కపిల గీత - 123 / Kapila Gita - 123


🌹. కపిల గీత - 123 / Kapila Gita - 123🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 07 🌴

07. సర్వభూతసమత్వేన నిర్వైరేణాప్రసంగతః|
బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా॥


సకల ప్రాణుల యందును సమభావము కలిగి యుండవలెను. ఎవ్వరి యెడలను వైరభావమును కలిగి యుండరాదు. లౌకిక విషయముల యందు ఆసక్తిని త్యజింప వలెను. బ్రహ్మచర్యమును పాటింపవలెను. భగవంతుని యందే మననశీలుడై యుండవలెను. స్వధర్మములను దృఢముగా ఆచరించుచు వాటి ఫలములను భగవదర్పణము చేయుచుండవలెను.

అప్పుడు ద్వేష భావం తొలగుతుంది. అలా చేయగా అన్ని భూతముల యందు సమానముగా ఉన్న భగవానుని చూస్తావు. అలాంటి భావన వచ్చినప్పుడు దేని యందు ఆసక్తి ఉండకూడదు. ఎవరి మీదా ద్వేషము పొందకుండా, అందరినీ సమముగా చూడాలి. ఇవి జరగాలంటే, శరీర భోగాల మీద ఆసక్తి తగ్గాలి. బ్రహ్మచర్యాన్ని అలవరచుకోవాలి. బ్రహ్మచర్యానికి భంగం కలిగించేది, కనపడిన ప్రతీ వారితో మాటలు కలపడం. బ్రహ్మచర్యానికి మూలం మౌనం. మౌనం అలవాటు చేసుకోవాలి. మౌనం అలవాటు కావాలంటే స్వధర్మాసక్తి కావాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 123 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 07 🌴

07. sarva-bhūta-samatvena nirvaireṇāprasaṅgataḥ
brahmacaryeṇa maunena sva-dharmeṇa balīyasā


In executing devotional service, one has to see every living entity equally, without enmity towards anyone yet without intimate connections with anyone. One has to observe celibacy, be grave and execute his eternal activities, offering the results to the Supreme Personality of Godhead.

A devotee of the Supreme Personality of Godhead who seriously engages in devotional service is equal to all living entities. There are various species of living entities, but a devotee does not see the outward covering; he sees the inner soul inhabiting the body. Because each and every soul is part and parcel of the Supreme Personality of Godhead, he does not see any difference. That is the vision of a learned devotee. As explained in Bhagavad-gītā, a devotee or a learned sage does not see any difference between a learned brāhmaṇa, a dog, an elephant or a cow because he knows that the body is the outer covering only and that the soul is actually part and parcel of the Supreme Lord. A devotee has no enmity towards any living entity, but that does not mean that he mixes with everyone. That is prohibited. Aprasaṅgataḥ means "not to be in intimate touch with everyone." A devotee is concerned with his execution of devotional service, and he should therefore mix with devotees only, in order to advance his objective. He has no business mixing with others, for although he does not see anyone as his enemy, his dealings are only with persons who engage in devotional service.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment