🌹 20, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 20, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 20, FEBRUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita -329 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 19 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 176 / Agni Maha Purana - 176 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 3 / The dimensions of different varieties of the Liṅga - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 041 / DAILY WISDOM - 041 🌹 🌻 10. యోగం అంటే ఆనందం / 10. Yoga is a Process of Rejoicing 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 305 🌹
6) 🌹. శివ సూత్రములు - 43 / Siva Sutras - 43 🌹 
🌻 14. దృశ్యం శరీరం - 2 / 14. Dṛśyaṁ śarīram - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 20, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాఘ, సోమావతి అమావాస్య, Magha, Somvati Amavas🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 21 🍀*

39. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోఽకరః |
మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః 
40. పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్థోఽర్థకరో యశః


🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దైవశక్తిని నీవు గ్రహించి నీ బాహ్య జీవనానికి ఏడుగడగా చేసుకోవాలంటే, మూడు ముఖ్య విషయాలు ఒనగూడాలి. ఒకటి ఏది సంప్రాప్తమైనా మనస్సులో కలతకు తావివ్వని శాంతి, సమత్వం. రెండు పరమ శ్రేయోదాయక మైనదే నీకు సంప్రాప్తం కాగలదన్న పూర్ణవిశ్వాసం. మూడు - దైవ శక్తిని గ్రహించి దాని సాన్నిధ్యమును అనుభవిస్తూ నీ ఇచ్ఛాజ్ఞాన క్రియలను దాని కధీనం చెయ్యగల సామర్థ్యం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: అమావాశ్య 12:36:40 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ధనిష్ట 11:47:41 వరకు
తదుపరి శతభిషం
యోగం: పరిఘ 11:02:58 వరకు
తదుపరి శివ
కరణం: నాగ 12:37:40 వరకు
వర్జ్యం: 18:09:12 - 19:34:08
దుర్ముహూర్తం: 12:53:11 - 13:39:48
మరియు 15:13:02 - 15:59:39
రాహు కాలం: 08:07:38 - 09:35:03
గుళిక కాలం: 13:57:17 - 15:24:41
యమ గండం: 11:02:27 - 12:29:52
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 02:39:42 - 04:03:54
మరియు 26:38:48 - 28:03:44
సూర్యోదయం: 06:40:14
సూర్యాస్తమయం: 18:19:31
చంద్రోదయం: 06:45:35
చంద్రాస్తమయం: 18:31:19
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 11:47:41 వరకు తదుపరి
అమృత యోగం - కార్య సిధ్ది
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 329 / Bhagavad-Gita - 329 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 19 🌴*

*19. భూతగ్రామ: స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |*
*రాత్ర్యాగమేవశ: పార్థ ప్రభవత్యహరాగమే ||*

🌷. తాత్పర్యం :
*బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనపుడు జీవులు మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు.*

🌷. భాష్యము :
భౌతికజగమునందే నిలుచుట యత్నించు మందమతులు ఒకవేళ ఉన్నతలోకములను చేరినను నిశ్చయముగా తిరిగి ఈ భూలోకమునకు రావలసివచ్చును. 

వారు బ్రహ్మదేవుని పగటి సమయమున భౌతికమందలి ఊర్థ్వ, అధోలోకములందు తమ కార్యములను చేయుచు బ్రహ్మదేవుని రాత్రిసమయము అరుదెంచగనే నశించిపోవుదురు. 

తమ కామ్యకర్మలకై వారు బ్రహ్మదేవుని పగటి యందు పలువిధములైన దేహములను పొందినను, అతని రాత్రిసమయమున ఎటువంటి దేహము లేకుండా విష్ణువు యొక్క దేహమందు నిలిచియుండి, తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే మరల వ్యక్తమగుచుందురు. “భూత్వా భూత్వా ప్రలీయతే – పగటియందు వ్యక్తమై రాత్రి యందు మరల నశింతురు.” 

చివరికి బ్రహ్మదేవుని ఆయుష్షు తీరినంతనే వారందరును నశించిపోయి కోట్లాది సంవత్సరములు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. తిరిగి బ్రహ్మదేవుడు జన్మించగనే వారును మరల వ్యక్తమగుదురు. ఈ విధముగా వారు భౌతికజగత్తు మాయచే మోహితులగుదురు. 

కాని కృష్ణభక్తిరసభావనను స్వీకరించు జ్ఞానవంతులైన మనుజులు మాత్రము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే – యను కృష్ణనామకీర్తనము చేయుచు శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందే మానవజన్మను నియోగింతురు. 

ఆ విధముగా వారు ఈ జన్మమునందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలు లేకుండా నిత్యానందభాగులు కాగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 329 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 19 🌴*

*19 . bhūta-grāmaḥ sa evāyaṁ bhūtvā bhūtvā pralīyate*
*rātry-āgame ’vaśaḥ pārtha prabhavaty ahar-āgame*

🌷 Translation : 
*Again and again, when Brahmā’s day arrives, all living entities come into being, and with the arrival of Brahmā’s night they are helplessly annihilated.*

🌹 Purport :
The less intelligent, who try to remain within this material world, may be elevated to higher planets and then again must come down to this planet earth. 

During the daytime of Brahmā they can exhibit their activities on higher and lower planets within this material world, but at the coming of Brahmā’s night they are all annihilated. 

In the day they receive various bodies for material activities, and at night they no longer have bodies but remain compact in the body of Viṣṇu. 

Then again they are manifest at the arrival of Brahmā’s day. Bhūtvā bhūtvā pralīyate: during the day they become manifest, and at night they are annihilated again. Ultimately, when Brahmā’s life is finished, they are all annihilated and remain unmanifest for millions and millions of years. 

And when Brahmā is born again in another millennium they are again manifest. In this way they are captivated by the spell of the material world. 

But those intelligent persons who take to Kṛṣṇa consciousness use the human life fully in the devotional service of the Lord, chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. 

Thus they transfer themselves, even in this life, to the spiritual planet of Kṛṣṇa and become eternally blissful there, not being subject to such rebirths.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 176 / Agni Maha Purana - 176 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*

*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 3 🌻*

ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణమగును. హస్తప్రమాణముచే లింగమును నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటె ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగ తొమ్మిది హస్తములు కొలత పూర్తిఅగు వరకు ఒక్కొక్క హస్తము పెంచుతు పోవలెను. పైన చెప్పిన హీన-మధ్యమ-జ్యేష్ఠ లింగములో ఒక్కొక్క దానికి మూడేసి భేదములుండను.

బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ. మూడేసి లింగములు నిర్మింప చెయవలెను. ద్వారమానము, గర్భమానము, హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నిర్మింపవలెను. పై మూడు ప్రమాణముల ననుసరించి భగేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును. విష్కంభ (విస్తార) మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదికముండు నట్లు చూచు కొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తములుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములున్నదో ఆ హస్తములను అంగుళములలోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజింపవలెను. మిగిలిన దానిని పట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను.

ధ్వజాద్యాయములలో ధ్వజ - సిహ - గజ - వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే - అనగా ఏడుచేత భాగించినపుడు షడ్జ-గాంధార-పంచమములు (శేషము) సుభదాయకములు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 176 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 54*
*🌻The dimensions of different varieties of the Liṅga - 3 🌻*

18. In this way there would be nine lines. The middle (variety of liṅga) would have five lines. The length of the liṅgas should be nine fingers. The opposite side (should be) separated by two intermediate links.

19. The liṅga is measured out cubit by cubit till it would be nine hands (length). The liṅga is of three kinds—inferior, mediocre and superior.

20-22. A wiseman should mark three liṅgas at the centre of every liṅga foot by foot at fourteen (places) by a fixed measure of length of the door or the adytum. Four liṅgas representing Śiva, Viṣṇu, Bṛhaspati proportionately should be marked by the breadth. The liṅga should be (shaped) long to represent the three forms.

23. The liṅga should have a circumference of four, eight, eight (inches) representing the three qualities. One should make the liṅgas of such lengths as one desires.

24. One should divide the figure (marked) by the banners, celestial gods, elements or cocks. One should know the good or bad from the inches left over.

25. The banners etc., the crows, lions, elephants and goats are excellent. The others are auspicious. Among the primary notes of Indian gamut, the first one, second one and the fifth one confer good.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 41 / DAILY WISDOM - 41 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి  🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 10. యోగ అంటే ఆనందం 🌻*

*యోగ అంటే ఆనందం. ఇది బాధ కాదు. ఇది ఆనందంలోకి ప్రయాణం. ఒక ఆనంద స్థితి నుండి, మనం మరొక ఆనంద స్థితికి ప్రయాణం. యోగము అనేది దుఃఖంతో మొదలవుతుందని కాదు. మనల్ని నిర్బంధించే ఒక రకమైన జైలు గృహమని కాదు.  యోగం అనేది మనిషి యొక్క సాధారణ జీవితానికి ఒక హింస, బాధ అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. సాధన అంటే భయం, మరియు ఒక అసహజమైన తీవ్రతను సూచిస్తుంది. ఇది తరచుగా జరుగుతుంది.*

*ఎందుకంటే ప్రజలు యోగ గురించి తమలో తాము ఒక తీవ్రత మరియు దృఢత్వం యొక్క చిత్రాన్ని రూపొందించుకున్నారు. ప్రాపంచికత మరియు మానవుని సహజ అభిరుచుల నుండి యోగ సాధనని విడిగా చూసారు. మన కోరికలు, నిస్సందేహంగా, యోగానికి అడ్డంకులే. కానీ అవి ‘మన’ కోరికలు; ఇది మనం గుర్తుంచుకోవాలి. అవి ఎవరివో కావు. కాబట్టి, ఈ కోరికల నుండి మనల్ని మనం క్రమంగా వేరు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మన చర్మాన్ని మనమే ఒలుచుకున్నట్లు అనిపించకూడదు. అటువంటి కఠినమైన చర్య తీసుకోకూడదు. అది యోగా యొక్క ఉద్దేశ్యం కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 41 🌹*
*🍀 📖  Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 10. Yoga is a Process of Rejoicing 🌻*

*Yoga is a process of rejoicing. It is not a suffering. It is a movement through happiness. From one state of joy, we move to another state of joy. It is not that yoga starts with sorrow, or that it is a kind of prison house into which we are thrown.  We have sometimes a feeling that yoga is a torture, a suffering, to the normal life of man. Sadhana means a fear, and indicates an unnatural seriousness.*

*This is so, often because people have created a picture of awe and sternness about yoga, an other-worldliness about it, dissociated from the natural likings of the human being. Our desires are, no doubt, obstacles to yoga.  But they are ‘our’ desires; this much we must remember, and they are not somebody’s. So, we have to wean ourselves from these desires gradually and not make it appear that we are peeling our own skin. Such a drastic step should not be taken, and it is not the intention of yoga.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 306 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీకు నీ గురువులో, తల్లిదండ్రులో చెప్పందే నీకు దేవుడి గురించి తెలీదు. దేవుడి గురించి ఆలోచనే రాదు. అందువల్ల నేను ఆనందమే దేవుడు, మరో దేవుడు లేడంటాను. తక్కిన యితర దేవతలందరూ సృష్టింప బడిన వాళ్ళే. 🍀*

*జనాలు దేవుడి గురించి ఆలోచిస్తూ, దేవుడి గురించి వాదిస్తూ వాళ్ళ జీవితాల్ని వ్యర్థం చేసుకుంటారు. ఎప్పుడూ వాళ్ళ హృదయ స్పందనల్ని వినరు. హృదయానికి దేవుడి గురించిన కోరిక లేదు. హృదయం కేవలం నాట్యం చేయాలంటుంది. పాట పాడాలంటుంది. ఆనందిచడాన్ని, జీవించడాన్ని, ప్రేమించడాన్ని, ప్రేమింపబడడాన్ని కోరుకుంటుంది. పరిమళభరితమయిన పువ్వులా జీవించడాన్ని కోరుకుంటుంది.*

*ఆకాశంలో పక్షిలా విహారించాలను కుంటుంది. జీవితాంధకారంలో కాగడాలా వెలగాలను కుంటుంది. దేవుడి గురించి ఆరాటపడదు. నీకు నీ గురువులో, తల్లిదండ్రులో చెప్పందే నీకు దేవుడి గురించి తెలీదు. దేవుడి గురించి ఆలోచనే రాదు. అందువల్ల నేను ఆనందమే దేవుడు, మరో దేవుడు లేడంటాను. తక్కిన యితర దేవతలందరూ సృష్టింప బడిన వాళ్ళే. వాళ్ళందరినీ వదిలేసి మనం సరయిన దిక్కులో వెళ్ళడం మేలు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 043 / Siva Sutras - 043 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 14. దృశ్యం శరీరం - 2 🌻*
*🌴. ఈ శరీరం కనిపించే నేను. ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది. 🌴*

*సూక్ష్మశరీరం స్థూలరూపం నుండి భిన్నమైనది కాదని అతను అర్థం చేసుకున్నాడు. అతను ద్వంద్వత్వంతో కట్టుబడి ఉండడు. అతనికి, వస్తు ప్రపంచం మరియు అతని స్వయం విభిన్న వస్తువులు కావు. రెండవ వివరణ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అతను తన శరీరాన్ని వస్తువుగా భావిస్తాడు. సాధారణంగా, ఎవరైనా వస్తువులను తమలో భాగంగా పరిగణిస్తారు. నా కారు, నా ఇల్లు మొదలైనవాటిగా గుర్తిస్తారు. అందువల్ల శరీరమే విషయంగా మారుతుంది, కానీ యోగి తన స్వంత శరీరాన్ని మరొక వస్తువుగా మాత్రమే భావిస్తాడు.*

*విషయం లేనప్పుడు వ్యక్తి స్వీయ లేదా 'నేను' అనే ప్రశ్న తలెత్తదు. అతని వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంగా మారుతుంది. 'నా మరియు నాది' ఉపయోగించబడినంత కాలం, ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడదు. అజ్ఞానం నుండి ఉద్భవించే భ్రమ మాత్రమే అటువంటి భేదానికి కారణం. చైతన్యం యొక్క నిమ్న దశలలో మాత్రమే భ్రమ ఉంటుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 043 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 14. Dṛśyaṁ śarīram - 2 🌻*
*🌴. The body is the visible self. It houses the true self, which is invisible.🌴*

*He understands that microcosm is not different from macrocosm. He is not bound by duality. For him, the objective world and his own self in not different objects. The second interpretation is a little more intricate. He considers his very body as on object. Generally, someone identifies objects as my body, my car, my home, etc. Hence body becomes the subject, but a yogi considers his own body as yet another object.*

*When there is no subject the question of individual self or “I” does not arise. His individual consciousness transforms into universal consciousness. As long as ‘my and mine’ are used, spiritual progression is not feasible. It is only the illusion that arises out of ignorance is the reason for such differentiation. Illusion is possible only in the normal stages of consciousness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment