🍀 08 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 08 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 08 - NOVEMBER - 2022 TUESDAY, మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Kartika Pournami to All 🍀
2) 🌹 కపిల గీత - 86 / Kapila Gita - 86 🌹 సృష్టి తత్వము - 42
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 125 / Agni Maha Purana - 125 🌹 🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 2🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 260 / Osho Daily Meditations - 260 🌹 మీ నుండి విముక్తి - LIBERATION FROM YOURSELF
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 2 🌹 'శిష్టేష్టా’- 2 'Sishteshta'- 2

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹08, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Kartika Pournami to All 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం, గురునానక్‌ జయంతి, Kartik Purnima, Chandra Grahan, Guru Nanak Jayanti🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 1 🍀*

*1. వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకమ్ |*
*దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నీలో పెంపొంద వలసిన గుణసంపద నీ పూర్ణత్వ సిద్ధికి దోహదం చేసేదీ, నీ ప్రకృతి ననుసరించి నీలోని ఈశ్వరుడు ఆదేశించేదీ కావాలి. లోకం నుండి మెప్పు, సన్మానం పొందడం దాని లక్ష్యం కారాదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: పూర్ణిమ 16:33:36 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: భరణి 25:40:40 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వ్యతీపాత 21:44:35 వరకు
తదుపరి వరియాన
కరణం: బవ 16:35:36 వరకు
వర్జ్యం: 10:38:24 - 12:18:28
దుర్ముహూర్తం: 08:34:16 - 09:19:55
రాహు కాలం: 14:50:50 - 16:16:25
గుళిక కాలం: 11:59:40 - 13:25:15
యమ గండం: 09:08:30 - 10:34:05
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 20:38:48 - 22:18:52
మరియు 24:36:00 - 26:18:00
సూర్యోదయం: 06:17:20
సూర్యాస్తమయం: 17:41:59
చంద్రోదయం: 17:40:04
చంద్రాస్తమయం: 05:57:51
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
25:40:40 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹. 




*🌹. కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యలకు, Happy Kartika Pournami to All 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 86 / Kapila Gita - 86🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 42 🌴*

*42. కషాయో మధురస్తిక్తః కట్వమ్ల ఇతి నైకధా|*
*భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే॥*

*రసము శుద్ధ స్వరూపములో ఒకటేయైనను ఇతర భౌతిక వస్తువుల కలియక వలన అది వగరు, తీపి, చేదు, కారము, పులుపు, ఉప్పు - మొదలగు రీతిలో పలు విధములుగా రూపొందును.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 86 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 42 🌴*

*42. kaṣāyo madhuras tiktaḥ kaṭv amla iti naikadhā*
*bhautikānāṁ vikāreṇa rasa eko vibhidyate*

*Although originally one, taste becomes manifold as astringent, sweet, bitter, pungent, sour and salty due to contact with other substances.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 125 / Agni Maha Purana - 125 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 39*

*🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 2🌻*

దేవతా విగ్రహమును నగరాభిముఖముగ స్థాపింపవలెను; దేవతల పృష్ఠభాగము నగరము వైపు ఉండగూడదు. దేవాలయ నిర్మాణమును కురుక్షేత్రగయాది తీర్థస్థానములందు గాని, నదీసమీపమునందు గాని చేయవలెను. బ్రహ్మాలయమును నగర మధ్యమునందు, ఇంద్రాలయమును నగరమునకు తూర్పునను నిర్మించిన ఉత్తమ మని చెప్పబడినది. 

అగ్నిదేవునకు, మాతృకలకును ఆగ్నేయదిక్కునందును, భూతగణములకు యుమధర్మరాజునకును దక్షిణమునను, చండికా - పితృగణ-దైత్యాదులకు నైరృతిదిక్కునందును, వరణునకు పశ్చిమమునందును, వాయుదేవునకు, నాగులకు వాయవ్యదిక్కునందును, యక్షులకులేదాకుబేరునకు ఉత్తరమునందును చండీశమహేశునకు ఈశాన్యమునందును, ఆలయమును నిర్మింపవలెను. 

విష్ణ్వాలయము అన్ని దిక్కులందును నిర్మింపవచ్చును. బుద్ధిమంతుడెన్నడును, పూర్వమునుంచియు ఉన్న దేవాలయమున చిన్నది చేసి చిన్న దేవాలయమును గాని, సమానమైనదానిని గాని, విశాలమైనదానిని గాని నిర్మింపరాదు, ఏదైన ఒక దేవాలయమునకు సమీపమున దేవాలయమును నిర్మించునపుడు రెండు దేవాలయముల మొత్తము ఎత్తుకు రెట్టింపు సీమాప్రదేశము విడచి నూతనదేవాలయమును నిర్మింపవలెను. విద్వాంసుడు రెండు దేవాలయములకును పీడ కలుగకుండు నట్లు చూడవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 125 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 39*
*🌻 Preparations of ground for constructing temples - 2 🌻*

9. Even though deficient in all characteristics he who is a. master of the tantras is (to be looked upon as) the preceptor. The image of the deity should be placed facing the city and never turned backwards.

10. At Kurukṣetra, Gayā and other places and near the rivers, (the image of) Brahmā at the centre of the city and (the image of) Indra on the east are auspicious.

11-12. (The images) of Agni, mothers, goblins, and Yama (should be placed) in the south-east. (The images) of Caṇḍikā (should be placed) in the south and those of the manes and demons in the south-west. The temples ofVaruṇa and others should be built in the west. (The images) of Vāyu and Nāga (serpent) (should be) on the north-west and those of Yakṣa and Guha (Kārttikeya) on the north.

13-15. (Those) of Caṇḍīśa (the lord of Caṇḍī), the great lord and Viṣṇu (are) always (placed) in the north-east. One should not knowingly construct a temple of a reduced size or equal in size or bigger in size than another temple already constructed so as to encroach upon it. A wise-man would leave between them a space measuring twice the elevation and erect a new temple without affecting both the temples. After having examined the ground one has to take possession of it.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 260 / Osho Daily Meditations - 260 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 260. మీ నుండి విముక్తి 🍀*

*🕉. జ్ఞానోదయం పారవశ్య స్థితి కాదు; అది పారవశ్యానికి మించినది. 🕉*

*జ్ఞానోదయంలో ఉత్సాహం లేదు; పారవశ్యం అనేది ఉత్సాహం యొక్క స్థితి. పారవశ్యం అనేది ఒక మానసిక స్థితి, అందమైన మానసిక స్థితి, కానీ ఇప్పటికీ మానసిక స్థితి. పారవశ్యం ఒక అనుభవం. జ్ఞానోదయం ఒక అనుభవం కాదు, ఎందుకంటే అనుభవించడానికి ఎవరూ మిగిలి లేరు.*

*పారవశ్యం ఇప్పటికీ అహంలోనే ఉంది, కానీ జ్ఞానోదయం అహంకారానికి మించినది. మీరు జ్ఞానోదయం పొందడం కాదు - మీరు లేకుండా పోవడం జ్ఞానోదయం. జ్ఞానోదయం అంటే మీరు ముక్తి పొందారని కాదు, మీరు ఆ ముక్తిలో ఉండటము కాదు. విముక్తి పొందడం - ఇది మీ నుండి విముక్తి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 260 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 260. LIBERATION FROM YOURSELF 🍀*

*🕉. Enlightenment is not a state of ecstasy; it is beyond ecstasy. 🕉*

*Enlightenment has no excitement in it; ecstasy is a state of excitement. Ecstasy is a state of mind--a beautiful state of mind, but still a state of mind. Ecstasy is an experience. And enlightenment is not an experience, because there is nobody left to experience.*

*Ecstasy is still within the ego, but enlightenment is beyond the ego. It is not that you become enlightened-you are not, then enlightenment is. It is not that you are liberated, it is not that you remain in that liberation, liberated--it is a liberation from yourself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 411. 'శిష్టేష్టా’- 2 🌻* 

*"ఆచారమున ధర్మము లేనప్పుడు ఆరాధన లెన్ని చేసిననూ దైవమునకు ప్రియులు కాలేరు.” 'శిష్టు' అనగా ధర్మాచార పరాయణులు. వీరికి చపలత్వముండదు. చపలత్వ మున్నవారిని గుర్తించుట సులభము. వారి కన్నులు సూటిగా, నిశ్చలముగ చూడలేవు. అటునిటు కదలు చుండును. హస్తములు కూడ పని లేకున్నను కదలుచుండును. పాదములు కూడ కదుపు చుందురు. వాక్కునందు దేనినో దాచుచున్నట్లు భాషణ వ్యక్త మగును. భావములందు స్థిరత్వము, స్పష్టత్వము, అనుస్యుతమగు చేతన యుండదు. పనులయందు ఏమరుపాటు, మితిమీరిన మరపు, ఆలస్యము, అలసత్వము, అపరిపూర్ణత యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 411. 'Sishteshta'- 2 🌻*

*'When there is no dharma in practice, even if you do worship, you will not be loved by God.' 'Sishtu' means the ones who practice dharma. They have no fickleness inside them. It's easy to identify those who are fickle. Their eyes cannot see straight and steady. They keep darting in all directions. Their hands cant be steady if there is no physical work. Their feet cant be steady. They speak as if they are hiding something. Their thoughts shall not be clear and steady with specific purpose. There will be negligence, excessive forgetfulness, tardiness, laziness and imperfection in work.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment