, పూర్ణమే కావచ్చు, ద్వాదశే కావచ్చు, షోడశే కావచ్చు, పంచదశే కావచ్చు, పూర్ణ దీక్షా పరులు కావచ్చు, ఎవరెవరైతే వారి వారి గురు సంప్రదాయ విధిని అనుసరించి, ఏయే మంత్రములైతే వారికి ఉపదేశించబడ్డాయో, ఆ మంత్రములను నిరంతరాయంగా జపం చేయి. తద్వారా ‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ - మనసు యొక్క చలనములను ఉడిగింప చేసేటటువంటి పద్ధతి మనన శక్తికి, మంత్రశక్తికి ఉంది. 

కాబట్టి, శ్రవణము నుంచి మననము, మననము నుంచి సదా మానసిక జపం ద్వారా నీవు పొందేటటుంవంటి, ఏ స్థిరమైనటువంటి స్థితి ఉందో, దానిపేరు ‘నిధి’. ఆ ‘నిధి’ అనేటటువంటి స్థితికి నువ్వు ఎదగాలి. తద్వారా మనసు నుంచి మరలా బుద్ధికి, బుద్ధి నుంచి మరలా ప్రత్యగాత్మకు తిరిగి వెనుకకు మరలగలిగేటటువంటి శక్తి నీకు వస్తుంది. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే శక్తి వస్తుంది.

        ఇంకా పడిపోయింది, ఒకవేళ వివేకం ఇంకా బాహ్యానికి వచ్చేసింది, అంతర్ముఖంలో నిలబడడం లేదు. అప్పుడు ‘అధమం శాస్త్ర చింతాచ’ కొద్దిగా వివేకం బాహ్యానికి తిరిగి బయటకి వచ్చేసింది. అప్పుడేమి చెయ్యాలయ్యా? ఒక భగవద్గీతో, ఒక వివేకచూడామణో, ఒక అష్టావక్రగీతో, ఒక వేదాంతపంచదశో... ఇట్లా తత్త్వచింతనకు సంబంధించినటువంటి శాస్త్రములను విచారణ చేయి. 

ఎందుకంటే, 24 గంటలు అంతర్ముఖంలోనే నీవు నిర్వికల్ప సమాధి నిష్ఠుడై కూర్చుంటే నీ వ్యవహారములు జరిగేటటువంటి జీవన శైలి, ప్రారబ్ద యుతమైన కర్మ నీకు అనువుగా ఉండాలి కదా! అలా లేకపోయినప్పటికీ ఏమీ భయపడనక్కర్లేదు. ఒక రోజు మొత్తం మీద అంతాకూడా ఈ నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి, నీవు వివేకము యొక్క స్థాయిని బట్టి నీ సాధనలను ఏర్పాటు చేసుకో! ఆయా సాధనా విధులననుసరించి నీవు ఆ శాస్త్ర చింతన చేయి.

        తద్వారా ఏమైంది? రోజుకి ఆరుగంటల సేపు నిద్ర, ఒక ఆరుగంటల సేపు స్వాధ్యయనము, ఒక ఆరుగంటల సేపు సాధన, ఒక ఆరుగంటల సేపు దైనందిన జీవితము. ఈ రకంగా నీ ఇరవై నాలుగు గంటలను కనుక నీవు సరిగ్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే, వరుసగా ఏకబిగిన 6 గంటలు ఎవరూ ఏమీ చేయరు. అధవా ఉద్యోగానికి వెళ్తే తప్ప. సరే ఉద్యోగ విధిలో నీవు వరుసగా కూడా ఏక బిగిన ఆరుగంటలు చేసేదేమీ ఉండదు. అక్కడ కూడా నీకు మధ్య మధ్యలో అంతరాయములు ఏర్పడుతూ ఉంటాయి. 

వింతైన విషయం ఏమిటంటే, అదే పనిగా వ్యవహారంలో నిమగ్నమైన వాడికంటే, ఈ ఆధ్యాత్మిక సాధన యందు ఆరితేరినటువంటి వాడి బుద్ధి మరింత సూక్ష్మ తరముగా, సూక్ష్మ తమముగా పనిచేయడం వల్ల ఇతరులకు ఎంతో తన్నుకుంటే కానీ అర్థం కానటువంటి విశేషాలు, రానటువంటి ధైర్యాలు వీడికి రెప్పపాటులోనే కలుగుతాయి.

 సులభసూత్రంగా కలుగుతాయి. అందువలన వ్యవహారంలో లోటుపాట్లు వస్తాయని, భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వ్యవహారంలో ఉత్తములుగానే ఉంటారు. - విద్యా సాగర్ స్వామి 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 125 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
117

One day, sage Vaishtha addressed king Dileepa thus, “Dileepa, you take my daughter out for walks only in the vicinity of your house, will you not take her to the forests and show her the beauty of the forests? You are the king, what are you afraid of? Take her out for walks farther away. You are only showing her the vicinities around the house. That is not enough. Show her the forests.”  

Dileepa obeyed his Guru’s command. He took Nandini (the divine cow) to the forests. Nandinidhenu roamed around freely in the forests, walking happily with Dileepa. A few days passed like this. There was no need to shepherd Nandini like other animals, she would follow the king exactly as asked. Sage Vasishtha’s ashram is in the Himalayas. The forests were in the Himalayas too.  

So, Nandini was very familiar with that area. One day, she set out with Dileepa and was roaming freely as usual when she suddenly disappeared. She was walking with Dileepa and following him closely, but disappeared all of a sudden. 

A worried Dileepa began anxiously searching for Nandini. As he was wondering how he would face sage Vasishtha, he heard the roar of a lion and the cry of a cow in a cave. Immediately, without a second’s delay, he darted into the cave. His sped like an arrow into the cave. There, a lion had Nandinidhenu in its clutches. 

As Dileepa was about to shoot his arrow to kill the lion, his hand involuntarily got stuck mid-air. At that time, the lion spoke in human language thus, “King, this is my territory. This cow is my food. So, let me eat my food. Don’t be unjust. I need to eat my food, so please restrain yourself. Don’t attack me”. 

Dileepa realized that this lion had great powers. He knew it was not an ordinary lion because it could speak human language. He was surprised to hear it speak. 

The king replied humbly, “Lion king, it is true that this is your territory. It is also true that this divine cow is your prey. But, this divine cow is under my protection. So, please let go of the cow and eat me instead. That will be just”. Saying so, he lowered his head to the lion. 

The cave glowed with divine light. Nandinidhenu looked very pleased . She said, “King, this is all my creation. I am happy with your devotion and dedication. Ask me for whatever you want”. 

Dileepa prostrated to Nandinidhenu and asked to be blessed with children . That is what he wanted. The Guru had instructed him to worship Nandini and be blessed by her.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 109 / Sri Gajanan Maharaj Life History - 109 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 20వ అధ్యాయము - 4 🌻*

జోషీ రాత్రి షేగాం చేరాడు, శ్రీమహారాజు సమాధిముందు సాష్టాంగపడి, సాయంత్రం ఊరేగింపులో పాల్గొన్నాడు. మరుసటిరోజు జోషీ ఉదారమయిన సేవలుచేసి, బాలభవోకు బ్రాహ్మణుల భోజనం కోసం కొంతడబ్బు తన మొక్కప్రకారం ఇచ్చి, అగత్యమయిన పని ఉండడంతో జోషీ వెంటనే షేగాంనుండి వెళ్ళిపోయాడు. 

యాదవ్ గణేష్ సుబేదార్ పాంగణిలో పత్తి వర్తకంలో దలాలీ చేసేవాడు. ఒకసారి తన వ్యాపారంలో పదవేల రూపాయలు నష్టంరావడంతో అతని ఆరోగ్యంమీద చాలాప్రభావం పడింది. ఈనష్టంనుండి తేరుకుని తిరిగి వ్యాపారం పునస్థాపించుకోడానికి అతను తన సాధ్యమయినంత ప్రయత్నాలు చేసాడు, కానీ ఫలితం లేకపోయింది. 

అటువంటి సమయంలో వార్ధాలో ఉన్న తన స్నేహితుడయిన అసర్కరు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఒక భిక్షకుడు అసర్కరు ఇంటికి భిక్షకోసరం వచ్చాడు. అతను మరాఠీ మనిషిలా వస్త్ర ధారణతో ఉన్నాడు. అతను ముసలి వానిమాదిరి వణుకు తున్నాడు. అసర్కరు అతనిని చూసి చికాకుపడి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి భిక్ష అడగమని అతనితో అన్నాడు. 

ఆ భిక్షకుడు అతని మాటలు లక్ష్య పెట్టక ఇంటిలోకి వచ్చి యాదవ్ సుబేదార్ ప్రక్కన కూర్చున్నాడు. నాకు కొంచెం భిక్షణయ్యి అంటూ ఆ భిక్షకుడు యాదవ్ ముందు ఒక గిన్నె చాపాడు. ఈ భిక్షకుని చొరవకు అతను ఆశ్ఛర్యపడి, అతనిని జాగ్రత్తగా చూసాడు. 

షేగాం శ్రీగజానన్ మహారాజులాగా, అదే విధమయిన కళ్ళలో కాంతి, మాట్లాడేతీరుతో అతనికి కనిపించాడు. ఒక్క తేడా ఏమిటంటే ఇతను ఏదో వ్యాధితో నిరంతరంగా వణుకు తున్నాడు. అతని ముఖంకూడా శ్రీమహారాజు వలె ఉంది. ఇతను శ్రీగజానన్ మహారాజు ఎలా అవగలరు, ఆయన చాలా కాలం క్రితమే సమాధి తీసుకున్నారు ? ఏమయితేనే నేను ఇతనిని శ్రీగజానన్ మహారాజుగా భావించి కొంత డబ్బు ఇవ్వాలి అని సుబేదార్ అనుకున్నాడు. 

ఆ భిక్షకుడు డబ్బుతీసుకుని, ఇంకా ఇవ్వమని అడిగాడు, శ్రీగజానన్ మహారాజుకు మొక్కిన మొక్కుప్రకారం బెల్లం పంచి పెట్టమనీ, తను మొక్కు చెల్లించని కారణంగానే వ్యాపారంలో నష్టం వచ్చిందని అతను యాదవ్తో అన్నాడు. యాదవ్ మరల కొంత డబ్బుఇచ్చాడు. అయినా ఆభిక్షకుడు ఇంకా అడిగాడు. యాదవ్ మరలా డబ్బు ఇచ్చాడు. ఆసమయంలో అసర్కరు ఏదో పనిమీద ఇంటిలోకి వెళ్ళాడు, యాదవ్ ఒక్కడే ఆ భిక్షకుడితో ఉన్నాడు. 

శ్రీగజానన్ మహారాజు గురించి నీకు అనుమానం ఎందుకు ఉంది, నువ్వు బట్టలు తీసి వెయ్యి, నన్ను నీ శరీరం మొత్తం చూడనీ, దానివల్ల నీరోగాలన్నీ మాయం అవుతాయి, నువ్వు నాకొడుకు లాంటివాడివి, కావున సిగ్గుపడకు అని అప్పుడు ఆభిక్షకుడు అన్నాడు. 

అలా అంటూ, శ్రీ మహారాజు తన చేతులను యాదవ్ మొత్తం శరీరం మీద తిప్పారు. అదేసమయంలో అసర్కరు తిరిగి వచ్చాడు, ఆ భిక్షకుడు కూడా వెళ్ళపోయాడు. యాదవ్ ఆతరువాత మర్లా ఆ ఊల్లో ఆ భిక్షకుని కొరకు వెతికాడు కానీ ఎక్కడా చూడలేక పోయాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 110 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 20 - part 4 🌻*

Yadao Ganesh Subhedar was a Cotton broker at Hingni. Once he suffered a loss of Rs.10, 000 in his business which affected his health very much. He tried his best to reestablish his business and recover the loss, but failed. During that period he went to his friend Asarkar at Wardha. At that time a beggar came to Asarkar's house for some alms. 

He was dressed like a Marathi man with a big stick in his hand and a dirty cap on the head. He was trembling like an old man. Looking to him, Asirkar got annoyed and asked him to go and beg at the door of the house. The beggar ignoring his words entered the house and sat beside Yadao Subhedar. Give me some alms. saying so the beggar held a bowl before Yadao. 

He wondered at the obstinacy of the beggar and looked at him minutely. He appeared like Shri Gajanan Maharaj of Shegaon, with the same luster in in His eyes and the same speaking style.

The only difference was that, this man was continuously shaking due to some disease. The face too was like Shri Gajanan Maharaj ; then, Subhedar thought, How can he be Shri Gajanan Maharaj who has taken Samadhi long ago? Whatever it may be, I should give Him some money treating him to be Shri Gajanan Maharaj. 

The beggar took the money and asked for more. He further told him to distribute jaggery as per his vow to Shri Gajanan Maharaj, and said that the loss in the business was the result of the non fulfillment of his vow. Yadao gave him some more money but the beggar again asked for more. So he gave him more money. 

At that time Asirkar went inside the house for some work and Yadao was left alone with the beggar, who said, Why do you have doubts about Shri Gajanan Maharaj? Remove your clothes and let me see your entire body so that all your ailments will vanish. As you are like a son to me, don't feel shy. 

Saying so, Shri Gajanan Maharaj moved his hand all over the body of Yadao. At that time Asirkar returned and the beggar also went away. Yadao, thereafter, searched for that beggar in the town, but could not find him anywhere. 

He thought that if the beggar was really Shri Gajanan Maharaj , he would certainly gain substantial profit in his business. Same day his carts of cotton were brought to Wardha for sale and he got recieved a very high price for them. 

Then Yadao believed that Shri Gajanan Maharaj had come to him in the guise of a beggar to give him advice. Shri Gajanan Maharaj always protects his devotees. Now listen to the experience of Bhau Kavar. Bhau Rajaram Kavar was doctor at Khamgaon, and was transferred to Telhara. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 51 / Sri Lalitha Sahasra Nama Stotram - 51 🌹*
*ప్రసాద్ భరద్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 92, 93 / Sri Lalitha Chaitanya Vijnanam - 92, 93 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖*

*🌻 92. 'కులాంగనా' 🌻*

శీలము, గుణము గల వంశమున జన్మించిన పతివ్రతా స్త్రీని 'కులాంగనా' అందురు.

ఏ స్త్రీ యందు పై మూడు గుణములుండునో ఆ స్త్రీ శ్రీదేవి వలె ఉపాస్యదేవత. గుణము, శీలము, పాతివ్రత్యము గలవారు శ్రీదేవి సృష్టి యందు రక్షింపబడుదురు. దేవతా ఉపాసనా మార్గము నందు కూడ ఈ మూడు గుణములు అత్యంత ప్రాముఖ్యము గలవి. శీలము లేనివారు, గుణము లేనివారు, ఉపాస్యదైవము నందు అచంచల భక్తి, విశ్వాసము, ప్రేమ (పాతివ్రత్యము) లేనివారు దైవానుగ్రహమునకు పాత్రులు కారు.

ప్రస్తుత కాలమున ఎందరో ఆస్తికులు ఈ మూడు విషయములందు తగు శ్రద్ధ లేక భక్తిమార్గమున పలు పాట్లు పడుచున్నారు. నగుబాట్లు చెందుచున్నారు. ఆత్మ వికాసమునకు, ఆత్మానుభూతికి, దివ్యజీవనమునకు, పాపహరణమునకు దైవారాధనము గాని ప్రచారము కొరకు, కీర్తి ప్రతిష్ఠల కొరకు, ప్రకటితముగ ఆరాధనలు చేయుట గాదు. 

కలి ప్రభావముచే జీవులు అంతరంగమున జరుగవలసిన సాధనను, ఆరాధనను, బహిరంగముగ వేదిక లేర్పరచుకొని ప్రచారములు గావించుకొనుచు డంబాచారులై దైవ కార్యములను నిర్వర్తించు చున్నారు. ఇది నిషిద్ధము.

శ్రీవిద్యోపాసకులకు ఇది మరింత నిషిద్ధము. పరశురాముడంతటి వాడు ఇతర విద్యలన్నియు వేశ్యవలె ప్రకటితము లనియు, శ్రీవిద్య కులస్త్రీ వలె గుప్త మనియు పవిత్ర మనియు అని తెలిపినాడు.

కావున శ్రీవిద్యోపాసకులు పై విషయమున ఎక్కువ నిష్ఠతో, దీక్షతో సద్గుణములు, శీలము ఆధారముగ గుప్తముగ అమ్మ నుపాసించవలెను.

'కులాంగనా' అను నామము దైవారాధకుల కందరికిని యొక హెచ్చరిక వంటిది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 92 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Kulāṅganā कुलाङ्गना (92) 🌻*

She hails from the family of chaste women. Such women protect the honour of the lineage they hail from and protect the lineage of the families of their husbands as well. In another interpretation it is said that, such women cannot be seen much in public.  

Lalitāmbikā, being supreme amongst such women protect Herself with the veil of avidyā or ignorance. Saundarya Laharī (verse 9) says “in sahasrāra you conjoin with your consort Śiva secretively.”  

It is explained that by breaking the six psychic planes, conquering twenty five tattva-s, She, in the form of kuṇḍalinī reaches sahasrāra and there unites with Sadāśiva tattva. This union is considered as a separate tattva known as sādākhya tattva. 

 This tattva is also known as Para-Brahman, the complete identity of Lalitāmbikā with Sadāśiva. This stage is also known as tādātmya. Such is the interpretation of Śrī Śaṁkara for chaste women. 

Śrī Vidyā ritual worship is considered as the most secretive.  

This ritual is called navāvaraṇa pūja. If this is performed in the right way, it will surely bestow everything on earth to the person who performs this worship.  

Most of the navāvaraṇa pūja-s performed today is purely for pomp and vanity. Pomp and vanity have no place in the worship of Lalitāmbikā. Secondly, there are many deviations from the prescribed rituals.  

Any ritual not performed according to the prescribed methods does not yield results. For the sake of convenience, nothing can be compromised in rituals.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 93 / Sri Lalitha Chaitanya Vijnanam - 93 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖*

*🌻 93. 'కులాంతస్థా' 🌻*

కులము నందు అంతర్గతముగ నుండునది శ్రీదేవి అని అర్థము. కులమనగా సుషుమ్న మార్గమని తెలుపబడినది. కులమున కనేకానేకార్థము లున్నవి. 

తొంబదవ నామము నుండి వీటిని వివరించుచునే యున్నాము. సుషుమ్న యందు గల చైతన్య ప్రవాహమే శ్రీదేవి. దీనిని కుండలిని చైతన్యమని కూడ యందురు. మూలాధారము నుండి ఆజ్ఞ వరకు వ్యాపించి అటుపైన సహస్రారమున దేదీప్యమగు కాంతులతో ప్రకాశించు చైతన్యమే 'కులాంతస్థ'. అమ్మను ఉపాసకుడు పై విధముగ భావించుచు ధ్యానించవలెను.

 క్రమముగ భావన యందలి పరిశుద్ధతను బట్టి ధ్యానమునందలి ఏకాగ్రతను బట్టి, భావించినది భాసించగలదు. అమ్మనట్లు దర్శించుట శ్రేయమని ఈ నామము సూచించుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 93 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Kulāntasthā कुलान्तस्था (93) 🌻*

Kulā also means scriptures. She resides in the midst of these scriptures.  

This nāma could possibly mean Devi Sarasvatī, the goddess of letters, as She is supposed to be the root for all scriptures.  

This also means the spinal cord or suṣumna and is called the path of kulā. In the triad we have seen earlier (nāma 90), that she is in the form of worthy of knowing (known).   

She is the object of the knowledge of kulā. Kula means Śaktī. Śaktī prevails everywhere i.e. omnipresence.  

This situation is well described in Kena Upaniṣad as ‘pratibodha-viditam’ which means ‘known at all levels of sādhaka’s consciousnesses.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 03 🌴*

03. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశీయుడా ! సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలిసికొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసికొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము.

🌷. భాష్యము :
దేహము మరియు దేహము నెరిగినవాని గూర్చియు, ఆత్మ మరియు పరమాత్ముని గూర్చియు చర్చించునపుడు భగవానుడు, జీవుడు, భౌతికపదార్థమనెడి మూడు అంశములు మనకు గోచరించును. 

ప్రతి కర్మక్షేత్రమునందును (ప్రతిదేహమునందును) జీవాత్మ, పరమాత్మలను రెండు ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణభగవానుడు “నేను కూడా క్షేత్రజ్ఞుడను. కాని దేహము నందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమజ్ఞాతయైన నేను పరమాత్మరూపమున ప్రతిదేహము నందును వసించియున్నాను” అని పలికెను.

భగవద్గీత దృష్ట్యాఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రము నెరిగినవానిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనము చేయువాడు సంపూర్ణజ్ఞానమును పొందగలడు.

“ప్రతిదేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై యుందును” అని శ్రీకృష్ణభగవానుడు పలికియున్నాడు. అనగా జీవుడు తన దేహమును గూర్చి మాత్రమే ఎరిగియుండును. ఇతర దేహముల జ్ఞానమతనికి ఉండదు. 

కాని సర్వదేహముల యందు పరమాత్మ రూపమున వసించు శ్రీకృష్ణభగవానుడు మాత్రము సర్వదేహములను గూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవజాతుల వివిధ దేహములను సంపూర్ణముగా ఎరిగియుండును. దేశపౌరుడు తనకున్న కొద్దిపాటి స్థలమును గూర్చిన జ్ఞానమునే కలిగియుండవచ్చును గాని దేశమునేలెడి రాజు తన రాజప్రాసాదమునే గాక పౌరులు కలిగియున్న ధనసంపత్తులనన్నింటిని తెలిసియుండును. 

అదే విధముగా జీవుడు వ్యక్తిగతముగా ఒక దేహమునకు యజమాని కావచ్చును. కాని భగవానుడు సర్వదేహములకు యజమాని. రాజ్యమునకు దేశములేనెడి రాజు పౌరుని వలె అప్రధాన యజమానుడు గాక ప్రధాన యజమానుడైనట్లు, దేవదేవుడు సర్వదేహములకు దివ్యయజమానియై యున్నాడు.

దేహము ఇంద్రియములను కూడియుండును. అట్టి ఇంద్రియములను నియమించెడివాడు కనుకనే దేవదేవుడు హృషీకేశుడని పిలువబడును. దేశకార్యములను నియమించుటలో రాజు ప్రధాన నియామకుడు మరియు పౌరులు అప్రధానులైనట్లు, దేవదేవుడు ఇంద్రియములకు ఆదినియామకుడు. 

“నేను కూడా క్షేత్రజ్ఞుడను” అని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. అనగా అతడు పరమజ్ఞాతయనియు, జీవాత్మ కేవలము తన దేహము మాత్రమే ఎరుగుననియు భావము. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 463 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 03 🌴*

03. kṣetra-jñaṁ cāpi māṁ viddhi
sarva-kṣetreṣu bhārata
kṣetra-kṣetrajñayor jñānaṁ
yat taj jñānaṁ mataṁ mama

🌷 Translation : 
O scion of Bharata, you should understand that I am also the knower in all bodies, and to understand this body and its knower is called knowledge. That is My opinion.

🌹 Purport :
While discussing the subject of the body and the knower of the body, the soul and the Supersoul, we shall find three different topics of study: the Lord, the living entity, and matter. In every field of activities, in every body, there are two souls: the individual soul and the Supersoul. 

Because the Supersoul is the plenary expansion of the Supreme Personality of Godhead, Kṛṣṇa, Kṛṣṇa says, “I am also the knower, but I am not the individual knower of the body. I am the superknower. I am present in every body as the Paramātmā, or Supersoul.”

One who studies the subject matter of the field of activity and the knower of the field very minutely, in terms of this Bhagavad-gītā, can attain to knowledge.

The Lord says, “I am the knower of the field of activities in every individual body.” The individual may be the knower of his own body, but he is not in knowledge of other bodies. The Supreme Personality of Godhead, who is present as the Supersoul in all bodies, knows everything about all bodies. 

He knows all the different bodies of all the various species of life. A citizen may know everything about his patch of land, but the king knows not only his palace but all the properties possessed by the individual citizens. 

Similarly, one may be the proprietor of the body individually, but the Supreme Lord is the proprietor of all bodies. The king is the original proprietor of the kingdom, and the citizen is the secondary proprietor. Similarly, the Supreme Lord is the supreme proprietor of all bodies.

The body consists of the senses. The Supreme Lord is Hṛṣīkeśa, which means “the controller of the senses.” He is the original controller of the senses, just as the king is the original controller of all the activities of the state; the citizens are secondary controllers. 

The Lord says, “I am also the knower.” This means that He is the superknower; the individual soul knows only his particular body. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
Join and Share in 🌹. Indaichat 🌹
https://wn78r.app.goo.gl/gv65S
Follow my Blogs
http://dailybhakthimessages.blogspot.com/
https://incarnation14.wordpress.com/ 
🌹 Vedas And Puranas 🌹
https://chat.whatsapp.com/HPdh0EYd5vdC3l6o0sQwZr
*🌹. గాయత్రి శక్తి Gayatri Mata 🌹*
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 77 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 15. బుద్ధిమంతుడు - కర్మ యందు గాని, అకర్మ యందు గాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.🍀*

*📚. 4. జ్ఞానయోగము - 16, 17, 18 📚*

కిం కర్మ కి మకర్మేతి కవయ్కో వ్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే 2 శుభాత్ || 16

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణా గతిః || 17 

కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత్ || 18

కర్మ మెట్టిది? అకర్మ మెట్టిది? అను విషయమున పండితులు కూడ మోహము చెందుచున్నారు. అట్టి కర్మ రహస్యమును నేను నీకిపుడు తెలుపుచున్నాను. దీనిని తెలిసి నీవు బంధము నుండి విముక్తుడవు కాగలవు అని కూడ తెలిపినాడు. 

చేయుట, చేయకుండుట అను విషయము చాల లోతైనది. వాస్తవికముగ ఎవ్వరును కర్మ విషయమున స్పష్టముగ వివరించి తెలియజెప్పలేరు. కర్మ స్వరూపమును వివరించుచు శ్రీకృష్ణుడిట్లను చున్నాడు. “చేయుటలో, చేయకుండుట యున్నది. 

అదెట్లనిన, సంభాషించుచు నడచుచున్నపుడు, నడచినట్లు తెలియదు. సంభాషించుచు వాహనము నడుపునపుడు, వాహనము నడుపుచున్నా నన్న భావముండదు. ప్రయాణమున సంభాషణ జరుగు చున్నపుడు, ప్రయాణము సాగినట్లే తెలియదు. 

ఇట్లు చేయుటలో చేయకపోవుట యున్నది. పై ఉదాహరణమునందు ఒక రహస్యము గోచరించు చున్నది. రసవత్తరమగు సంభాషణమున, నడక - ప్రయాణము జరుగుచున్నవి గాని, చేయుచున్నట్లనిపించవు. ఇచ్చట నడక ప్రయాణము, పరధ్యానముగ జరుగుచున్నవి. 

అదే విధముగా పరమును (దైవమును) స్మరించుచూ పనులు జరిపినచో తాను దైవము నందుండుట, పనులు జరుగుట యుండును. భక్తులు మహత్కార్యము లన్నియు ఇట్లే నిర్వర్తించిరి. వారు దైవమున రుచిగొని యుండగ, పనులు జరిగినవి. ఇట్లు జరిగినపుడు కర్తృత్వ భావన కూడ యుండదు. 

అనగా తాను చేయుచున్నానను భావన యుండదు. అతడు దైవముతో యుక్తుడగుటచే, అతని నుండి కర్మలు జరిగినవి. "యుక్తః కర్మకృత్" అని పలుకుటలో, నా స్మరణమున నిలిచి కర్మ లాచరింపుము. అపుడు చేయుటలో చేయని స్థితి అనుభూతమగును.

అట్లే చేయకుండుటలో చేయుట యున్నది. ఏమీ చేయకుండ కూర్చున్న వానియందు కూడ మనసు ఆలోచన చేయుచునే యుండును. అట్లు చేయకపోవుటలో చేయుట యున్నది. ఆ చేయుట మానసికము. మునుల తపస్సు యిట్లే సాగుచుండును. 

వారేమియు చేయుచున్నట్లు గోచరింపదు. కాని వారి తపశ్శక్తి లోకములను కూడ చలింపచేయ గలదు. ధ్యాన యోగులు చేయక చేయుదురు. కర్మయోగులు చేయుచు చేయరు. 

చేయక చేసిన జ్ఞానయోగులు ఇటీవలి కాలమున శ్రీ అరవింద యోగీంద్రులు, మాస్టర్ సి.వి.వి., రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా. చేయుచు చేయని వారు మదర్ (శ్రీమాత, పాండిచేరి), మాస్టర్ ఇ.కె., వివేకానంద స్వామి, శ్రీ సత్య సాయిబాబా, పై రహస్యము తెలిసి యుద్ధము చేయుచు చేయనివాడుగ నీవుండుమని అర్జునునికి తెలిపెను. యుద్ధము చేయక చేయు వానిగ శ్రీకృష్ణుడు నిలచెను.

కర్మ యందుగాని, అకర్మ యందుగాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 274 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
65. అధ్యాయము - 20

*🌻. సతి కైలాసమునకు పయనమగుట - 1 🌻*

నారుదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! శివభక్తశ్రేష్ఠా! ప్రభూ! అద్భుతము, మంగళములకు పెన్నిధియగు శంభుని చరితమును వినిపించితివి (1). తండ్రీ! తరువాత ఏమైనది? సర్వపాప సమూహములను నశింపజేయు సతీ చంద్రశేఖరుల దివ్యచరితమును చెప్పుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్తులయందు దయను చూపే శంకరుడు నన్ను వధించే యత్నమునుండి నివృత్తుడు కాగా, సర్వులు భయమును వీడి సుఖమును, ప్రసన్నతను పొందిరి (3).వారందరు శిరసా ప్రణమిల్లి దోసిలి యొగ్గి శంకరుని భక్తితో స్తుతించి ఉత్సాహముతో జయధ్వానమును చేసిరి (4). 

ఓ మహర్షీ! అదే సమయములో నేను భయమును వీడి ప్రసన్నమగు మనస్సుతో భక్తితో వివిధ మంగళ స్తోత్రములతో శంకరుని స్తుతించితిని (5). అపుడు అనేక లీలలను ప్రదర్శించే శంభు ప్రభుడు సంతసించెను. ఓ మహర్షీ! అపుడాయన అందరు వినుచుండగా నాతో ఇట్లనెను (6).

రుద్రుడిట్లు పలికెను -

ఓ వత్సా! బ్రహ్మా! నేను ప్రసన్నుడనైతిని. నీవు ఇపుడు భయమును విడవాడి, చేతితో నీతలను పట్టు కొనుము. నీవు సంశయమును వీడి నా ఆజ్ఞను పాలింపుము (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుని ఈమాటను విని, నేను నా శిరస్సును సృశించుచూ, అటులనే ఉండి వృషభధ్వజుని నమస్కరించితిని (8). నేను ఎంతలో నా శిరస్సును నా చేతితో స్పృశించితినో, అంతలో అచట వృషవాహనుడగు శివుని రూపము ఉండెను (9). 

నేను అపుడు సిగ్గుచే ముడుచుకున్న అవయవములు గలవాడనై తలవంచి నిలబడితిని. అచట అంతటా ఉన్న ఇంద్రాది దేవతలందరు స్పష్టముగా చూచినారు (10). తరువాత నేను సిగ్గుతో నిండిన వాడనై మహేశ్వరునకు ప్రణమిల్లి, చక్కనిస్తోత్రమును చేసి, 'క్షమించుము క్షమించుము' అని పలికితిని (11).

హే ప్రభో! ఈ పాపము క్షాళితమయ్యే ప్రాయశ్చిత్తమును చెప్పుము. ఈ నా పాపము తొలగి పోవుట కొరకై, ఇంద్రియనిగ్రహమును, వివేకబుద్ధిని ప్రసాదించుము (12). భక్తవత్సలుడగు సర్వేశ్వరునితో నేను ఇట్లు పలికి నమస్కరించగా, ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (13).

శంభుడు ఇట్లు పలికెను -

నేను శిరస్సును అధిష్ఠించియున్న ఈ రూపముతోనే, నీవు ప్రసన్నమగు మనస్సు గలవాడవై, నన్ను ఆరాధించుటలో నిమగ్నమై తపస్సును చేయుము (14). లోకములో సర్వత్రా నీకు రుద్ర శిరస్కుడు అను పేరు ప్రసిద్ధి గాంచ గలదు. తేజశ్శాలులగు బ్రాహ్మణులకు సర్వకార్యములను నీవు సిద్ధింపచేయ గలవు (15). 

నీకు జరిగిన ఈ వీర్యపతనము మానవుల లక్షణమై యున్నది. కాన నీవు నముష్యుడవై భూలోకములో సంచరించుము (16). నీవు భూలోకములో సంచరించుచుండగా నిన్ను ఎవరు చూచెదరో, వారు 'ఇది యేమి? బ్రహ్మ శిరస్సుపై శివుడు ఉన్నాడు' అని పలికెదరు (17).

ఈ నీ వృత్తాంతమునంతనూ ఉత్సుకతో ఎవరు విందురో, వారు పరదారయందలి రాగము అనే దోషమునుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు (18). జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకొనెదరో, అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందగలవు (19). 

ఓ బ్రహ్మా! నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తమిదియే. జనులు నీ గురించి పరిహాసమును చేయుట, లోకములో నీపై తీవ్రమగు జుగుప్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము (20). ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించితిని. ఈ వీర్యము ధరింపయోగ్యము కాజాలదు (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 31 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
🌻KILL OUT AMBITION - 10 🌻

33. In his present state the man is a worthless creature in the world, useless to himself and everybody else. Before he reached this condition he was a force that helped the general evolution of the world, because he was affected by those things which attract normal men and enable them to evolve. 

Into this condition of perfect collapse and uselessness into which he has been plunged by the loss of ordinary lower motives, there comes a special appeal – an appeal which meets him on the three points where he had lost his motive.

134. It is to the man in this condition that the command comes: “Work as those work who are ambitious.” That is joined to the first teaching: “Kill out ambition,” that taken alone would lead to lethargy. 

The separated self being killed, the man has now no motive for work, so the cry comes: “Work as those work who are ambitious.” 

Then comes the second command: “Respect life as those do who desire it,” and the third: “Be happy as those who live for happiness.” These are the three new commands that are to begin the new life, the three new motives that replace the three old ones. The man is lying there as dead. 

The life of the form is dead. Now he has to waken up the life of the consciousness; that will be done by these three appeals. He has to begin to work again, but now it must be the spiritual man who lives and works, while the personality acts like a machine. He has to live more than ever he did before, though the desires for life, happiness and power have all been extinguished. This is the answer to his question: “Why should I work?”

135. If a man does not find the answer, he will remain in the dead condition and will grow no further. It is the point known to students of mechanics as a dead point, the point of equilibrium, in which there is no force to push him on; the higher forces have counterbalanced the lower ones and destroyed his former selfishness and ambition, but are not yet strong enough in him to send him forth full of energy and purpose in their cause. 

That equilibrium is not the object of evolution. What new motives can be put before the man so as to arouse him from this state and make him active? There is only one which can stir the soul from within – his identifying himself with the life of Ishvara in the world, and acting as a part of that life instead of with the desire for the fruit of action.

136. There is no better commentary on this sentence than that which you will find in the third discourse of the Bhagavad-Gita, where reasons are given why a man should work after he has lost the common motives, the desire for the fruits of action:

137. But the man who rejoiceth in the Self, with the Self is satisfied, and is content in the Self, for him verily there is nothing to do;

138. For him there is no interest in things done in this world, nor any in things not done, nor doth any object of his depend on any being.

139. Therefore, without attachment, constantly perform action which is duty, for, by performing action without attachment, man verily reacheth the Supreme.

140. Janaka and others indeed attained to perfection by action: then having an eye to the welfare of the world also, thou shouldst perform action.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 162 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జాబాలిమహర్షి - 2 🌻*

8. ఏకాంతం అంటే ఎవరూలేనిచోటికి పారిపోవటం కాదు.అందరి మధ్యన ఉండి తనొక్కడే అక్కడౌన్నట్లు భావించటమే ఏకాంతం. ఏకాంతం అనే దానికోసం ఎక్కడికీ వెళ్ళకూడదు. మౌనం అంటే, తాను మాట్లాడకుండా, ఏదీవినకుండా ఉండటమే మౌనం.
మౌనితో, ఏకాంతంగా ఉండేవాడితో ప్రకృతి – వాయువు, పంచభూతములు మాట్లాడుతాయి. 

9. ఎట్లా అంటే, వాటికి ఒక భాష ఉంటుంది. సద్వస్తువునుగురించిన విషయం అవి చెప్పగలుగుతాయి. పంచభూతాలు శాశ్వతంగా ఉన్నాయి. జీవులే వచ్చి పోతున్నవి. అనేకమయిన జీవుల యొక్క రాకపోకలను అవి చూస్తున్నాయి. 

10. ఈ పంచభూతాలు – భూమి, వాయువు, వృక్షాలు మొదలయినవన్నీ చూస్తున్నాయి. ఈ సృష్టిలో పుట్టిపెరిగి నశించే లక్షణాలు కలిగిన ఈ వృక్ష సంపదకు మూలం బీజములు. అవన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని చూస్తున్నాయి. అగ్నిహోత్రుడు, ఆకాశం, నక్షత్రాలుకూడ చూస్తున్నాయి. వాటికి ఈ జీవులయొక్క రాకపోకల విషయం బాగా లెలుసు. వాటిని కూడా గురువుగా భావించి ఆశ్రయించవచ్చు. వాటిని స్మరిస్తూ ఏకాంతంలో ఉంటే, అవికూడా చెప్పగలవు.

11. గురువు ఎక్కడో ఉన్నాడు అనుకోనక్కరలేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి-వాయువు, అగ్ని, సూర్యచంద్రులు, పంచభూతములు అవన్నీ గురువే! శాశ్వతమై నిత్యమై, అనేకజీవుల గమాగమనములను చూస్తూఉండి, వారి సుఖదుఃఖాలను కేవలం సాక్షిగా చుస్తూ, అవిమాత్రం సుఖదుఃఖాలను అనుభవించకుండా చైతన్యస్వరూపులై; మన మనుగడకు, ప్రాణానికి, తిండికి, బట్టకు, పెరగటానికి కారణభూతమ్యిన పోషకద్రవ్యములుగా ఉన్నాయి. 

12. అవి నిర్జీవంగా ఉన్నవా, అచేతనంగా ఉన్నవా, అజ్ఞానంలో ఉన్నవా? అవి అసత్పదార్థములా? అని ఆలోచిస్తే; కాదని, వాటిలో జ్ఞానబోధకమైన అంశం తప్పకుండా ఉంది అని తెలుస్తుంది. వినేందుకు మనం సంసిద్ధంగా ఉండాలి అంటే! ఏమీ చెయ్యనక్కరలేదు. అంటే నిష్క్రియుడై ఉండాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 116 / The Siva-Gita - 116 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 15
*🌻. భక్తి యోగము - 5 🌻*

ప్రధమా రక్త వర్ణాస్యా -ద్ద్వితియా భాస్వ రామతా,
తృతీయా విద్యుదా భాసా - చతుర్ధి శుక్ల వర్ణ నీ 22
జాతంచ జాయ మానంచ - తదోం కారే ప్రతిష్టి తిమ్,
విశ్వం భూతం భువనం - విచిత్రం బహుదా తధా 23
జాతం చ జాయ మానం య - త్తత్ర్వం రుద్ర ఉచ్యతే,
తస్మిన్నేన పునః ప్రాణా- స్సర్వ మోంకార ఉచ్చతే. 24
ప్రవి లీనం తదోం కారే - పరం బ్రహ్మ సనాతనమ్,
తస్మాదోం కార జాపీయ - స్సముక్తో నాత్ర సంశయః 25

మాత్రల రంగులిలా ఉండునని యాదేశించు చున్నాడు. అందు ప్రధమ మాత్ర రంగు ఎరుపు గాను, రెండవ మాత్ర రంగు భాస్వర వర్ణము గాను, మూడవ మాత్ర రంగు ఎరుపు కాంతిగాను, నాలుగవ మాత్ర రంగు మక్ల రంగు గాను ఉండును. 

అనేక విధముల చిత్రమగు నట్టియు పుట్టినదియు, పుట్ట బోవునదియు నగు ప్రపంచము ఓంకారము నందు ప్రతిష్టించ బడెను. 

పుట్టినది పుట్టబోవునది యు నగునీ సమస్తమును రుద్రుడే. ఆయన లోనే ఈ ప్రాణము లున్నవి. సమస్తము రుద్రాభిన్నమగు నోంకారమే యని నిరూపించబడి యున్నది .

దీనివలన నోం కార శివుల కభేదము గనే చెప్పబడినది. ఈ ఓంకారమున సనాతనమగు బ్రహ్మము లీనమై యుండుట వలన ప్రణవమును జపించువాడు ముక్తి నొందుటలో సందేహము లేదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 116 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 15
*🌻 Bhakthi Yoga - 5 🌻*

The first note Akara remains of red color, second note Ukara of golden color, the third one of lightening hue, fourth one of white color. 

This entire creation with the past, present and future universes is established in the Omkara. That which is born, which is yet to be born everything is Rudra alone. 

All the pranas reside in him. Scriptures voice the fact that everything is nondual from Rudra who is the Omkara.

That's why Omkara and Shiva are nondifferent.
Because the eternal brahman is established in this Omkara, those who chants Omkara would get liberated for sure beyond any doubts.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 226 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 75. When the body dies the 'I am' goes into oblivion and only the Absolute remains. Stay put there, nothing happens to you the Absolute. 🌻*

The 'I am' is the essence of the five elements and three qualities that form the body-mind. 

When the body falls off, the 'I am' disappears and only the Absolute remains. As you stay put in the 'I am', a time will come when the 'I am' will disappear and you remain as the Absolute. 

You are not the body-mind, so you know no death but only the disappearance of 'I am'. 

In any case the body will drop off and the 'I am' disappear without asking you, so realize 'your' relevance, before you irrelevantly depart.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 101 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - 6 🌻*

422. మానవుని ఆధ్యాత్మిక వికాశము:-
అనుభూతి ఐక్యము:- 
మనోమయ భూమికలైన 5వ భూమిక యందున్న వారిపై ఉదయించును. ఇచ్చట ఆత్మ, సరాసరి భగవంతుని దివ్యత్వ ప్రసారముచే ప్రకాశింపబడుచున్నానని కనుగొనును. ఎఱుకతోగాని ఎరుకలేకగాని భౌతిక, సూక్ష్మగోళములలో నున్నవారికి ఇతోధికమైన సహాయము చేయుదురు.

423. అభావరుప అస్తిత్వము:-
మనోమయ ప్రపంచములో అనేకత్వమందు ఏకత్వస్థితి ప్రారంభమగును.

424. మనోమయ భూమిక ;-
(అస్తిత్వము గాని అస్తిత్వము) ఉనికి గాని ఉనికి భగవంతుని జ్ఞానావస్థానము నుండి దీని ఉనికి ఏర్పడుచున్నది. అంతర్జ్ఞానము యొక్క ప్రతిబింబము. దీనిలో సృష్టియొక్క వివరములన్నియు ఉండును ఇచ్చట భగవంతునికి-సృష్టికి గల సంబంధము ప్రియతముడు-ప్రేమికుడు సంబంధము వంటిది ఇది మానవుని సత్యస్థితి. ఈ దశలో భగవంతుని యందు గల భావము అనుభూతి ఐక్యమే. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 65 / Sri Vishnu Sahasra Namavali - 65 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🌻 65. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |*
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ‖ 65 ‖ 🌻*

🍀 605) శ్రీ ద: - 
భక్తులకు సిరిని గ్రహించువాడు.

🍀 606) శ్రీ శ: - 
శ్రీ దేవికి నాథుడైనవాడు.

🍀 607) శ్రీనివాస: - 
ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.

🍀 608) శ్రీ నిధి: - 
ఐశ్వర్య నిధి.

🍀 609) శ్రీ విభావన: - 
సిరులను పంచువాడు.

🍀 610) శ్రీ ధర: - 
శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.

🍀 611) శ్రీ కర: - 
శుభముల నొసగువాడు.

🍀 612) శ్రేయ: - 
మోక్ష స్వరూపుడు.

🍀 613) శ్రీమాన్ - 
సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.

🍀 614) లోకత్రయాశ్రయ: - 
ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 65 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 1st Padam*

*🌻 65. śrīdaḥ śrīśaḥ śrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ |
śrīdharaḥ śrīkaraḥ śreyaḥ śrīmān lōkatrayāśrayaḥ || 65 || 🌻*

🌻 605. Śrīdaḥ: 
One who bestows prosperity on devotees.

🌻 606. Śrīśaḥ: 
One who is Lord of the Goddess Shri.

🌻 607. Śrīnivāsaḥ: 
Shri here denotes men with Shri, that is, virtue and power. He who dwells in such men is Shrinivasa.

🌻 608. Śrīnidhiḥ: One who is the seat of all Shri, that is, virtues and powers.

🌻 609. Śrīvibhāvanaḥ: 
One who grants every form of prosperity and virtue according to their Karma.

🌻 610. Śrīdharaḥ: 
One who bears on His chest Shri who is the mother of all.

🌻 611. Śrīkaraḥ: 
One who makes devotees - those who praise, think about Him and worship Him- into virtuous and powerful beings.

🌻 612. Śreyaḥ: 
'Shreyas' means the attainment of what is un-decaying good and happiness. Such a state is the nature of the Lord.

🌻 613. Śrīmān: 
One in whom there are all forms of Shri that is power, virtue, beauty etc.

🌻 614. Lōkatrayāśrayaḥ: 
One who is the support of all the three worlds.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
🌹. దత్త చైతన్యము Datta Chaitanya 🌹
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA
🌹 చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 🌹 
https://www.facebook.com/groups/465726374213849/
JOIN 🌹. SEEDS OF CONSCIOUSNESS 🌹
https://t.me/Seeds_Of_Consciousness
Join and Share in 🌹. Indaichat 🌹
https://wn78r.app.goo.gl/gv65S
Follow my Blogs
http://dailybhakthimessages.blogspot.com/
https://incarnation14.wordpress.com/ 
🌹 Vedas And Puranas 🌹
https://chat.whatsapp.com/HPdh0EYd5vdC3l6o0sQwZr
*🌹. గాయత్రి శక్తి Gayatri Mata 🌹*
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment