శ్రీ మదగ్ని మహాపురాణము - 239 / Agni Maha Purana - 239


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 239 / Agni Maha Purana - 239 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 72

🌻. స్నానతర్పణాది విధి కధనము - 4 🌻

త్రినేత్రయై శిరస్సుపై అర్ధచంద్రముకుటముతో విరాజిల్లు చున్న ఆమె వృషభపీఠముపై కమలాసనమున కూర్చుండి యుండును. కుడిచేతులలో త్రిశూల - రుద్రాక్షమాలలతోను, ఎడమచేతులలో అభయముద్రా - శక్తులతోను ప్రకాశించుచుండును. ఈ సంధ్యలు కర్మసాక్షులు. సాధకుడు ఈ శక్తుల కాంతులు తనను అనుసరించి యున్నట్లు భావన చేయవలెను. ఇవి కాక మరొక సంధ్య నాల్గవది కూడ ఉన్నది. అది కేవలము జ్ఞానికి మాత్రమే. అర్ధ రాత్రి ప్రారంభమున, దాని బోధాత్మక సాక్షాత్కారము కలుగును. ఈ మూడు సంధ్యలును క్రమముగ, హృదయ - బిందు - బ్రహ్మరంధ్రములలో నుండును. నాల్గవ సంధ్యకు రూపముండదు. ఆ సంధ్య పరమశివునిలో ప్రకాశించుచుండును. ఈమె శివునికంటె అతీత మగుటచే 'పరాసంధ్య' అని పేరు.

తర్జనీ మూలము పితృతీర్థము. కనిష్ఠికామూలము ప్రజాపతి తీర్థము అంగుష్ఠ మూలము బ్రహ్మతీర్థము. హస్తాగ్రభాగము దేవతా తీర్థము. కుడి అరచేయి అగ్నితీర్థము. ఎడమ అరచెయ్యి సోమతీర్థము. అంగుళుల అన్ని పర్వములును, సంధులును ఋషితీర్థము. సంధ్యాధ్యానానంతరము, శివమంత్రములచే జలాశయమును శివస్వరూపము చేసి, ''ఆపోహిస్ఠా'' ఇత్యాది సంహితామంత్రములతో, ఆ జలముతో మార్జనము చేసికొనవలెను. ఎడమ చేతిలో తీర్థజలము పోసికొని కుడి చేతితో మంత్రపఠన పూర్వకముగ శిరస్సుపై ఆ నీరు చల్లుకొనుటకు మార్జన మని పేరు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 239 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 72

🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 4🌻


28. The midday twilight should be contemplated as Vaiṣ-ṇavi, white (in complexion), seated with crossed-legs on the Garuḍa, holding conch and disc in the left arm and the mace and abhaya (mudrā) (hand showing protection) in the right hand.

29. Raudrī should be meditated upon as seated on the lotus and as riding the bull, possessing three eyes, decorated by the moon and holding trident and rosary in the right arm and the protective posture (abhaya) and mace in the left arm.

30. The twilight is the witness of deeds of men. The soul (should be known) as following its radiance. The fourth twilight is that of the learned and it is meditated upon in the night.

31. The supreme sandhyā is declared as that which remains. invisible in the cavities situated at the heart, and the upper end of the nose and which secures the realization of Śiva.

32. The root of the fore-finger (is known to be) the pitṛtīrtha and that of the little finger as that of Prajāpati. The root of the thumb (is known to be) that of Brahmā, while the forepart of the hand is held sacred for all gods.

33. It is the place of sacred fire on the palm of the left hand, and the soma on that of the right hand. All the tips and folds on the fingers (are sacred) for the sages.

34. After having got ready the sacred waters for Śiva with the mantras pertaining to Śiva, one should sprinkle that water with the saṃhitā mantras.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment