నిర్మల ధ్యానాలు - ఓషో - 186


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 186 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతి మనిషి కాంతితో పుట్టాడు. ప్రతి మనిషీ మసకబారాడు. మనిషి చనిపోయే సమయానికి బుద్ధిహీనుడుగా వుంటాడు. అది చిత్రమైన సంగతి. అది పరిణామం అంటూ వుంటారు. కానీ అది అపరిణామం.🍀


మనిషి తన ఉనికి చుట్టూ దుమ్ము పేర్చుకుని కాంతిని కోల్పోతాడు. కాంతి అతను జన్మతో తెచ్చుకుంది. ప్రతి మనిషి కాంతితో పుట్టాడు. ప్రతిమనిషీ మసకబారాడు. మనిషి చనిపోయే సమయానికి బుద్ధిహీనుడుగా వుంటాడు. అది చిత్రమైన సంగతి. అది పరిణామం అంటూ వుంటారు. అది అపరిణామం. పిల్లలు చురుగ్గా వుంటారు. సజీవంగా వుంటారు. ప్రతిదాని పట్ల ఎట్లాంటి నిర్ణయం లేకుండా స్పష్టంగా వుంటారు. ఎదిగే కొద్దీ ప్రతి దాన్నించీ అయోమయాన్ని సేకరిస్తారు. మనం 21 ఏళ్ళు వచ్చేదాకా ఆగి అప్పుడు వాళ్ళకు ఓటుహక్కు ఇస్తాం. ఆ సమయానికి ప్రతి ఒక్కడూ మొద్దుబారి పోతాడు. నీరసిస్తాడు. బుద్ధిహీనుడవుతాడు.

జనం ఇప్పుడు నువ్వు వయసుకొచ్చావు, అంటారు. కచ్చితంగా రాజకీయవాదులు పిల్లలకు ఓటుహక్కు యివ్వడానికి భయపడతారు. కారణం వాళ్ళు స్పష్టంగా చూస్తారు. నీకు చూసే గుణం కోల్పోయినప్పటికి నీకు ఓటుహక్కు ఇస్తారు. అప్పటికి దాదాపు నువ్వు గుడ్డి వాడివయి వుంటావు. నా ప్రయత్నం మీ తుప్పును వదిలించుకోవడానికి మీకు సాయపడడం. మీ అద్దాన్ని శుభ్రం చేసుకోవడానికి మీకు సాయపడడం. అప్పుడు మీరు యధార్థ వదనాన్ని చూస్తారు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

28 May 2022

No comments:

Post a Comment