🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జాబాలిమహర్షి - 2 🌻
8. ఏకాంతం అంటే ఎవరూలేనిచోటికి పారిపోవటం కాదు.అందరి మధ్యన ఉండి తనొక్కడే అక్కడౌన్నట్లు భావించటమే ఏకాంతం. ఏకాంతం అనే దానికోసం ఎక్కడికీ వెళ్ళకూడదు. మౌనం అంటే, తాను మాట్లాడకుండా, ఏదీవినకుండా ఉండటమే మౌనం.
మౌనితో, ఏకాంతంగా ఉండేవాడితో ప్రకృతి – వాయువు, పంచభూతములు మాట్లాడుతాయి.
9. ఎట్లా అంటే, వాటికి ఒక భాష ఉంటుంది. సద్వస్తువునుగురించిన విషయం అవి చెప్పగలుగుతాయి. పంచభూతాలు శాశ్వతంగా ఉన్నాయి. జీవులే వచ్చి పోతున్నవి. అనేకమయిన జీవుల యొక్క రాకపోకలను అవి చూస్తున్నాయి.
10. ఈ పంచభూతాలు – భూమి, వాయువు, వృక్షాలు మొదలయినవన్నీ చూస్తున్నాయి. ఈ సృష్టిలో పుట్టిపెరిగి నశించే లక్షణాలు కలిగిన ఈ వృక్ష సంపదకు మూలం బీజములు. అవన్నీ భూమిలో ఉన్నాయి. వాటిని చూస్తున్నాయి. అగ్నిహోత్రుడు, ఆకాశం, నక్షత్రాలుకూడ చూస్తున్నాయి. వాటికి ఈ జీవులయొక్క రాకపోకల విషయం బాగా లెలుసు. వాటిని కూడా గురువుగా భావించి ఆశ్రయించవచ్చు. వాటిని స్మరిస్తూ ఏకాంతంలో ఉంటే, అవికూడా చెప్పగలవు.
11. గురువు ఎక్కడో ఉన్నాడు అనుకోనక్కరలేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి-వాయువు, అగ్ని, సూర్యచంద్రులు, పంచభూతములు అవన్నీ గురువే! శాశ్వతమై నిత్యమై, అనేకజీవుల గమాగమనములను చూస్తూఉండి, వారి సుఖదుఃఖాలను కేవలం సాక్షిగా చుస్తూ, అవిమాత్రం సుఖదుఃఖాలను అనుభవించకుండా చైతన్యస్వరూపులై; మన మనుగడకు, ప్రాణానికి, తిండికి, బట్టకు, పెరగటానికి కారణభూతమ్యిన పోషకద్రవ్యములుగా ఉన్నాయి.
12. అవి నిర్జీవంగా ఉన్నవా, అచేతనంగా ఉన్నవా, అజ్ఞానంలో ఉన్నవా? అవి అసత్పదార్థములా? అని ఆలోచిస్తే; కాదని, వాటిలో జ్ఞానబోధకమైన అంశం తప్పకుండా ఉంది అని తెలుస్తుంది. వినేందుకు మనం సంసిద్ధంగా ఉండాలి అంటే! ఏమీ చెయ్యనక్కరలేదు. అంటే నిష్క్రియుడై ఉండాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2020
No comments:
Post a Comment