1) 🌹 07, APRIL 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 159 / Kapila Gita - 159 🌹
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 13 / 4. Features of Bhakti Yoga and Practices - 13 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 751 / Vishnu Sahasranama Contemplation - 751 🌹
🌻751. త్రిలోకధృక్, त्रिलोकधृक्, Trilokadhrk🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 711 / Sri Siva Maha Purana - 711 🌹
🌻. శివస్తుతి - 3 / Prayer to Śiva - 3 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 331 / Osho Daily Meditations - 331 🌹
🍀 331. ప్రార్థన / 331. PRAYER 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 445-2 🌹
🌻 445. ‘శాంతిః'- 2 / 445. 'Shantih'- 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 07, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -39 🍀*
*39. క్షామాదితాపహారిణి నవధాన్యరూపే అజ్ఞాన ఘోరతిమిరా పహజ్ఞానరూపే ।*
*దారిద్ర్యదుఃఖపరిమర్దితభాగ్యరూపే లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సాక్షాత్కారానుభవం - జాగ్రదవస్థకు అతీతమైన సమాధి స్థితిలో సాక్షాత్కారం కలిగిన మాత్రాన చాలదు. జాగ్రదావస్థలో సైతం సాక్షాత్కారానుభవం కలిగి సుస్థిరం కావాలి. ఇందుకొరకై అంతకంతకు సువిశాల మగుచుండెడి ప్రశాంత చైతన్యమున కృషి సాగించడంలోనే సాధనతో పాటు సిద్ధి కూడా కలిసివస్తుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 10:22:16
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: చిత్ర 13:34:24 వరకు
తదుపరి స్వాతి
యోగం: హర్షణ 25:25:47 వరకు
తదుపరి వజ్ర
కరణం: కౌలవ 10:19:16 వరకు
వర్జ్యం: 19:15:50 - 20:53:30
దుర్ముహూర్తం: 08:35:14 - 09:24:50
మరియు 12:43:13 - 13:32:49
రాహు కాలం: 10:45:25 - 12:18:25
గుళిక కాలం: 07:39:26 - 09:12:26
యమ గండం: 15:24:24 - 16:57:24
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:42
అమృత కాలం: 06:56:24 - 08:35:48
మరియు 29:01:50 - 30:39:30
సూర్యోదయం: 06:06:26
సూర్యాస్తమయం: 18:30:24
చంద్రోదయం: 19:38:10
చంద్రాస్తమయం: 06:44:36
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ముసల యోగం - దుఃఖం
13:34:24 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 159 / Kapila Gita - 159 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 13 🌴*
*13. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణమ్|*
*నీలోత్పలదళశ్యామం శంఖచక్రగదాధరమ్॥*
*తాత్పర్యము : ఆ శ్రీమన్నారాయణుని యొక్క వదనారవిందము ప్రసన్నమై యుండును. నేత్రములు పద్మకోశముల వలె అరుణవర్ణ శోభితములు. మేను నల్లగలువల రేకుల వలె శ్యామవర్ణముతో విలసిల్లు చుండును. ఆ స్వామి నాల్గు భుజముల యందును శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించి యుండును.*
*వ్యాఖ్య : పద్మ పత్రముల వంటి, ఎర్రాగా ఉన్న, నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడూ, అయిన పరమాత్మని ధ్యానం చేయాలి. పరమాత్మ ఆత్మగా ఉన్న జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం వలన ప్రకృతి మనని బంధించదు. అలాంటి పరమాత్మని చేరడానికి జ్ఞ్యాన కర్మాదులతో కూడి ఉన్న భక్తి యోగం సహకరిస్తుంది. దానికి అన్ని ఇంద్రియాలనూ మనసులో, మనసును హృదయములో చేర్చాలి. మనసు ప్రాణాయామముతో మనం చెప్పినట్లు వింటుంది. పరమాత్మ భూషణాలూ, ఆయుధాలు ఉన్న పరమాత్మని ధ్యానించాలి. హృదయ దహరాకాశములో స్వామి ఉంటాడు. ఎలాంటి స్వామిని ధ్యానించాలి. పడుకుని ఉన్నా, కూర్చుని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. సంపూర్ణ ధ్యానం చేయాలి. కేశముల నుండీ పాదముల వరకూ, పాదముల నుండీ కేశముల వరకూ ధ్యానించవచ్చు. ఒకే సారి పరమాత్మను మొత్తం ధ్యానములో నిల్పుకోలేని నాడు, ఒక్కొక్క అవయవాన్నే ముందు పెట్టుకుంటూ దాని మీదే ధ్యానం చేయాలి. ఇతర ఏ విషయములవైపూ మనసు వెళ్ళకుండా, పరమాత్మ యొక్క ఆ అవయవం మీదే ధ్యానం కుదిరే వరకూ చేయాలి. ఇలాంటి ఏకాగ్రత కలిగిన తరువాత సాంసారికమైన విషయాలు బాధించవు. ఇది సులభ ఉపాయం.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 159 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 4. Features of Bhakti Yoga and Practices - 13 🌴*
*13. prasanna-vadanāmbhojaṁ padma-garbhāruṇekṣaṇam*
*nīlotpala-dala-śyāmaṁ śaṅkha-cakra-gadā-dharam*
*MEANING : The Supreme Personality of Godhead has a cheerful, lotuslike countenance with ruddy eyes like the interior of a lotus and a swarthy body like the petals of a blue lotus. He bears a conch, discus and mace in three of His hands.*
*PURPORT : It is definitely recommended herein that one concentrate his mind upon the form of Viṣṇu. There are twelve different forms of Viṣṇu, which are described in Teachings of Lord Caitanya. One cannot concentrate his mind on anything void or impersonal; the mind should be fixed on the personal form of the Lord, whose attitude is cheerful, as described in this verse. Bhagavad-gītā states that meditation on the impersonal or void features is very troublesome to the meditator. Those who are attached to the impersonal or void features of meditation have to undergo a difficult process because we are not accustomed to concentrating our minds upon anything impersonal. Actually such concentration is not even possible. Bhagavad-gītā also confirms that one should concentrate his mind on the Personality of Godhead.*
*The color of the Personality of Godhead, Kṛṣṇa, is described here as nīlotpala-dala, meaning that it is like that of a lotus flower with petals tinted blue and white. The Lord's appearance is described here as padma-garbhāruṇekṣaṇam. His eyes resemble the inside of a lotus flower, and in His four hands He holds the four symbols: conchshell, discus, mace and lotus.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 751 / Vishnu Sahasranama Contemplation - 751🌹*
*🌻751. త్రిలోకధృక్, त्रिलोकधृक्, Trilokadhrk🌻*
*ఓం త్రిలోకధృషే నమః | ॐ त्रिलोकधृषे नमः | OM Trilokadhrṣe namaḥ*
*త్రిలోకధృగితి ప్రోక్తః లోకాంస్త్రీన్ యోహ్యధారయత్*
*మూడు లోకములను ధరించువాడు కనుక లోకధృక్ అని నుతింపబడును.*
:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ.పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మతే.సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)
*లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేదసంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములుగలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతములేనివాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 751🌹*
*🌻751. Trilokadhrk🌻*
*OM Trilokadhrṣe namaḥ*
*त्रिलोकधृगिति प्रोक्तः लोकांस्त्रीन् योह्यधारयत् / Trilokadhrgiti proktaḥ lokāṃstrīn yohyadhārayat*
*Since He supports the three worlds, He is called Trilokadhrk.*
:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.
My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥
Amānī mānado mānyo lokasvāmī trilokadhrk,Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 712 / Sri Siva Maha Purana - 712 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴*
*🌻. శివస్తుతి - 3 🌻*
*ఓ జగద్గురూ! చూడబడే, వినబడే, తెలియబడే సర్వము నీవే. నీవు అణువు కంటె సూక్ష్మతరుడవు. మిక్కిలి పెద్ద దానికంటె పెద్దవాడవు అని ఋషులు చెప్పుచున్నారు (18). సర్వత్రా నీ చేతులు, కాళ్లు, కళ్లు, శిరస్సులు, ముఖములు, చెవులు, ముక్కులు గలవు. సర్వాత్మకుడవగు నీకు నమస్కారము (19). ఓ సర్వవ్యాపీ! సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మాయావరణము లేనివాడు, జగద్రూపుడు, ముక్కంటి అగు నిన్ను అన్ని దిక్కుల యందు నమస్కరించు చున్నాను (20). సర్వేశ్వరుడు, జగదధ్యక్షుడు, సత్యస్వరూపుడు, మంగళ స్వరూపుడు, సర్వోత్కృష్టుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అగు నీకు సర్వదిక్కుల యందు నమస్కరించు చున్నాను (21).*
*జగత్తునకు ప్రభువు, ఆద్యంతములు లేనివాడు, ఇరువదియారు తత్త్వములను ప్రవర్తిల్ల జేయువాడు, తనకంటె పైన ప్రభువు లేనివాడు, సర్వప్రాణులను ప్రవర్తిల్ల జేయువాడు అగు నిన్ను అన్ని వైపుల నుండియూ నమస్కరించు చున్నాను (22). ప్రకృతికి చైతన్యము నిచ్చి అనుగ్రహించు వాడు, సర్వజగత్తును సృష్టించిన బ్రహ్మకు తండ్రి, సర్వదేవతాస్వరూపుడు, ఈశ్వరుడు అగు నిన్ను అన్ని విధములుగా నమస్కరించు చున్నాను (23). వేదములు, వేదవేత్తలు నిన్ను వరముల నిచ్చువాడనియు, సర్వులకు అధిష్టానమనియు, స్వయంసిద్ధుడవనియు వర్ణించుచున్నారు (24).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 712 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 06 🌴*
*🌻 Prayer to Śiva - 3 🌻*
18. Whatever is seen, heard or eulogised, whatever is being realised, O preceptor of the universe, are you alone. They call you minuter than the atom and greater than the greatest.
19. I bow to you everywhere, you who have hands, legs, eyes, heads, mouths, ears and noses everywhere.
20. I bow to you everywhere, you who are omniscient who pervade everything, you who are unveiled as the lord of al, you who are omniformed and odd-eyed.
21. I bow to you everywhere who are the lord of all, who preside over the worlds, who are the excellent Satya and Śiva and who have the refulgence of innumerable suns.
22. I bow to you everywhere, you the lord of the universe devoid of beginning and end, the lord of the twenty six Tattvas[1] and the activiser of everything.
23. I bow to you everywhere you the activiser of the Prakṛti, the great grandfather of everyone, the lord, the body of everyone.
24. The Śrutis and those who know the essence of Śrutis speak of you thus. You are the abode of all, the selfborn and the knower of the essence of Śrutis.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 331 / Osho Daily Meditations - 331 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 331. ప్రార్థన 🍀*
*🕉. నేర్చుకుని నిర్వహించే ప్రార్ధనని విడిచి పెట్టాలి. ప్రార్ధన అనేది ఆకస్మిక ప్రవాహంగా ఉండాలి. 🕉*
*చాలా మంది ప్రజలు చర్చిలలో, దేవాలయాలలో ప్రార్థనలు చేస్తారు కానీ ఏమీ జరగదు; ఇకపైన కుడా ఏమీ జరగదు. వారు అనేక జన్మలు ప్రార్థించవచ్చు కానీ ఏమీ జరగదు, ఎందుకంటే వారి ప్రార్థన సహజంగా వచ్చినది కాదు. వారు దానిని నిర్వహిస్తున్నారు; అది మనస్సు ద్వారా. వారు చాలా తెలివైనవారు, కానీ ప్రార్థన పనిచేయాలంటే మీరు
మూర్ఖులు కావాలి. ప్రార్థన ఒక మూర్ఖత్వం. మీరు దేవునితో మాట్లాడు తున్నారని మీకు ఇబ్బందిగా కూడా అనిపించ వచ్చు. ఇది మూర్ఖత్వంలా ఉండాలి, కానీ అది పని చేస్తుంది.*
*మూర్ఖత్వం జ్ఞానం, మరియు జ్ఞానం మూర్ఖత్వం అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థన అవసరమని మీకు అనిపించినప్పుడల్లా, దానిని ఉపయోగించండి. మీరు దీన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. మరియు ధ్యానం నుండి మీ ప్రార్థన తీవ్రమవుతుంది. మీరు లోపల ప్రార్థించినపుడు శరీరంలో ఏదైనా జరిగితే, అది ఏమైనా సరే అనుమతించండి. శరీరానికి ఏదైనా కదలిక వచ్చినా, ఏదైనా శక్తి శరీరంలో కదలటం మొదలయినా లేదా మీరు ఒక బలమైన గాలికి చిన్న ఆకులా మారినా, ప్రార్థన చేసి దానిని అనుమతించండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 331 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 331. PRAYER 🍀*
*🕉. Prayer should be unlearned; it should be spontaneous. 🕉*
*Many people pray in the churches, in the temples, and nothing happens; nothing is going to happen. They can go on praying for lives together and nothing will happen, because their prayer is not spontaneous. They are managing it; it is through the mind. They are too wise, and for a prayer to function you have to be a fool. Prayer is foolish--you may even feel awkward that you are talking to God. It is foolish, but it works.*
*There are times when foolishness is wisdom, and wisdom is foolishness. So whenever you feel a moment when prayer is needed, use it. The more you use it, the more it will become available. And out of meditation your prayer will deepen. You pray inside, and if something happens in the body, allow it, whatever it is. If any movement comes to the body, any energy starts waving in the body or if you become like a small leaf in a strong wind, just pray and allow it.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 445 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।*
*శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀*
*🌻 445. ‘శాంతిః'- 2 🌻*
*త్రిగుణముల యందు పంచభూతముల యందు వసించు వారికి శాంతి యెట్లు కలుగును? అష్టప్రకృతులు కావల శాంతి యున్నది. దానిని పొందినవారు అష్ట ప్రకృతులలో కూడ శాంతియుతముగ వసింతురు. అష్టప్రకృతుల కావలయున్నది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము పొందుటకు అనుస్మరణమే మార్గము. అనుస్మరణమే నిజమగు ఆరాధనము. అనుస్మరణమున శ్రీమాత సాన్నిధ్యమున వసించు వారికి సృష్టి యందెచ్చట నైననూ శాంతి లభింపగలదు. అట్టి శాంతి నిచ్చునది శ్రీమాత. అక్షరములలో చివరి ఎనిమిది అక్షరములను శాంతము లందురు. అవి వరుసగ య, ర, ల, వ, శ, ష, స, హ, ఈ ఎనిమిది అక్షరములు బీజాక్షరము లగుటచే శాంతి వర్ణములు. యం, రం, లం, వం, శం, షం, సం, హం. వీనిని రకరకములుగ 'ఈం' కారముతో చేర్చి ఋషులు మంత్రముల నేర్పరచిరి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 445 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih*
*Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻*
*🌻 445. 'Shantih'- 2 🌻*
*How can peace come to those who live in the trigunas and panchabhutas? Peace is beyond Ashta Prakriti. Those who attain it live peacefully even in Ashta Prakriti. The one beyond Ashta Prakritis is Sri Mata herself. Continuous remembrance of Sri Mata is the only way to get her grace. Remembrance is the only true worship. Those who dwell in the presence of Sri Mata through continuous remembrance of Her can find peace anywhere in the world. Srimata is the giver of such peace. The last eight letters of the alphabet are called shantamulu. They are Ya, Ra, La, Va, Sha, Sha, Sa, Ha. These eight letters are the symbols of peace as they are Bijakshara. Yam, Ram, Lum, Vam, Sham, Sham, Sam, Ham. Sages combined these in various ways with 'Eem' and created mantras.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
No comments:
Post a Comment