ప్రసాద్ భరద్వాజ
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 92. 'కులాంగనా' 🌻
శీలము, గుణము గల వంశమున జన్మించిన పతివ్రతా స్త్రీని 'కులాంగనా' అందురు.
ఏ స్త్రీ యందు పై మూడు గుణములుండునో ఆ స్త్రీ శ్రీదేవి వలె ఉపాస్యదేవత. గుణము, శీలము, పాతివ్రత్యము గలవారు శ్రీదేవి సృష్టి యందు రక్షింపబడుదురు. దేవతా ఉపాసనా మార్గము నందు కూడ ఈ మూడు గుణములు అత్యంత ప్రాముఖ్యము గలవి. శీలము లేనివారు, గుణము లేనివారు, ఉపాస్యదైవము నందు అచంచల భక్తి, విశ్వాసము, ప్రేమ (పాతివ్రత్యము) లేనివారు దైవానుగ్రహమునకు పాత్రులు కారు.
ప్రస్తుత కాలమున ఎందరో ఆస్తికులు ఈ మూడు విషయములందు తగు శ్రద్ధ లేక భక్తిమార్గమున పలు పాట్లు పడుచున్నారు. నగుబాట్లు చెందుచున్నారు. ఆత్మ వికాసమునకు, ఆత్మానుభూతికి, దివ్యజీవనమునకు, పాపహరణమునకు దైవారాధనము గాని ప్రచారము కొరకు, కీర్తి ప్రతిష్ఠల కొరకు, ప్రకటితముగ ఆరాధనలు చేయుట గాదు.
కలి ప్రభావముచే జీవులు అంతరంగమున జరుగవలసిన సాధనను, ఆరాధనను, బహిరంగముగ వేదిక లేర్పరచుకొని ప్రచారములు గావించుకొనుచు డంబాచారులై దైవ కార్యములను నిర్వర్తించు చున్నారు. ఇది నిషిద్ధము.
శ్రీవిద్యోపాసకులకు ఇది మరింత నిషిద్ధము. పరశురాముడంతటి వాడు ఇతర విద్యలన్నియు వేశ్యవలె ప్రకటితము లనియు, శ్రీవిద్య కులస్త్రీ వలె గుప్త మనియు పవిత్ర మనియు అని తెలిపినాడు.
కావున శ్రీవిద్యోపాసకులు పై విషయమున ఎక్కువ నిష్ఠతో, దీక్షతో సద్గుణములు, శీలము ఆధారముగ గుప్తముగ అమ్మ నుపాసించవలెను.
'కులాంగనా' అను నామము దైవారాధకుల కందరికిని యొక హెచ్చరిక వంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 92 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Kulāṅganā कुलाङ्गना (92) 🌻
She hails from the family of chaste women. Such women protect the honour of the lineage they hail from and protect the lineage of the families of their husbands as well. In another interpretation it is said that, such women cannot be seen much in public.
Lalitāmbikā, being supreme amongst such women protect Herself with the veil of avidyā or ignorance. Saundarya Laharī (verse 9) says “in sahasrāra you conjoin with your consort Śiva secretively.”
It is explained that by breaking the six psychic planes, conquering twenty five tattva-s, She, in the form of kuṇḍalinī reaches sahasrāra and there unites with Sadāśiva tattva. This union is considered as a separate tattva known as sādākhya tattva.
This tattva is also known as Para-Brahman, the complete identity of Lalitāmbikā with Sadāśiva. This stage is also known as tādātmya. Such is the interpretation of Śrī Śaṁkara for chaste women.
Śrī Vidyā ritual worship is considered as the most secretive.
This ritual is called navāvaraṇa pūja. If this is performed in the right way, it will surely bestow everything on earth to the person who performs this worship.
Most of the navāvaraṇa pūja-s performed today is purely for pomp and vanity. Pomp and vanity have no place in the worship of Lalitāmbikā. Secondly, there are many deviations from the prescribed rituals.
Any ritual not performed according to the prescribed methods does not yield results. For the sake of convenience, nothing can be compromised in rituals.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 93 / Sri Lalitha Chaitanya Vijnanam - 93 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ‖ 37 ‖
🌻 93. 'కులాంతస్థా' 🌻
కులము నందు అంతర్గతముగ నుండునది శ్రీదేవి అని అర్థము. కులమనగా సుషుమ్న మార్గమని తెలుపబడినది. కులమున కనేకానేకార్థము లున్నవి.
తొంబదవ నామము నుండి వీటిని వివరించుచునే యున్నాము. సుషుమ్న యందు గల చైతన్య ప్రవాహమే శ్రీదేవి. దీనిని కుండలిని చైతన్యమని కూడ యందురు. మూలాధారము నుండి ఆజ్ఞ వరకు వ్యాపించి అటుపైన సహస్రారమున దేదీప్యమగు కాంతులతో ప్రకాశించు చైతన్యమే 'కులాంతస్థ'. అమ్మను ఉపాసకుడు పై విధముగ భావించుచు ధ్యానించవలెను.
క్రమముగ భావన యందలి పరిశుద్ధతను బట్టి ధ్యానమునందలి ఏకాగ్రతను బట్టి, భావించినది భాసించగలదు. అమ్మనట్లు దర్శించుట శ్రేయమని ఈ నామము సూచించుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 93 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Kulāntasthā कुलान्तस्था (93) 🌻
Kulā also means scriptures. She resides in the midst of these scriptures.
This nāma could possibly mean Devi Sarasvatī, the goddess of letters, as She is supposed to be the root for all scriptures.
This also means the spinal cord or suṣumna and is called the path of kulā. In the triad we have seen earlier (nāma 90), that she is in the form of worthy of knowing (known).
She is the object of the knowledge of kulā. Kula means Śaktī. Śaktī prevails everywhere i.e. omnipresence.
This situation is well described in Kena Upaniṣad as ‘pratibodha-viditam’ which means ‘known at all levels of sādhaka’s consciousnesses.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2020
No comments:
Post a Comment