🌹 01, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 01, JUNE 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 01, JUNE 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 186 / Kapila Gita - 186🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 40 / 4. Features of Bhakti Yoga and Practices - 40 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 778 / Vishnu Sahasranama Contemplation - 778 🌹 
🌻 778. దుర్గమః, दुर्गमः, Durgamaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 737 / Sri Siva Maha Purana - 737 🌹
🌻. మయస్తుతి - 2 / The Gods go back to their abodes (Maya’s prayer) - 2 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 358 / Osho Daily Meditations - 358 🌹 
🍀 358. ఊహలు / 358. FANTASY 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 458 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 458 - 2 🌹 
🌻 458. 'సుముఖీ' - 2 / 458. 'Sumukhi' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 01, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌺*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 8 🍀*

*15. సిద్ధరూపః సిద్ధవిధిః సిద్ధాచారప్రవర్తకః | రసాహారో విషాహారో గంధకాది ప్రసేవకః*
*16. యోగీ యోగపరో రాజా ధృతిమాన్ మతిమాన్సుఖీ | బుద్ధిమాన్నీతిమాన్ బాలో హ్యున్మత్తో జ్ఞానసాగరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భక్తి ప్రాదుర్భావం - భక్తి అనునది అనుభూతి కాదు. అది యొక హృదయస్థితి, హృదయమందలి పురుషుడు - అంతరాత్మ - మేల్కాంచి ప్రాముఖ్యం వహించి నప్పుడు ఆ స్థితి ఏర్పడుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 13:40:39 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: చిత్ర 06:49:23 వరకు
తదుపరి స్వాతి
యోగం: వరియాన 19:00:18 వరకు
తదుపరి పరిఘ
కరణం: బాలవ 13:34:39 వరకు
వర్జ్యం: 12:25:56 - 14:02:12
దుర్ముహూర్తం: 10:02:54 - 10:55:18
మరియు 15:17:17 - 16:09:40
రాహు కాలం: 13:52:08 - 15:30:23
గుళిక కాలం: 08:57:24 - 10:35:39
యమ గండం: 05:40:56 - 07:19:10
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 00:12:12 - 01:51:24
మరియు 22:03:32 - 23:39:48
సూర్యోదయం: 05:40:56
సూర్యాస్తమయం: 18:46:51
చంద్రోదయం: 16:09:50
చంద్రాస్తమయం: 03:13:34
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 06:49:23 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 186 / Kapila Gita - 186 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 40 🌴*

*40. యథోల్ముకాద్విస్ఫులింగాద్ధూమాద్వాపి స్వసంభవాత్|*
*అప్యాత్మత్వేనాభిమతాద్యథాగ్నిః పృథగుల్ముకాత్॥*

*తాత్పర్యము : కాలుచున్న కట్టెలనుండి వెలువడిన మంట, మంట ఆరిన పిదప ఉండే నిప్పు, నిప్పురవ్వలు, పొగ ఇవన్నీ అగ్నినుండి పుట్టినవే. ఇవన్నీ అగ్నిగనే పరిగణింప బడుచున్నవి. కాని, నిజమునకు అగ్ని వీటన్నిటికంటెను వేరైనది గదా!*

*వ్యాఖ్య : శరీరమూ ఆత్మా ఎలా వేరో, ప్రకృతి వేరు పరమాత్మ వేరు. అగ్ని వల్లనే నిప్పు రవ్వ (విస్ఫులింగం) ఏర్పడుతుంది. అగ్ని, పచ్చి కట్టే సమ్యోగము వలనే పొగ వస్తుంది. ఆ కట్టెకు అంటుకున్న నిప్పు కట్టె బాగా కాలి కిందపడితే అది నిప్పు కణం అంటాం. మరి నిప్పూ, నిప్పుకణం, పొగ ఈ మూడూ ఒకటేనా? వేరా? నిప్పు వలన వచ్చిన పొగా ఎలా నిప్పు కాదో, అగ్ని సమ్యోగం వలన వచ్చిన కట్టే, కట్టెలోంచి వచ్చిన నిప్పు కణం, ఎలా నిప్పుకన్నా వేరో, దాని కన్నా అగ్ని ఎలా వేరుగా ఉందని చెప్పుకుంటామో పొగ వేరు, నిప్పు కణం వేరు, నిప్పు వేరు - అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 186 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 40 🌴*

*40. yatholmukād visphuliṅgād dhūmād vāpi sva-sambhavāt*
*apy ātmatvenābhimatād yathāgniḥ pṛthag ulmukāt*

*MEANING : The blazing fire is different from the flames, from the sparks and from the smoke, although all are intimately connected because they are born from the same blazing wood.*

*PURPORT : Although the blazing firewood, the sparks, the smoke and the flame cannot stay apart because each of them is part and parcel of the fire, still they are different from one another. A less intelligent person accepts the smoke as fire, although fire and smoke are completely different. The heat and light of the fire are separate, although one cannot differentiate fire from heat and light.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 778 / Vishnu Sahasranama Contemplation - 778🌹*

*🌻 778. దుర్గమః, दुर्गमः, Durgamaḥ🌻*

*ఓం దుర్గమాయ నమః | ॐ दुर्गमाय नमः | OM Durgamāya namaḥ*

*గమ్యతే జ్ఞాయతే దుఃకేనేతి దుర్గమ ఉచ్యతే*

*ఎంతయో శ్రమచే మాత్రమే తెలియబడువాడు కనుక దుర్గమః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 778🌹*

*🌻778. Durgamaḥ🌻*

*OM Durgamāya namaḥ*

*गम्यते ज्ञायते दुःकेनेति दुर्गम उच्यते / Gamyate jñāyate duḥkeneti durgama ucyate*

*Is attained, known, with difficulty and hence He is Durgamaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 739 / Sri Siva Maha Purana - 739 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴*
*🌻. మయస్తుతి - 2 🌻*

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా| మయుడు చేసిన ఈ స్తోత్రమును విని పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రేమతో మయుని ఉద్దేశంచి ఇట్లు పలికెను (10).

శివుడిట్లు పలికెను -

ఓ రాక్షసశ్రేష్ఠా! మయా! నేను ప్రసన్నుడనైతిని. నీ మనస్సునకు నచ్చిన వరమును కోరుకొనుము. నేను ఇచ్చెదను. సంశయము లేదు (11).

సనత్కుమారుడిట్లు పలికెను -

రాక్షస శ్రేష్ఠుడగు ఆ మయుడు శంభుని ఈ మంగళకరమగు వచనమును విని చేతులు జోడించి ప్రభువునకు సాష్టాంగనమస్కారమును జేసి ఇట్లు బదులిడెను (12).

మయుడిట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! నీవు నా యందు ప్రసన్నుడవైనచో, నేను వరమునకు అర్హుడనైనచో, నాకు నీయందు శాశ్వతభక్తి కలుగునట్లు అనుగ్రహించుము (13). నీ భక్తులతో నిత్యమైత్రిని, దీనుల యెడ సర్వదా దయాభావమును, ఇతరప్రాణులయందు దుష్ఠులయెడల ఉపేక్షాభావమును ఇమ్ము. ఓ పరమేశ్వరా! (14). నాకు ఎన్నటికి అసుర భావము కలుగకుండు గాక | ఓ మహేశ్వరా! నేనుసర్వదా మంగళకరమగు నీ భజన యందు నిమగ్నుడనై నిర్భయుడనై ఉండెదను గాక! (15).

సనత్కుమారుడిట్లు పలికెను -

మయుడు ఇట్లు ప్రార్థించగా భక్తవత్సలుడు, పరమేశ్వరుడునగు శంకరుడు ప్రసన్నుడై అపుడు ఇట్లు బదులిడెను (16).

మహేశ్వరుడిట్లు పలికెను -

రాక్షసశ్రేష్ఠా! నా భక్తుడవగు నీవు ధన్యుడవు, నీ యందు వికారములు లేవు. నీవు ఇపుడు కోరిన వరములనన్నిటినీ నీకు ఇచ్చుచున్నాను (17). నీవు నా శాసనముచే నీ పరివారుముతో గూడి, స్వర్గము కంటె కూడా సుందరమైన వితలలోకమునకు వెళ్లుము (18). నీవు అచట నిర్భయముగా ఆనందముతో జీవించుము. సర్వదా భక్తిని కలిగియుండుము. నా ఆజ్ఞచే నీకు ఏనాడైననూ అసురబావము కలుగనుబోదు (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 739🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴*

*🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 2 🌻*

Sanatkumāra said:—
10. On hearing this eulogy of Maya, O excellent brahmin, lord Śiva, was delighted and he spoke to Maya eagerly.

Śiva said:—
11. O Maya, I am delighted. O excellent Asura speak out the boon you wish to have. There is no doubt. I shall grant you what you desire.

Sanatkumāra said:—
12. On hearing the auspicious words of Śiva, Maya the foremost among the Asuras spoke after bowing to the lord with stooping shoulders and palms joined in reverence.

Maya said:—
13. “O great lord, lord of the Gods, if you are delighted and if I deserve the grant of a boon please grant me parmanent devotion to you.

14. O supreme lord, grant me comradeship with your devotees for ever, compassion towards the distressed and indifference towards the wicked living beings.

15. O lord Śiva, let there be no demonaic instinct in me at any time. O lord, let me be fearless for ever engrossed in your auspicious worship.”

Sanatkumāra said:—
16. On being thus requested, Śiva the great lord, who is favourably disposed to his devotees and was in a delightful mood replied to Maya.

Lord Śiva said:—
17. O excellent Asuras you are my devotees and are blessed. You are free from aberrations. All the boons desired by you are granted now.

18. At my bidding, you go to the region Vitala,[1] more beautiful than heaven. Go in the company of your family and kinsmen.

19. You stay there without fear. Be devout always. At my bidding you will never have demonaic instinct.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 358 / Osho Daily Meditations  - 358 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 358. ఊహలు 🍀*

*🕉. ఊహ ఒక పని చేయగలదు: అది నరకాన్ని సృష్టించగలదు లేదా స్వర్గాన్ని సృష్టించగలదు. ఊహ చాలా స్థిరంగా ఉంటుంది; అది వైరుధ్యాన్ని సృష్టించదు. 🕉*

*ఊహ చాలా తార్కికమైనది, మరియు వాస్తవికత చాలా అతార్కికమైనది. కాబట్టి వాస్తవికత విస్ఫోటనం చెందినప్పుడల్లా, దానిలో రెండు ధ్రువాలు ఉంటాయి. అది వాస్తవిక ప్రమాణాలలో ఒకటి. దానికి రెండు ధ్రువాలు కలిసి ఉండకపోతే, అది మనస్సు యొక్క నిర్మాణం మాత్రమే. మనస్సు సురక్షితంగా ఆడుతుంది మరియు ఎల్లప్పుడూ స్థిరమైన విషయాన్ని సృష్టిస్తుంది. జీవితమే చాలా అస్థిరమైనది మరియు విరుద్ధమైనది - అది వైరుధ్యం ద్వారానే ఉంటుంది. జీవితం మరణం ద్వారా ఉంటుంది, కాబట్టి మీరు నిజానికి జీవించి ఉన్నప్పుడల్లా మీరు మరణాన్ని కూడా అనుభవిస్తారు.*

*గొప్ప జీవితం యొక్క ఏదైనా క్షణం మరణం యొక్క గొప్ప క్షణం కూడా అవుతుంది. ఏ క్షణమైనా గొప్ప సంతోషకరమైనదైతే ఆ క్షణం దుఃఖమయమైనదీ ఆవుతుంది. ఇది ఇలాగే ఉండాలి. కాబట్టి ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: మీకు విరుద్ధమైన అనుభవం కలిగినప్పుడల్లా--ఒకదానికొకటి పొంతన లేని రెండు విషయాలు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి-అవి వాస్తవమే అయ్యుండాలి; మీరు వాటిని ఊహించి ఉండరు. ఊహలు ఎప్పుడూ అంత అతార్కికం కావు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 358 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 358. FANTASY 🍀*

*🕉. Fantasy can do one thing: It can either create hell or it can create heaven. Fantasy is very consistent; it cannot create the paradox.  🕉*

*Fantasy is very logical, and reality is very illogical. So whenever reality erupts, it will have both the polarities in it-that is one of the criteria of reality. If it has not both polarities together, then it is a mind construction. The mind plays safe and always creates a consistent thing. Life itself is very inconsistent and contradictory--it has to be, it exists through contradiction. Life exists through death, so whenever you are really alive you will feel death too.*

*Any moment of great life will also be a great moment of death.  Any moment of great happiness will also be a great moment of sadness. This has to be so. So let this be remembered always: Whenever you have a contradictory experience--two things that don't fit together, that are diametrically opposite to each other-they must be real; you could not have imagined them. Imagination is never so illogical.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 458 -2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 458  - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 458. 'సుముఖీ' - 2 🌻* 

*శ్రీమాత ముఖము సృష్టి యందలి సమస్త జ్ఞానమునకు, శోభనమునకు (ఆనందముతో కూడిన వైభవము), అందమునకు, ఆకర్షణకు ప్రతీక. శ్రీమాత ముఖ దర్శనము దర్శనములలోకెల్ల పరాకాష్ఠ. మళయాళ దేశమున గల ముఖాంబిక (మూకాంబిక) ఇట్టి సుముఖియే అని తెలియవలెను. శ్రీమాత ముఖము పై తెలిపిన అందముతో పాటు ఈ క్రింది విశేషములు కూడ కలిగి యుండును. 1) ముఖమున మహారాణి దర్పముండును. 2) ఎఱుపు, పసుపుతో కూడిన ప్రకాశముతో ముఖము మెరయు చుండును. 3) ఉదయించుచున్న సూర్య బింబమువలె యుండును. 4) దేవతలను, ధర్మమును, సత్పురుషులను అనుగ్రహించు చున్నట్లుగ గోచరించును. 5) అసురులకు జ్వాలారూపమై గోచరించును. 6) భక్తుల కోర్కెలను తీర్చుచున్నట్లుగ, భయమును పోగొట్టు చున్నట్లుగ ఆమె కన్నులు గోచరించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 458 - 2  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 458. 'Sumukhi' - 2 🌻*

*Shrimata's face is a symbol of all wisdom, grace (splendour with joy), beauty and charm of all creation. The darshan of Srimata's face is the highest of all darshans. It should be known that Mukhambika (mukambika) in Malayalam country is this sumukhi. Along with the beauty mentioned above, Srimata's face also has the following features. 1) Pride of a queen on the face. 2) Face glowing with a reddish, yellowish glow. 3) It will be like the image of the rising sun. 4) It appears as if she's blessing the gods, dharma and good men. 5) She appears as a flame to the Asuras. 6) As if fulfilling the desires of the devotees, her eyes appear as if they are removing the fear.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment