శ్రీ శివ మహా పురాణము - 571 / Sri Siva Maha Purana - 571


🌹 . శ్రీ శివ మహా పురాణము - 571 / Sri Siva Maha Purana - 571 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴

🌻. శివ పార్వతుల కైలాసగమనము - 2 🌻


పార్వతి యందు దృఢమగు ప్రేమగల ఆమె తల్లి, అక్క చెల్లెళ్లు, ఇతరస్త్రీలు, సోదరులు, మరియు తండ్రి ప్రేమచే రోదించిరి (11). అపుడు బ్రాహ్మణులు వచ్చి ఆదరముతో నచ్చజెప్పి సుఖకరము, శ్రేష్ఠము అగు యాత్రాలగ్నము సమీపించినదని విన్నవించిరి (12).

అపుడు వివేకి యగు హిమవంతుడు మేనకు ధైర్యమును చెప్పి పార్వతి అధిరోహించుటకై పల్లకిని రప్పించెను (13). అచట నున్న బ్రాహ్మణస్త్రీలు ఆ పార్వతిని పల్లకిలో కూర్చుండబెట్టిరి. అపుడు తల్లిదండ్రులు, సర్వస్త్రీలు, బ్రాహ్మణులు ఆశీర్వదించరి (14). మేనా హిమవంతులు మహారాణికి తగిన ఉపచారములను, ఇతరులకు దుర్లభమగు శుభకరమగు అనేక ద్రవ్యములను ఆమెకు ఇచ్చిరి (15).

ఓ మునీ! పార్వతి గురువులను, తండ్రిని, తల్లిని, బ్రాహ్మణులను, పురోహితుని, అక్కచెల్లెళ్లను, ఇతరస్త్రీలను నమస్కరించి వెళ్లెను (16). వివేకి యగు హిమవంతుడు కూడా ప్రేమకు వశుడై కుమారులతో గూడి, శివుడు దేవతలతో బాటు ఉన్నచోటకు వచ్చి వారందరికీ ఆనందమును కలిగించెను (17). వారందరు మహోత్సాహముతో పరస్పరము కలుసుకొనిరి. అపుడు వారు భక్తితో శివునకు నమస్కరించి ఆయనను ప్రశంసిస్తూ, నగరమునకు తిరిగి వచ్చిరి (18). 'పూర్వ జన్మస్మృతి గల నీకు గుర్తు చేయుచున్నాను. నీవు నన్ను నిత్యము స్మరించి యున్న పక్షములో చెప్పుము. ఓదేవ దేవీ! నేను నిన్ను పొందుట ఒక లీల. నీవు నాకు సర్వదా ప్రాణ ప్రియురాలవు' (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 571 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴

🌻 Śiva returns to Kailāsa - 2 🌻


11. Her mother, sister, brothers, father and the other ladies who were affectionately attached to her cried frequently.

12. Then the brahmins respectfully intimated to them the auspicious hour for the starting of the journey and consoled them.

13. Then Himavat and Menā composed themselves and caused the palanquin to be brought for Pārvatī to get in.

14. The brahmin ladies helped her to get into the palanquin. They gave their blessings. Her parents and the brahmins too offered their blessings.

15. Menā and the lord of mountains gave her a royal send-off with various auspicious rare presents not accessible to common people.

16. O sage, Pārvatī started after bowing to the preceptors, elders, father, mother, the brahmins, the chief priest, sisters and the other women.

17. Himavat, the sensible affectionate father with his sons accompanied her as far as the place where the lord was waiting joyously along with the gods.

18. Everyone was jubilant and jolly with love. They bowed to the lord with devotion. Praising Him they returned to Kailāsa.

19. Then Śiva told Pārvatī—“I am reminding you although you know the previous birth. If you remember, speak out. In my divine sport you are always my beloved.”


Continues....

🌹🌹🌹🌹🌹


29 May 2022

No comments:

Post a Comment