శ్రీమద్భగవద్గీత - 351: 09వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 351: Chap. 09, Ver. 13

 


🌹. శ్రీమద్భగవద్గీత - 351 / Bhagavad-Gita - 351 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 13 🌴

13. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ పృథాకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించియుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు.

🌷. భాష్యము :

మహాత్ములైనవారి వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దైవీప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతడెన్నడును భౌతికప్రకృతికి లోబడియుండడు. అది ఎట్లు సాధ్యమనెడి విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతికప్రకృతి యొక్క అధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని అధీనము చేసినంతనే భౌతికప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగాలడన్నది ప్రాథమికసూత్రము. తటస్థశక్తియైన జీవుడు భౌతికశక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మికశక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మికప్రకృతి నిర్దేశమే “దైవీప్రకృతి” యని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణభగవానునికి శరణమునొంది ఆ విధముగా పురోగతి నొందినపుడు మనుజుడు “మహాత్ముడు” అనెడి స్థాయిని పొందగలడు.

శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసియున్నందున మహాత్ముడైనవాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపునకు మళ్ళింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధభక్తుల సాంగత్యము వలననే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధభక్తులైనవారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజరూపమునందే అనురాగమును, ఆకర్షణను కలిగియుందురు. కృష్ణుని ఇతర రూపముల యెడ గాని, ఇతర దేవతల యెడగాని, మనుజుల యెడగాని వారెన్నడును ఆకర్షుతులు కారు. సంపూర్ణ భక్తిభావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి, ఆ కృష్ణభక్తిరసభావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై యుందురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 351 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 13 🌴

13 . mahātmānas tu māṁ pārtha daivīṁ prakṛtim āśritāḥ
bhajanty ananya-manaso jñātvā bhūtādim avyayam


🌷 Translation :

O son of Pṛthā, those who are not deluded, the great souls, are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know Me as the Supreme Personality of Godhead, original and inexhaustible.

🌹 Purport :

In this verse the description of the mahātmā is clearly given. The first sign of the mahātmā is that he is already situated in the divine nature. He is not under the control of material nature. And how is this effected? That is explained in the Seventh Chapter: one who surrenders unto the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, at once becomes freed from the control of material nature. That is the qualification. One can become free from the control of material nature as soon as he surrenders his soul to the Supreme Personality of Godhead. That is the preliminary formula. Being marginal potency, as soon as the living entity is freed from the control of material nature, he is put under the guidance of the spiritual nature.

The guidance of the spiritual nature is called daivī prakṛti, divine nature. So when one is promoted in that way – by surrendering to the Supreme Personality of Godhead – one attains to the stage of great soul, mahātmā. The mahātmā does not divert his attention to anything outside Kṛṣṇa, because he knows perfectly well that Kṛṣṇa is the original Supreme Person, the cause of all causes. There is no doubt about it. Such a mahātmā, or great soul, develops through association with other mahātmās, pure devotees. Pure devotees are not even attracted by Kṛṣṇa’s other features, such as the four-armed Mahā-viṣṇu. They are simply attracted by the two-armed form of Kṛṣṇa. They are not attracted to other features of Kṛṣṇa, nor are they concerned with any form of a demigod or of a human being. They meditate only upon Kṛṣṇa in Kṛṣṇa consciousness. They are always engaged in the unswerving service of the Lord in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment