శ్రీ మదగ్ని మహాపురాణము - 225 / Agni Maha Purana - 225


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 225 / Agni Maha Purana - 225 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 66

🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 1 🌻


హయగ్రీవుడు పలికెను. - ఇపుడు దేవసముదాయ ప్రతిష్ఠను గూర్చి చెప్పదను. ఇది కూడ వాసుదేవ ప్రతిష్ఠ వలెనే చేయవలెను. ఆదిత్య - వసు - రుద్ర - సాధ్య - విశ్వదేవ - అశ్వినీ కుమార - ఋషి - ఇతర దేవగణములకు దేవసముదాయ మని పేరు. వీరి స్థాపనలో నున్న విశేషములు చెప్పెదను. అయా దేవతల పేర్లలోని మొదటి అక్షరము గ్రహించి దానికి స్వరములు చేర్చవలెను. దీర్ఘ స్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగ న్యాసము చేయవలెను. ఆ ప్రథమాక్షరమునకు బిందువు, చేర్చి బీజముగ గ్రహింపవలెను. ప్రణవనమస్కారములు చేర్చవలెను. సమస్తదేవతలను మూలమంత్రముతోడనే పూజించి స్థాపింపవలెను. ఇవి కాక, స్థాపనావిషయమున ఆవలంబింపవలసిన నియమములను, వ్రతములను, కృచ్ఛృములను. మఠ-సేత-గృహాదులను-మాసోపవాస-ద్వాదశీవ్రతాదులను చెప్పెదను.

ముందుగా శిలా-పూర్ణకుంభ-కాంస్య పాత్రలు తీసికొని వచ్చి ఉంచవలెను. పిమ్మట సాధకుడు బ్రహ్మకూర్చ గైకొని ''తద్విష్ణోఃపరమం పదమ్‌'' అను మంత్రముతో కపిలగోవుపాలతో యవచరువును వండవలెను. ఓం కారముతో దానిలో నేయిపోసి, గరటితో ఎనపవలెను. పిదప శ్రీవిష్ణు పూజ చేసి హోమము చేయవెలను. వ్యాహృతి గాయత్రులతో కూడిన ''తద్విప్రాసో'' ఇత్యాదిమంత్రముతో చరుహోమము చేయవలెను. ''విశ్వతశ్చక్షుః'' ఇత్యాది వైదిక మంత్రముతో భూమి-అగ్ని-సూర్య-ప్రజాపతి-అన్తరిక్ష-ద్యౌ-బ్రహ్మన్‌- పృథ్వీ-కుబేర-సోమశబ్దములను చతుర్థ్యంతములు చేసి, వాటికి ''స్వాహా''చేర్చి, ఆ దేవతల నుద్దేశించి ఆహుతు లీయవలెను, ఇంద్రాది దేవతలవకు ఆ దేవతలకు సంబంధించిన మంత్రములు చదువుచు ఆహుతు లివ్వవలెను. చరు భాగములను ఈ విధముగ హోమము చేసి ఆదర పూర్వకముగ దిగ్బలు లీయవలెను.



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 225 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 66

🌻Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 1 🌻


The Lord said:

1-2. I shall describe the mode of consecration (of images) of all gods—the Ādityas (the suns, twelve in number), Vasus (eight), Rudrāḥ [=Rudra] (eleven), Sādhyāḥ [=Sādhya], Viśvedevāḥ [=Viśvedeva], Aśvins and the sages etc. It is like (the consecration of the image of) Vāsudeva. I shall describe special features (of ceremonies). The first letter of the name of particular deity should be taken.

3. It should be split into syllables. The longer vowels should be split. The mystical letter (of the deity) is first formed by adding a nasal and the praṇava.

4. (The images of) all gods as well as those who had led a disciplined life and had observed austerities and atonements and those who had lived in the monasteries should be worshipped and installed with their respective principal mantra.

5. I shall describe the mode of fasting for a month and that which concludes on the twelfth day (of a fortnight). One should place a stone slab and pitchers made of bell metal filled with the articles (described earlier).

6. After having collected the brahmakūrca (grass), the worshipper should prepare the gruel made of barley and milk of tawny (coloured) cow with (the mantra) tadviṣṇoḥ.[1]

7. It should be stirred with the ladle holding it with (the recitation of) praṇava (oṃ). Having got it ready and bringing it down lord Viṣṇu should be worshipped and the offering made.

8. The oblation should be done with the vyāhṛti (bhūḥ, bhuvaḥ, svaḥ), the vedic mantras such as gāyatrī[2] (mantra), tadviprāsa[3], viśvataścakṣuḥ[4] and bhūragnaye[5].

9. Oblations should be given to Sūrya, Prajāpati (the creator), (the lord of) the ethereal region. Oblation to sky! Oblations to Brahman! (Oblations should be given upto) the earth and the great king.

10. Oblations should be done with (the mantras) tasmai, somaṃ ca, rājānamidam. Having offered the remaining part of the gruel as oblation, digbali (offerings to the quarters) should be done with due respect.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment