శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀

🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 2 🌻


పంచభూతముల సృష్టి భౌతిక సృష్టిగ పేర్కొందురు. అందు కూడ ఆనందము పొందుటకు వీలుకలదు. దానికి ప్రాతిపదిక పరిశుద్ధత. పంచకోశములను పరిశుద్ధముగా నుంచుకొనుట ఆరాధకునకు ప్రథమ కర్తవ్యము. అపుడే ఆనందము యుండును. శబ్దము వినుట పలుకుట యందు, స్పర్శయందు, రుచియందు, గంధమునందు పరిశుద్ధతను పాటింపవలెను.

అట్లే చూచు విషయముల యందు పరిశుద్దత పాటింపవలెను. అపుడే ఆనందమయుడగు బ్రహ్మయొక్క స్పర్శ, రుచి కలుగును. అపరిశుద్ధులకు యే అనుభూతి యుండదు. భ్రమ భ్రాంతులే యుండును. పంచకోశములు, పంచభూతములు బ్రహ్మము యొక్క రుచిని మాత్రమే కలిగించగలవు. నిజమగు ఆనందము చితశక్తిని కూడినపుడే కలుగును. అది త్రిగుణములకు ఆవల యున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sthita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻

🌻 426. 'Panchakoshantarah Stitha' - 2🌻


The creation of five elements is called physical creation. That too cannot be enjoyed. Purity is the basis for it. The first duty of the worshiper is to clean the five layers( Panchakoshams). Only then will there be happiness. Purity should be observed in speech, touch, taste and smell. Purity should be observed in such things.

Only then will the touch and taste of blissful Brahma come. The impure have no feeling. They have only illusions. The panchakoshams and panchabhutas can only cause the taste of Brahman. Real happiness comes only when there is mental energy. It is beyond trigunas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment