28 - MAY - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 28, మే 2022 శనివారం, స్థిర వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 208 / Bhagavad-Gita - 208 - 5- 04 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 286 / DAILY WISDOM - 286🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 186 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 125🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 28, మే, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 6 🍀*

*6) సంవత్సరపక్షవారోత్సవవైభవం సంయోగవియోగాతీతమానసం*
*సమానాధికవివర్జితతుల్యనాతీతం శ్రీ వేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రతిభను మేల్కొలుపుటకు శరీర ఓజస్సును, మనో తేజస్సును, ఆత్మిక వర్చస్సును, మేల్కొల్పాలి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ త్రయోదశి 13:11:12 
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: భరణి 28:40:27 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శోభన 22:21:36 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: వణిజ 13:12:11 వరకు
వర్జ్యం: 12:56:12 - 14:41:04
దుర్ముహూర్తం: 07:25:49 - 08:18:06
రాహు కాలం: 08:57:18 - 10:35:20
గుళిక కాలం: 05:41:15 - 07:19:16
యమ గండం: 13:51:24 - 15:29:26
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 23:25:24 - 25:10:16
మరియు 28:33:42 - 30:19:54
సూర్యోదయం: 05:41:15
సూర్యాస్తమయం: 18:45:31
చంద్రోదయం: 04:03:30
చంద్రాస్తమయం: 17:02:38
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మేషం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, 
కార్య హాని 28:40:27 వరకు 
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 208 / Bhagavad-Gita - 208 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 04 🌴*

*04. సాంఖ్యయోగౌ పృథాగ్బాలా: ప్రవదన్తి న పణ్డితా: |*
*ఏకమప్యాస్థిత: సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ||*

🌷. తాత్పర్యం :
*కేవలము అజ్ఞానులే భక్తియోగమును (కర్మయోగము) భౌతికజగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు(సాంఖ్యమునకు) భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మనుజుడు పొందగలడని పండితులు చెప్పుదురు.*

🌷. భాష్యము :
ఆత్మ ఉనికిని తెలిసికొనుటయే భౌతికజగమును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనముయొక్క లక్ష్యమై యున్నది. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగమునకు ఆత్మయై యున్నాడు. శ్రీకృష్ణభగవానునకు ఒనరింపబడు భక్తి ఆ పరమాత్మకు కూర్చబడు సేవయే కాగలదు. ఒక పద్ధతి చెట్టు ములమును కనుగొను విధానము కాగా, ఇంకొక పద్ధతి ఆ మూలమునకు నీరుపోయుట వంటిది. 

నిజమైన సాంఖ్యజ్ఞాన అధ్యయనపరుడు భౌతికజగత్తునకు మూలమైన విష్ణువును తెలిసికొని పూర్ణజ్ఞానముతో అతని సేవ యందు నియుక్తుడగును. అనగా వాస్తవమునకు ఈ రెండు మార్గముల లక్ష్యము విష్ణువేయైనందున రెండింటిలో భేదమేమియును లేదు. అంతిమ ప్రయోజనమును తెలియనివారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు ఏకము కావని పలుకుదురు. కాని పండితుడైనవాడు మాత్రము ఈ రెండుమార్గముల యొక్క ఏకమాత్ర ప్రయోజనమును సంపూర్ణముగా ఎరిగియుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 208 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 04 🌴*

*04. sāṅkhya-yogau pṛthag bālāḥ pravadanti na paṇḍitāḥ*
*ekam apy āsthitaḥ samyag ubhayor vindate phalam*

🌷 Translation : 
*Only the ignorant speak of devotional service [karma-yoga] as being different from the analytical study of the material world [Sāṅkhya]. Those who are actually learned say that he who applies himself well to one of these paths achieves the results of both.*

🌹 Purport :
The aim of the analytical study of the material world is to find the soul of existence. The soul of the material world is Viṣṇu, or the Supersoul. Devotional service to the Lord entails service to the Supersoul. One process is to find the root of the tree, and the other is to water the root. 

The real student of Sāṅkhya philosophy finds the root of the material world, Viṣṇu, and then, in perfect knowledge, engages himself in the service of the Lord. Therefore, in essence, there is no difference between the two because the aim of both is Viṣṇu. Those who do not know the ultimate end say that the purposes of Sāṅkhya and karma-yoga are not the same, but one who is learned knows the unifying aim in these different processes.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 607 / Vishnu Sahasranama Contemplation - 607🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻607. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ🌻*

*ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ*

*శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ*

*శ్రీ శబ్దేన తు లక్ష్యన్తే శ్రీమన్తస్తేషు సర్వదా ।*
*వసతీతి శ్రీనివాస ఇతి కేశవ ఉచ్యతే ॥*

*(ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి 'శ్రీ'గలవారు శ్రీమంతులు.) శ్రీమంతులయందు నిత్యమును వసించువాడుగనుక ఆ కేశవునకు శ్రీనివాసః అను నామము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 607🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻607. Śrīnivāsaḥ🌻*

*OM Śrīnivāsāya namaḥ*

श्री शब्देन तु लक्ष्यन्ते श्रीमन्तस्तेषु सर्वदा ।
वसतीति श्रीनिवास इति केशव उच्यते ॥

*Śrī śabdena tu lakṣyante śrīmantasteṣu sarvadā,*
*Vasatīti Śrīnivāsa iti keśava ucyate.*

*(R‌k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it. Such are known as Śrīmanta.) Lord Keśava who always resides with the Śrīmanta is called Śrīnivāsaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 286 / DAILY WISDOM - 286 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 12. ధ్యానాలుగా వేదమంత్రాలు🌻*

*యోగ సూత్రాలపై వ్యాఖ్యాత అయిన వాచస్పతి మిశ్రా పేర్కొన్నట్లుగా, వేదాలు నుండి పురుష సూక్తం వంటి శ్లోకాల యొక్క అర్ధాన్ని అర్థం చేసుకోవడంతో పాటు రోజువారీ పారాయణం గొప్ప స్వాధ్యాయమని చెప్పవచ్చు. అలాగే, దేవాలయంలో మనం రోజూ,బహుశా దాని అర్థం తెలియకుండానే జపించే శతరుద్రియం, - దానిని సరిగ్గా అర్థం చేసుకుని, సరైన భక్తి దృక్పథంతో పఠిస్తే గొప్ప ధ్యానం. వాచస్పతి మిశ్రా ప్రత్యేకంగా వేదానికి సంబంధించిన రెండు గొప్ప శ్లోకాలను సూచిస్తాడు-పురుష సూక్తం మరియు శతరుద్రియ-అవి చాలా శుద్ధి చేసే మంత్రాలు. అవి మనసుని ధ్యనలగ్నం మరియు ఏకాగ్రం చేయడమే కాక శరీరాన్ని ఎన్నో రకాలుగా శుద్ధి చేస్తాయి. ఈ మంత్రాలను పఠించడం వల్ల శరీరంలో మరియు మొత్తం వ్యవస్థలో ఇది జరుగుతుంది.*

*ఈ వేదమంత్రాలు అణుబాంబుల వంటి అపారమైన శక్తిని కలిగి ఉంటాయి మరియు వాటిని నిర్వహించడం మరియు వాటి బలగాలతో వ్యవస్థను శక్తివంతం చేయడం అనేది ఆధ్యాత్మిక సాధన. ఇది ఒక సూచన. స్వాధ్యాయానికి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. ఇది ఒకరి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది-అది ఎంత వరకు ఏకాగ్రతతో ఉంది, ఎంత వరకు పరధ్యానంలో ఉంది, ఈ కోరికలు లోపల నిరాశగా ఉండి పోయాయి, కోరికలు ఏమి అధిగమించ బడ్డాయి మరియు మొదలైనవి. ఒక వ్యక్తి సాధన చేయవలసిన స్వాధ్యాయ రకాన్ని తన మానసిక స్థితి నిర్ణయిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 286 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 12. Veda Mantras as Meditations 🌻*

*A daily recitation with the understanding of the meaning of such hymns as the Purusha Sukta from the Veda, for instance, is a great svadhyaya, as Vachaspati Mishra, the commentator on the Yoga Sutras, mentions. Also, the Satarudriya - which we chant daily in the temple without perhaps knowing its meaning - is a great meditation if it is properly understood and recited with a proper devout attitude of mind. Vachaspati Mishra specifically refers to two great hymns of the Veda - the Purusha Sukta and the Satarudriya - which he says are highly purifying, not only from the point of view of their being conducive to meditation or concentration of mind, but also in other purifying processes which will take place in the body and the whole system due to the chanting of these mantras.*

*These Veda mantras are immense potencies, like atom bombs, and to handle them and to energise the system with their forces is a spiritual practice by itself. This is one suggestion. There are various other methods of svadhyaya. It depends upon the state of one's mind—how far it is concentrated, how far it is distracted, what these desires are that have remained frustrated inside, what the desires are that have been overcome, and so on. The quality of the mind will determine the type of svadhyaya that one has to practise.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 186 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రతి మనిషి కాంతితో పుట్టాడు. ప్రతి మనిషీ మసకబారాడు. మనిషి చనిపోయే సమయానికి బుద్ధిహీనుడుగా వుంటాడు. అది చిత్రమైన సంగతి. అది పరిణామం అంటూ వుంటారు. కానీ అది అపరిణామం.🍀*

*మనిషి తన ఉనికి చుట్టూ దుమ్ము పేర్చుకుని కాంతిని కోల్పోతాడు. కాంతి అతను జన్మతో తెచ్చుకుంది. ప్రతి మనిషి కాంతితో పుట్టాడు. ప్రతిమనిషీ మసకబారాడు. మనిషి చనిపోయే సమయానికి బుద్ధిహీనుడుగా వుంటాడు. అది చిత్రమైన సంగతి. అది పరిణామం అంటూ వుంటారు. అది అపరిణామం. పిల్లలు చురుగ్గా వుంటారు. సజీవంగా వుంటారు. ప్రతిదాని పట్ల ఎట్లాంటి నిర్ణయం లేకుండా స్పష్టంగా వుంటారు. ఎదిగే కొద్దీ ప్రతి దాన్నించీ అయోమయాన్ని సేకరిస్తారు. మనం 21 ఏళ్ళు వచ్చేదాకా ఆగి అప్పుడు వాళ్ళకు ఓటుహక్కు ఇస్తాం. ఆ సమయానికి ప్రతి ఒక్కడూ మొద్దుబారి పోతాడు. నీరసిస్తాడు. బుద్ధిహీనుడవుతాడు.*

*జనం ఇప్పుడు నువ్వు వయసుకొచ్చావు, అంటారు. కచ్చితంగా రాజకీయవాదులు పిల్లలకు ఓటుహక్కు యివ్వడానికి భయపడతారు. కారణం వాళ్ళు స్పష్టంగా చూస్తారు. నీకు చూసే గుణం కోల్పోయినప్పటికి నీకు ఓటుహక్కు ఇస్తారు. అప్పటికి దాదాపు నువ్వు గుడ్డి వాడివయి వుంటావు. నా ప్రయత్నం మీ తుప్పును వదిలించుకోవడానికి మీకు సాయపడడం. మీ అద్దాన్ని శుభ్రం చేసుకోవడానికి మీకు సాయపడడం. అప్పుడు మీరు యధార్థ వదనాన్ని చూస్తారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 125 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 97. ఒక పొడుపు కథ 🌻*

*అతి ప్రాచీన కాలమున హిందువులు ఒక పిట్టకథను చెప్పుకొనుచుండెడివారు. ఆర్యులలో మొదటి తెగవారే హిందువులు. ఆర్యులలో జ్యేష్టులు వారే. వారు చెప్పుకొను కథ యిట్లున్నది. అనగ అనగ ఒక రాజ్యములో ఒక మహామృగముండెడిది. అది రోజున కొక జీవుని చొప్పున భక్షించుచుండెడిది. ఆ మృగము ఆకాశమున ఎగురగలదు. భూమిపై పరుగిడగలదు. నీటిలో ఈద గలదు. దానికి ముందు చూపేగాని వెనుక చూపు లేదు. అది, అడ్డు, ఆపులేక జీవులను భక్షించుచునే యుండెడిది.*

*ఒకనాడు దాని కంటికొక యోగి కనిపించెను. అతనిని భక్షించుట కుద్యమించెను. యోగి నవ్వుకొని పరుగెత్తుచు, సమీపమున గల ఒక మహా సరస్సున జొరపడెను. మృగము కూడ జొరపడినది. మృగము యోగి కొఱకై వెతుకుచుండగ యోగి మృగము వీపు పైకెక్కి కూర్చుండెను. వెనుక చూపు లేని మృగము యోగికై వెతుకుచు నుండెను. యోగి కనపడక పోగ క్రమముగ మృగమునకు పంతము పెరిగెను. యోగికొరకై వెతుకుట సాగించెను. నేటికిని వెదకులాడు కొనుచునే యున్నది. యోగి మృగము వీపున తన యోగమును సాగించుచునే యున్నాడు. పై కథను విప్పుకొనుట సాధకుల కర్తవ్యము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment