మైత్రేయ మహర్షి బోధనలు - 125


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 125 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 97. ఒక పొడుపు కథ 🌻


అతి ప్రాచీన కాలమున హిందువులు ఒక పిట్టకథను చెప్పుకొనుచుండెడివారు. ఆర్యులలో మొదటి తెగవారే హిందువులు. ఆర్యులలో జ్యేష్టులు వారే. వారు చెప్పుకొను కథ యిట్లున్నది. అనగ అనగ ఒక రాజ్యములో ఒక మహామృగముండెడిది. అది రోజున కొక జీవుని చొప్పున భక్షించుచుండెడిది. ఆ మృగము ఆకాశమున ఎగురగలదు. భూమిపై పరుగిడగలదు. నీటిలో ఈద గలదు. దానికి ముందు చూపేగాని వెనుక చూపు లేదు. అది, అడ్డు, ఆపులేక జీవులను భక్షించుచునే యుండెడిది.

ఒకనాడు దాని కంటికొక యోగి కనిపించెను. అతనిని భక్షించుట కుద్యమించెను. యోగి నవ్వుకొని పరుగెత్తుచు, సమీపమున గల ఒక మహా సరస్సున జొరపడెను. మృగము కూడ జొరపడినది. మృగము యోగి కొఱకై వెతుకుచుండగ యోగి మృగము వీపు పైకెక్కి కూర్చుండెను. వెనుక చూపు లేని మృగము యోగికై వెతుకుచు నుండెను. యోగి కనపడక పోగ క్రమముగ మృగమునకు పంతము పెరిగెను. యోగికొరకై వెతుకుట సాగించెను. నేటికిని వెదకులాడు కొనుచునే యున్నది. యోగి మృగము వీపున తన యోగమును సాగించుచునే యున్నాడు. పై కథను విప్పుకొనుట సాధకుల కర్తవ్యము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 May 2022

No comments:

Post a Comment