✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 14 🌴
14. సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతా: |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
🌷. తాత్పర్యం :
ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు, నాకు నమస్కారమొసగుచు, నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.
🌷. భాష్యము :
సామాన్యమానవునికి అధికారికముగా ముద్రవేయుట ద్వారా మహాత్ముడు కాజాలడు. మహాత్ముని లక్షణములు ఇట వర్ణింపబడినవి. మాహాత్ముడైనవాడు సదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుట యందే నిమగ్నుడై యుండును. దానికి అన్యమైన కర్మ ఏదియును లేకుండా ఆ భక్తుడు కీర్తనమందే సదా నియుక్తుడై యుండును. అనగా అతడెన్నడును నిరాకారవాది కాడు. కీర్తనమను విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని పవిత్రనామమును, దివ్యరూపమును, దివ్యగుణములను, అసాధారణలీలలను కీర్తించుటకే ఉపయోగించవలెను. అవన్నియును ప్రతియోక్కరిచే కీర్తనీయములు కనుకనే మహాత్ముడైనవాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురక్తుడై యుండును. శ్రీకృష్ణభగవానుని నిరాకారరూపమైన బ్రహ్మజ్యోతి యెడ అనురక్తుడై యుండెడివాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడినాడు.
శ్రీమద్భాగవతమున తెలుపబడినట్లు మహాత్ముడైనవాడు విష్ణువు యొక్క శ్రవణ, కీర్తనములను కూడిన భక్తియుతసేవ యందు సదా నిమగ్నుడై యుండును. అతడు శ్రీకృష్ణభగవానుని సేవలోనే నిలుచునుగాని, దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు. ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి(శ్రవణం, కీర్తనం, విష్ణో: స్మరణం) యనబడును. దివ్యమైన ఐదు భక్తిరసములలో ఏదేని ఒక భక్తిరసము ద్వారా అంత్యమున అ భగవానునితో నిత్య సాహచార్యమును పొందవలెనని ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగయుండును. దాని యందు జయమును పొందుట అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటిని ఆ దేవదేవుని సేవ యందే నియోగించును. అదియే సంపూర్ణ కృష్ణభక్తిరస భావనమని పిలువబడుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 352 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 14 🌴
14 . satataṁ kīrtayanto māṁ yatantaś ca dṛḍha-vratāḥ
namasyantaś ca māṁ bhaktyā nitya-yuktā upāsate
🌷 Translation :
Always chanting My glories, endeavoring with great determination, bowing down before Me, these great souls perpetually worship Me with devotion.
🌹 Purport :
The mahātmā cannot be manufactured by rubber-stamping an ordinary man. His symptoms are described here: a mahātmā is always engaged in chanting the glories of the Supreme Lord Kṛṣṇa, the Personality of Godhead. He has no other business. He is always engaged in the glorification of the Lord. In other words, he is not an impersonalist. When the question of glorification is there, one has to glorify the Supreme Lord, praising His holy name, His eternal form, His transcendental qualities and His uncommon pastimes. One has to glorify all these things; therefore a mahātmā is attached to the Supreme Personality of Godhead.
One who is attached to the impersonal feature of the Supreme Lord, the brahma-jyotir, is not described as mahātmā in the Bhagavad-gītā. He is described in a different way in the next verse. The mahātmā is always engaged in different activities of devotional service, as described in the Śrīmad-Bhāgavatam, hearing and chanting about Viṣṇu, not a demigod or human being. That is devotion: śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ and smaraṇam, remembering Him. Such a mahātmā has firm determination to achieve at the ultimate end the association of the Supreme Lord in any one of the five transcendental rasas. To achieve that success, he engages all activities – mental, bodily and vocal, everything – in the service of the Supreme Lord, Śrī Kṛṣṇa. That is called full Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment