29 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, ఆదివారం, మే 2022 భాను వాసరే 🌹
2) 🌹 కపిల గీత - 15 / Kapila Gita - 15🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 55 / Agni Maha Purana - 55🌹 
4) 🌹. శివ మహా పురాణము - 571 / Siva Maha Purana - 571🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 190 / Osho Daily Meditations - 190🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 374-3 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 29, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 8 🍀*

*8. ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శరీర ఓజస్సు, మనో తేజస్సు, ఆత్మిక వర్చస్సు - ఈ త్రివిధ జాగరణ, త్రిపదా గాయత్రిని ఉపయోగించుకుని, సవితతో సంబంధం పెట్టుకొనుట వల్ల సంభవం అవుతుంది. సద్గురు శ్రీరామశర్మ. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 14:56:25 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: కృత్తిక 31:13:43 వరకు
తదుపరి రోహిణి
యోగం: అతిగంధ్ 22:53:22 వరకు
తదుపరి సుకర్మ
కరణం: శకుని 14:57:24 వరకు
వర్జ్యం: 17:56:30 - 19:42:42
మరియు 25:05:40 - 26:52:56
దుర్ముహూర్తం: 17:01:14 - 17:53:33
రాహు కాలం: 17:07:46 - 18:45:51
గుళిక కాలం: 15:29:41 - 17:07:46
యమ గండం: 12:13:30 - 13:51:35
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 28:33:42 - 30:19:54
మరియు 30:27:28 - 32:14:44
సూర్యోదయం: 05:41:09
సూర్యాస్తమయం: 18:45:51
చంద్రోదయం: 04:41:18
చంద్రాస్తమయం: 17:54:20
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మేషం
ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము
నష్టం 31:13:43 వరకు తదుపరి ధాత్రి
యోగం - కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 15 / Kapila Gita - 15🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 4 🌴*

*15. చేతః ఖల్వస్య బన్ధాయ ముక్తయే చాత్మనో మతమ్*
*గుణేషు సక్తం బన్ధాయ రతం వా పుంసి ముక్తయే*

*మోక్షం రావాలన్నా నరకము రావాలన్నా, మనసే కారణము. గుణముల యందు ఆసక్తమయిన మనసు నరకాన్నిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల యందు లగ్నమయిన మనసు సన్సారాన్ని (నరకాన్ని) ఇస్తుంది. పరమాత్మ యందు ఆసక్తమైతే ముక్తినిస్తుంది. మనసు మురికి లేనిది కావాలి. అరిషడ్వర్గాలనే ఆరు మలాలు మనసుకు ఉన్నాయి. మరి మనసు మొదటి నుండీ మురికేనా? మనసు సహజముగా మంచిదే. దానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 15 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 4 🌴*

*15. cetah khalv asya bandhaya muktaye catmano* matam*
*gunesu saktam bandhaya ratam va pumsi muktaye*

*The stage in which the consciousness of the living entity is attracted by the three modes of material nature is called conditional life. But when that same consciousness is attached to the Supreme Personality of Godhead, one is situated in the consciousness of liberation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 55 / Agni Maha Purana - 55 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 20*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. పునః జగత్సర్గ వర్ణనము - 2 🌻*

పులస్త్యుని భార్యయైన ప్రీతికి దత్తోలియను కుమారుడు పట్టెను. క్షమకు పులహుని వలన సహిష్ణువు, క్రముడు, పాదికుడు అను పుత్రులు జనించిరి.

క్రతువునకు సన్నతియందు గొప్ప తేజస్సు గలవారును, బొటన వేలు కణుపు ప్రమాణము కలవారును. అగు ఆరవైవేలమంది వాలఖిల్యులు పుట్టిరి.

వసిష్ఠుని వలన ఉర్జయందు రాజు, గా తుడు, ఊర్ధ్వబాహుడు సవనుడు, అలఘుడు, శక్రుడు, సుతపుడు అను ఏడుగురు బుషులు జనించిరి. స్వాహా - అగ్నులకు పావకుడు, పవమానుడు, శుచి అను కుమారులు పుట్టిరి. అజునినుండి అగ్నిష్వాత్తుడు, బర్హిషత్‌, అనగ్ని, నాగ్ని అను కుమరులు జనించిరి. పితృదేవతలకు స్వధయందు మేన, వైధారిణి అను కుమార్తెలు పట్టిరి. అధర్ముని భార్య హింస. వారిరువురికిని అనృతము పుట్టెను.

అధర్మహింసలకు నికృతి అను కన్యయు పుట్టినది. ఈ అనృతము నికృతియు మిథునమయ్యెను. వారివలన భయము, నరకము పుట్టెను వారికి వరసగా మాయయు, వేదనయు భార్యలైరి. వారిలో మాయ భూతములను నశింపచేయు మృత్యువును కనెను. వేదన నరకము వలన దుఃఖమనే కుమారుని కనెను.

మృత్యువునకు వ్యాధి, జర శోకము, తృష్ణ, క్రోధము సంతానముగా జనించిరి బ్రహ్మదేవుని నుంచి రోదించుచు (ఏడ్చుచు) పుట్టుటచే రుద్రుడను పేరు గల కుమారుడు పెట్టెను. ఆనతికే పితామహుడు --భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవడు అను పేర్లు పెట్టెను.

ఆతని భార్యయైన సతీదేవి దక్షునిపై కోపముచే దేహము విడచి, హిమవంతుని కుమార్తెగా జనించి మరల ఆతని (రుద్రుని) భార్య ఆయెను.

స్వాయంభువాదులు నారదాదులచ బుషులకు చెప్పబడినవియు, భుక్తి ముక్తి ప్రదములను అగు విష్ణ్వాదులకు చేయదగిని స్నానాది పూజలను చేసి (చరితార్థులైరి)
అగ్ని మహాపురాణము నందు జగత్సర్గవర్ణన మను ఇరువదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 55 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 20*
*🌻 Primary creation - 2 🌻*

13. A son (by name) Dattoli was born to Prīti, the wife of Pulastya. Sahiṣṇu and Kramapādika[4] were born to Kṣamā from Pulaha.

14. The highly radiant Bālakhilyas were born to Sannati[5] from Kratu. They, who were 60000, were of the size of a joint of the thumb.

15. To Urjā from Vasiṣṭha (were born) Raja, Gātra, Urdhvabāhu, Savana, Alaghu[6], Śukra and Sutapāḥ [=Sutapas?], the seven sages.

16. Pāvaka, Pavamāna and Śuci were born of Agni and. Svāhā. The manes Agniṣvāttāḥ [=Agniṣvāttas?]), devoid of fire and Barhiṣada, with fire (were born) from aja (Brahmā, the unborn).

17. Menā and Dhāriṇī were the daughters of the manes through Svadhā. Hiṃsā was the wife of Adharma. Then. Anṛta was born to them.

18. Nikṛti (was their) daughter. Bhaya and Naraka (were. born) from them, who had Māyā and Vedanā as their wives.

19. Of those two, Māyā gave birth to Mṛtyu, the destroyer of living beings. And also Vedanā gave birth to a son Duḥkha. from Raurava (Naraka).

20. Vyādhi, Jarā, Śoka, Tṛṣṇā and Krodha were born from Mṛtyu. (Rudra) was born wailing from Brahmā and (was known as) Rudra by name on account of the wailing.

21. O twice-born! the grandfather (Brahmā) said to (him) (called him as) Bhava, Śarva, Īśāna, Paśupati, Bhīma, Ugra (and) Mahādeva.

22. His wife Satī gave up her life on account of the wrath of Dakṣa and having become the daughter of Himavat again became the wife of Śambhu (Siva):

23. (I will now describe) the methods of worship of Viṣṇu etc., preceded by bathing and other (rites) and yielding enjoyment and emancipation, by doing which Svāyambhuva (Manu) (had the benefit), as told by Nārada and others to the sages.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 571 / Sri Siva Maha Purana - 571 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 55 🌴*

*🌻. శివ పార్వతుల కైలాసగమనము - 2 🌻*

పార్వతి యందు దృఢమగు ప్రేమగల ఆమె తల్లి, అక్క చెల్లెళ్లు, ఇతరస్త్రీలు, సోదరులు, మరియు తండ్రి ప్రేమచే రోదించిరి (11). అపుడు బ్రాహ్మణులు వచ్చి ఆదరముతో నచ్చజెప్పి సుఖకరము, శ్రేష్ఠము అగు యాత్రాలగ్నము సమీపించినదని విన్నవించిరి (12). 

అపుడు వివేకి యగు హిమవంతుడు మేనకు ధైర్యమును చెప్పి పార్వతి అధిరోహించుటకై పల్లకిని రప్పించెను (13). అచట నున్న బ్రాహ్మణస్త్రీలు ఆ పార్వతిని పల్లకిలో కూర్చుండబెట్టిరి. అపుడు తల్లిదండ్రులు, సర్వస్త్రీలు, బ్రాహ్మణులు ఆశీర్వదించరి (14). మేనా హిమవంతులు మహారాణికి తగిన ఉపచారములను, ఇతరులకు దుర్లభమగు శుభకరమగు అనేక ద్రవ్యములను ఆమెకు ఇచ్చిరి (15). 

ఓ మునీ! పార్వతి గురువులను, తండ్రిని, తల్లిని, బ్రాహ్మణులను, పురోహితుని, అక్కచెల్లెళ్లను, ఇతరస్త్రీలను నమస్కరించి వెళ్లెను (16). వివేకి యగు హిమవంతుడు కూడా ప్రేమకు వశుడై కుమారులతో గూడి, శివుడు దేవతలతో బాటు ఉన్నచోటకు వచ్చి వారందరికీ ఆనందమును కలిగించెను (17). వారందరు మహోత్సాహముతో పరస్పరము కలుసుకొనిరి. అపుడు వారు భక్తితో శివునకు నమస్కరించి ఆయనను ప్రశంసిస్తూ, నగరమునకు తిరిగి వచ్చిరి (18). 'పూర్వ జన్మస్మృతి గల నీకు గుర్తు చేయుచున్నాను. నీవు నన్ను నిత్యము స్మరించి యున్న పక్షములో చెప్పుము. ఓదేవ దేవీ! నేను నిన్ను పొందుట ఒక లీల. నీవు నాకు సర్వదా ప్రాణ ప్రియురాలవు' (19). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 571 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 55 🌴*

*🌻 Śiva returns to Kailāsa - 2 🌻*

11. Her mother, sister, brothers, father and the other ladies who were affectionately attached to her cried frequently.

12. Then the brahmins respectfully intimated to them the auspicious hour for the starting of the journey and consoled them.

13. Then Himavat and Menā composed themselves and caused the palanquin to be brought for Pārvatī to get in.

14. The brahmin ladies helped her to get into the palanquin. They gave their blessings. Her parents and the brahmins too offered their blessings.

15. Menā and the lord of mountains gave her a royal send-off with various auspicious rare presents not accessible to common people.

16. O sage, Pārvatī started after bowing to the preceptors, elders, father, mother, the brahmins, the chief priest, sisters and the other women.

17. Himavat, the sensible affectionate father with his sons accompanied her as far as the place where the lord was waiting joyously along with the gods.

18. Everyone was jubilant and jolly with love. They bowed to the lord with devotion. Praising Him they returned to Kailāsa.

19. Then Śiva told Pārvatī—“I am reminding you although you know the previous birth. If you remember, speak out. In my divine sport you are always my beloved.”

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 190 / Osho Daily Meditations - 190 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 190. రసవాదం 🍀*

*🕉. ధ్యానం రసవాదం; ఇది మీ మొత్తం జీవిని మారుస్తుంది. ఇది అన్ని పరిమితులను, అన్ని సంకుచితత్వాలను నాశనం చేస్తుంది; అది మిమ్మల్ని విస్తృతం చేస్తుంది. 🕉*
 
*ధ్యానం అన్ని సరిహద్దులను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది: మతం, దేశం, జాతి సరిహద్దులు. అవగాహన అన్ని రకాల తార్కిక మరియు సైద్ధాంతిక నిర్బంధాలు, ఖైదులను వదిలించుకోవడానికి మాత్రమే కాకుండా, శరీరం, మనస్సు యొక్క పరిమితులను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీరు స్వచ్ఛమైన చైతన్యం మరియు స్పృహ అని మరియు మరేమీ కాదని మీకు తెలియజేస్తుంది.*

*శరీరం మీ ఇల్లు మాత్రమే; నువ్వు అది కాదు. మనస్సు అనేది ఉపయోగించే ఒక యంత్రాంగమే. ఇది అధికారి కాదు; అది కేవలం సేవకుడు. మీరు శరీరం లేదా మనస్సు కాదు అని తెలుసు కున్నప్పుడు, మీరు విస్తరించడం ప్రారంభిస్తారు. మీరు విస్తృతంగా, మరింత విశాలంగా మారతారు. మీరు సముద్రంగా, ఆకాశంలాగా మారడం ప్రారంభించండి. ఆ పరివర్తన మీకు ప్రతిష్ఠని మరియు విజయాన్ని తెస్తుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 190 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 190. ALCHEMY 🍀*

*🕉 Meditation is alchemical; it transforms your whole being. It destroys all limitations, all narrowness; it makes you wide. 🕉*
 
*Meditation helps you to get rid of all boundaries: the boundaries of religion, nation, race. Awareness helps you not only to get rid of all kinds of logical and ideological confinements, imprisonments, but also it helps you to transcend the limitations of the body, the mind. It makes you aware that you are pure consciousness and nothing else.*

*The body is only your house; you are not it. Mind is only a mechanism to be used. It is not the master; it is just a servant. As you become aware that you are neither the body nor the mind, you start expanding, you become wider and wider. You start becoming oceanic, skylike. That transformation brings glory and victory to you.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

*🌻 374 -3. 'కృతజ్ఞా'🌻* 

*కృత యుగమున శ్రీమాత జ్ఞాన స్వరూపిణిగ పరిపూర్ణముగ దర్శనమిచ్చు చుండెడిది. అటు తరువాత యుగములలో జ్ఞానము అజ్ఞానముచే కప్పబడుటచే దైవమున్నాడన్న భావము కూడ ప్రస్తుతము మృగ్యమై యున్నది. అజ్ఞానము వలన అహంకారమునబడిన జీవులు శ్రీమాత ఆరాధనము ద్వారా మరల క్రమముగ జ్ఞానమును పొందగలరు.*

*శ్రీమాత జీవులందరిని సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచ మహాభూతముల రూపమున గమనించు చుండునట. పై తెలిపిన తొమ్మిది మందిని లోక సాక్షులుగ పేర్కొందురు. ఈ లోక సాక్షుల ద్వారా జీవులు చేయుచున్న పాప పుణ్యములను గమనించుచు తదనుగుణమైన ఫలముల నిచ్చుచుండును. ఉపకారము చేయువారికి ఉపకారము చేయును. అపకారము చేయువారికి అపకారము చేయును. అపకారము చేసిననూ, ఉపకారము చేయువారిని అనుగ్రహించును. అనగా విశేషముగ ఉపకారము చేయును. ఇట్లు 'కృతజ్ఞ' అను శ్రీమాత నామమునకు వివిధములగు భాష్యము లున్నవి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*

*🌻 374-3. Kṛtajñā कृतज्ञा🌻*

*It is also said that ādhyātimka and ādhidaivika together represent the universe and hence is known as Virāt (the Supreme Intellect located in a supposed aggregate of gross bodies). Living beings are known as ādhibautika.*

*In terms of Cāndogya Upaniṣahad (IV.i.4) Kṛtajñā means a person who includes within himself all the good things that other people do. He is the sum total of all good things in the world.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment