🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 329 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషిలో శరీరం, మనసు, హృదయం మూడు వున్నాయి. ఈ మూడు ఒక దగ్గర కలిస్తే ఒకదానిలో ఒకటి లీనమైతే నాలుగోది ఆవిర్భవిస్తుంది. దాన్ని 'తురీయ' మనవచ్చు. అదే నిజమైన జీవితానికి ఆరంభం. 🍀
మనిషిలో శక్తికి మూడు అవకాశాలు వున్నాయి. ఒకటి శరీరం. రెండోది మనసు. మూడోది హృదయం. ఈ మూడు ఒక దగ్గర కలిస్తే ఒకదానిలో ఒకటి లీనమైతే నాలుగోది ఆవిర్భవిస్తుంది. దాన్ని శరీరమనలేం. మనసనలేం. హృదయమనలేం. దాన్ని 'తురీయ' మనవచ్చు. అంటే నాలుగోది. దానికి ఏ పేరూ ఇవ్వబడలేదు. ఆ నాలుగోదాని ఆరంభమే పవిత్రం, పరివర్తన, అదే నిజమైన జీవితానికి ఆరంభం.
అది సాధికారిక జీవితం, శాశ్వత జీవితం, దైవత్వంతో నిండిన జీవితం. ఈ మూడు నదులూ ప్రతి మనిషిలో వుంటాయి. అవి అరుదుగా కలుస్తాయి. వాస్తవానికి అవి వేరు వేరు మార్గాలలో ప్రయాణిస్తూ వుంటాయి. శరీరమొక వేపు లాగితే, మనసొకవేపు లాగితే, హృదయమొక వేపు లాగుతుంది. వాటి మధ్య అంగీకారముండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment